
న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు బయల్దేరారు. సతీసమేతంగా ఎయిర్‌ఫోర్స్ 1 విమానంలో ఆయన వాషింగ్టన్ డీసీ నుంచి పయనమయ్యారు. వారి వెంట కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్ కూడా ఇండియా వస్తున్నారు. జర్మనీ మీదుగా వారు భారత్‌కు చేరుకుంటారు. రేపు (సోమవారం) ఉదయం 11.55 నిముషాలకు ట్రంప్ ఫ్యామిలీ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అగ్రరాజ్య అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతారు. ఎయిర్‌పోర్టు నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతేరా క్రికెట్ స్టేడియం వరకు ఇరు దేశాల అధినేతలు రోడ్ షోలో పాల్గొంటారు. లక్షలాది నమస్తే ట్రంప్ అంటూ స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు.
చదవండి :-
ట్రంప్ పర్యటన : మోదీకి ఐదు సూటి ప్రశ్నలు!
ట్రంప్‌ను విలన్‌తో పోల్చిన కాంగ్రెస్ నేత
హౌడీ X నమస్తే





Comments
Please login to add a commentAdd a comment