వాషింగ్టన్ డీసీలో ఓ వ్యక్తి పోలీసులపై కాల్పులకు పాల్పడ్డాడు.
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఓ వ్యక్తిని పోలీసులు షూట్ చేశారు. ఓ అపార్ట్‌మెంట్‌లో పోలీసులపై దాడికి యత్నించిన వ్యక్తి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడని అధికారులు వెల్లడించారు.
పోలీస్ చీఫ్ పీటర్ న్యూషామ్ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ అపార్ట్‌మెంట్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయన్న సమాచారం మేరకు అక్కడకు వెళ్లిన పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వ్యక్తిని మైఖెల్ లీచ్(32)గా గుర్తించారు. అతడికి సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు.