![Microsoft Was Entering Into Smart Phone Business After 4 Years - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/13/Microsoft.jpg.webp?itok=mYt-IORu)
వాషింగ్టన్ : దాదాపు 4ఏళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలోకి తిరిగి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కొత్త డ్యూయల్ స్క్రీన్ ఆండ్రాయిడ్ డివైజ్ సర్ఫేస్ డ్యూయో కోసం కంపెనీ బుధవారం ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు 1,399 డాలర్లు ఉండొచ్చు. ఈ స్మార్‌ఫోన్ 5.6అంగుళాల డిప్లేను, 4.8 మిల్లిమీటర్ల మందాన్ని కలిగి ఉండొచ్చు. సెప్టెంబరులో మార్కెట్లోకి విడుదల కావచ్చనే అంచనాలున్నాయి. స్మార్ట్ ఫోన్ అధిక ధరను కలిగి ఉన్నప్పటికీ.., వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. అయితే కరోనా ఎఫ్టెక్‌తో అమెరికా ఆర్థిక వ్యవస్థ భారీ పతననాన్ని చవిచూడటం, నిరుద్యోగం రెండంకెల క్షీణత చూస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ స్మార్ట్‌ఫోన్ల వ్యాపారంలోకి అడుగుపెట్టడం పట్ల మార్కెట్ వర్గాలు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment