రచయిత | Writer Malladi Venkata Krishnamurthy | Sakshi
Sakshi News home page

రచయిత

Published Sun, Aug 2 2015 4:46 AM | Last Updated on Mon, Oct 1 2018 5:16 PM

రచయిత - Sakshi

రచయిత

మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 9

 కెనడా నించి అక్రమంగా వచ్చే మద్యాన్ని తీసుకోడానికి నేను, మరో ఇద్దరం సముద్రతీరంలోని సొనోమా కౌంటిలో గల బ్రింగిల్స్ కోవ్‌కి బయలుదేరాం. ఏంజెలో, బెన్నీ, నేను కోళ్లని సరఫరా చేేన  లారీలో అక్కడికి చేరుకున్నాం. ఐదు నిమిషాల తర్వాత మా వెనకే ఇంకో పెద్దలారీ వచ్చి ఆగింది. ఉదయం ఐదు కాబట్టి పెద్దగా ట్రాఫిక్ లేదు.బ్రింగిల్స్ కోవ్ స్మగ్లింగ్‌కి సరైన ప్రదేశం. ఎఫ్‌బీఐ ఏజెంట్లు దాక్కోడానికి చెట్లులాంటివేం లేవు. పడవలకి ప్రమాదం కలిగించే రాళ్లేమీ సముద్ర తీరంలోని నీళ్లల్లో లేవు. మేం 1927 నుంచి, అంటే ఏడాది నుంచి ఆ ప్రదేశాన్ని అమెరికాలోకి మద్యాన్ని స్మగుల్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఇంతదాకా ఇక్కడ మాకు ఎలాంటి సమస్యా రాలేదు.ఏంజెలో దగ్గర ‘థాంసన్ గన్’ ఉంది. నా దగ్గర, బెన్నీ దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. సీట్ కింద గల డబ్బు సంచిని నేను తప్ప ఇంకెవరూ తాకకూడదన్నది నియమం.
 
 ఏంజెలో, బెన్నీలతో కలసి  పని చేయడం నాకు ఇదే మొదటిసారి. స్మగ్లింగ్‌లో బెన్నీకి ఇదే మొదటి అనుభవం కాబట్టి అతను చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాడు. మా అందరి సగటు వయసు ఇరవై నాలుగు. రేంజో దగ్గర బెన్నీ ఐదు నెలలుగా పని చేస్తున్నాడు. అతని మీద నమ్మకం కుదిరాక రేంజో అతన్ని నాతో పంపాడు.
 
 ‘‘రెండు వందల కేసులు కదా వచ్చేది?’’ బెన్నీ నన్ను అడిగాడు.
 ‘‘ఇది నువ్వు అడగటం మూడోసారి’’ చిరాగ్గా చెప్పాను.
 ‘‘ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ స్కాచ్ బాటిల్ కేసులు ఇరవై వస్తున్నాయి’’ ఏంజెలో నవ్వుతూ చెప్పాడు.
 
 ‘‘ఓ బాటిల్‌ని మనం తీసుకోవచ్చా?’’ బెన్నీ ఆశగా అడిగాడు.
 ‘‘అలాంటి ఆలోచనే వద్దు. రేంజో ఓ డాలర్ కోసం మోసం చేసినవాళ్లని కూడా చంపించాడు’’ హెచ్చరికగా చెప్పాను.
 కాసేపాగి బెన్నీ అడిగాడు.
 ‘‘కోస్ట్‌గార్డ్‌లతో ప్రమాదం ఉండదుగా?’’
 ‘‘కోస్ట్‌గార్డ్‌లు లేదా ఎఫ్‌బీఐ ఏజెంట్లతో సదా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకని మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి’’ జవాబు చెప్పాను.
 ‘‘అప్పుడు కొంత యాక్షన్ ఉంటుంది’’ బెన్నీ తన థాంసన్ తుపాకీని నిమురుతూ చెప్పాడు.
 ‘‘నిజంగా వాళ్లొస్తే తుపాకీ పేలుళ్లకి నీ పేంటు తడిసి  తీరుతుంది’’ ఏంజెలో నవ్వుతూ చెప్పాడు.
 ‘‘నువ్వు ఎన్నడైనా తుపాకీతో మనిషిని కాల్చావా?’’ బెన్నీని ప్రశ్నించాను.
 ‘‘లేదు. ఇంతదాకా టార్గెట్ ప్రాకీే్టన. కానీ, ఎఫ్‌బీఐ ఏజెంట్లని, కోస్ట్‌గార్డులని పేల్చగలను’’
 ‘‘చూద్దాం. మనిషిని మొదటిసారి చంపడం తేలిక కాదు’’ ఏంజెలో మళ్లీ నవ్వుతూ చెప్పాడు.
 కాసేపు మా మధ్య నిశ్శబ్దం. నేను బైనాక్యులర్స్‌లోంచి సముద్రాన్ని నిశితంగా పరిశీలించాను. ఎక్కడా మర పడవ కనపడలేదు. ఆకస్మాత్తుగా బెన్నీ అడిగాడు.
 
 ‘‘మీలో ఎవరైనా లిటిల్ సీజర్‌ని చదివారా?’’
 ‘‘లిటిల్ వాట్?’’ అడిగాను.
 ‘‘లిటిల్ సీజర్.’’
 ‘‘ఎప్పుడూ వినను కూడా లేదు’’ ఏంజెలో చెప్పాడు.
 ‘‘చికాగో మాఫియా బాన్ రికో బండెల్లో గురించిన నవల అది. అతను చివర్లో కాల్చి చంపబడతాడు’’
 ‘‘అలాంటప్పుడు దాన్ని చదవడం దేనికి?’’ ఏంజెలో విసుగ్గా అడిగాడు.
 ‘‘ది మాలెే్టన ఫాల్కన్? అదింకో యాక్షన్ నవల.’’
 
 ‘‘లేదు’’ ఇద్దరం చెప్పాం.
 ‘‘దాన్నెవరు రాసారో తెలుసా? డేషియెల్ హేమెట్. అతను శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసిస్తాడు. ఎల్లీ స్ట్రీట్‌లోని జాన్స్ గ్రిల్‌లో అతన్ని చూశాను. అతను బ్లాక్ మాస్క్ అనే పత్రికలో దాన్ని ముందు సీరియల్‌గా రాశాడు. ఇంకా రెడ్ హార్వెస్ట్, ది డెయిన్‌కర్స్ అనే నవలల్ని, కొన్ని చిన్న కథలని కూడా రాశాడు. అవన్నీ చదివాను.’’‘‘దేని గురించి రాస్తాడు?’’ ఏంజెలో ఆసక్తిగా అడిగాడు.‘‘మాబ్‌ల మధ్య యుద్ధాలు, మోసం చేేన  అందగత్తెలు. కొంతకాలం అతను ప్రైవేట్ డిటెక్టివ్‌గా పనిచేశాడు కాబట్టి అతను అనుభవంలోంచే రాస్తూంటాడు.’’
 
 ‘‘ఇంకా ప్రైవేట్ డిటెక్టివ్‌గానే పని చేస్తున్నాడా?’’ నేను ప్రశ్నించాను.
 ‘‘ఉహు. రాయడానికి ఆ వృత్తిని వదిలేసాడు. జోయీ! నువ్వు తప్పక అతని పుస్తకాల్లో ఒకటి చదవాలి’’ బెన్నీ ఆసక్తిగా చెప్పాడు.‘‘నాకు పుస్తకాలు చదివేంత సమయం ఉండదు. నువ్వు పుస్తకాలు ఎక్కువగా చదువుతూంటావా?’’ అడిగాను.
 ‘‘బాగా. బ్లాక్ మాస్క్ మేగజైన్‌లో ఇంకా ఫ్రెడరిక్ నెబెల్, కెరొల్ జాన్ డాలి, రావుల్ విట్‌ఫీల్డ్ కథలు కూడా బావుంటాయి. హేమెట్ రాేన లాంటివే వాళ్లూ రాస్తారు. నేను కూడా బ్లాక్ మాస్క్ పత్రికకి కథలు రాస్తూంటాను. నేను ఇప్పుడు ఓ మంచి నవలని రాస్తున్నాను’’ బెన్నీ గర్వంగా చెప్పాడు.
 
 ‘‘దేని గురించి?’’ ఏంజెలో ఆసక్తిగా అడిగాడు.
 ‘‘మద్యం స్మగ్లింగ్ గురించి. లిటిల్ సీజర్, ది మాలెే్టన ఫాల్కెనో లాంటిది. కాని వాటికన్నా ఆసక్తి కలిగించేది’’ బెన్నీ గర్వంగా చెప్పాడు.‘‘అందులోని పాత్రలు నీకు ఎలా పరిచయం?’’ అడిగాను.‘‘మనమే ఆ పాత్రలం. రేంజో, నేను, ఏంజెలో, నువ్వు. కాని మన పేర్లు ఉండవు. వాటిని మార్చేస్తాను. మిగిలిన వారంతా స్మగ్లింగ్ పద్ధతి ఎలా ఉంటుందో ఊహించి రాస్తారు. పాఠకులకి తొలిసారిగా నా అనుభవం ద్వారా తెలియచేస్తాను. పుస్తకం చివర్లో మనం రిపో బెండెలోలాగా కాల్చి చంపబడం. తెలివిగా తప్పించుకుంటాం.’’
 
 ‘‘దాని పేరు?’’
 ‘‘రవాణా. స్మగ్లింగ్ సబ్జెక్ట్‌కి అంతకన్నా మంచి పేరు దొరకదు. బ్రింగిల్స్ కోవ్ అని పెడదామనుకున్నాను. ఇంకా నిర్ణయించలేదు.’’ఇంకా కొద్దినిమిషాల్లో సూర్యోదయం అవుతుందనగా మర పడవ వచ్చింది. నేను దాని కెప్టెన్‌కి డబ్బు చూపించాను. అతను, అతని ఇద్దరు సహాయకులు, మేము కలసి మద్యం కేసులు అన్నిటినీ దింపి మా లారీల్లోకి ఎక్కించాం. డబ్బు తీసుకుని అతను తిరిగి కెనడాకి, మేం శాన్‌ఫ్రాన్సిస్కోకి బయలుదేరాం.
 ‘‘కెప్టెన్‌ని అడిగి తెలుసుకున్నాను. నూట పది అడుగుల పొడవుగల అతని పడవ అరవై టన్నుల మద్యాన్ని తీసుకురాగలదట. ఇలాంటి వివరాలు నా నవల్లో రాస్తే రియలిస్టిక్‌గా ఉంటుంది’’ బెన్నీ ఉత్సాహంగా చెప్పాడు.
 ‘‘ఏం సమస్యా రాలేదుగా?’’ రేంజో గోడౌన్‌లోని మద్యం సీసాలని లెక్క చూసుకున్నాక నన్ను అడిగాడు.
 ‘‘ఓ సమస్య’’ దాన్ని వివరించాను.
 
 అతను తల ఊపి చెప్పాడు.
 ‘‘అవును సమస్యే. నువ్వు దాన్ని పరిష్కరించగలవుగా?’’         
 తల ఊపాను.
 ‘‘వెంటనే బహుమతిగా ఓ స్కాచ్  సీసా తీసుకో’’ ఆజ్ఞాపించాడు.
 ఆ రాత్రి ఏంజెలో, నేను బెన్నీ అపార్ట్‌మెంట్‌కి వెళ్లాం.
 ‘‘మనం బ్రిస్బేన్‌కి వెళ్లాలి. వస్తావా?’’ అడిగాను.
 అరగంట తర్వాత మా కారు అడవి పక్కనగల మట్టి రోడ్డులో ముందుకి సాగింది. కారుని ఆపాను. అంతా దిగి హెడ్‌లైట్ల వెలుగులోకి వచ్చాం. నా చేతిలోని తనకి గురిపెట్టబడ్డ రివాల్వర్‌ని చూసి బెన్నీ ఆశ్చర్యంగా అడిగాడు.
 ‘‘ఇదేమిటి?’’
 ‘‘నువ్వు రాసిన నవల ద్వారా బ్రింగిల్స్ కోవ్ పేరు కాని, స్మగ్లింగ్‌కి చెందిన ఇతర రహస్యాలు కాని బయటికి రాకూడదని రేంజో ఆజ్ఞ.’’
 
 ‘‘కాని నేను చెప్పేది విను...’’ కంగారుగా చెప్పాడు.
 రెండు సార్లు కాల్చాను. అతను ఇంకా జీవించి ఉండొచ్చని మూడో గుండుని అతని తల్లోకి కాల్చాను. తాళంచెవిని బెన్నీ జేబులోంచి తీసుకున్నాను. అక్కడ నుంచి సరాసరి ఫెల్ స్ట్రీట్‌లోని బెన్నీ అపార్ట్‌మెంట్‌కి నేను, ఏంజెలో చేరుకున్నాం. అతని అపార్ట్‌మెంట్ మొత్తం వెతికినా కొన్ని బ్లాక్ మాస్క్ పత్రికలు తప్ప ఎక్కడా అతను రాేన  ‘రవాణా’ కాగితాల ప్రతి కనపడలేదు. అసలు తెల్ల కాగితాలే లేవు. అతనికి టైప్ రైటర్ కూడా లేదు.‘‘అతను అబద్ధం ఆడాడు. మనతో చెప్పినట్లు ఒక్క అక్షరం కూడా రాయలేదు’’ చెప్పాను.
 ‘‘గొప్పలు చెప్పి పాపం ప్రాణాలు కోల్పోయాడు’’ ఏంజెలో జాలిగా చెప్పాడు.
 (బిల్ ప్రోంజినీ కథకి స్వేచ్ఛానువాదం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement