
వాషింగ్టన్: అమెరికాలో విచక్షణారహితంగా అమాయకులపై కాల్పులకు పాల్పడుతున్న వ్యక్తుల ప్రవర్తనా సరళి ఎలా ఉంటుందో గుర్తించామని దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ తెలిపింది. ఈ లక్షణాలు తెలిసి ఉండటం వల్ల పోలీసులు కొన్ని కాల్పుల ఘటనలనైనా అడ్డుకోగలగడానికి వీలవుతుందంది. హంతకుల్లో చాలా వరకు శ్వేతజాతీయులేననీ, వారు వివిధ రకాల ఒత్తిడులకు, అన్యాయానికి గురైన వారేనని తెలిపింది. 75 శాతం హంతకులకు మానసిక అనారోగ్యాలేవీ లేవని ఎఫ్‌బీఐ తెలిపింది.