white people
-
దక్షిణాఫ్రికాలోని ఒక పట్టణం...అక్కడ అంతా శ్వేత జాతీయులే!
పలానా దేశం అనగానే వాళ్లు ఇలా ఉంటారనే ఒక భావన ఒకటి ఉంటుంది. దక్షిణాఫ్రికా అనగానే నల్లజాతీయలు అని తెలుస్తుంది అందరికీ. అక్కడ ఘోరమైన ఎండలు కారణంగా అక్కడ జీవించే మనుషులు అలా ఉంటారు. అలాంటి చోట ఒరానియా అనే ఒక విచిత్రమైన పట్టణం ఉంది. అక్కడ మొత్తం శ్వేత జాతీయులే ఉంటారు. పైగా ఆ పట్టణం దక్షిణఫ్రికాతో సంబంధం లేకుండా వేరుగా ఉంటుంది. పైగా అక్కడ రోడ్లు ఊడ్చే వ్యక్తి దగ్గర నుంచి కార్మికులు, సెక్యురిటీ గార్డు వరకు అంతా తెల్లవాళ్లే. ఆ ప్రాంతంలోని ఇళ్లు కూడా తెల్లగా ఉండే వాళ్లకు మాత్రమే ఇవ్వబడును అని ఉంటుంది . ఈ పట్టణం పై పలు వివాదాలు కూడా ఉన్నాయి. కేవలం జాత్యాహంకారానికి తెర లేపుతుంది, వర్ణ వివక్షతకు ఆజ్యం పోస్తుందంటూ పెద్ద ఎత్తున్న ఆరోపణలు వచ్చాయి. కానీ ఒరానియా పట్టణ వాసులు మాత్రం అదేం కాదని వాదించడం విశేషం. స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన పట్టణం ఈ పట్టణం 1991 నుంచి ఇలానే ఉంది. వారంతా 17వ శతాబ్దపు డచ్ వలసదారుల వారుసులు. దక్షిణాఫ్రికాలోని ఆరెంజ్ నది ఒడ్డున సుమారు 8 వేల హెక్టార్ల భూమిని కొనుగోలు చేసి ప్రవేట్ యజామాన్యంతో కలిసి ఒక పట్టణంగా ఏర్పరుచుకున్నారు. అప్పడు ఈ ఒరానియా ప్రాంతంలో జనాభా కూడా తక్కువే. అయితే కాలక్రమేణ వర్ణవివక్ష అనంతరం ఏర్పడిన రాజ్యంగాన్ని అనుసరించి స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన నగరంగా తీర్చిదిద్దుకుంది. అయితే ఆ పట్టణ వాసులు మాత్రం దక్షిణాఫ్రికాలో పీడిస్తున్న నేరాలు, విద్యుత్ కోతలు, స్థానికి పాలనలో ఉన్న సమస్యలకు దూరంగా తాము ఏర్పరుచుకున్న కమ్యూనిటీగా అభివర్ణించుకోవడం విశేషం. దక్షిణాఫ్రికా రాజ్యాంగం ప్రకారం, ఒరానియాకు స్వీయ నిర్ణయాధికారం ఉంది, పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి స్వయంప్రతిపత్తితో పనిచేస్తుంది. అంతేకాదు ఈ పట్టణానికి ఒక ప్రత్యేక కరెన్సీ కూడా ఉంది. ఈ పట్టణంలో ఉండాలనుకునే నివాసితులు కొన్ని విలువలను పాటించాలి, భాద్యతగా మెలగాలి, సభ్యుత్వం పొంది ఉండాలి. ఐతే ఒరానియాలో ఉండేందుకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చునని ఇంతవరకు తాము నల్లజాతీయులు దరఖాస్తును అనుమతించకపోవడం వంటివి చేయలేదని ఒరానియా అధికారులు పేర్కొన్నారు. ఇంతవరకు ఒక్క నల్లజాతీయుడు కూడా ఈ నగరంలో ఉండేందుకు దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. ఐతే చాలామంది మాత్రం ఈ పట్టణాన్ని ఆఫ్రికేతర పట్టణంగానూ వర్ణవివక్షతకు పెద్ద పీఠం వేసే ప్రాంతంగానే చూస్తుండటం గమనార్హం. అంతేకాదు దక్షిణాఫ్రికా నల్లజాతి అధ్యక్షుడు నెల్సన్ మండేలా దేశంతో సంబంధం లేకుండా వేరుగా ఉన్న ఈ పట్టణాన్ని పునరుద్ధరించటానికి అవిశ్రాంతంగా ప్రయత్నించారు. అందులో భాగంగా 1995లో ఈ ప్రాంతాన్ని సందర్శించి వారితో కలిసి ఉన్నారు కూడా. (చదవండి: కిమ్ జోంగ్ ఆరోగ్య పరిస్థితి విషమం.. కిమ్ సోదరి కీలక వ్యాఖ్యలు!) -
స్వాతంత్య్రం వద్దన్న న్యూ కెలడోనియా
-
మాకు స్వాతంత్య్రం వద్దు!
నౌమీ: పసిఫిక్ సముద్రంలోని న్యూ కెలడోనియా దీవుల వాసులు ఫ్రాన్స్ దేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం జరిగిన రెఫరెండంలో మొత్తం 2.69 లక్షల జనాభాలో అర్హులైన 1.75 లక్షల మంది పాల్గొన్నారు. మొత్తం ఓటింగ్‌లో 70 శాతం లెక్కింపు పూర్తి కాగా అందులో 59.5 శాతం మంది స్వాతంత్య్రం వద్దు, ఫ్రాన్స్‌తోనే ఉంటామంటూ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే, ఈ ఫలితాలు 1853లో ఫ్రాన్స్ వలస ప్రాంతంగా మారిన తర్వాత అక్కడ సెటిలైన శ్వేత జాతీయులు, స్థానిక కనాక్ ప్రజల మధ్య వైషమ్యాలను మరింత పెంచే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 1998లో రెండు జాతుల మధ్య జరిగిన ఘర్షణల్లో 70 మంది చనిపోయారు. ఆ తర్వాతే న్యూ కెలడోనియాకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు, రెఫరెండం నిర్వహించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం అంగీకరించింది. దాని ప్రకారం స్వాతంత్య్రం కావాలా వద్దా అనే విషయంపై 2022లో మరోసారి రెఫరెండం నిర్వహించాల్సి ఉంటుంది. ఫ్రాన్స్ ప్రధాన భూభాగానికి దాదాపు 18వేల కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ సముద్రంలోని ఈ సుందరమైన దీవులు ఫ్రాన్స్‌కు వ్యూహాత్మకంగా కీలకమైనవి. ప్రపంచంలోని నికెల్ నిల్వల్లో 25 శాతం ఇక్కడే ఉన్నాయి. నికెల్‌ను ముఖ్యమైన ఎలక్ట్రానిక్ విడి భాగాల తయారీలో వినియోగిస్తుంటారు. -
ఆ ముష్కరులను గుర్తించొచ్చు: ఎఫ్‌బీఐ
వాషింగ్టన్: అమెరికాలో విచక్షణారహితంగా అమాయకులపై కాల్పులకు పాల్పడుతున్న వ్యక్తుల ప్రవర్తనా సరళి ఎలా ఉంటుందో గుర్తించామని దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ తెలిపింది. ఈ లక్షణాలు తెలిసి ఉండటం వల్ల పోలీసులు కొన్ని కాల్పుల ఘటనలనైనా అడ్డుకోగలగడానికి వీలవుతుందంది. హంతకుల్లో చాలా వరకు శ్వేతజాతీయులేననీ, వారు వివిధ రకాల ఒత్తిడులకు, అన్యాయానికి గురైన వారేనని తెలిపింది. 75 శాతం హంతకులకు మానసిక అనారోగ్యాలేవీ లేవని ఎఫ్‌బీఐ తెలిపింది. -
’వారి భయాలను అర్ధం చేసుకోవాలి’
వాషింగ్టన్: ఆఫ్రికన్-అమెరికన్ల భయాలను గురించి తెల్లజాతీయులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించారు. డల్లాస్ కాల్పుల ఘటన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. నల్లజాతీయులు భయంతో ఉన్నారన్నారు. 'తమ పిల్లలు డ్రైవ్‌కు, ఆటలకు, డేట్లకు బయటకు వెళ్లేప్పుడు.. వారికేం జరుగుతుందో అన్నభయంతో ఆఫ్రికన్-అమెరికన్లు ఉన్నారు. వారి భయాలను గురించి తెల్లజాతీయులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతిరోజూ ఎంతో క్లిష్టమైన విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను గురించి కూడా మనం ఆలోచించాలి' అని వ్యాఖ్యానించారు. డల్లాస్‌లో కాల్పులను అత్యంత దారుణమైన ఘటనగా హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె పెన్సిల్వేనియాలో నిర్వహించాల్సిన ఎన్నికల కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. అసమానతల విషయంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా విశేషమైన కృషి చేశారని ఆమె కితాబిచ్చారు. డల్లాస్‌లో నల్లజాతి నిరసనకారుల ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్లో ఐదుగురు పోలీసు అధికారులు మరణించిన విషయం తెలిసిందే.