’వారి భయాలను అర్ధం చేసుకోవాలి’
వాషింగ్టన్: ఆఫ్రికన్-అమెరికన్ల భయాలను గురించి తెల్లజాతీయులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించారు. డల్లాస్ కాల్పుల ఘటన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. నల్లజాతీయులు భయంతో ఉన్నారన్నారు. 'తమ పిల్లలు డ్రైవ్కు, ఆటలకు, డేట్లకు బయటకు వెళ్లేప్పుడు.. వారికేం జరుగుతుందో అన్నభయంతో ఆఫ్రికన్-అమెరికన్లు ఉన్నారు. వారి భయాలను గురించి తెల్లజాతీయులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతిరోజూ ఎంతో క్లిష్టమైన విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను గురించి కూడా మనం ఆలోచించాలి' అని వ్యాఖ్యానించారు.
డల్లాస్లో కాల్పులను అత్యంత దారుణమైన ఘటనగా హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె పెన్సిల్వేనియాలో నిర్వహించాల్సిన ఎన్నికల కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. అసమానతల విషయంలో అధ‍్యక్షుడు బరాక్ ఒబామా విశేషమైన కృషి చేశారని ఆమె కితాబిచ్చారు. డల్లాస్లో నల్లజాతి నిరసనకారుల ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్లో ఐదుగురు పోలీసు అధికారులు మరణించిన విషయం తెలిసిందే.