అమెరికాలో స్వర్ణయుగం తెస్తానని ట్రంప్ ప్రమాణస్వీకార ప్రసంగంలో పలు ప్రతిజ్ఞలు చేస్తున్నవేళ విపక్ష నాయకురాలు, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కిసుక్కున నవ్వారు. ఓవైపు ట్రంప్ సీరియస్‌గా మాట్లాడుతుంటే హిల్లరీ ఎందుకలా నవ్వారన్న అంశం ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది.
హిల్లరీ నవ్విన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. దశాబ్దాలుగా స్థిరపడిపోయిన ఒక భౌగోళిక స్వరూపం పేరును ఊరకే ఒక దేశాధ్యక్షుడు ఇష్టమొచ్చినట్లు మార్చితే ఇబ్బందులు రావా? అనేది ఇక్కడ అసలు ప్రశ్న. ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ అనే పేరు శతాబ్దాల క్రితమే స్ధిరపడిపోయింది. ఇప్పుడు హఠాత్తుగా అమెరికాలాంటి ఏదో ఒక్క దేశం తాము ఈ ప్రాంతాన్ని మరోలా పిల్చుకుంటామంటే కుదరదు.
కొత్త పేరును తగిలించడానికి అంతర్జాతీయంగా మ్యాప్‌లలో పేర్లు మార్చాలి. ఈ మార్గంలో వెళ్లే భారీనౌకల సాఫ్ట్‌వేర్‌లలో, సముద్ర సంబంధ ఉపగ్రహాల్లోల డేటాల్లో, చమురు, వాణిజ్య సంస్థల ఒప్పందాల్లో.. ఇలా ఎన్నింటిలోనూ ఈ ప్రాంతం పాత పేరును చెరిపేసి కొత్తపేరును రాయాల్సి ఉంటుంది. ఇదంతా ఎంతో శ్రమతో కూడిన వ్యవహారం. అన్ని దేశాల ∙ఏకాభిప్రాయంతో జరగాల్సిన సుదీర్ఘ ప్రక్రియ ఇది.
When Donald Trump starts talking the Gulf of America, the entire sane world is Hillary Clinton. pic.twitter.com/Yp3gp61Wka
— Brad Bo 🇺🇸 (@BradBeauregardJ) January 21, 2025
Comments
Please login to add a commentAdd a comment