ఐఎస్లో చేరాలనుకున్న అమెరికన్కి జైలు శిక్ష
వాషింగ్టన్: ఆస్టిన్ నగరానికి చెందిన మైఖేల్ టొడ్ ఫరూఖ్ తీవ్రవాద సంస్థ ఐఎస్లో చేరేందుకు చేసిన ప్రయత్నాన్ని యూఎస్ కోర్టు తీవ్ర నేరంగా పరిగణించిది. ఈ నేపథ్యంలో మైఖేల్కి 82 నెలల జైలు శిక్ష విధిస్తూ జడ్జి సమ్ స్పార్క్స్ తీర్పు వెలువరించారని ఎఫ్బీఐ అధికారులు శుక్రవారం వెల్లడించారు. 2013లో ఐఎస్లో చేరాలని మైఖేల్ నిర్ణయించుకున్నాడు. ఆ దిశగా అతడు ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
అందులోభాగంగా 2014 జూన్ 17న తూర్పు ప్రాచ్యా దేశాలకు పయనమైందుకు విమాన టికెట్లు కూడా కొనుగోలు చేశారు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అనంతరం మైఖేల్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఐఎస్లో చేరేందుకు తాను చేసిన ప్రయత్నాలను మైఖేల్ కోర్టులో ఒప్పుకున్నాడు. దీంతో కోర్టు అతడికి 82 నెలల జైలు శిక్ష విధించింది.