ట్రంప్‌ మరో సంచలనం.. గుజరాతీ కాష్‌ పటేల్‌కు కీలక బాధ్యతలు | Indian-origin Kash Patel Appointed As Director Federal Bureau Of Investigation, Know About Him In Telugu | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ మరో సంచలనం.. గుజరాతీ కాష్‌ పటేల్‌కు కీలక బాధ్యతలు

Feb 21 2025 7:56 AM | Updated on Feb 21 2025 11:39 AM

Kash Patel Appointed As director Federal Bureau of Investigation

వాషింగ్టన్‌: భారత సంతతి వ్యక్తి కాష్ పటేల్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కీలక బాధ్యతలను అప్పగించారు. అమెరికా ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పటేల్‌ నియామకానికి సంబంధించిన తీర్మానానికి సెనెట్ ఆమోదం తెలిపింది. 51-49 ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది.

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ పేరును ప్రకటించారు. అయితే, ఇలాంటి పదవుల విషయంలో సెనెట్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనిపై తీర్మానంపై సెనెట్‌లో ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్‌లో కాష్‌ పటేల్‌కు అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన నియామకం అధికారికంగా ధ్రువీకరించారు. అయితే, రిపబ్లికన్‌లకు మెజార్టీ ఉన్న సెనేట్‌లో కాష్ పటేల్ నియమాకంపై ఓటింగ్ చేపట్టారు. అయితే, అనూహ్యంగా ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు పార్టీ విప్ ధిక్కరించి ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. మైనే, అలస్కా సేనేటర్లు సుశాన్ కొలిన్స్, లీసా ముర్కోస్కీలు పటేల్‌ నియమాకాన్ని వ్యతిరేకించారు. ఇక, ప్రతిపక్ష డెమోక్రాట్లు కూడా పటేల్‌ నియమాకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం రెండు ఓట్ల తేడాతో ఆయన నియామకానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది.

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియామకం అనంతరం కాష్‌ పటేల్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా క్వాష్‌ పటేల్‌.. అమెరికా ప్రజలు గర్వించేలా ఎఫ్‌బీఐని తీర్చిదిద్దుతాను. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే అంతు చూస్తాం. అలాంటి వారు ఈ గ్రహంలో ఏ మూలన ఉన్నా వెంటాడుతామని హెచ్చరించారు. అలాగే, అమెరికానే ఫస్ట్‌.. మిషన్‌ ఫస్ట్‌గా పనిచేద్దాం. డైరెక్టర్‌గా నా లక్ష్యం స్పష్టంగా ఉంది అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. కాష్‌ పటేల్‌ ప్రవాస భారతీయుడు. ఆయన కుటుంబం గుజరాత్‌కు చెందినవారు. పూర్తి పేరు కశ్యప్ ప్రమోద్ వినోద్ పటేల్. పటేల్‌.. 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో జన్మించారు. లాంగ్ ఐలండ్‌లోని గార్డెన్ సిటీ హైస్కూల్‌‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు. యూనివర్శిటీ కాలేజ్ లండన్‌ నుంచి ఇంటర్నేషనల్ లా అభ్యసించారు. ట్రంప్ తొలి హయాంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో కౌంటర్ టెర్రరిజం విభాగానికి సీనియర్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. రెండో టర్మ్‌లో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement