వీడిన మిస్టరీ
Published Fri, Jan 15 2016 3:59 PM | Last Updated on Mon, Oct 1 2018 5:16 PM
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన సునంద పుష్కర్ (53) అనుమానాస్పద మరణంపై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. సునందాది సహజ మరణం కాదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. విషప్రయోగం వల్లే సునంద మరణం సంభవించినట్టుగా ఎయిమ్స్ సమర్పించిన ఫోరెన్సిక్ రిపోర్టు తేల్చిందన్నారు. దీంతో సునంద పుష్కర్ భర్త, కాంగ్రెస్ నేత శశిథరూర్ ఇరకాటంలో పడ్డారు.
అయితే ఆమెది మరణం సహజం కాదని నిశ్చయంగా చెప్పగలనని ఢిల్లీ పోలీస్ చీఫ్ బిఎస్ బాసీ వ్యాఖ్యానించారు. రేడియోధార్మిక విషపదార్థం ఉండే అవకాశాలను తోసి పుచ్చిన ఆయన తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు.
సుదీర్ఘ విచారణ అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ బస్సీ వెల్లడించారు. కేసు విచారణ, ఎయిమ్స్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ వివరాలను పోలీస్ కమిషనర్ మీడియాకు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడు ఆమె భర్తను శశిథరూర్ ను మరో మారు ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై శశ్ థరూర్ ఇంకా స్పందించాల్సి ఉంది.
కాగా 2014 జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఫైవ్‌స్టార్ హోటల్ గదిలో 53 ఏళ్ల పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎన్నో మలుపులు తిరిగిన సునంద మృతిపై పోలీసులు పలుమార్లు సునంద భర్త శశిథరూర్ తో సహా.. పలువురిని విచారించారు.
Advertisement
Advertisement