ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో మరో ఎన్నారై | Another NRI insider trading | Sakshi
Sakshi News home page

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో మరో ఎన్నారై

Published Thu, Aug 27 2015 1:21 AM | Last Updated on Mon, Oct 1 2018 5:35 PM

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో మరో ఎన్నారై - Sakshi

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో మరో ఎన్నారై

న్యూయార్క్: అమెరికాలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న భారత సంతతి వ్యక్తి ఆశిష్ అగర్వాల్ (27), ఆయన మిత్రులు ఇద్దరు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ముందు లొంగిపోయారు. అయితే, తామే నేరం చేయలేదని వారు న్యాయస్థానానికి విన్నవించారు. 2011 జూన్-2013 జూన్ మధ్య కాలంలో జేపీ మోర్గాన్ సెక్యూరిటీస్‌కి చెందిన శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలో ఆశిష్ అగర్వాల్ సెక్యురిటీ అనలిస్టుగా పనిచేశారు. ఆ సమయంలో పీఎల్‌ఎక్స్ టెక్నాలజీస్‌ను ఇంటిగ్రేటెడ్ డివైజ్ టెక్నాలజీ, ఎగ్జాక్ట్‌టార్గెట్‌ను సేల్స్‌ఫోర్స్‌డాట్‌కామ్ కొనుగోలు చేసే డీ ల్స్‌కు జేపీ మోర్గాన్ సలహాదారుగా వ్యవహరించింది.

అభియోగాల ప్రకారం.. ఈ రెండు డీల్స్‌కి సంబంధించిన కీలక విషయాలను ఆశిష్.. తన స్నేహితుడు షహర్యార్ బొలాందియాన్‌కు చేరవేశారు. ఆ వివరాలను షహర్యార్ తన మిత్రుడు కేవన్ సాదిఘ్‌కు అందించారు. ఈ కీలక ఇన్‌సైడర్ సమాచారాన్ని ఉపయోగించి వీరు 6,72,000 డాలర్ల మేర లాభపడ్డారని, అగర్వాల్, షహర్యార్ ఈ సొమ్మును గతంలో వచ్చిన ట్రేడింగ్ నష్టాలను భర్తీ చేసుకునేందుకు, రుణాలు తీర్చేందుకు ఉపయోగించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అగర్వాల్ ఈ ఆరోపణలు ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement