insider trading
-
సిండికేటు లూటీ!
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కాజేసిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు తమకు సన్నిహితులైన కాంట్రాక్టర్లతో సిండికేట్‌ను ఏర్పాటు చేసి రాజధాని నిర్మాణ పనులను అధిక ధరలకు కట్టబెడుతున్నారు. మొన్న.. రూ.10,696.79 కోట్ల వ్యయంతో 37 ప్యాకేజీల కింద రాజధాని ముంపు నివారణ, రహదారుల నిర్మాణంలో మిగిలిన పనులకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏడీసీఎల్) నిర్వహించిన టెండర్లలో సిండికేట్ బాగోతం బట్టబయలైంది. నేడు.. రూ.16,463.83 కోట్ల వ్యయంతో 22 ప్యాకేజీల కింద భూసమీకరణ ద్వారా భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు లేఅవుట్ల అభివృద్ధి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్.. మంత్రులు, జడ్జిలు, ఐఏఎస్ అధికారులకు బంగ్లాల నిర్మాణ పనులకు సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ఖరారు చేసిన టెండర్లలోనూ ప్రభుత్వ పెద్దల లాలూఛీ బాగోతం మరోసారి బట్టబయలైంది. ఏడీసీఎల్, సీఆర్డీఏ రెండు కలిసి రూ. రూ.27,160.62 కోట్ల కాంట్రాక్టు విలువతో 59 ప్యాకేజీల కింద పనులకు టెండర్లు పిలిచాయి. ఈ పనులను రూ.28,209.62 కోట్లకు సిండికేట్‌లోని ఎనిమిది కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వ పెద్దలు పంచి పెట్టారు. కాంట్రాక్టు విలువ కంటే సగటున 3.94 నుంచి 4.34 శాతం అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ఖజానాపై రూ.1,049 కోట్లు భారం మోపారు. అదే రివర్స్ టెండరింగ్ విధానం అమల్లో ఉండి ఉంటే కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి కనీసం 8 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చేవారని.. దీనివల్ల ఖజానాకు రూ.2,500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల మేర ఆదా అయ్యేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సిండ్ఙికేటు’ రాజ్యం..!రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలవక ముందే సన్నిహిత కాంట్రాక్టు సంస్థలతో ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపారు. ఆ కాంట్రాక్టర్లతో సిండికేట్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 2014–19 మధ్య షాపూర్జీ పల్లోంజీ కాంట్రాక్టు సంస్థ నుంచి ముఖ్యనేత తరఫున కమీషన్లు వసూలు చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సాక్ష్యాధారాలతో పట్టుబడిన అధికారే ఇప్పుడూ ప్రభుత్వ పెద్దల తరఫున సిండికేట్ కాంట్రాక్టర్లతో చక్రం తిప్పుతున్నారు. సిండికేట్‌లోని కాంట్రాక్టర్ల ప్రతిపాదన మేరకే వారికి అధికంగా పనులు కట్టబెట్టేందుకు వీలుగా బిడ్ కెపాసిటీని 2 ఎన్ఎన్–బీ నుంచి 3 ఏఎన్–బీకి పెంచుతూ ఫిబ్రవరి 10న ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయించారు. అంతకు ముందే అంచనాలను ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి, సిండికేట్ కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ జారీ చేయడానికి వీలుగా జ్యుడీషియల్ ప్రివ్యూ విధానాన్ని కూడా రద్దు చేశారు. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్డానికి వీలుగా రివర్స్ టెండరింగ్ విధానానికి కూడా మంగళం పాడారు. తమ అక్రమాలకు అడ్డొచ్చే వ్యవస్థలు.. విధానాలను అన్నింటినీ రద్దు చేశాకే రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు.పూలింగ్ లేఅవుట్ల అభివృద్ధికి రూ.14,887.64 కోట్లు..భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) పథకం కింద రాజధానికి రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. ఆ పథకం కింద రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలి. అందుకు రహదారులు, విద్యుత్, తాగునీటి సౌకర్యం వంటి కనీస సదుపాయాలు కల్పించడం ద్వారా లేఅవుట్లను అభివృద్ధి చేయాలి. రాజధానికి భూసమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వడానికే 17 వేల ఎకరాలు భూమి అవసరం. ఇందులో లేఅవుట్ల అభివృద్ధి పనులకు 18 ప్యాకేజీల కింద సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఈ పనులన్నింటినీ కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకే సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. రూ.14,887.64 కోట్లకు ఆ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ తదితర పన్నుల రూపంలో కాంట్రాక్టర్లకు అదనంగా ఇస్తామని సీఆర్డీఏ చెప్పిన మొత్తాన్ని కూడా కలిపితే ఈ పనుల వ్యయం రూ.17 వేల కోట్లకు చేరుతుంది. అంటే ఎకరం భూమిలో లేఅవుట్ అభివృద్ధి చేయడానికే సగటున రూ.కోటి చొప్పున వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలే చెబుతున్నాయి. వాస్తవానికి అత్యాధునిక సదుపాయాలతో లేఅవుట్‌ను అభివృద్ధి చేయడానికి ఎకరానికి రూ.50 లక్షలకు మించి వ్యయం కాదని స్పష్టం చేస్తున్నారు. ఇక సీఆర్డీఏ ద్వారా ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగుతూ చేపట్టిన హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్.. మంత్రులు, జడ్జీలకు బంగ్లాలు.. ఐఏఎస్‌లకు బంగ్లాల నిర్మాణ పనులను నాలుగు ప్యాకేజీల కింద కాంట్రాక్టర్లకు అప్పగించారు.– ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన కృష్ణారెడ్డికి చెందిన మేఘా సంస్థకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లే అవుట్లు అభివృద్ధి చేసేందుకు సంబంధించిన ఐదు ప్యాకేజీల పనులను కట్టబెట్టారు. ఈ పనుల విలువ రూ.5,608.7 కోట్లు.– ఈనాడు కిరణ్ సోదరుడి వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌కు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి నాలుగు పనులను ప్రభుత్వ పెద్దలు అప్పగించారు. ఈ పనుల విలువ రూ.2,813.66 కోట్లు.– బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్లకు సంబంధించి ఎనిమిది ప్యాకేజీల పనులను అప్పగించారు. వీటి విలువ రూ.3,945.47 కోట్లు.– ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఏవీ రంగరాజు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఎన్సీసీ సంస్థకు హ్యాపీ నెస్ట్‌తోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణం, ఓ ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ పని అప్పగించారు. వీటి విలువ రూ.3,438.21 కోట్లు.– మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఆయన తరఫున ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన కనకమేడల వరప్రసాద్‌కు చెందిన కేఎమ్వీ ప్రాజెక్ట్స్‌కు ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ పనులు కట్టబెట్టారు.– సీఎం చంద్రబాబుతో ఆది నుంచి సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్ అభివృద్ధి చేసే ఒక ప్యాకేజీ పనిని అప్పగించారు.ఎనిమిది సంస్థలకే పనులన్నీ..రాజధాని అమరావతిలో వరద మళ్లింపు, రహదారుల అభివృద్ధి పనులను 37 ప్యాకేజీల కింద చేపట్టేందుకు రూ.15,095.02 కోట్లతో ఏడీసీఎల్‌కు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇక ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్ల అభివృద్ధి, హ్యాపీనెస్ట్, మంత్రులు, జడ్జిలు, ఐఏఎస్ అధికారుల బంగ్లాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణ పనులను 22 ప్యాకేజీల కింద చేపట్టడానికి రూ.22,607.11 కోట్లతో సీఆర్డీఏకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ రెండూ మొత్తం 59 ప్యాకేజీల కింద పనులకు టెండర్లు పిలిచాయి. వాటన్నింటినీ సిండికేట్‌లోని ఎనిమిది సంస్థలే దక్కించుకున్నాయి. ఎన్సీసీ సంస్థ రూ.6,124.08 కోట్లు, బీఎస్సార్ ఇన్ఫ్రా రూ.6,216.47 కోట్లు, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ రూ.6,031.79 కోట్లు, మేఘా రూ.7,022.38 కోట్లు, ఎమ్వీఆర్ ఇన్ఫ్రా (నారా లోకేష్ తోడల్లుడు విశాఖ ఎంపీ భరత్ సన్నిహితుడికి చెందిన సంస్థ)కు రూ.796.04 కోట్లు, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే కృష్ణయ్యకు చెందిన బీఎస్పీసీఎల్‌కు రూ.779.82 కోట్లు, ఎల్ అండ్ టీ సంస్థకు రూ.809.88 కోట్లు, కేఎమ్వీ ప్రాజెక్ట్స్‌కు రూ.429.23 కోట్ల విలువైన పనులను కట్టబెట్టబెట్టారు.నీకింత.. నాకింత..సీఆర్డీఏ, ఏడీసీఎల్ 59 ప్యాకేజీల కింద పనులకు పిలిచిన టెండర్లను ప్రభుత్వం ఆమోదించింది. ఆ పనులను రూ.28,209.62 కోట్లకు ఎనిమిది కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వ పెద్దలు పంచి పెట్టారు. ఆ పనులను అప్పగిస్తూ సీఆర్డీఏ, ఏడీసీఎల్ వాటితో ఒప్పందం చేసుకున్న వెంటనే కాంట్రాక్టు విలువలో పది శాతం అంటే రూ.2,820.96 కోట్లను ఆ సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెబుతాయి. అందులో 8 శాతం అంటే.. రూ.2,256 కోట్లను ప్రభుత్వ పెద్దలు తొలి విడత కమీషన్లుగా రాబట్టుకోనున్నారు. ఇందుకోసమే గత ప్రభుత్వం రద్దు చేసిన మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని పునరుద్ధరించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. సిండికేట్ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసే బాధ్యతను గతంలో ఆదాయపు పన్ను శాఖకు చిక్కిన అధికారికే ప్రభుత్వ పెద్దలు అప్పగించినట్లు చర్చ సాగుతోంది. -
అక్రమాల పుట్ట ‘అమరావతి’
సాక్షి, అమరావతి: ఆశ్రిత పక్షపాతం.. అవినీతి.. అధికార దుర్వినియోగం.. వెరసి అమరావతిని మాజీ సీఎం చంద్రబాబు అక్రమాల పుట్టగా మార్చేశారు. అడ్డగోలు నిర్ణయాలతో అమరావతిని భ్రష్టు పట్టించారు. రాజధాని ఇక్కడా.. అక్కడా అంటూ లీకులిచ్చి స్కాములకు బీజం వేశారు. రాజధాని ఎంపిక నుంచి భూముల కొనుగోళ్లు, భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్), ప్రైవేట్ సంస్థలకు కేటాయింపు, సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు, ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూముల వ్యవహారం వరకు ఏది తవ్వినా టన్నుల కొద్దీ అవినీతి పుట్ట బద్ధలవుతోంది. అధికార రహస్యాలను బయటకు వెల్లడించనని, రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని, తన, పర బేధం చూడనని చేసిన ప్రమాణాన్ని (ఓత్ ఆఫ్ సీక్రసీ) ఉల్లంఘించి అమరావతిని అక్రమాల అడ్డాగా మార్చేసిన తీరు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో ప్రజలు నివ్వెరపోతున్నారు. అమరావతిలో జరిగిన అసైన్డ్ భూముల స్కామ్ తాజాగా సీఐడీ దర్యాప్తులో బట్టబయలవడం, ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి భూముల కేటాయింపుల వరకు చోటు చేసుకున్న అక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రివర్గ ఉపసంఘం నుంచి సీఐడీ, ఈడీ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వరకు ఏ నివేదికను పరిశీలించినా అమరావతి అక్రమాల పుట్ట అని, చంద్రబాబు పర్యవేక్షణలోనే ఇవన్నీ జరిగాయని నిగ్గు తేలుతోంది. రాజధాని ముసుగులో సాగిన ఇన్సైడర్ ట్రేడింగ్ లబ్ధిదారులు గత సర్కారు పెద్దలు, మాజీ మంత్రులు, టీడీపీ నేతలే అన్నది జగమెరిగిన సత్యం. ఈ జాబితాలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సన్నిహితుడు వేమూరు రవికుమార్ ప్రసాద్, మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ నరేంద్ర, చంద్రబాబు కరకట్ట నివాసం యజమాని లింగమనేని రమేష్, లంకా దినకర్, కంభంపాటి రామ్మోహన్రావు, పుట్టా మహేష్ యాదవ్ తదితరులున్నారు. అమరావతి భూ కుంభకోణాన్ని మంత్రివర్గ ఉపసంఘం తవ్వి తీయడం తెలిసిందే. ఉపసంఘం నివేదికతో రంగంలోకి సీఐడీ మంత్రివర్గ ఉపసంఘం సమగ్ర నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. రాజధాని పేరుతో లీకులు ఇచ్చి కారుచౌకగా భూములు కొట్టేసి ఆ తర్వాత ల్యాండ్ ఫూలింగ్‌తో ఆర్థికంగా లబ్ధి పొందిన అక్రమార్కుల జాబితాను సీఐడీ రూపొందించింది. రాజధాని ప్రకటనపై ముందస్తు సమాచారంతో క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ రీజియన్‌లో తక్కువ ధరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు నిర్ధారించింది. బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేసినట్లు నివేదికలో పేర్కొంది. రూ.కోట్లు విలువైన భూములను పేద వర్గాలు (797 మంది తెల్లకార్డుదారులు) కొనుగోలు చేయడం వెనుక బినామీలు టీడీపీ నాయకులేనని నిగ్గు తేల్చింది. నిజమైన పేదలే అయితే వారికి అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? ఒకవేళ డబ్బున్న వారైతే తెల్లకార్డులు ఎలా పొందారు? అనే కోణంలో విచారించిన సీఐడీ అధికారులు ఆదాయ పన్ను శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లకు నివేదికలు అందించడంతో ఆయా విభాగాలు తమదైన రీతిలో విచారణ సాగించాయి. అక్రమాల చిట్టా... చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బినామీ వేమూరి రవికుమార్ కుటుంబం పేరుతో 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. లింగమనేని రమేష్ తన భార్య, బంధువుల పేర్లతో భూములు కొన్నారు. మాజీ మంత్రి నారాయణ తన సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణకుమార్ పేర్లతో 55.27 ఎకరాలు కొనుగోలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ బినామీ పేర్లతో 68.6 ఎకరాలు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్ పేరుతో 37.84 ఎకరాలు, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు మైత్రీ ఇన్ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నిర్థారణ అయ్యింది. బినామీలకు భారీ లబ్ధి చేకూర్చేలా.. టీడీపీ నేతలు, వారి బినామీలకు మేలు చేసేలా చంద్రబాబు సర్కారు రాజధాని సరిహద్దులను కూడా మార్పు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారించింది. భూ కేటాయింపుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని, 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు. బినామీలు, నేతల భూములకు ప్రయోజనం చేకూర్చేలా రాజధానిని ఏర్పాటు చేశారని తేటతెల్లమైంది. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు తేలింది. 4,070 ఎకరాల భూములను ఇన్సైడర్ ట్రేడింగ్‌లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఎదుర్కోలేక అడ్డుకునే ప్రయత్నాలు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి తాజాగా సీఐడీ నమోదు చేసిన అసైన్డ్ భూ కుంభకోణం వరకు దర్యాప్తును ఎదుర్కొనేందుకు చంద్రబాబు అండ్‌కోకు ధైర్యం లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వ్యవస్థల ద్వారా దర్యాప్తును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌లో టీడీపీ పెద్దలతోపాటు వారికి మద్దతుగా నిలిచిన ప్రముఖుల గుట్టు రట్టు కావడంతో సీఐడీ, ఏసీబీ, సిట్ దర్యాప్తులను గతేడాది అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. చదవండి: పేదలను బెదిరించారు..‘అసైన్డ్’ కాజేశారు -
అదానీ గ్రూప్‌పై ఆధారాలున్నాయా?
న్యూఢిల్లీ: విదేశీ రిపోర్టులను సాక్ష్యాధారాలుగా పరిగణించలేమని, అందులోని అంశాలను స్వచ్ఛమైన నిజాలుగా భావించలేమని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. భారత్‌కు చెందిన అదానీ గ్రూప్ ఇద్దరు విదేశీ ఇన్వెస్టర్ల ద్వారా ఇన్సైడర్ ట్రేగింగ్కు పాల్పడిందని ఆరోపిస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు (ఓసీసీఆర్పీ) అనే విదేశీ స్వచ్ఛంద సంస్థ ఓ నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే. అమెరికా బిలియనీర్ జార్జి సోరోస్ ఈ సంస్థను స్థాపించారు. ఈ నివేదిక వెలువడిన నేపథ్యంలో.. అక్రమాలకు పాల్పడిన అదానీ గ్రూప్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు వ్యక్తులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ హాజరయ్యారు. ‘‘విదేశీ నివేదికలను కచి్చతంగా నిజాలుగా ఎందుకు స్వీకరించాలి? ఓసీసీఆర్పీ నివేదికను మేము తోసిపుచ్చడం లేదు. కానీ, అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలు కావాలి. అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా మీ దగ్గరున్న ఆధారాలేమిటి?’’ అని ప్రశాంత్ భూషణ్‌ను ప్రశ్నించింది. -
‘ఇన్సైడర్ ట్రేడింగ్’.. అమెరికాలో ఎన్నారై విభాగం టీడీపీ నేతలకు 25 ఏళ్ల జైలు శిక్ష!
అమెరికా టీడీపీ ఎన్నారై విభాగంలో కీలక సభ్యులుగా వ్యవహరిస్తున్న నెల్లూరు జనార్ధన్ చౌదరి, బర్మా శివ నారాయణ చౌదరిలు జైలు శిక్ష అనుభవించనున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడినట్లు తేలడంతో అమెరికా న్యాయ స్థానం సుమారు 25 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో తుది తీర్పు వెలువరించనుంది. నెల్లూరు జనార్ధన్ చౌదరి, బర్మా శివ నారాయణ చౌదరిలు అమెరికాలో ఐటీ ప్రొఫెషనల్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఓవైపు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూనే అమెరికా టీడీపీ ఎన్నారై విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే వారిద్దరు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడడంతో కాలిఫోర్నియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికన్ స్టాక్ ఎక్చ్ంజ్లో నమోదైన ఓ పబ్లిక్ ట్రెడెడ్ కంపెనీ నిర్వహించే ట్రేడింగ్‌లో.. ఆ కంపెనీ స్టాక్స్‌తో పాటు ఇతర ఆర్ధిక సంబంధిత రహస్య సమాచారాన్ని నాలుగు సార్లు ఇతరులకు చేరవేయడం ద్వారా నిందితులు లాభపడేలా సెక్యూరిటీ ఫ్రాడ్‌కు పాల్పడినట్లు తేలింది. శివ నారాయణ బర్మాతో పాటు అతని సహచరుడు నెల్లూరు జనార్ధన్ కుట్రపూరితంగా సెక్యూరిటీ మోసానికి పాల్పడ్డారంటూ 2019లో అమెరికన్ పోలీసులు అభియోగాలు మోపారు. కేసు విచారణ కొనసాగుతుండగా సత్యనారాయణ సహచరుడు తాము నేరం చేసినట్లు అంగీకరించాడు. దీనిపై జ్యూరీ ట్రయల్స్ (కోర్టు ధర్మాసనం) విచారణ జరిపి గతేడాది డిసెంబర్ 13న తీర్పు వెలువరించారు. పాలో ఆల్టో నెట్వర్క్స్ జ్యూరీ ట్రయల్స్‌లో నిందితుడు శివ నారాయణ అమెరికా టెక్నాలజీ ఎక్స్ఛేంజ్ 'నాస్డాక్'లో లిస్టైన పాలో ఆల్టో నెట్వర్క్ క్వార్టర్లీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించిన సమాచారాన్ని షేర్ చేసి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారించారు. సమాచారాన్ని షేర్ చేయకూడదు స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్టెడ్ కంపెనీలు తమ పనితీరు, లాభనష్టాల గురించి ప్రతి మూడు నెలలకు (క్యూ1, క్యూ2, క్యూ3, క్యూ4) ఒకసారి బహిరంగంగా ప్రకటిస్తుంటాయి. ఆ మూడు నెలల లోపల కంపెనీ పనితీరు గురించి ఎవరికి షేర్ చేయరు. అలా చేయడం వల్ల స్టాక్ మార్కెట్లో ఆసంస్థ పనితీరుపై ప్రభావం చూపుతుంది. స్టాక్ వ్యాల్యూపెరగడం,తగ్గడంలాంటి ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. అందుకే 3 నెలలు ముగిసిన తర్వాతనే కంపెనీల పనితీరును అనౌన్స్ చేస్తాయి. ఆ సమాచారాన్ని సత్యనారాయణ పాలో ఆల్టో నెట్వర్క్స్ పనితీరు గురించి ముందే లీక్ చేశారు. అన్నం పెట్టిన ఇంటికే సున్నం రహస్యంగా ఉండే కంపెనీల సమాచారాన్ని శివ నారాయణ ముందే ఎలా చేరవేశారనే అనుమానంతో పోలీసులు లోతుగా విచారణ జరిపారు. ఆ విచారణలో నిందితుడు పాలో ఆల్టో నెట్వర్క్స్ మాజీ కాంట్రాక్టర్‌గా పనిచేసినట్లు తేలింది. కాంట్రాక్టర్‌గా పనిచేసే సమయంలో ఆ సంస్థ ఐటీ విభాగంలో పనిచేసే ఉద్యోగుల్ని కలిసినట్లు, వారి ద్వారా కంపెనీ ఆర్ధిక పరమైన రహస్యాలు సేకరించినట్లు నార్తన్ డిస్ట్రీక్ కాలిఫోర్నియా న్యాయవాది స్టెఫానీ ఎమ్ హిండ్స్ కార్యాలయం తెలిపింది ఏడాది కాలంగా శివ నారాయణ బర్మా ఓ వైపు ఉద్యోగిగా పనిచేస్తూనే.. మరోవైపు పాలో ఆల్టో నెట్వర్క్ 4 సార్ల త్రైమాసిక ఆదాయ ఫలితాల సమాచారంతో అక్టోబర్ 2016 నుంచి సెప్టెంబర్ 2017 వరకు ఇన్ సైడ్ ట్రేడింగ్ నిర్వహించారు. సంస్థకు చెందిన రహస్య సమాచారంతో పాటు, ట్రేడింగ్ ఇన్స్ట్రక్షన్ గురించి.. ఆ కంపెనీ షేర్లు కొన్న ఇన్వెస్టర్లకు చేరవేశారు. దీంతో మదుపర్లు 5 రెట్లు లాభపడ్డారు. 7.3 మిలియన్ల లాభం అదే సమయంలో శివ నారాయణ సైతం నాలుగు సార్లు 7.3 మిలియన్లు, అంతకంటే ఎక్కువ అర్జించారు. ఇక జ్యూరీ సభ్యులు విచారణలో 18 యూఎస్ఈ సెక్షన్లు 1348ని ఉల్లంఘించి నాలుగు సెక్యూరిటీల మోసాలకు పాల్పడ్డారని, జ్యూరీ గత వారం బరామాను దోషిగా నిర్ధారించింది. 25ఏళ్లు జైలు శిక్ష విచారణలో ప్రధాన యూఎస్ కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి రిచర్డ్ సీబోర్గ్ బరామకు శిక్షా విచారణ తేదీని ఖరారు చేయలేదు. ఒకవేళ అతనికి 25ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు 18 యూఎస్ఈ సెక్షన్లు 1348ని ఉల్లంఘన నియమావళిలో ఉంది. -
ఫండ్స్ లావాదేవీలకూ ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల వర్తింపు!
న్యూఢిల్లీ: ప్రస్తుతం లిస్టయిన, లిస్ట్ కాబోతున్న షేర్లకు మాత్రమే పరిమితమైన ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ లావాదేవీలకు కూడా వర్తింపచేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. తద్వారా ధరపై ప్రభావం చూపే కీలక సమాచారం (యూపీఎస్‌ఐ) కలిగి ఉన్న ఫండ్స్ సిబ్బంది, దాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తోంది. నిర్దిష్ట స్కీమునకు సంబంధించి, బైటికి ఇంకా వెల్లడించని యూపీఎస్‌ఐ సమాచారం గల ఒక మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంటు..యూనిట్లన్నీ విక్రయించేసుకుని లాభపడటం, అదే విధంగా మరో ఫండ్ ఏజెన్సీలోనూ జరగడం తదితర పరిణామాల నేపథ్యంలో సెబీ ఈ మేరకు ప్రతిపాదన చేసింది ఇందుకు సంబంధించిన చర్చాపత్రం ప్రకారం ఫండ్ యూనిట్లకు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను వర్తింపచేసేలా సెక్యూరిటీస్, ట్రేడింగ్, ఇన్సైడర్ ట్రేడింగ్ నిర్వచనాలను సవరించాలని ప్రతిపాదించింది. అలాగే, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో నిర్దిష్ట స్థాయి వ్యక్తులు తమకు, తమ సమీప బంధువులకు సదరు సంస్థ స్కీముల్లో ఉన్న యూనిట్ల వివరాలను సెబీ నిర్దేశించిన తేదీన బహిర్గతం చేయాలి. ఆ తర్వాత నుంచి మూడు నెలలకోసారి వెల్లడించాలి. 6 గంటల్లోగా రిపోర్ట్ చేయాలి సైబర్ దాడులను గుర్తించిన ఆరు గంటల్లోగా సమాచారం ఇవ్వవలసి ఉందని ఇష్యూలను చేపట్టే అర్హతగల రిజిస్ట్రార్లు, షేర్ల బదిలీ ఏజెంట్లు(క్యూఆర్టీలు), కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ(కేఆర్ఏ)లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దాడులు, బెదిరింపులు, నిబంధనల ఉల్లంఘన తదితర అన్ని రకాల సైబర్ ఘటనలను గుర్తించిన వెంటనే సమయానుగుణంగా దేశీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ–ఇన్)కు సైతం రిపోర్ట్ చేయవలసిందిగా తెలియజేసింది. ఇందుకు మార్గదర్శకాలను ప్రకటిస్తూ రెండు ప్రత్యేక సర్క్యులర్లను జారీ చేసింది. వీటిలో భాగంగా జాతీయ కీలక సమాచార మౌలిక రక్షణ కేంద్రం(ఎన్సీఐఐపీసీ) ద్వారా ‘రక్షణాత్మక వ్యవస్థ’గా గుర్తింపును సైతం పొందవలసి ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎన్‌సీఐఐపీసీకి సైతం సైబర్ సంఘటనలపై సమాచారాన్ని ఇవ్వవలసి ఉంటుందని సెబీ పేర్కొంది. -
ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో ఎన్నారై అరెస్టు .. రుజువైతే 20 ఏళ్ల జైలు శిక్ష
న్యూయార్క్: మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ దిగ్గజం మెకిన్సే అండ్ కంపెనీలో పార్ట్నర్ అయిన పునీత్ దీక్షిత్ అనే ప్రవాస భారతీయుడు ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుల ఆరోపణలతో అమెరికాలో అరెస్టయ్యారు. ఆయన 4,50,000 డాలర్ల మేర అక్రమంగా లాభాలు ఆర్జించినట్లు సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజీ కమిషన్ (ఎస్ఈసీ) అభియోగాలు మోపింది. దీక్షిత్‌పై నమోదైన రెండు అభియోగాలు రుజువైతే ఒక్కో దానిలో 20 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. అభియోగాలు మెకిన్సే క్లయింట్ అయిన గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్.. త్వరలో గ్రీన్‌స్కై అనే సంస్థను కొనుగోలు చేయబోతోందన్న ఇన్సైడ్ సమాచారాన్ని దీక్షిత్ దుర్వినియోగం చేశారు. కొనుగోలు ప్రకటన వెలువడ్డాక కొద్ది రోజుల్లో ముగిసిపోయే గ్రీన్ స్కై అవుట్ ఆఫ్ మనీ కాల్ ఆప్షన్లను చౌకగా కొనుగోలు చేశారు. ఆ తర్వాత టేకోవర్ ప్రకటన వెలువడిన అనంతరం గ్రీన్‌స్కై షేర్ల ధరలు ఏకంగా 44 శాతం ఎగియడంతో, కాల్ ఆప్షన్లు భారీగా పెరిగాయి. సరిగ్గా అదే సమయంలో దీక్షిత్ వాటిని విక్రయించి, గణనీయంగా లాభపడ్డారని ఎస్ఈసీ అరోపిస్తోంది. -
ఇన్ఫీలో ఇన్సైడర్ వివాదం: సెబీ వేటు
సాక్షి,ముంబై: దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇన్సైడర్ ట్రేడింగ్ వివాదంలో ఇరుక్కుంది. ఇన్ఫోసిస్‌లో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలతో ఎనిమిది మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిషేధం విధించింది. వీరిలో ఇద్దరు ఇన్ఫో ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరిపై రూ.3.06 కోట్ల జరిమానా విధించడంతోపాటు సెక్యూరిటీలను నేరుగా లేదా పరోక్షంగా కొనుగోలు చేయడం, అమ్మడం లేదా వ్యాపారం చేయకుండా సెబీ నిషేధించింది. గత ఏడాది (జూలై 15, 2020) ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ వెలుగులోకి వచ్చింది. దీనికిపై సెబీ ప్రాథమిక దర్యాప్తు అనంతరం తాజా నిషేధ ఉత్తర్వులను జారీ చేసింది. సెబీ శాశ్వత సభ్యుడు మాధాబి పూరి బుచ్ మే 31న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రభు భూత్రా, సీనియర్ ప్రిన్సిపల్ కార్పొరేట్ అకౌంటింగ్ గ్రూప్ వెంకట సుబ్రమణియన్ లను దోషిగా నిర్ధారించింది. గత ఏడాది ఇన్ఫోసిస్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరిపినట్లు సెబీ తెలిపింది. ఈ దర్యాప్తులో ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి వీరి మధ్య టెలిఫోన్ సంభాషణలను కనుగొన్నామని కూడా సెబీ వెల్లడించింది. ఈ దర్యాప్తులో క్యాపిటల్ వన్ పార్టనర్స్ భరత్ సీ జైన్, టెసోరా క్యాపిటల్, మనీష్ సీ జైన్, అమిత్ బుత్రాలను కూడా సెబీ దోషిగా తేల్చింది. దీంతో బుదవారం నాటి మార్కెట్లో ఇన్ఫోసిస్ షేరు దాదాపు 2 శాతం నష్టాలతో కొనసాగుతోంది. టెసోరా, క్యాపిటల్ వన్ రెండూ షేర్ ధరలకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఆధారంగా ఇన్ఫోసిస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ విభాగంలో షేర్లను కొనుగోలు చేసి విక్రయించాయని సెబీ తెలిపింది. ఇన్ఫోసిస్ అధికారి వెంకట్ సుబ్రమణియన్ ధరల సమాచారాన్ని లీక్ చేసి ఉండవచ్చని సెబీ భావిస్తున్నది. భూత్రాతో సుబ్రమణియన్ నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు అందిన సమాచారం మేరకు విచారణ జరిపినట్లు సెబీ వెల్లడించింది. అటు జూన్ 1 న సెబీ నిషేధం విషయం తమ దృష్టికి వచ్చిందనీ, ఈ విషయంలో సెబీకి పూర్తిగా సహకరిస్తామనీ, అదనంగా, అంతర్గత దర్యాప్తును ప్రారంభించి, ఫలితాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ఇన్ఫోసిస్ తెలిపింది. మరోవైపు సంబంధిత పార్టీలు ప్రతిస్పందన లేదా అభ్యంతరాన్ని 21 రోజుల్లో సమర్పించవచ్చు. అలాగే వ్యక్తిగత విచారణను కూడా కోరే అవకాశం ఉంది. చదవండి: భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర stockmarket: లాభాల స్వీకరణ, ఐటీసీ ఢమాల్ -
అక్రమాల పుట్ట ‘అమరావతి’
సాక్షి, అమరావతి: ఆశ్రిత పక్షపాతం.. అవినీతి.. అధికార దుర్వినియోగం.. వెరసి అమరావతిని మాజీ సీఎం చంద్రబాబు అక్రమాల పుట్టగా మార్చేశారు. అడ్డగోలు నిర్ణయాలతో అమరావతిని భ్రష్టు పట్టించారు. రాజధాని ఇక్కడా.. అక్కడా అంటూ లీకులిచ్చి స్కాములకు బీజం వేశారు. రాజధాని ఎంపిక నుంచి భూముల కొనుగోళ్లు, భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్), ప్రైవేట్ సంస్థలకు కేటాయింపు, సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు, ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూముల వ్యవహారం వరకు ఏది తవ్వినా టన్నుల కొద్దీ అవినీతి పుట్ట బద్ధలవుతోంది. అధికార రహస్యాలను బయటకు వెల్లడించనని, రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని, తన, పర బేధం చూడనని చేసిన ప్రమాణాన్ని (ఓత్ ఆఫ్ సీక్రసీ) ఉల్లంఘించి అమరావతిని అక్రమాల అడ్డాగా మార్చేసిన తీరు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో ప్రజలు నివ్వెరపోతున్నారు. అమరావతిలో జరిగిన అసైన్డ్ భూముల స్కామ్ తాజాగా సీఐడీ దర్యాప్తులో బట్టబయలవడం, ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి భూముల కేటాయింపుల వరకు చోటు చేసుకున్న అక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రివర్గ ఉపసంఘం నుంచి సీఐడీ, ఈడీ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వరకు ఏ నివేదికను పరిశీలించినా అమరావతి అక్రమాల పుట్ట అని, చంద్రబాబు పర్యవేక్షణలోనే ఇవన్నీ జరిగాయని నిగ్గు తేలుతోంది. రాజధాని ముసుగులో సాగిన ఇన్సైడర్ ట్రేడింగ్ లబ్ధిదారులు గత సర్కారు పెద్దలు, మాజీ మంత్రులు, టీడీపీ నేతలే అన్నది జగమెరిగిన సత్యం. ఈ జాబితాలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సన్నిహితుడు వేమూరు రవికుమార్ ప్రసాద్, మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ నరేంద్ర, చంద్రబాబు కరకట్ట నివాసం యజమాని లింగమనేని రమేష్, లంకా దినకర్, కంభంపాటి రామ్మోహన్రావు, పుట్టా మహేష్ యాదవ్ తదితరులున్నారు. అమరావతి భూ కుంభకోణాన్ని మంత్రివర్గ ఉపసంఘం తవ్వి తీయడం తెలిసిందే. ఉపసంఘం నివేదికతో రంగంలోకి సీఐడీ మంత్రివర్గ ఉపసంఘం సమగ్ర నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. రాజధాని పేరుతో లీకులు ఇచ్చి కారుచౌకగా భూములు కొట్టేసి ఆ తర్వాత ల్యాండ్ ఫూలింగ్‌తో ఆర్థికంగా లబ్ధి పొందిన అక్రమార్కుల జాబితాను సీఐడీ రూపొందించింది. రాజధాని ప్రకటనపై ముందస్తు సమాచారంతో క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ రీజియన్‌లో తక్కువ ధరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు నిర్ధారించింది. బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేసినట్లు నివేదికలో పేర్కొంది. రూ.కోట్లు విలువైన భూములను పేద వర్గాలు (797 మంది తెల్లకార్డుదారులు) కొనుగోలు చేయడం వెనుక బినామీలు టీడీపీ నాయకులేనని నిగ్గు తేల్చింది. నిజమైన పేదలే అయితే వారికి అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? ఒకవేళ డబ్బున్న వారైతే తెల్లకార్డులు ఎలా పొందారు? అనే కోణంలో విచారించిన సీఐడీ అధికారులు ఆదాయ పన్ను శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లకు నివేదికలు అందించడంతో ఆయా విభాగాలు తమదైన రీతిలో విచారణ సాగించాయి. అక్రమాల చిట్టా... చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బినామీ వేమూరి రవికుమార్ కుటుంబం పేరుతో 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. లింగమనేని రమేష్ తన భార్య, బంధువుల పేర్లతో భూములు కొన్నారు. మాజీ మంత్రి నారాయణ తన సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణకుమార్ పేర్లతో 55.27 ఎకరాలు కొనుగోలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ బినామీ పేర్లతో 68.6 ఎకరాలు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్ పేరుతో 37.84 ఎకరాలు, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు మైత్రీ ఇన్ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నిర్థారణ అయ్యింది. బినామీలకు భారీ లబ్ధి చేకూర్చేలా.. టీడీపీ నేతలు, వారి బినామీలకు మేలు చేసేలా చంద్రబాబు సర్కారు రాజధాని సరిహద్దులను కూడా మార్పు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారించింది. భూ కేటాయింపుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని, 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు. బినామీలు, నేతల భూములకు ప్రయోజనం చేకూర్చేలా రాజధానిని ఏర్పాటు చేశారని తేటతెల్లమైంది. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు తేలింది. 4,070 ఎకరాల భూములను ఇన్సైడర్ ట్రేడింగ్‌లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఎదుర్కోలేక అడ్డుకునే ప్రయత్నాలు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి తాజాగా సీఐడీ నమోదు చేసిన అసైన్డ్ భూ కుంభకోణం వరకు దర్యాప్తును ఎదుర్కొనేందుకు చంద్రబాబు అండ్‌కోకు ధైర్యం లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వ్యవస్థల ద్వారా దర్యాప్తును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌లో టీడీపీ పెద్దలతోపాటు వారికి మద్దతుగా నిలిచిన ప్రముఖుల గుట్టు రట్టు కావడంతో సీఐడీ, ఏసీబీ, సిట్ దర్యాప్తులను గతేడాది అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. తాజాగా అసైన్డ్ భూ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు నేపథ్యంలో ఈ నెల 23న చంద్రబాబు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన తప్పించుకునేందుకు దారులు అన్వేషిస్తున్నట్లు సమాచారం. -
అమరావతి భూ కుంభకోణంపై సమగ్ర నివేదిక
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి భూ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే మంగళవారం నాడు సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు అందజేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డ ప్రముఖుల జాబితాను నివేదిక వెల్లడించింది. రాజధాని ప్రకటనకు ముందస్తు సమాచారంతో భూముల కోనుగోళ్లు చేసినట్లు మంత్రివర్గం తేల్చింది. క్యాపిటల్ సిటీ, రీజియన్‌లో భూముల కొనుగోళ్లు జరిపినట్లు నిర్ధారించింది. బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేపట్టినట్టు నివేదికలో పేర్కొంది. టీడీపీ నేతలు, బినామీలకు మేలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం రాజధాని సరిహద్దులపై నిర్ణయం తీసుకుందని నివేదిక తెలిపింది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారించారు. భూ కేటాయింపుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు. 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పక్కా ఆధారాలు సేకరించిన మంత్రివర్గ ఉపసంఘం.. అమరావతి భూముల వ్యవహారంలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించినట్లు మంత్రివర్గ ఉపసంఘం చెబుతోంది. బినామీలు, నేతల భూములకు మేలు చేసేలా రాజధాని ఏర్పాటు చేశారని ఆరోపించింది. టీడీపీ నేతలు.. తెల్ల రేషన్ కార్డు దారులను బినామీలుగా వాడినట్లు మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు తేల్చింది. 4 వేల 70 ఎకరాల భూములను ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొనుగోళ్లు చేసినట్లు గుర్తించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్‌లో టీడీపీ నేతలు, ప్రముఖులు ఉన్నట్లు తేల్చారు. అంతేకాదు.. నివేదికలో పేర్లను సైతం మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. ఇన్ సైడర్ ట్రేడింగ్‌కి పాల్పడ్డ ప్రముఖుల జాబితా… అమరావతి భూముల వ్యవహారంలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన ప్రముఖుల పేర్లతో కూడిన జాబితాను మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. మంత్రివర్గ ఉపసంఘం పేర్కొన్న పేర్లు ఇవే. 1. నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీ ఎం 2. వేమూరు రవికుమార్ ప్రసాద్, నారా లోకేష్ సన్నిహితుడు 3.పరిటాల సునీత, మాజీ మంత్రి 4. జీవి ఎస్ ఆంజనేయులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే 5.లింగమనేని రమేష్, చంద్రబాబు గెస్ట్ హౌస్ యజమాని 6. పయ్యావుల కేశవ్, టీడీపీ ఎమ్మెల్యే 7. లంకా దినకర్, 8. దూళిపాళ్ల నరేంద్ర, 9. కంభంపాటి రామ్మోహన్ రావు, 10. పుట్టా మహేష్ యాదవ్ పేర్లను మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణల బినామీ దందా గురించి.. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బినామీ భూముల వ్యవహారాన్ని మంత్రివర్గ ఉపసంఘం బయటపెట్టింది. వేమూరి రవి కుమార్ కుటుంబం పేరుతో లోకేష్ భూముల కొనుగోళ్లు చేసినట్లు పేర్కొంది. మొత్తం 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు నివేదికలో పేర్కొంది. ఇక లింగమనేని రమేష్.. తన భార్యా, బంధువుల పేర్లతో భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. మాజీ మంత్రి నారాయణ బినామీ దందాను కూడా ఈ నివేదిక బయటపెట్టింది. నారాయణ తన సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణ కుమార్ పేర్లతో 55. 27 ఎకరాలు భూములు కొనుగోలు చేసినట్లు నివేదిక పేర్కొంది. ఇక మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్.. బినామీ పేర్లతో 68.6 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అలాగే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్ పేరుతో 37.84 ఎకరాల భూములు కొన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు.. మైత్రీ ఇన్ ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోళ్లు చేసినట్లు మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. ఇంకా భూముల వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారి పేర్లు, రికార్డులు, ఆధారాలతో నివేదిక సమర్పించింది. టీడీపీ నేతల కోసం సీఆర్డీఏ పరిధి మార్పు టీడీపీ నేతలకు ప్రయోజనం చేకూర్చడం కోసమే సీఆర్డీయే పరిధిని నాటి చంద్రబాబు ప్రభుత్వం మార్చినట్లుగా మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. నేతల భూముల కోసం చంద్రబాబు ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసిందని మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. సీఆర్డీయే పరిధిలో 524.545 ఎకరాల భూముల కోసం సరిహద్దులు మార్పేశారు. బాలక్రిష్ణ వియ్యంకుడి సంస్థ వీబీసీ కెమికల్స్ కు భూముల కేటాయించారు. జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో 498 ఎకరాల కేటాయించారు. భూములు కేటాయించాక సిఆర్డీయే పరిధి మారుస్తూ జీవో జారీ చేశారు. అలానే సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో కోడెల శివప్రసాద్‌కు భూములుకేటాయించాక పరిధి మారుస్తూ 207 జీవో విడుదల చేశారని నివేదిక తెలిపింది. మొవ్వ మండలం పెదముట్టేవి, చినముట్టేవిలో లింగమనేని భూముల కోసం.. కొనకంచిలో యలమంచిలి శివలింగ ప్రసాద్ భూముల కోసం సీఆర్డీఏ సరిహద్దుల్లో మార్పులు చేసినట్లు నివేదిక వెల్లడించింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపుల్లోనూ అక్రమాలు జరిగినట్లు నివేదిక తెలిపింది. 5 ప్రైవేట్ సంస్థలకు 850 ఎకరాల భూ కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఒక రేటు, ప్రైవేట్ సంస్థల మరొక రేటుకు భూముల అమ్మకాలు జరిపినట్లు తెలిపింది. సింగపూర్‌తో ఒప్పందంలోనూ అక్రమాలు గుర్తించిన మంత్రి వర్గ ఉపసంఘం పేర్లు, రికార్డులు, ఆధారాలతో సహా నివేదిక వెల్లడించింది. చదవండి: చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు ఏం చంద్రబాబు ఇప్పుడేమంటారు..? -
అదో పెద్ద ఆర్థిక నేరం.. లోతైన దర్యాప్తు అవసరం
సాక్షి, అమరావతి: అమరావతి భూముల కొనుగోలు వ్యవహారం ఓ పెద్ద ఆర్థిక నేరమని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్ శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. దీనిపై లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ వ్యవహారంలో సీఐడీ ఇటీవల నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సన్నిహితులు కిలారు రాజేశ్, ఆయన భార్య శ్రీహాస, నార్త్‌ఫేస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, చేకూరి తేజస్వి మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా క్రిమినల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కిలారు రాజేశ్ తదితరులు దాఖలు చేసిన రెండు వ్యాజ్యాలు జస్టిస్ రజనీ ముందుకు రాగా, లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన వ్యాజ్యం జస్టిస్ లలిత ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో జస్టిస్ రజనీ తన ముందున్న రెండు వ్యాజ్యాలను కూడా జస్టిస్ లలిత వద్దకు పంపారు. దీంతో మొత్తం మూడు వ్యాజ్యాలపై జస్టిస్ లలిత బుధవారం విచారణ జరిపారు. పక్కా వ్యూహంతో భూముల కోనుగోలు ‘ప్రభుత్వంలో ఉన్న పరిచయాలు, పదవులను అడ్డం పెట్టుకుని, అమరావతి చుట్టు పక్కల ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది.. ఏ ఏ ప్రాజెక్టులు వస్తాయి.. తదితర వివరాలు ముందే తెలుసుకుని, రైతుల నుంచి నామమాత్రపు ధరలకు భూములు కొనుగోలు చేసి లబ్ధి పొందారు. అమరావతి భూముల కొనుగోళ్లు మొత్తం ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ ద్వారానే జరిగాయి. ప్రస్తుత కేసులో సీఐడీ తన ప్రాథమిక విచారణ ద్వారా ఈ విషయాన్ని తేల్చాకే పిటిషనర్లపై కేసు నమోదు చేసింది. అన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచుతాం’ అని ఏజీ శ్రీరాం వాదించారు. హైకోర్టు ఇందుకు అనుమతిస్తూ తదుపరి విచారణను నవంబర్ 2కు వాయిదా వేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు స్టే కోసం పట్టుపట్టగా, సోమవారం వరకు ఎలాంటి కఠిన చర్యలుండవని ఏజీ స్పష్టంగా చెప్పారు. సోమవారం వరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదంటూ న్యాయమూర్తి ఆదేశించారు. -
అమరావతిలో బినామీ ఫ్లాప్ షో
సాక్షి, అమరావతి: అమరావతిలో జరుగుతున్నది చంద్రబాబు, ఆయన బినామీల కోసం చేస్తున్న ఒక కృత్రిమ ఉద్యమమని, అదొక బినామీ ఫ్లాప్ షో అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పప్పు తినడం తప్పితే కందిపప్పు ఎలా వస్తుందో తెలియని లోకేష్.. తాను రైతునని మాట్లాడ్డం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. ► టీడీపీ నేతలు అమరావతి ఉద్యమం పేరుతో చేస్తున్న కార్యక్రమం బాగా డబ్బున్న నిర్మాత తన కొడుకే హీరోగా ఒక చెత్త సినిమా తీసి తానే ఒక థియేటర్ అద్దెకు తీసుకుని ప్రపంచ రికార్డులు బద్దలు చేయాలనో, లేక గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాలనో వాళ్లకు వాళ్లే వంద రోజుల సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ► ఉద్యమాలంటే తెలుగు సీరియల్స్‌లో ఉన్నట్లు కొత్త కండువాలు, కొత్త శాలువాలు వేసుకున్నట్లు ఉండవు. ఒక షో కోసం వచ్చినట్లు, ఆర్టిస్ట్‌లు చేసే విన్యాసాల మాదిరిగా ఉండవు. వీరిలో కొంత మంది అమాయకులు ఉండవచ్చు, వారిని మేం అవమానించడం లేదు. చంద్రబాబే ముందుండి ఎందుకు నాయకత్వం వహించడం లేదు? ► నిజాలు బయటకు వస్తుంటే.. చంద్రబాబు కుటుంబంలో కంగారు ఎక్కువైంది. ఈ స్కాంలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులను అడ్డం పెట్టుకొని బయట పడవచ్చు. పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులందర్నీ కలుపుకుని తప్పు చేస్తే.. అందరూ కలిసి బయటపడవచ్చు అన్నది చంద్రబాబు వ్యూహం. తప్పు చేయనప్పుడు భయమెందుకు? ► ఇన్సైడర్ ట్రేడింగ్‌పై కోర్టుల్లో కేసులున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో కూడా స్పష్టంగా పేర్కొన్న విషయం లోకేష్‌కు తెలియదా! ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదంటే డీజీపీ, సీఎస్‌కు లేఖ రాసే బదులు సీబీఐ విచారణ కోరుతూ ప్రధాని మోదీకే లేఖ రాసి ఉండవచ్చు కదా? ► ఏ తప్పూ చేయలేదు కాబట్టే, జగన్.. ఆయన ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా సిద్ధపడుతోంది. సోషల్ మీడియాలో జడ్జిల వ్యాఖ్యలపై సీబీఐ విచారణ జరుపడానికి అభ్యంతరం లేదని మా అడ్వకేట్ జనరల్ ధైర్యంగా ఒప్పుకున్నారు. మరి మీరెందుకు విచారణ అంటే వెనక్కి పోతున్నారు? ► ఈ రోజు 29 గ్రామాలు కాస్తా.. 3 గ్రామాలయ్యాయి. 3 గ్రామాలు కాస్తా.. 30 మందికి పరిమితమయ్యాయి. ఆ 30 మందీ రైతులా.. బాబు మద్దతుదారులా.. అన్నది అందరికీ తెలుసు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చంద్రబాబు మాట విని రాష్ట్రంలో 0.001 శాతం కాదుగదా.. అందులో వెయ్యో వంతు కూడా ఆందోళన చేసింది లేదు. చంద్రబాబు, లోకేష్‌లను ఏపీకి టూరిస్టుల కింద పిలిస్తే బాగుంటుంది. ► రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చంద్రబాబు చెబుతున్నది అబద్ధం. అమరావతిలో చంద్రబాబు హయాంలో జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారం. వాస్తవానికి జగన్ హయాంలోనే అమరావతికి న్యాయం జరగబోతోంది. అమరావతి ఉద్యమం నిజమైనదో కాదో వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారు. -
అక్కా, బావ, ఓ బామ్మర్ది.. కుచ్చుటోపి!
సాక్షి, అమరావతి: అమరావతి భూముల విషయంలో ‘ఇన్సైడ్ ట్రేడింగ్’ ఆరోపణలతో ఏసీబీ కేసులో మొదటి నిందితునిగా ఉన్న మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అపార్ట్మెంట్ ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్ పేరుతో దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన భార్య, బావమరిది నన్నపనేని సీతారామరాజు, మరికొందరు కలిసి తనను మోసం చేశారంటూ రిటైర్డ్ లెక్చరర్ కోడె రాజా రామమోహనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నాలుగవ నిందితునిగా చేర్చారు. ఈ ఫిర్యాదులోని అంశాలు ఇలా ఉన్నాయి. ► నేను ఓ రిటైర్డ్ లెక్చరర్ని. విజయవాడలో నాకు ఓ నివాస గృహం ఉంది. దానిని 2018 అక్టోబర్‌లో అమ్మేశాను. ఈ విషయం తెలుసుకుని నా పక్క ఊరుకు చెందిన వ్యక్తి కేవీజీ కృష్ణుడు అలియాస్ వేణు విజయవాడలోని ‘క్యాపిటల్ హౌసింగ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్’ కార్యాలయానికి నన్ను తీసుకెళ్లాడు. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నన్నపనేని సీతారామరాజుకు నన్ను పరిచయం చేశారు. ► సీతారామరాజు ‘లేక్ వ్యూ అపార్ట్మెంట్స్’పేరుతో తాము నిర్మిస్తున్న ప్రాజెక్ట్ బ్రోచర్‌ను నాకు చూపారు. ఈ ప్రాజెక్టులో దమ్మాలపాటి శ్రీనివాస్ కుటుంబానికి సైతం భాగం ఉందని, వారి పలుకుబడి ద్వారా తమ కంపెనీ వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సమీపంలో దమ్మాలపాటి శ్రీనివాస్ భార్యకు సైతం భూమి ఉందని సీతారామరాజు చెప్పారు. ► ఆ కార్యాలయంలోనే నేను మొదటిసారి దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన భార్య నాగరాణిని కలిశాను. తాను రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా పనిచేస్తున్నానని, ప్రభుత్వంలో ఎవరినైనా ప్రభావితం చేయగలనని, ఏ పనైనా చేసుకురాగలనని దమ్మాలపాటి, ఆయన భార్య నాకు హామీ ఇచ్చారు. వీరి ప్రేరేపణతో నేను ‘లేక్‌వ్యూ అపార్ట్మెంట్స్’లో రెండు త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్లు కొనాలని నిర్ణయించుకున్నాను. దమ్మాలపాటిని చూసే రూ.50 లక్షలు చెల్లించా ► ఒక్కో ఫ్లాట్‌ను రూ.38.50 లక్షలకు అమ్ముతామని చెప్పారు. దీంతో నేను రెండ్లు ఫ్లాట్లకు అడ్వాన్సు కింద రూ.50 లక్షలు చెల్లించాను. వారు నాకు రెండు వేర్వేరు రసీదులు ఇచ్చారు. ఆ తర్వాత నేను అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కోసం ఒత్తిడి తెచ్చాను. వారు అగ్రిమెంట్ చేయకుండా తప్పించుకు తిరగడం మొదలుపెట్టారు. ► నేను ఒత్తిడి చేస్తున్నట్లు ఎవరూ చేయలేదని, ఆయన చెప్పిన చోట పెట్టుబడి పెట్టేందుకు ఆయన కార్యాలయం బయట వందల మంది ఎదురు చూస్తున్నారని దమ్మాలపాటి మాట్లాడారు. గట్టిగా ఒత్తిడి చేయగా చివరకు 2019 ఫిబ్రవరి 22న ఫ్లాట్ నంబర్ 1001కు కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ చేశారు. రెండో ఫ్లాట్‌కు త్వరలోనే అగ్రిమెంట్ పంపుతామని చెప్పారు. ► చెల్లించాల్సిన మిగిలిన మొత్తానికి రూ.19 లక్షలు, రూ.18.65 లక్షలు, రూ.10.50 లక్షలకు ఆంధ్ర బ్యాంక్ పేరు మీద ఉన్న చెక్కులు ఇచ్చాను. ఆ రోజునే సీతారామరాజు వాటిని నగదుగా మార్చుకున్నారు. స్టార్ హోటల్స్ వస్తాయంటూ.. ► ఆ తర్వాత సీతారామరాజు నాతో ఫోన్లో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు విస్తరణకు డబ్బు అవసరం ఉందన్నారు. అందువల్ల తాను, దమ్మాలపాటి శ్రీనివాస్ భార్య నాగరాణి సంయుక్తంగా కొన్న స్థలాన్ని అమ్ముతున్నామని, ఆ స్థలం చుట్టుపక్కల స్టార్ హోటల్స్ వస్తాయన్నారు. దమ్మాలపాటి శ్రీనివాస్ ఆ స్థలాన్ని నాకు చూపారు. స్టార్ హోటల్స్ వస్తాయని ఆయన కూడా చెప్పారు. ► వాళ్ల మాటలు నమ్మి నా కుమార్తెను ఆ స్థలం కొనమని చెప్పాను. ఆమె ఎన్ఆర్ఐ ఖాతా నుంచి రూ.73 లక్షలు ఓపెన్ ప్లాట్ కోసం వారికి బదిలీ చేశాను. రెండు వారాల్లో రిజిస్ట్రేషన్ చేస్తానని హామీ ఇచ్చి, 2019 జూలై 24న లేక్ వ్యూ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ 1001ని మాత్రమే నా పేరు మీద రిజిష్టర్ చేశారు. మిగిలిన రెండు ఆస్తుల రిజిస్ట్రేషన్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తప్పుడు కేసులు పెడతామని బెదిరింపు ► సేల్‌డీడ్‌ను పరిశీలిస్తే ఈ రిజిస్ట్రేషన్ సరైన రీతిలో చేయలేదని తెలిసింది. వారి ప్రవర్తనపై అనుమానంతో నా సోదరుడు సత్యప్రసాద్‌ను పంపి విచారించాను. ఈ ప్రాజెక్టుకు సమీపంలో వారికి ఎలాంటి ఓపెన్ ప్లాట్ లేదని కూడా తేలింది. దీంతో లేని ప్లాట్‌కు వాళ్లు నా ద్వారా నా కుమార్తెకు చెందిన రూ.73 లక్షలు తీసుకున్నారని అర్థమైంది. ► డబ్బు తిరిగి ఇవ్వమంటే న్యాయ వ్యవస్థలో, పోలీసుల్లో తమకు భారీ పలుకుబడి ఉందంటూ సీతారామరాజు, దమ్మాలపాటి శ్రీనివాస్‌లు బెదిరిస్తున్నారు. నా డబ్బు కొట్టేసి, నాపైనే తప్పుడు కేసులు బనాయిస్తామంటున్నారు. ► లాక్డౌన్ వల్ల నేను హైదరాబాద్‌లోనే చిక్కుకుపోయాను. అందుకే ఇప్పుడు విజయవాడకు వచ్చి ఫిర్యాదు చేశాను. దమ్మాలపాటి శ్రీనివాస్, దమ్మాలపాటి నాగరాణి, నన్నపనేని సీతారామరాజు, కేవీజీ కృష్ణుడు, అడుసుమిల్లి తనూజ, పొట్లూరి అనంత లక్ష్మీలు నన్ను దారుణంగా మోసం చేశారు. -
'బాబు స్వార్థం కోసం వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు'
సాక్షి, అమరావతి : కొందరు తమ స్వార్థం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని.. వ్యవస్థల పనితీరుపై ప్రజలకు అనుమానాలు వస్తున్నాయని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. అమరావతి రాజధాని భూకుంభకోణంపై కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ' అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది వాస్తవం. చంద్రబాబు బినామీలు రాజధాని ప్రకటనకు ముందే వేల ఎకరాలు కొన్నారు. ఆయన తన ఆస్తులను కాపాడుకునేందుకే రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌లో దోషులు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని ఎన్నికలకు ముందే చెప్పాం. (చదవండి : 'పదవుల్లేక వారికి మతి భ్రమించినట్టయింది') అమరావతి భూ కుంభకోణంపై .. సీబీఐ దర్యాప్తు చేయాలని సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ఏ రాజకీయ నేత తీసుకోలేని నిర్ణయాలను సీఎం జగన్ తీసుకుంటున్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్ధేశంతోనే ముఖ్యమంత్రి నిజాయితీగా వ్యవహరిస్తున్నారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చకు రాకుండా టీడీపీ సిగ్గు లేకుండా అడ్డుపడుతోంది. కేవలం తాను, తన సామాజిక వర్గమన్నదే చంద్రబాబు లక్షణం. రాజధాని పేరుతో నాడు చంద్రబాబు పెట్రో సెస్ విధిస్తే.. ఎల్లో మీడియా కళ్లు మూసుకుందా ? రహదారుల మరమ్మతుల కోసం సెస్ వేస్తే.. అదేదో మహాపాపమన్నట్లు చిత్రీకరిస్తారా?' అంటూ ధ్వజమెత్తారు 'ఐదేళ్లలో 840 బార్లను ఓపెన్ చేసిన చరిత్ర చంద్రబాబుది... తన పాలనలో దళితులకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు.. దళితులకు అన్యాయం చేసినందుకే చంద్రబాబు 23 సీట్లకు పరిమితం అయ్యారు. ఇప్పుడు దళిత శంఖారావమని చంద్రబాబు పిలుపు ఇస్తే నమ్మాలా? చంద్రబాబు దళిత ద్రోహి.. సీఎం హోదాలో ఉండి దళితుడిగా ఎవరైనా పుడతారా? అని అడిగిన వ్యక్తి చంద్రబాబు.. దళితుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే వారే బాబుకు బుద్ధి చెబుతారు. కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చిన హామీలను .. సీఎం జగన్ నెరవేరుస్తూ ప్రజలకు అండగా ఉన్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతూ చంద్రబాబు తన పబ్బం గడుపుకుంటున్నారు. చంద్రబాబు జూమ్ రాజకీయాలను ప్రజలు నమ్మరంటూ' కొడాలి నాని ధ్వజమెత్తారు. (చదవండి : ‘ఆ దృష్టితో కాదు.. ధర్మ దృష్టితో చూడాలి’) -
'బాబు తన స్వార్థం కోసం వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు'
-
తీవ్రమైన, అసాధారణ ఉత్తర్వులు ఇవి..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్‌పై ఏసీబీ పెట్టిన ఎఫ్ఐఆర్ గురించి వార్తలు రాయొద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం తీవ్రమైన, అసాధారణ విషయమని సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి అన్నారు. అమరావతిలో భూ లావాదేవీల్లో అక్రమాలు జరిగిన మాట వాస్తవమని, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు భూములు కొంటే తప్పేముందని శాసన సభలో వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. అక్రమాలు జరిగి ఉంటే దోషుల్ని శిక్షించాల్సిన పని న్యాయ వ్యవస్థదేనని పేర్కొన్నారు. (చదవండి: హైకోర్టు ఉత్తర్వులపై జాతీయ స్థాయిలో ఆందోళన) అదే విధంగా.. ప్రజా జీవితానికి భంగం కలిగే అంశాలకే కోర్టులు అసాధారణ ఉత్తర్వులు ఇస్తాయని, కానీ ఇలా భావ ప్రకటనను హరించే విధంగా వ్యవహరించడం దేనికి సంకేతమని రవి ప్రశ్నించారు. అసలు ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వటానికి చెప్పిన కారణాలు కూడా సహేతుకం కాదని, వీటికి సంబంధించి సుప్రీంకోర్టులోనైనా సరైన మార్గదర్శకాలు లభిస్తాయని ఆశిద్దామని తెలకపల్లి రవి పేర్కొన్నారు. న్యాయస్థానాలు మీడియా స్వేచ్ఛను హరించడం సరికాదని సీనియర్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాసరావు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేయటం దారుణమన్నారు. (చదవండి: హైకోర్టు ఉత్తర్వులు : కేంద్రం జోక్యం చేసుకోవాలి) -
బోండా ఉమకు నిన్న సాయంత్రమే ఎలా తెలిసింది?
సాక్షి, అమరావతి : ప్రతిపక్షం మీడియా స్వేచ్ఛను హరించడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మీడియాలో కథనాలు ప్రసారం చేయకూడదని కోర్టుకు వెళ్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. గతంలో అధికార పార్టీ మీడియా స్వేచ్ఛను హరించిందని విన్నాం, కానీ ఇప్పుడు ప్రతిపక్షమే మీడియాలో కథనాలు రాకూడదంటూ కోర్టుకెళ్లిందని అన్నారు. మాజీ అడ్వొకేట్ జనరల్ ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని తెలిపిన సజ్జల ప్రాథమిక సాక్ష్యాధారాలతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వెల్లడించారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణలో తొందరపాటు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. చదవండి: (అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తు ఆపండి ) సిట్ అనేది స్వతంత్ర విచారణ సంస్థ అని, నిన్న జరిగిన పరిణామాలు కొత్త పోకడగా అనిపిస్తున్నాయని మండిపడ్డారు. తప్పులపై విచారణ జరగకుండా కక్షసాధింపు పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారుని విమర్శించారు. మేధావులు కూడా నిన్నటి పరిణామాలపై విస్మయం చెందుతున్నారని తెలిపారు. టీడీపీ కార్యకర్తగా పనిచేసిన వ్యక్తికి అడ్వకేట్ జనరల్‌గా అవకాశం ఇచ్చారన్నారు. కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తెచ్చుకుంటున్నారని, ఢిల్లీ నుంచి న్యాయవాదులను తెచ్చుకోవడానికి అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా వేసిన మరో పిటిషన్‌పై కూడా స్టే వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతుందని భావిస్తే సీబీఐ దర్యాప్తు కోరవచ్చు కదా అని ప్రశ్నించారు. చదవండి: (లోకేష్‌కు ఆ విషయం కూడా తెలియదా?: సజ్జల) సీబీఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వం కోరితే ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం బాధాకరమన్నారు. హైకోర్టులో ఎప్పుడు ఏ కేసు వస్తుందో టీడీపీ నేతలకు ఎలా తెలుసని, ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ గురించి బోండా ఉమ నిన్ననే ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఎన్నికలకు ముందే తాము అధికారంలోకి వస్తే దీనిపై విచారణ జరిపిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, అమరావతిలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అలాగే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి: (రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది) మీడియా స్వేచ్ఛను పరిరక్షించడానికి కోర్టులు పాటుపడేవి.. కానీ నిన్న రాత్రి అది వ్యతిరేకమయ్యిందని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ‘సామాన్యులకు అండగా కోర్టులు నిలబడేవి.ఇప్పడు పెద్దలకు ఒక తీర్పు, సామాన్యులకు ఒక తీర్పు అనేలా పరిస్థితి ఉంది. న్యాయ వ్యవస్థ నిష్పక్షికత ప్రశ్నార్ధకం అవుతోంది. రాజీవ్ ర్దేశాయ్ వంటి ప్రముఖ జర్నలిస్టులు కూడా దీనిపై స్పందించారు. తప్పు జరిగిందా లేదా అనే అంశాన్ని కక్ష సాధింపుగా మార్చడం దొంగలకు అవకాశం ఇచినట్లే. దొంగతనం ఆధారాలతో చూపినా కక్ష ఉంది కాబట్టి నీ పిర్యాదు చెల్లదు అంటే ఎలా. మేము సీబీఐ విచారణ కోరాం. అది కూడా వద్దంటారా. ఒక అడ్వకేట్.. అంతకు ముందు ఒక పార్టీ కార్యకర్త. అతనిపై ఆధారాలు ఉన్నాయని కేసు నమోదు చేశారు. మీడియా నోరు నొక్కేయడం కొంచెం ఓవర్ రియాక్షన్‌గా అనిపిస్తోంది. దీనిపై మా నాయకుడు మొదటి నుంచి అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఎప్పుడో చెప్పారు. దర్యాప్తు చేస్తామని ఎన్నికలకు ముందే చెప్పారు...దానిపైనే ప్రజలు 151 సీట్లతో తీర్పు ఇచ్చారు. అని పేర్కొన్నారు. చదవండి: (సభ్యసమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాదు) -
చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని విమర్శలు
సాక్షి, తాడేపల్లి: రాజధాని వ్యవహారంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అండ్ కో బాగుపడ్డారని మంత్రి కొడాలి నాని అన్నారు. అమరావతిలో రాజధాని వస్తుందని టీడీపీ నేతలకు ముందే తెలుసునని చెప్పారు. భూములు కొనుగోలు చేసుకోవాలని టీడీపీ నేతలకు చంద్రబాబు ముందే చెప్పారని ఆరోపించారు. రాజధానిలో రైతులను మోసం చేసి ఎకరం రూ.25లక్షలకు కొనుగోలు చేశారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్త చేశారు. టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించారని విమర్శించారు. గుడివాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ భూ కుంభకోణం జరిగిందని చెప్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుంభకోణంపై కేబినెట్ సబ్ కమిటీ, సిట్ నియమించారు. గత మార్చిలోనే అమరావతి రాజధాని భూ కుంభకోణంపై.. సీబీఐ విచారణకు ఆదేశించాలని కేబినెట్ ఆమోదంతో కేంద్రాన్ని కోరాం. కరోనా వల్లో లేకపోతే సీబీఐకి దేశవ్యాప్తంగా అనేక కేసులు ఉండటంతోనో జాప్యం జరిగింది. (చదవండి: మంత్రి సీదిరి అప్పలరాజు సాహసం) కేంద్రం నిర్ణయం రాకపోవడంతో ఏసీబీ దర్యాప్తునకు సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. చంద్రబాబు, అతని బినామీలు లాయర్లకు కోట్లాది రూపాయలు ఫీజులు చెల్లించి.. కోర్టులో వారి పేర్లు బయటకు రాకుండా స్టేలు తెచ్చుకున్నారు. చంద్రబాబు అవినీతి చేసి డబ్బు ఎలా సంపాదించాలో తెలిసిన మాస్టర్. ఆయన ఎన్ని స్టేలు తెచ్చుకున్నారో ప్రజలందరికీ తెలుసు. బాబు ప్రమేయం ఉందని తేలితే ఆయన మీద కూడా కేసులు పెడతారు. చంద్రబాబుకు ప్రజలు ముందే శిక్ష వేశారు. ఆయన ఇప్పుడు ఇంట్లో ఉంటూ జైలు జీవితం గడుపుతున్నారు. బాబు కోర్టుల నుంచి తప్పించుకోవచ్చేమో గానీ ప్రజల నుంచి శిక్ష తప్పదు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతి వ్యవస్థలోనూ సొంత మనుషులను పెట్టుకుని.. వాళ్లను అడ్డం పెట్టుకుని ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు’అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. (చదవండి: కైనటిక్ గ్రీన్ ప్రతినిధులతో మేకపాటి భేటీ) -
రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంత భూ వ్యవహారాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. ఫలానా చోట రాజధాని పెట్టుబోతున్న విషయం బహిరంగంగా ప్రకటించక ముందే ఆ ప్రాంతంలో టీడీపీ నేతలు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ వ్యవహారాలకు సంబంధించి పలువురిపై ఏసీబీ తాజాగా కేసు నమోదు చేసిన నేపథ్యంలో మంగళవారం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ► అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా తమ పార్టీ ఈ ఆరోపణలు చేసింది. ఇప్పటికీ వాటికి కట్టుబడి ఉన్నాం. రాజధాని నిర్మాణానికి సంబంధించి రూ.7,200 కోట్లు విలువచేసే పనుల్లో పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ► అక్కడ ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా చ.అ.కు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు బిల్లులు చెల్లించారు. ఆ ఐదేళ్లలో కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పలేదు. ► ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ప్రధాని మోదీ కూడా ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిని ఏటిఎంతో ఆయన పోల్చారు. నీరు చెట్టు, పోలవరం, ఉపాధి హామీ, ఇళ్ల నిర్మాణం, స్వచ్ఛ భారత్ పనుల్లో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. ► టీడీపీ నేతలు మరుగుదొడ్లను సైతం వదల్లేదు. ప్రపంచంలో ఎక్కడా జరగని రీతిలో టీడీపీ హయాంలో అవినీతి జరిగింది. దానిపై విచారణ జరపాలి. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. నేడు గవర్నర్‌ను కలవనున్న బీజేపీ నేతలు బీజేపీ నేతలు బుధవారం గవర్నర్ విశ్వభూషణ్ ను కలవనున్నారు. సోము వీర్రాజు నేతృత్వంలో నేతల బృందం గవర్నర్‌ను కలిసి అంతర్వేది ఆలయ రథం దగ్ధం çఘటన తదనంతర పరిణామాలను వివరించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
త్వరలోనే నిజాలు నిగ్గు తెలుతాయి: ఎమ్మెల్యే
సాక్షి, విజయవాడ: అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద కుంభకోణం సృష్టించారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజధాని పేరుతో అమరావతిలో చంద్రబాబు అతి పెద్ద స్కాం చేశారని, ఇన్సైడర్ ట్రేడింగ్ పేరిట 4,500 ఎకరాల భూమిని దోచేశారని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పుడే చెప్పారన్నారు. లక్షల కోట్లు ఆర్జించడానికి పేద రైతులను రాజధాని చంద్రబాబు మోసం చేస్తున్నారని తాము ప్రతిపక్షంలో ఉండగానే చెప్పామని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే సమగ్ర విచారణ చేస్తామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా విడిచే ప్రసక్తి లేదని అప్పుడే పేర్కొమన్నారు. చంద్రబాబు తన బినామీల పేరు మీద 4,500 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. (చదవండి: ఏసీబీ కేసు.. శుభ పరిణామం) అమరావతి రాజధాని స్కాంకు ఆధ్యుడు చంద్రబాబేనని, ఇందులో తన పేరు లేదు, సంబంధం లేదు అని చెప్పినా విడిచే ప్రసక్తి లేదన్నారు. తన భూములు ఉన్న చోట రియల్ ఎస్టేట్ జోన్ అని లేని ఏరియా అగ్రికల్చర్, గ్రీన్ జోన్‌గా బాబు ప్రకటించారన్నారు. రాష్ట్రానికి బాబు చేసిన ఆరాచకం, అన్యాయంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, దర్యాప్తులో తప్పు అని తేలిన ప్రతి వ్యక్తికి శిక్ష తప్పదని హెచ్చరించారు. అందులో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు అని తాము భావిస్తున్నామన్నారు. దళితులకు కేటాయించిన భూములను సైతం టీడీపీ నేతలు లాక్కున్నారని, చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఎవరూ చేసిన తప్పులకు వారే బాధ్యులని త్వరలో ఏసీబీ విచారణలో నిజాలు నిగ్గు తెలుతాయని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. (చదవండి: టీడీపీ బాత్రూంలను కూడా వదల్లేదు: సోము వీర్రాజు) -
ఏసీబీ కేసు.. శుభ పరిణామం
సాక్షి, విజయవాడ: అమరావతి రాజధాని భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని సీపీఎం ఆహ్వానిస్తోంది. ఇది మంచి పరిణామం.. నేరస్తులు ఎవరో బట్టబయలు చేయాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చాలాకాలం నుంచి రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. కొందరు అవినీతికి పాల్పడ్డారు. ప్రభుత్వంలో వుండి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి ప్రయోజనాలు పొందారని.. వాటిపై విచారణ జరపాలని ప్రజలు కోరారు. హై కోర్టులో కేసు సైతం వేశారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది.. అయితే ఇది సరైనది కాదని సుప్రీంకోర్టు రాష్ట్ర కోర్టు ఇచ్చిన తీర్పుపై వ్యాఖ్యనం చేసింది. ఇది హర్షించదగ్గ పరిణామం. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు ఎవరైతే పాల్పడ్డారో మొత్తం వివరాలు బట్టబయలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. దానికి అనుగుణంగానే ఏసిబి కేసు నమోదు చేసింది. ఇది శుభపరిణామం’ అన్నారు.(చదవండి: చంద్రబాబు, లోకేష్‌లకు అవకాశం..) అంతేకాక ‘ఈ ప్రాంతంలో రాజధానిని అడ్డం పెట్టుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలని కొందరు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. అసైన్డ్ భూముల విషయంలో మీకు న్యాయమైన ధర రాదు, నష్టపరిహారం రాధని అధికారంలో ఉన్న వారు రైతులను బెదిరించి.. భయపెట్టి మభ్యపెట్టి ఆ భూమలన్నీ వారే కాజేశారు. ఇలాంటి అవినీతి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు’ అన్నారు మధు. -
చంద్రబాబు, లోకేష్‌లకు అవకాశం..
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు రైతులు, దళితుల భూములను దోచుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. అసైన్డ్ భూములు కొనుగోలు చేసి వ్యాపారం చేశారని, దళితులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీలా మారిపోయిందని.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతి కోసం ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదని, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాజధాని అక్రమాలపై విచారణకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.(చదవండి: అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు) కాగా అమరావతి రాజధాని భూకుంభకోణంపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణల నేపథ్యంలో ప్రాథమిక నివేదికల ఆధారంగా ఏసీబీ మరింత లోతుగా విచారణ చేపట్టనుంది. ఈ విషయంపై స్పందించిన వైఎస్సార్ సీపీ నేతలు మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్‌లకు అవకాశం టీడీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. చట్టాలను సైతం ఉల్లంఘించి భూ కుంభకోణానికి పాల్పడ్డారని.. చంద్రబాబు, లోకేష్ తమ నిజాయితీ నిరూపించుకునే అవకాశం వచ్చిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ నేతలకు దమ్ముంటే విచారణకు సహకరించాలని చాలెంజ్ విసిరారు. ఫైబర్‌గ్రిడ్ కుంభకోణంపై విచారణ జరగాలి కేబినెట్ సబ్ కమిటీ విచారణలో రాజధాని అక్రమాలు బయటపడ్డాయని ఎమ్మెల్యే రోశయ్య స్పష్టం చేశారు. సబ్ కమిటీ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదైందని, తప్పు చేశారు కాబట్టే టీడీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. గతంలో టీడీపీ హయాంలో జరిగిన ఫైబర్‌గ్రిడ్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. లోకేష్ కోట్లు కొల్లగొట్టారు అక్రమార్కులపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తుంటే కక్షసాధింపు అంటున్నారని, అందుకే తాము సీబీఐ విచారణ కోరుతున్నామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఫైబర్‌గ్రిడ్‌లో లోకేష్ తన బినామీలతో కోట్లు కొల్లగొట్టారని, ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు. సీబీఐ విచారణ జరిపించాలి అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని, చంద్రబాబు, టీడీపీ నేతలు విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
టీడీపీ బాత్రూంలను కూడా వదల్లేదు: సోము వీర్రాజు
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలు బాత్రూమ్లను కూడా వదలకుండా అవినీతికి పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాటు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజధానిలో ఇన్సైడర్ ట్రెడింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి రాజధాని నిర్మాణంలో దాదాపు 7200 కోట్ల రూపాయల పనుల్లో అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా చదరపు అడుగుకు 8 నుంచి 12 వేల వరకు ఖర్చు చేశారన్నారు. నీరు, చెట్టు పోలవరం, ఉపాధిహామీ, స్వచ్ఛ భారత్ పనుల్లో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని పేర్కొన్నారు. టీడీపీ హాయంలో జరిగిన అవినీతి మొత్తంపై విచారణ జరపాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రశ్నించారని, ఆయన చంద్రబాబు అవినీతిని ఏటీఎంతో పోల్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టీడీపీపై చేసిన అవినీతి ఆరోపణలకు తాము ఇప్పటికి కట్టుబడి ఉన్నామని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. (రాజధాని అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి) -
దమ్ముంటే చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలి
సాక్షి, అమరావతి : అమరావతి రాజధాని భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడం పట్ల రాష్ట్ర మంత్రులు స్పందించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి రాసిన లేఖకు తాము సహకరిస్తామని బాబు కేంద్రానికి లేఖ రాయగలరా ? అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ స్వీకరించే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. రాజధానిలో అక్రమాలు జరగకుంటే బాబు ఎందుకు భయపడుతున్నారు? రాజధానిలో అక్రమాలు జరగలేదని చంద్రబాబు సీబీఐకి లేఖ రాయగలరా అంటూ ఎద్దేవా చేశారు. దమ్ముంటే చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలని.. ఫైబర్ గ్రిడ్‌లో కూడా భారీ అవినీతి జరిగిందన్నారు.(చదవండి : అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు) కేబినెట్ సబ్ కమిటీ, దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా.. సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు. రాజధాని భూ కుంభకోణంపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేనంతగా పంటలు పండాయని.. రైతుల కోసమే ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని.. రైతులను చంద్రబాబు అనవసరంగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కన్నబాబు స్పందిస్తూ.. టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని ఆధారాలతో నివేదిక ఇచ్చాం.. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత మాపై ఉంది. కక్షసాధింపే అయితే విచారణ లేకుండానే కేసులు పెట్టేవాళ్లం కదా? అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అమరావతిలో ఎక్కడ చూసినా భూ కుంభకోణాలే. రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారు.. టీడీపీ నేతలు దళితుల భూములు కూడా దోచుకున్నారు. భూములను టీడీపీ నేతలు, బినామీలే కొనుగోలు చేశారంటూ దుయ్యబట్టారు. -
అమరావతి: రాజధాని భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు
-
అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు
సాక్షి, అమరావతి : అమరావతి రాజధాని భూకుంభకోణంపై మంగళవారం ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ప్రాథమిక నివేదికల ఆధారంగా ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనుంది. రాజధాని విషయం ముందే తెలుసుకుని ఎవరెవరు భూములు కొన్నారు అనే కోణంలో దర్యాప్తు జరుపుతుంది. రాజధాని ప్రకటనకు ముందే టీడీపీకి చెందిన పలువురు నేతలు, ప్రముఖులు దాదాపు 4,075 ఎకరాల కొనుగోలు చేశారు. అందులో 900 ఎకరాల అసైన్డ్ భూములను దళితుల నుంచి బలవంతంగా కొనుగోలు చేసినట్లు తేలింది. కాగా ఈ భూములు కొన్నవారిలో తెల్లరేషన్‌కార్డు దారులుతో పాటు టీడీపీ నేతలు, సన్నిహితులు, బినామీలు భూములు కొన్నట్టు గుర్తించారు. అలాగే టీడీపీ నేతలకు వాటాలు ఉన్న కంపెనీలు కూడా భూములు కొనుగోలు చేశారని తెలిసింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డ వారిలో పరిటాల సునీత, జీవీఎస్ ఆంజనేయులు, పయ్యావుల కేశవ్, లంకా దినకర్, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్, పుట్టా మహేష్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. (చదవండి : రాజధాని అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి) సెప్టెంబర్ 3,2015న చంద్రబాబు రాజధాని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా అంతకముందే జూన్ 1,2014 నుంచి డిసెంబర్ 31,2014 వరకు భూముల కొనుగోళ్లు జరిగాయని.. 1977 అసైన్డ్ భూముల చట్టం, 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టం ఉల్లంఘించారని నిర్ధారణ అయింది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాల గుర్తింపు జరిగినట్లు తేలింది. లాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు తెలుస్తుంది. నారా లోకేష్ బినామీ వేమూరి రవి కుటుంబం పేరుతో 62 ఎకరాల భూమి, మరో టీడీపీ నేత లింగమనేని రమేష్ భార్యా, బంధువుల పేరిట భూముల కొనుగోలు చేశారు. మాజీ మంత్రి నారాయణ బినామీల పేర్లతో 55 ఎకరాలు కొనుగోలు చేశారని.. అందులో సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, కొత్తపు వరుణ కుమార్, పొత్తూరి ప్రమీల పేర్లతో 55.27 ఎకరాలు కొనుగోలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్ బినామీ పేర్లతో 68.6 ఎకరాలు, మాజీ మంత్రి ప్రత్తిపాటి గుమ్మడి సురేష్ పేరుతో 38 ఎకరాలు, మరో మంత్రి రావెల కిషోర్‌బాబు మైత్రీ ఇన్ ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొన్నట్లు తేలింది. టీడీపీ నేతల కోసం సీఆర్డీఏ పరిధినే మార్చిన బాబు ప్రభుత్వం టీడీపీ నేతల కోసమే గతంలో చంద్రబాబు ప్రభుత్వం సీఆర్డీయే పరిధిని మార్చేసింది. బాలకృష్ణ వియ్యంకుడికి చెందిన విబిసి కెమికల్స్ సంస్థకు 498 ఎకరాల కేటాయింపులు జరిగినట్లు తేలింది. కాగా భూములు కేటాయించాక సీఆర్డీయే పరిధి మారుస్తూ బాబు ప్రభుత్వం జీవో జారీ చేసింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపుల్లోనూ అక్రమాలు ఉన్నట్లు తేలిందని ఏసీబీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకో రేటు, ప్రైవేటు సంస్థలకు మరో రేటుగా నిర్ణయించారని.. 5 ప్రైవేటు సంస్థలకు 850 ఎకరాల భూమి కేటాయింపులోనూ అక్రమాలు జరిగినట్లు తేలింది. (చదవండి : దివీస్‌లో ఇన్సైడర్ ట్రేడింగ్!) -
రాజధాని అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిలో అక్రమాల నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణకు పార్లమెంట్లో పట్టుపట్టాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ మొదలు కావాల్సిన వారికి లబ్ధి కలిగించేలా గత చంద్రబాబు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకున్న విషయం విదితమే. మంత్రి వర్గ ఉపసంఘం చేపట్టిన అధ్యయనంలో ఈ అక్రమాలన్నీ బయటపడ్డాయి. ఆ వివరాలు ఇలా.. రాజధాని ప్రకటనకు ముందే రాజధాని ఎక్కడ ఉంటుందనే సమాచారాన్ని ప్రభుత్వ పెద్దలు లీక్ చేసి, తమ అనుయాయుల ద్వారా అక్కడ చాలా తక్కువ ధరకు భూములు కొనిపించారు. తెల్లకార్డు ఉన్న వారిని బినామీలుగా పెట్టి భూములు కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాలను రాజధాని ప్రకటనకు ముందే రహస్యంగా కొనుగోలు చేసినట్లు రిజిష్ట్రేషన్ రికార్డుల ద్వారా తేలింది. ఇది పక్కాగా ఇన్సైడర్ ట్రేడింగ్. ఈ వ్యవహారంలో అప్పటి సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌కు దగ్గరి వ్యక్తి వేమూరి రవికుమార్, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు, లింగమనేని రమేష్, టీడీపీ నాయకులు పయ్యావుల కేశవ్, కంభంపాటి రామ్మోహనరావు, లంకా దినకర్, పుట్టా మహేష్‌యాదవ్, ధూళిపాళ నరేంద్ర తదితరులున్నారు. చంద్రబాబుకు దగ్గరి వ్యక్తి లింగమనేని రమేష్, మాజీ మంత్రులు పి. నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, నారా లోకేష్, రావెల కిషోర్‌బాబు, కోడెల శివప్రసాదరావు, పల్లె రఘునాథ్‌రెడ్డి, ధూళిపాళ నరేంద్ర, పయ్యావుల కేశవ్, మురళీమోహన్, జీవీ ఆంజనేయులు బినామీ పేర్లతో రాజధాని, రాజధాని రీజియన్‌లో భూములు కొన్నారు. రాజధాని, రాజధాని రీజియన్ హద్దులను కూడా వారికి లబ్ధి కలిగేలా మార్చారు. తద్వారా బాలకృష్ణ దగ్గరి బంధువు ఎంఎస్పీ రామారావు, లింగమనేని రమేష్ భారీగా లబ్ధి పొందారు. కొందరు టీడీపీ నేతలు లంక, పోరంబోకు, ప్రభుత్వ భూములను తమవిగా చూపించి ప్లాట్లు పొందారు. రెవెన్యూ రికార్డులనూ తారుమారు చేశారు. ఐదు ప్రైవేటు సంస్థలకు 850 ఎకరాలను అతి తక్కువ ధరలకు కేటాయించారు. 900 ప్లాట్లను సంబంధికులకు కాకుండా వేరే వారికి రిజిస్టర్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం–1989ని ఉల్లంఘించారు. ఫైబర్ గ్రిడ్ సీబీఐ విచారణ కోసం పార్లమెంట్లో ఒత్తిడి తేనున్న వైఎస్సార్సీపీ ఈవీఎం దొంగ వేమూరు హరికృష్ణ ద్వారా చంద్రబాబు, లోకేష్ అక్రమాలు రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని తేల్చిన కేబినెట్ సబ్ కమిటీ సాక్షి, అమరావతి: ఫైబర్ గ్రిడ్ అక్రమాలను నిగ్గు తేల్చడానికి వేగంగా విచారణ జరిపించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్సీపీ ఎంపీలు నిర్ణయించారు. ఈవీఎం దొంగ వేమూరు హరికృష్ణను ముందు పెట్టి అప్పటి సీఎం చంద్రబాబు, నాటి ఐటీ మంత్రి లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారని, ఈ కుంభకోణంలో రూ.2 వేల కోట్లకుపైగా అవినీతి జరిగిందని మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటికే తేల్చింది. ఈ అంశాల్లో మరింత లోతుగా విచారణ చేయడానికి సీబీఐకి కేసు అప్పగించాలని మంత్రివర్గం సైతం తీర్మానించిన విషయం విదితమే. భారత్ నెట్ రెండో దశ పనులను టెండర్ షరతులను సడలించి.. నిబంధనలు ఉల్లంఘించి.. అర్హత లేని టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ (వేమూరు హరికృష్ణకు చెందినది)కు పనులు అప్పగించారు. అందువల్ల అంచనా వ్యయం రూ.907.94 కోట్ల నుంచి రూ.1410 కోట్లకు పెరిగింది. బీబీఎన్ఎల్(భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్) నిర్ధారించిన దాని కంటే రూ.558.77 కోట్ల అధిక ధరలకు పనులు అప్పగించారు. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదని మంత్రివర్గ ఉప సంఘం ఎత్తి చూపింది. తక్కువ ధరకు బిడ్ దాఖలు చేసిన(ఎల్–1) కంపెనీని కాదని.. అధిక ధరకు బిడ్ దాఖలు చేసిన టెరాసాఫ్ట్‌కు ఫైబర్ గ్రిడ్ దక్కేలా చక్రం తిప్పారు. రెండో దశ పనుల టెండర్లలో అప్పటి సీఎం చంద్రబాబు, నాటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ భారీ అక్రమాలకు పాల్పడ్డారు. సెట్ టాప్ బాక్స్‌ల టెండర్లలో 8 సంస్థలు పాల్గొంటే.. తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగించకుండా.. నాలుగు సంస్థలకు పనులు విభజించి, అప్పగించారు. కానీ.. సెట్ టాప్ బాక్స్‌లను కేవలం టెరాసాఫ్ట్ నుంచే కొనుగోలు చేసి, బిల్లులు చెల్లించారు. తీరా సెట్ టాప్ బాక్స్‌ల్లో నాణ్యత లేదని తేలింది. ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా 13 జిల్లాల్లో పైబర్ గ్రిడ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేయడానికి టెండర్లు ఖరారు చేసే వరకు ఆ పనులను నెలకు రూ.2,44,01,865తో టెరా సాఫ్ట్‌కు అప్పగించారు. -
దివీస్‌లో ఇన్సైడర్ ట్రేడింగ్!
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగంపై దివీస్ ల్యాబొరేటరీస్ సీఎఫ్‌వోతోపాటు ఇతరులకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రూ.96 లక్షలకుపైగా జరిమానా విధించింది. సీఎఫ్‌వో ఎల్.కిశోర్‌బాబు, ఆయన కుమారుడు, సన్నిహితులు 2017లో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని సెబీ వెల్లడించింది. సీఎఫ్‌వోతోపాటు ప్రవీణ్ లింగమనేని, నగేశ్ లింగమనేని, శ్రీలక్ష్మి లింగమనేని, డి.శ్రీనివాస రావు, రాధిక ద్రోణవల్లి, గోపీచంద్ లింగమనేని, పుష్పలత దేవి ఇన్సైడర్లుగా సెబీ గుర్తించింది. వీరు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని సెబి తన ఆదేశాల్లో తెలిపింది. విశాఖ యూనిట్–2పై ఉన్న ఇంపోర్ట్ అలర్ట్‌ను యూఎస్ఎఫ్డీఏ ఎత్తివేయనుందంటూ దివీస్ 2017 జూలై 10న మార్కెట్ సమయంలో ప్రకటించింది. స్టాక్స్‌పై ప్రభావం చూపే ఈ విషయాన్ని కిశోర్ బాబు ముందే లీక్ చేసి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని సెబీ చెబుతోంది. జూలై 7–10 మధ్య జరిగిన ట్రేడింగ్‌పై సెబీ విచారణ జరిపింది. జూలై 7న దివీస్ షేరు ధర రూ.680 నమోదైంది. జూలై 10న ఇది రూ.734కి చేరింది. ప్రొహిబిషన్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్స్ ప్రకారం షేర్ల కొనుగోళ్లకు కావాల్సిన ప్రి–క్లియరెన్స్ కోసం సీఎఫ్‌వో, ఆయన కుమారుడు ప్రవీణ్ లింగమనేని దరఖాస్తు చేయలేదని విచారణలో తేలింది. ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను వీరు అతిక్రమించారని సెబీ విచారణలో తేలింది. ఈ ఎనిమిది మంది 30 రోజుల్లో స్పందించాలని సెబి ఆదేశించింది. ఈ మొత్తం మేరకు వీరి ఖాతాలను స్తంభింపజేయాలని బ్యాంకులను ఆదేశించింది. విచారణ పూర్తి అయ్యే వరకు వీరు ఆస్తులను విక్రయించరాదని స్పష్టం చేసింది. -
అమరావతి అక్రమాలపై సీబీ'ఐ'
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో టీడీపీ హయాంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, ఇతర అక్రమాలపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి పేరుతో అక్రమాలకు పాల్పడినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం అన్ని రికార్డులను పరిశీలించి వివరాలు సేకరించి గతేడాది డిసెంబర్ 27న నివేదిక ఇచ్చింది. ఓత్ ఆఫ్ సీక్రెసీ (అధికారిక రహస్యాలు వెల్లడించననే ప్రమాణాన్ని)ని ఉల్లంఘించినట్టు మంత్రివర్గ ఉప సంఘం నిర్ధారించింది. రాజధానిపై తమ వాళ్లకు ముందస్తు లీకులు ఇవ్వడంతో 2014 జూన్ నుంచి డిసెంబర్‌లోపు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా సీఆర్డీఏ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. సీఐడీ, సిట్, ఈడీ దర్యాప్తు ఇలా.. - రాజధాని అక్రమాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సీఐడీ, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తమ పరిధిలో లోతైన దర్యాప్తు చేపట్టాయి. - మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. రాజధాని కోర్ ఏరియాలో 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు ఆధారాలు సేకరించింది. - అమరావతి, పెదకాకాని, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి గ్రామాల్లో తెల్లకార్డు దారులను బినామీలుగా అడ్డుపెట్టుకుని భూములు కొనుగోలు చేసినట్టు నిర్ధారించింది. - మభ్యపెట్టి తన భూమి కొనుగోలు చేశారని వెంకటాయపాలెంకు చెందిన దళిత మహిళ పోతురాజు బుజ్జి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది. - టీడీపీ మాజీ మంత్రులు పి.నారాయణ, పత్తిపాటి పుల్లారావులతోపాటు టీడీపీ నాయకుడు బెల్లంకొండ నరసింహారావుపై సెక్షన్ 420, 506 రెడ్‌విత్ 120(బి)తోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 3(1)(జి)(పి) కింద కేసు నమోదు చేసి.. ఆధారాలు సేకరించింది. - ఇప్పటి వరకు సీఐడీ ఏడు కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో మనీ ల్యాండరింగ్, అక్రమ ఆదాయం వంటి అంశాలు ముడిపడ్డాయి. - ఇదే వ్యవహారంపై సీఐడీ ఇచ్చిన రిపోర్టుతో రాజధానిలో అక్రమ లావాదేవీలపై ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్–హైదరాబాద్) ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) – 2002, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఎఫ్ఇఎంఎ –ఫెమ)–1999 కేసులు నమోదు చేసింది. కీలక ఆధారాలు సేకరించడంలో నిమగ్నమైంది. డీఓపీటీకి నివేదిక - రాజధాని ప్రాంతంలో భూములను స్వాధీనం చేసుకోవడంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానంలో అనేక అవకతవకలు, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడిందనడంపై బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. - పేదల నుంచి భూముల సేకరణలోనే గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టు తేలింది. - ఇందులో అనేక నేరాలు, పెద్ద ఎత్తున కుట్ర, ఫోర్జరీ(చీటింగ్), తప్పుడు పత్రాల తయారీ, రికార్డుల ట్యాంపరింగ్ వంటి అక్రమాలు చోటు చేసుకున్నట్టు మంత్రివర్గ ఉప సంఘం గుర్తించింది. - ఈ అక్రమాలపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ), అవినీతి నిరోధక చట్టం, బినామీ లావాదేవీలు (నిషేధ) చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టం వంటి నేరాలపై కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. - రాజధాని అమరావతి పేరుతో అక్రమాలకు పాల్పడిన వారు ఆర్థిక లబ్ధి పొంది ఇతర రాష్ట్రాలు, విదేశాలకు కూడా నగదు తరలించినట్టు స్పష్టమవుతోంది. - ఈ నేరాలతో సంబంధం ఉన్న కొందరు రాష్ట్రంలో, పొరుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉండే అవకాశం ఉండటంతో జాతీయ సంస్థ దర్యాప్తు తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు బాధ్యతను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం నివేదికను కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీఓపీటీ)కు పంపించింది. -
ఇన్ సైడర్ గుట్టు!
-
రట్టవుతున్న 'ఇన్సైడర్' గుట్టు
సాక్షి, అమరావతి/కంచికచర్ల: రాజధాని అమరావతిలో గత టీడీపీ సర్కారు హయాంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో టీడీపీ నేతలకు ఉన్న లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పక్కా ఆధారాలు చిక్కుతున్నాయి. కృష్ణా జిల్లాలో శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), శనివారం సీఐడీ వరుసగా నిర్వహించిన సోదాల్లో పలు కీలక పత్రాలు లభ్యమయ్యాయి. సీఐడీ ప్రత్యేక బృందాలు కృష్ణా జిల్లా కంచికచర్లలో పలువురు టీడీపీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించాయి. కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత నన్నపనేని లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు సీతారామరాజు ఇళ్లల్లో సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. కీలక పత్రాలతోపాటు రెండు సీడీలను స్వాధీనం చేసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అడ్వొకేట్ జనరల్‌గా(ఏజీ) పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్.. నన్నపనేని లక్ష్మీనారాయణకు స్వయానా అల్లుడే. కాగా, లక్ష్మీనారాయణ కుమారుడు సీతారామరాజు టీడీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్‌గా వ్యవహరించారు. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు. ఇంటి నుంచి పరారైన లక్ష్మీనారాయణ అమరావతిలో భూముల కొనుగోళ్ల విషయంలో ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ప్రత్తిపాటి పుల్లారావు వియ్యంకుడి ఇంట్లో శుక్రవారం సిట్ సోదాలు నిర్వహించింది. కంప్యూటర్ హార్డ్ డిస్క్, కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. అలాగే కంచికచర్లలో సీతారామరాజు ఇంట్లోనూ సిట్ అధికారులు సోదాలు జరిపారు. దీంతో నన్నపనేని లక్ష్మీనారాయణ తన ఇంటికి తాళం వేసుకుని పరారయ్యారు. శుక్రవారం కంచికచర్లలోని లక్ష్మీనారాయణ నివాసంలో సోదాల కోసం వెళ్లిన సీఐడీ ప్రత్యేక బృందానికి ఆయన దొరకలేదు. ఇంటికి తాళం వేసి ఉండటం, లక్ష్మీనారాయణతోపాటు కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేకపోవడంతో సీఐడీ అధికారులు శుక్రవారం సెర్చ్ వారెంట్‌ను ఆయన ఇంటి గోడకు అతికించి వెనుతిరిగారు. సీఐడీ ప్రత్యేక బృందాల ఏర్పాటు! అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్‌పై దర్యాప్తును వేగవంతం చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీఐడీ నిర్ణయించింది. భూ కుంభకోణాలు, భూ వివాదాలు, రికార్డుల తారుమారు తదితర కీలక అంశాలపై దర్యాప్తు చేసిన అనుభవం కలిగిన పోలీసు అధికారులను సీఐడీ విభాగంలోకి తీసుకొచ్చి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బృందానికి డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. 4 గంటలపాటు సీఐడీ సోదాలు తన కుమారుడు సీతారామరాజు ఇంట్లో శుక్రవారం సిట్ సోదాలు ముగియడం, సీఐడీ అధికారులు వచ్చి వెళ్లిపోవడంతో లక్ష్మీనారాయణ శనివారం తన ఇంటికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న సీఐడీ అధికారులు శనివారం ఉదయం మరోమారు లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలకు వెళ్లారు. లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు సీతారామరాజు నివాసంలోనూ 4 గంటలపాటు సీఐడీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. పలు కీలకపత్రాలు, సీడీలను స్వాధీనం చేసుకున్నాయి. టీడీపీ నేత లక్ష్మీనారాయణ అమరావతిలో తక్కువ ధరకే విలువైన భూములను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ముందుగానే తెలుసుకుని విలువైన భూములను రైతుల నుంచి తక్కువ ధరకు కొనేశారని స్థానికులు చెబుతున్నారు. -
ఇన్సైడర్ ట్రేడింగ్..టీడీపీ నేత ఇంటికి నోటీసులు
-
సీఐడీ సోదాలు.. టీడీపీ నేతకు నోటీసులు
సాక్షి, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో రాజధానిలో చోటు చేసుకున్న ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో సీఐడీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో శనివారం కంచికచర్లలో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కంచికచర్ల తెలుగుదేశం పార్టీ మార్కెటయార్డ్ మాజీ ఛైర్మన్ నన్నపనేని లక్ష్మీ నారాయణ ఇంటిలో సోదాకు వెళ్లారు. అయితే సీఐడీ వస్తుందన్న సమాచారం ముందుగానే తెలుసుకున్న లక్ష్మీనారాయణ ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో సీఐడీ అధికారులు ఆయన ఇంటి గుమ్మానికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు. కాగా లక్ష్మీనారాయణ అల్లుడు దమ్మాలపాటి శ్రీనివాసరావు.. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన కుమారుడు సీతారామరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు, టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్‌గా వ్యవహరించారు. (ఇన్సైడర్ ట్రేడింగ్‌లో అక్రమాల 'వరద') కాగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమాలపై విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిట్ ప్రత్యేకాధికారి, ఇంటెలిజిన్స్ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి బృందం శుక్రవారం విజయవాడలో దాడులు నిర్వహించింది. రాజధానిలో భూములు కొనుగోలు చేసిన పేదల వెనుక ఉన్న బినామీల గుట్టు విప్పేందుకు టీడీపీ నేతలకు చెందిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా విజయవాడ పటమటలో కొందరు కోటీశ్వరుల ఇళ్లను కూడా తనిఖీ చేసింది. వీరిలో ఒకరు టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బంధువుగా చెబుతున్నారు. వీరి ఇళ్లల్లో సిట్ పలు కీలక ఆధారాలు సేకరించింది. ఇక ఇప్పటికే రాజధాని భూముల వ్యవహారంలో టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి, నారాయణలపై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసిన విషయం విదితమే. -
బినామీల ఇళ్లలో సిట్ సోదాలు
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తొలి గురిపెట్టింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమాలపై విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ ప్రత్యేకాధికారి, ఇంటెలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి బృందం శుక్రవారం విజయవాడలో మెరుపు దాడులు నిర్వహించింది. రాజధానిలో భూములు కొనుగోలు చేసిన పేదల వెనుక ఉన్న బినామీల గుట్టు విప్పేందుకు టీడీపీ నేతలకు చెందిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. విజయవాడ పటమటలో కొందరు కోటీశ్వరుల ఇళ్లను కూడా తనిఖీ చేసింది. వీరిలో ఒకరు టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బంధువుగా చెబుతున్నారు. వీరి ఇళ్లల్లో సిట్ పలు కీలక ఆధారాలను సేకరించింది. కంప్యూటర్ హార్డ్ డిస్కులు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లాకర్లను స్వాధీనం చేసుకుంది. సిట్ అధికారులు వారి నుంచి కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. వారి ఆస్తులు, ఆదాయాలు, రాజధానిలో కొన్న భూములు, వాటికి డబ్బులు ఎలా వచ్చాయి, టీడీపీ నేతలతో వారి సంబంధాలపై ప్రశ్నించడంతోపాటు వారి వద్ద అనేక పత్రాలను తీసుకుని పరిశీలించారు. కాగా, ఇప్పటికే రాజధాని భూముల వ్యవహారంలో టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి, నారాయణలపై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఈడీ కూడా మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై ఆరా.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై రాష్ట్రంలో ఎక్కడైనా దర్యాప్తు చేసి.. ఎవరినైనా విచారించి, కేసులు నమోదు చేసేందుకు సిట్‌కు ప్రభుత్వం అధికారాలిచ్చింది. గత ప్రభుత్వ పెద్దలకు రాజకీయ, ఆర్థిక లబ్ధి కలిగేలా రాజధాని పేరుతో పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్, తదితర అక్రమాలకు పాల్పడ్డట్టు మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదించింది. దీంతో సిట్ రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌పైనే తొలి విచారణ చేపట్టింది. రాజధానిలో 797 మంది తెల్లకార్డుదారులు కొనుగోలు చేసిన భూములు, వారి కార్డుల నంబర్లు, తదితర అన్ని వివరాలను సీఐడీ నుంచి తెలుసుకుని వాటి పరిశీలన చేపట్టింది. పోరంకి నుంచి సిట్ కార్యకలాపాలు.. సిట్ ప్రత్యేకాధికారిగా నియమితులైన కొల్లి రఘురామిరెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీఐజీగా కూడా ఉన్నారు. దీంతో సిట్ కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై అనేక ప్రతిపాదనలను పరిశీలించారు. ప్రస్తుతానికి ఆయన విజయవాడ పోరంకి ప్రాంతంలోని తన (ఇంటెలిజెన్స్) కార్యాలయం నుంచే కార్యకలాపాలు ప్రారంభించారు. -
క్షేత్రస్థాయి దర్యాప్తునకు ఈడీ రెడీ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో చంద్రబాబు సర్కారు హయాంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్‌పై క్షేత్రస్థాయి దర్యాప్తునకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన శాఖ(సీఐడీ) పంపిన ఆధారాలను పరిశీలించిన ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అమరావతిలో జరిగిన అక్రమ లావాదేవీలపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ)–2002, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్(ఫెమా)–1999 కింద కేసులు నమోదు చేసిన ఈడీ కీలక ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. హైదరాబాద్‌లోని ఈడీ జాయింట్ డైరెక్టర్(జేడీ) అభిషేక్ గోయల్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం క్షేత్రస్థాయి దర్యాప్తునకు రంగం సిద్ధం చేసుకుంటోంది. రాజధానిలో పెద్ద ఎత్తున జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్‌కు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా గుర్తించిన ఆధారాలను సీఐడీ అందజేయడంతో వాటిని ఈడీ పరిశీలిస్తోంది. విలువైన భూములు ఎలా కొన్నారో? అమరావతి, పెదకాకాని, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి గ్రామాల్లో 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు సీఐడీ అధికారులు ఈడీకి ఆధారాలు అందజేశారు. పేద వర్గాలుగా తెల్లకార్డులు పొందిన వారు దాదాపు రూ.276 కోట్లు పెట్టి ఆ భూములు ఎలా కొన్నారనే దానిపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. పచ్చ నేతలకు బినామీలుగా తెల్లకార్డుదారులు భూములు కొన్నట్టు నిర్ధారణ కావడంతో ఇందులో మనీ ల్యాండరింగ్, అక్రమ ఆదాయం వంటి అంశాలు ముడిపడి ఉన్నాయని ఈడీ నిర్ధారించింది. రూ.కోట్లతో కొనుగోలు చేసిన భూముల వివరాలు, వారి ఆర్థిక పరిస్థితి, వారు ఎవరికి బినామీలు తదితర కోణాల్లో ఈడీ కూపీలాగుతోంది. రికార్డుల పరిశీలన పూర్తయిన అనంతరం ఈడీ అమరావతి ప్రాంతంలో విచారణ ప్రారంభిస్తుందని సీఐడీ అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి దర్యాప్తునకు ముందే సీఐడీ అధికారుల బృందంతో ఈడీ ఉమ్మడి సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోగా ఈడీ, సీఐడీ ఉమ్మడి సమావేశం ఉంటుందని అధికారులు ధ్రువీకరించారు. -
సిట్ విచారణలో అన్ని వాస్తవాలు బయటకొస్తాయి
-
గత సర్కారు అవినీతిని నిగ్గు తేల్చనున్న సిట్
-
రాజధాని అక్రమాలపై ‘సిట్’
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో భూ కుంభకోణంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. భూ సేకరణతోపాటు గత సర్కారు హయాంలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి క్షుణ్ణంగా దర్యాప్తు నిమిత్తం దీనిని ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి పాలకపక్ష నేతలు అధికార రహస్యాల ప్రతిజ్ఞను తుంగలో తొక్కి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, అసైన్డ్ చట్టాన్ని తుత్తునియలు చేస్తూ అడ్డగోలుగా, బలవంతంగా, కారు చౌకగా పేదల నుంచి భూములు కొన్నారని.. సరిహద్దులు మార్చి అడ్డగోలుగా లబ్ధి పొందారని మంత్రివర్గ ఉప సంఘం అధ్యయనంలో ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి. (మూడు రాజధానులు ముమ్మాటికీ అవసరమే) ఆ మేరకు మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చ అనంతరం ప్రభుత్వం లోతుగా దర్యాప్తు జరిపించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) డాక్టర్ కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో పది మందితో కూడిన ‘సిట్’ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలక విధానాలు, ప్రాజెక్టులు, పథకాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు తదితరాలపై సమీక్షించేందుకు జీవో 1411 ద్వారా గతేడాది జూన్ 26న మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటైన విషయం తెలిసిందే. సీఆర్డీఏ ప్రాంతంలో భూ సేకరణతోపాటు పలు ప్రాజెక్టుల్లో విధాన, న్యాయ పరమైన లోపాలతోపాటు నకిలీ లావాదేవీలు, ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఉప సంఘం గుర్తించింది. (వెనకుండి నడిపిందెవరు?) పాత్రధారులు, సూత్రధారులెవరో తేల్చాలనే.. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో భారీ అక్రమాలు జరిగినట్లు మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించింది. ఈ నివేదికపై గత అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర చర్చ జరిగింది. ఎవరెవరు అసైన్డ్ భూములు కొన్నారు? ఎవరెవరు ఎక్కడెక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కారుచౌకగా దక్కించుకున్నారనే వివరాలను పేర్లు, సర్వే నంబర్లతో సహా సభలో వివరించారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. తమ నుంచి బలవంతంగా అసైన్డ్ భూములను కొన్నట్లు కొందరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. (అమరావతి ఆందోళనలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు) ఈ మేరకు కేసులు కూడా నమోదయ్యాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంతోపాటు రాజధాని భూకుంభకోణంలో సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, నాటి మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి బినామీల హస్తం ఉందని రిజిస్ట్రేషన్ లావాదేవీలు, భూముల కొనుగోలు సాక్షిగా తేలిపోయింది. అందువల్ల ఈ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులను తేల్చడంతోపాటు మొత్తం అక్రమాలను బట్టబయలు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందానికి పూర్తి స్థాయి అధికారాలు అప్పగిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. (‘ఇన్సైడర్’పై ఈడీ కేసు!) విధి విధానాలు.. – గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై సీఆర్పీసీ నిబంధనల ప్రకారం దర్యాప్తు. – అవసరమైతే కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో కలిసి పని చేయొచ్చు. సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవచ్చు. – అవసరమైన పక్షంలో విచారణ నిమిత్తం ఎవరినైనా పలిపించి, ప్రశ్నించే సంపూర్ణ అధికారం. వారి వాదనను సిట్ రికార్డు చేస్తుంది. – భూ లావాదేవీలు, ఇతర వ్యవహారాలకు సంబంధించిన ఏ రికార్డులనైనా పరిశీలించే అధికారం. – అన్ని ప్రభుత్వ శాఖలు, అధికారులు ‘సిట్’ కోరిన సమాచారాన్ని అందజేయడంతోపాటు సంపూర్ణ సహకారం అందించాలి. పక్కా ఇన్సైడర్ ట్రేడింగ్ రాజధాని ముసుగులో అమరావతి వేదికగా గత సర్కారు పాలనలో అంతులేనన్ని అక్రమాలు జరిగాయని మంత్రివర్గ ఉప సంఘం అధ్యయనంలో తేలింది. గత పాలకులు రాజధాని నూజివీడులో వస్తుందని ఒకసారి, మరో చోట వస్తుందని మరో సారి, ఇంకో చోట వస్తుందని ఇంకోసారి.. లీకులిచ్చి సామాన్యులు భూములు కొనుగోలు చేసి నష్టపోయేలా చేశారు. పాలక పెద్దలు మాత్రం ఎక్కడ రాజధాని వస్తుందో అక్కడే కారుచౌకగా భూములు కొన్నారు. ఇలా వారు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. ఇందుకు కొన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఆధారంగా ఉన్నాయని మంత్రివర్గ ఉప సంఘం నివేదిక మేరకు ప్రభుత్వం అసెంబ్లీలోనే బట్టబయలు చేసింది. 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ మధ్య రాజధాని ప్రకటనకు ముందు.. వాస్తవ రాజధాని ప్రాంతంలో అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరెవరు భూములు కొన్నారో ఆధార సహితంగా వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే. బినామీల పేరుతో కారుచౌకగా కొనుగోలు రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలిసినందున గత పాలకులు.. డ్రైవర్లు, పనివాళ్లు, బంధువుల పేర్లతో కారు చౌకగా భూములు కొన్నారు. ఇలా టీడీపీ పెద్దలు అమరావతి ప్రాంతంలో 4,075 ఎకరాల భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ 14.22 ఎకరాలు తాడికొండ మండలం కంతేరులో కొనింది. టీడీపీ నేత లంకా దినకర్ (లోకేశ్ బినామి), జీవీఎస్ ఆంజనేయులు, లింగమనేని రమేష్, పయ్యావుల కేశవ్, అప్పటి మంత్రి నారాయణ, కంభంపాటి స్వాతి (కంభంపాటి రామ్మోహన్రావు కుటుంబీకురాలు)లాంటి వారెందరో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొన్నారు. బంధువుల పేర్లతోనే కాకుండా బినామీల పేర్లతో కూడా భూములు కొన్నారు. సరిహద్దులు మార్చి భారీగా లబ్ధి చంద్రబాబు అండ్ కో ఇన్సైడర్ ట్రేడింగ్‌తో సరిపెట్టుకో లేదు. లంక, పొరంబోకు, ప్రభుత్వ భూములనూ వదల్లేదు. సీఆర్డీఏ సరిహద్దులు సైతం మార్చారు. కోర్ రాజధానిని జూలై 2015లో 395 చదరపు కిలోమీటర్ల మేర ప్లాన్ చేశారు. అయితే వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని 2016లో దానిని 217 చదరపు కిలోమీటర్లకు తగ్గించారు. తమ భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వకుండా కాపాడుకుని అధిక విలువ పొందడమే లక్ష్యంగా వ్యవహరించారు. రింగ్ రోడ్డును కూడా వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు. లేని భూములు ఇచ్చి.. కోట్లకు పడగలెత్తి.. అనంతవరంలో భూభాగోతం మరోరకంగా సాగింది. లేని ప్రభుత్వ భూమి, పొరంబోకు భూములిచ్చి ప్లాట్లు తీసుకున్నారు. ఐనవోలులో 2.98 ఎకరాలు, బోరుపాలెం, కేఆర్ పాలెంలో 6.47 ఎకరాలు లేని భూమిని ఇచ్చినట్లుగా చూపి ప్లాట్లు దక్కించుకున్నారు. లింగాయపాలెంలో మొత్తం 158 ఎకరాల ప్రభుత్వ భూమి.. నేలపాడు, పిచ్చుకాయలపాలెంలో 9 ఎకరాలు, శాఖమూరులో 3 ఎకరాలు, వెలగపూడిలో 3 ఎకరాలు తీసుకున్నారు. చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములను కైవసం చేసుకున్నారు. శివాయ్ జమీందార్ పేరుతో జీఓలు ఇచ్చి దాదాపు 289 ఎకరాలను బదలాయించుకున్నారు. చెరువుల భూముల విషయంలోనూ ఇలాగే చేశారు. కాగా, ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు తక్కువ ధరకు కట్టబెడుతూ, ప్రభుత్వ సంస్థలకు మాత్రం అధిక ధరలకు ఇచ్చిన వైనం కూడా వెలుగు చూసింది. సీఐడీ విచారణలోనూ అక్రమాలు బట్టబయలు రాజధాని ప్రాంతంలో చంద్రబాబు అండ్ కో సాగించిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ దర్యాప్తులో తీగలాగితే డొంక కదిలింది. అమరావతిని రాజధానిగా నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషించిన అప్పటి మంత్రి పి.నారాయణ తన సమీప బంధువులు, విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బంది పేర్లతో ఇన్సైడరన్ ట్రేడింగ్ ద్వారా భూములు కొన్నారు. వందలాది మంది తెల్లకార్డుదారులు భారీగా భూములు కొనుగోలు చేసిన విషయం కూడా బట్టబయలైంది. సిట్ బృందమిదే.. డాక్టర్ కొల్లి రఘురామ్ రెడ్డి (డీఐజీ, ఇంటెలిజెన్స్–బృంద నాయకుడు),అత్తాడ బాబూజీ (విశాఖపట్నం ఎస్పీ),సీహెచ్ వెంకట అప్పలనాయుడు (ఎస్పీ–2 ఇంటెలిజెన్స్), సీహెచ్ శ్రీనివాస రెడ్డి, (అడిషనల్ ఎస్పీ, కడప), జయరామరాజు (డీఎస్పీ, ఇంటెలిజెన్స్), విజయ భాస్కర్ (డీఎస్పీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్), ఎం.గిరిధర్ (డీఎస్పీ, ఇంటెలిజెన్స్), కెన్నెడి (ఇన్స్పెక్టర్, ఏలూరు రేంజి), ఐ.శ్రీనివాసన్ (ఇన్స్పెక్టర్, నెల్లూరు జిల్లా), ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి (ఇన్స్పెక్టర్, గుంటూరు జిల్లా). -
వేగం పెంచిన సీఐడీ
మంగళగిరి: రాజధాని భూముల ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ విచారణను వేగవంతం చేసింది. ముఖ్యంగా అసైన్డు భూముల కొనుగోలు వివరాలను సేకరిస్తోంది. రాజధాని ప్రకటన వచ్చిన వెంటనే రాజధానిలోని అసైన్డు భూములు, లంక భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, పరిహారం ఇవ్వదంటూ టీడీపీ నాయకులు, రియల్ ఎస్టేట్ మీడియేటర్లు గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం సైతం అసైన్డు, లంక భూములు ప్రభుత్వానివే కనుక ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందంటూ జీవో జారీచేసి ఆ జీవోతో గ్రామాల్లో అసైన్డు, లంక భూముల యజమానులైన దళితులు, బీసీలను భయభ్రాంతులకు గురిచేసింది. మీ భూములు ప్రభుత్వం తీసేసుకుంటుందని, తమకు ఇస్తే ఎంతోకొంత డబ్బులు ఇస్తామంటూ టీడీపీ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దళితులు, చిన్నకారు రైతులను భయపెట్టి వారి వద్ద నుంచి ఆ భూములను కొనుగోలు చేశారు. ఎకరం కోట్లలో ఉన్న భూమిని పది లక్షలు, ఇరవై లక్షలిచ్చి కొనుగోలు చేశారు. అనంతరం ప్రభుత్వం ఆ భూములకు పరిహారం ప్రకటించింది. దీంతో టీడీపీ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ భూములను రాజధాని భూసమీకరణకు ఇచ్చి పరిహారంగా పొందిన ప్లాట్లను కోట్లాది రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అసైన్డ్, లంక భూములను రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేకున్నా కోర్టు ఉత్తర్వుల కాపీ ఒకటి సృష్టించి రిజిస్ట్రేషన్ అధికారులకు భారీగా లంచాలిచ్చి ముందుగా పెండింగ్ రిజిస్ట్రేషన్లు చేశారు. అసైన్డ్, లంక భూములను కొనుగోలు చేసిన నీరుకొండకు చెందిన టీడీపీ నాయకుడితో పాటు.. మరో పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు అప్పటి రిజిస్ట్రార్‌తో కలిసి 495 పెండింగ్ రిజిస్ట్రేషన్లు చేశారు. ఒక్కో రిజిస్ట్రేషన్‌కు లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు రాగా.. విచారించిన ఉన్నతాధికారులు అప్పటి రిజిస్ట్రార్‌ను సైతం సస్పెండ్ చేశారు. నాటి రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల తీరుపై సీఐడీ ఆరా ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో రాజధాని భూములపై సీఐడీ విచారణ చేపట్టింది. ఇప్పటికే రాజధానిలో భూములు కొనుగోలు చేసిన తెల్లరేషన్ కార్డుదారులకు సంబంధించి రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టగా.. విచారణ నిర్వహించాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖనూ సీఐడీ అధికారులు కోరారు. సోమవారం మంగళగిరిలోని రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్న సీఐడీ అధికారులు అసైన్డ్, లంక భూముల రిజిస్ట్రేషన్లతో పాటు మరికొన్ని దస్తావేజులు సేకరించి తీసుకెళ్లడం స్థానికంగా సంచలనం కలిగిస్తోంది. టీడీపీ నాయకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకరించిన అప్పటి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల తీరుపైనా సీఐడీ అధికారులు ఆరా తీశారు. అప్పుడు పనిచేసిన అధికారులెవరు, టీడీపీ నాయకులు, రియల్ వ్యాపారులకు సహకరించిన అధికారులు, సిబ్బంది ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారనే అంశాలపై అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. -
మరో ఐదుగురిపై సీఐడీ కేసులు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో టీడీపీ పెద్దల అండతో సాగిన ఇన్సైడర్ ట్రేడింగ్ డొంక కదులుతోంది. ఇందుకు కారకులైన వారిపై సీఐడీ కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంకు చెందిన దళిత మహిళ పి.బుజ్జి ఫిర్యాదుతో టీడీపీ మాజీ మంత్రులు పి. నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు మరో నేత బెల్లంకొండ నరసింహారావులపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనితోపాటు కురగల్లు గ్రామానికి చెందిన పల్లెపోగు శివశంకర్ ఫిర్యాదుతో తాతా బసవశంకర్రావు, పాలడుగు నాగలక్ష్మిలపై కూడా కేసు నమోదు చేసింది. తాజాగా.. కృష్ణాజిల్లా విజయవాడ, యనమలకుదురు, పెనమలూరు, పోరంకి ప్రాంతాలకు చెందిన వారిపై సీఐడీ ఐదు కేసులు నమోదు చేసింది. ఇందులో భాగంగా పెనమలూరు తహసీల్దార్ జి. భద్రు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యనమలకుదురుకు చెందిన పొల్లినేని కొండలరావుపై కేసు నమోదు చేసింది. తప్పుడు ధృవపత్రాలు చూపించి తెల్లకార్డు పొందిన కొండలరావు రాజధాని ప్రాంతంలోని నేలపాడులో ఎకరా 8 సెంట్లు భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇతనిపై ఐపీసీ సెక్షన్–177, 403, 420, 468, 471, 120(బి) కింద కేసు నమోదు చేసిన అధికారులు అతని తెల్లకార్డు రద్దుకు సిఫారసు చేశారు. అలాగే, పెనమలూరుకు చెందిన మండవ నాగమణి వెంకటపాలెంలో 95 సెంట్లు.. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి బొల్లినేని నాగలక్ష్మి.. ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగి అయిన భూక్యా నాగలక్ష్మి.. పెనమలూరు మండలం గంగూరు గ్రామానికి చెందిన అబ్దుల్ జమేదార్ తప్పుడు పత్రాల ద్వారా తెల్లకార్డులు పొంది తద్వారా రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసినందుకు కేసు నమోదు చేశారు. అసైన్డ్ భూములు కొన్న 106 మంది జాబితా ఐటీ శాఖకు.. కాగా, అమరావతిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన 106 మంది జాబితాను ఆదాయ పన్ను (ఐటీ) శాఖకు సీఐడీ మరోసారి పంపించింది. ఈ మేరకు వారికి సంబంధించిన చిరునామా, తెల్లకార్డు నంబర్, కొనుగోలు చేసిన భూమి విస్తీర్ణం, దాని విలువ తదితర వివరాలతో ఐటీ శాఖ కమిషనర్‌కు ఏపీ సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ లేఖ రాశారు. అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారు, రూ.2 లక్షలకు పైగా మొత్తాలను నగదు రూపంలో చెల్లించిన వారి వివరాలను అందజేశారు. వీరిపై ఐటీ యాక్టు కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంత భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే అనేక అక్రమాలు వెలుగుచూశాయని.. నిబంధనలకు విరుద్ధంగా భూములు కొనుగోలు చేసిన వారిలో తెల్లకార్డుదారులు కూడా ఉన్నారని సీఐడీ ఆ లేఖలో వివరించింది. మరోవైపు.. ఉద్యోగాలు చేస్తున్న వారు, భూములు కలిగిన వారు, విలువైన ఆస్తులు కలిగిన వారు నిబంధనలకు విరుద్ధంగా పొందిన తెల్లకార్డులను రద్దుచేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ను కూడా సీఐడీ అధికారులు కోరారు. -
ఇన్సైడర్ ట్రేడింగ్‌లో అక్రమాల 'వరద'
సాక్షి, అమరావతి : రాజధాని భూకుంభకోణంలో తీగలాగితే చంద్రబాబు బృందం డొంక కదులుతోంది. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి) కూడా ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రూ.400 కోట్ల విలువైన భూములు కొనుగోలు చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. తన భార్య గోనుగుంట్ల నిర్మలమ్మ, కాంట్రాక్టు సంస్థ నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ పేరుతో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో భారీగా భూములు కొన్నారు. విజయవాడకు అత్యంత సమీపంలో.. వెలగపూడి సచివాలయానికి కూతవేటు దూరంలో ఉండవల్లిలో 11.34 ఎకరాల భూమి కొనుగోలు చేయడాన్ని దర్యాప్తు సంస్థ సీఐడీ గుర్తించింది. బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువే రూ.వంద కోట్లకు పైగా ఉంటుందని అంచనా. రాజధాని గ్రామాల్లోనూ.. సీఆర్డీఏ పరిధిలోనూ భారీగా భూముల కొనుగోలులో వరదాపురం సూరి మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చిన సీఐడీ.. అందుకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను ఆదాయపు పన్ను (ఐటీ), ఈడీకి అందజేసింది. దీంతో ఈ రెండు సంస్థలు సీఐడీకి సమాంతరంగా విచారణ చేపట్టనున్నాయి. బాబు హయాంలో కేసులు నిర్వీర్యం టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడైన సూరి 2014 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. క్వారీల్లో అక్రమ మైనింగ్.. నాసిరకంగా పనులు చేసినందుకు నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్‌పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం 2014కు ముందే పలు కేసులు నమోదు చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ కేసులను నిర్వీర్యం చేయించుకున్న సూరి.. ఆ తర్వాత చంద్రబాబు బృందంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు నుంచి ముందే సమాచారం తెలుసుకున్న ఆయన.. తాడేపల్లి మండలం ఉండవల్లిలో సర్వే నంబర్లు 144–2ఏ2, 144–2ఏ3, 149–బీ2, 149–బీ3, 151–2ఏ, 195–ఏ, 196–సీ1ఏ1ఏ, 199–3, 207–3, 207–5ఏలలో తన భార్య గోనుగుంట్ల నిర్మలమ్మ పేరుతో 5.6725 ఎకరాలు, సర్వే నంబర్లు 140–1బీ, 180–1బీ1, 184–ఏ2/3, 196బీ3బీ, 200–ఏ1, 206–1ఏలలో 5.67 ఎకరాలు మొత్తం 11.34 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇదే రీతిలో సీఆర్డీఏ పరిధిలోని పలు మండలాల్లోనూ 56 ఎకరాలకు పైగా భూమిని కొన్నారు. వీటి విలువ రూ. 400 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో.. సూరి కుటుంబ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టిన సీఐడీ.. ఆదాయానికి మించి ఆస్తులు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించింది. అలాగే, మనీల్యాండరింగ్‌కు కూడా పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఐటీ, ఈడీలకు నివేదిక అందజేసింది. కాగా, 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం చంద్రబాబు ఆదేశాల మేరకు తనను తాను రక్షించుకోవడానికి బీజేపీ గూటికి చేరారు. -
ఇన్సైడర్ ట్రేడింగ్; ఏడుగురిపై కేసు
-
ఇన్సైడర్ ట్రేడింగ్; ఏడుగురిపై కేసు
సాక్షి, విజయవాడ: రాజధాని అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. తాజాగా ఏడుగురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. తెల్లరేషన్ కార్డు దారుల పేర్లతో కోట్లాది రూపాయల విలువైలన భూములు కొనుగోలు చేసినట్టు కీలక ఆధారాలను సీఐడీ సేకరించింది. పాన్‌కార్డు లేని పేదలు కోట్లాది రూపాయల చెలామణి చేశారని గుర్తించింది. నాగమణి, నరసింహారావు, అనురాధ, కొండలరావు, భుక్యానాగమణి, అబ్దుల్, జమేదార్‌లపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఇప్పటికే మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావులపై కేసు నమోదైన సంగతి తెలిసింది. మరికొందరి ప్రమేయంపై విచారణ కొనసాగుతోంది. (చదవండి: టీడీపీలో ఈడీ దడ!) కూపీ లాగుతున్న ఈడీ అమరావతి : రాజధాని అమరావతిలో సాగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి మనీల్యాండరింగ్‌పై దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్సుమెంట్ డైరెక్ట రేట్(ఈడీ) మరో అడుగు ముందుకేసింది. తెల్ల కార్డుదారులు ఎవరికి బినామీలనే కోణంలో ఆరా తీస్తోంది. కోట్లాది రూపాయలతో అక్కడ విలువైన భూములు కొనుగోలు చేసిన పేదల(తెల్లకార్డుదా రుల) జాబితాను సీఐడీ సేకరించడం తెలిసిందే. దీనిపై సీఐడీ ఇచ్చిన వివరాలతో క్రైమ్ నెంబర్ 3/ 2020 కేసు నమోదు చేసిన ఈడీ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టింది. అమరావతి కోర్ ఏరియాలో 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు బహిరంగ మార్కెట్లో రూ.276 కోట్ల విలువైన 761.34 ఎకరా ల్ని రూ.38.56 కోట్లు(రిజిస్ట్రేషన్ విలువ) పెట్టి ఎలా కొన్నారనే దానిపై ప్రధానంగా ఆరా తీస్తోంది. వీరిలో పాన్‌కార్డు కలిగినవారు 268 మంది ఉండగా.. లేనివారు 529 మంది. తెల్లకార్డులు కలిగిన వారి వివరాల్ని వివిధ కోణాల్లో సేకరిస్తున్న విషయాన్ని ఈడీ హైద రాబాద్ జోనల్ కార్యాలయ జాయింట్ డైరెక్టర్ (జేడీ) అభిషేక్ గోయల్ ఏపీ సీఐడీ అధికారులకు సమాచారమిచ్చినట్లు తెలిసింది. అలాగే, రాజధాని రావడానికి ముందు నుంచి పథకం ప్రకారం బినామీలను వాడుకుని తక్కువ ధరకు భూములు కొట్టేసినట్లు ఈడీ పసిగట్టింది. తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, తుళ్లూరు, పెదకాకాని, అమరావతి మండలాల్లో ఈ కొనుగోళ్లు ఎక్కువగా జరిగినట్లు నిర్ధారించింది. మరోవైపు.. ఎన్ని లక్షల రూపాయిల చొప్పున ఎంతమంది పెట్టుబడి పెట్టి భూములు కొన్నారో ఈడీ లెక్క తీసింది. -
ఏపీ: అజ్ఞాతంలోకి ఇద్దరు మాజీ మంత్రులు?
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, మనీల్యాండరింగ్ వ్యవహారాల గుట్టుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేయడం టీడీపీ నేతలను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నాయకులు బినామీల పేర్లతో భూములు కొనుగోలు చేయడంపై సీఐడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తోందనే వార్తలు టీడీపీ శ్రేణుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపినా తమకు ఏమీకాదనే ధీమాతో మొన్నటివరకూ మాట్లాడిన సీనియర్ నాయకులు నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఉచ్చు బిగుస్తోందని తమ నాయకులకు అర్ధమైందని.. అందుకే కొందరు స్తబ్దుగా ఉంటున్నారని విజయవాడకు చెందిన ఒక టీడీపీ నాయకుడు వ్యాఖ్యానించారు. స్వయంగా చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్‌పై ఈడీ కేసు నమోదు చేసే వీలుందని తెలియడంతో రాబోయే రోజుల్లో మరీ ఆందోళనకర పరిస్థితులుంటాయని, అరెస్టులూ ఉంటాయని చర్చించుకుంటున్నారు. (చదవండి: చంద్రబాబు సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ సోదాలు) అజ్ఞాతంలోకి ఇద్దరు మాజీ మంత్రులు? మాజీ మంత్రులు పుల్లారావు, నారాయణలు అజ్ఞాతంలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అమరావతి ప్రాంతంలోని వెంకటపాలేనికి చెందిన ఒక దళిత మహిళ తన భూమిని మోసపూరితంగా కాజేశారని ఇచ్చిన ఫిర్యాదుతో వారిద్దరిపై ఛీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి పలు సెక్షన్లతో కేసులు నమోదవడంతో వారిద్దరూ మీడియా ముందుకే రావడంలేదని నాయకులు చర్చించుకుంటున్నారు. అరెస్టు భయంతో వారు ముందస్తు బెయిల్‌కు ప్రయత్నిస్తున్నట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. కాగా, తెల్లకార్డుదారులను బినామీలుగా పెట్టుకుని 761.34 ఎకరాలను కొనుగోలు చేయడంపై విచారణ ముమ్మరంగా జరుగుతుండడంతో ఏ రోజు ఎవరి పేరు వినాల్సివస్తుందనే ఆందోళన నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే, టీడీపీ బడా నేతలు జరిపిన ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పూర్తిగా సహకరించి దందా నడిపిన రాజధాని గ్రామాలకు చెందిన పలువురు స్థానిక నేతలు సైతం తాజా పరిణామాలతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. తమపై వచ్చే విమర్శలు, ఆరోపణలపై ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చే టీడీపీ నేతలు ఈ విషయంలో మాత్రం నోరు మెదపడంలేదు. తమకు అనుకూలమైన మీడియాలోనూ ఆ వార్తలు రాకుండా చంద్రబాబు కోటరీ ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు. జనం దృష్టి మళ్లించేందుకు ‘కియా’పై దుష్ప్రచారం తమకు వ్యతిరేకంగా ఉన్న ఈ పరిణామాల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు నిత్యం రకరకాల కొత్త పుకార్లు, అవాస్తవాలను వెలుగులోకి తెచ్చి ప్రచారం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. కియా మోటార్స్ అనంతపురం నుంచి చెన్నైకి తరలిపోతోందనే ప్రచారాన్ని లేవనెత్తి హడావుడి చేయడం ఇందులో భాగమేనని చెబుతున్నారు. ఒక వ్యూహం ప్రకారం ఆయన మీడియా మేనేజర్లు కియా తరలిపోతోందనే కథనాన్ని రాయించి దాన్ని తమ ఐటీ విభాగం ద్వారా సోషల్ మీడియాలో వైరల్ చేయించారని విమర్శలు వెల్లువెత్తాయి. తర్వాత స్వయంగా చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి అదే విషయం పై ఆరోపణలు గుప్పించారు. కియా యాజమాన్యం, తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రచారాన్ని ఖండించాయనే విషయాన్నీ చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకుని మాట్లాడడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పరిశ్రమలు తరలిపోతున్నాయని.. ఉన్నతాధికారులు సెలవులో వెళ్లిపోతున్నారని.. ఏదో జరిగిపోతోందనే పుకార్లను వ్యాపింపజేయడం, వాటిపై హడావుడి చేయడమే పనిగా చంద్రబాబు కొద్దిరోజులుగా పనిచేస్తున్న ట్లు విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. తన అవినీతి సామ్రాజ్యం గుట్టుపై ప్రజల్లో చర్చ జరక్కుండా చేసేందుకే పథకం ప్రకారం అవాస్తవాలను తెరపైకి తెచ్చి హడావుడి చేస్తున్నట్లు చెబుతున్నారు. (చదవండి: కియాపై మాయాజాలం) -
‘ఇన్సైడర్’తో కోట్లు పోగేసుకోవాలనుకున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని అమరావతికి సంబంధించిన ఇన్సైడర్ సమాచారంతో 4 వేల ఎకరాలు కొనుగోలు చేసిన టీడీపీ నేతలు.. వ్యక్తిగతంగా కోట్లాది రూపాయల సంపద పోగేసుకోవాలని చూశారని వైఎస్సార్సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం జరిగిన చర్చలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ మాట్లాడగా వాటిని తిప్పి కొడుతూ కోటగిరి శ్రీధర్ ప్రసంగించారు. ‘నా సహచరుడు జయదేవ్ గల్లా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పలు అంశాలు లేవనెత్తారు. వాటికి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ మెజారిటీతో తిరిగి అధికారం చేపట్టారు. అంతకు ముందు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రాదనే ఉద్దేశంతో పొత్తు వదిలేసింది. చంద్రబాబునాయుడు దేశవ్యాప్తంగా తిరిగి మోదీ వ్యతిరేక ప్రచారంలో తానే ఛాంపియన్ అని చెప్పుకున్నారు. పార్టీలన్నీ మోదీకి వ్యతిరేకంగా పనిచేసేలా ప్రయత్నించారు. ఇలా పుంజుకున్న శక్తులన్నీ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బీజేపీని ఓడించగలిగాయని ఆయన టీవీ చర్చల్లో గొప్పలు చెప్పుకొన్నారు. చంద్రబాబు తీసుకున్న అస్థిర, విశ్వసనీయతలేని నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొంది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన ముగ్గురు ఎంపీలను కేంద్రంలోని అధికార పార్టీకి దగ్గర చేయడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది’ అని కోటగిరి శ్రీధర్ పేర్కొన్నారు. రూ. 60 వేల కోట్ల బిల్లులు చెల్లించలేదు ‘రాష్ట్రానికి ఉన్న రూ. 70 వేల కోట్ల అప్పును టీడీపీ ప్రభుత్వం రూ. 2.5 లక్షల కోట్లకు పెంచింది. తన హయాంలోని రూ. 60 వేల కోట్ల బిల్లులు చెల్లించకుండా వదిలేసింది. ఎన్నికలకు ముందు రోజు రూ. 30 వేల కోట్లు ఖర్చు చేసి ప్రజలను ఉచితాల పేరుతో మభ్యపెట్టాలని చూసింది. ప్రపంచ స్థాయి రాజధాని అన్న పేరుతో అభివృద్ధిని కేవలం ఒకే చోట కేంద్రీకరించాలని, అక్కడ భారీగా వ్యక్తిగత సంపద కూడబెట్టుకోవాలని టీడీపీ నేతలు ప్రణాళిక రచించారు. ఈ వంచనలకు తగిన రీతిలో స్పందించిన ప్రజలు వారిని ఇంటికి పంపించేశారు..’ అని పేర్కొన్నారు. కేంద్రం మద్దతు కావాలి ‘వైఎస్సార్సీపీ శాసనసభలో 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ 151 స్థానాలు గెలుచుకుంది. 25 ఎంపీ సీట్లకు గాను 22 సీట్లు గెలుచుకుంది. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అధికార పార్టీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక అంశాల్లో మద్దతుగా నిలుస్తూ వచ్చింది. ట్రిపుల్ తలాఖ్ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు బిల్లు తదితర బిల్లులకు మేం మద్దతు ఇచ్చాం. నిర్లక్ష్యానికి గురైన మా రాష్ట్రానికి మీ మద్దతు ఉంటే వేగవంతంగా అభివృద్ధి సాధించగలమనే ఉద్దేశంతో మీ సాయం కోరుతున్నాం. అయితే కేంద్రం సానుకూలంగా స్పందించడం లేదనే అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో ఉంది. మా సీఎం పేదరిక నిర్మూలనకు సమర్థవంతంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా పాలనను ఇంటి వద్దకే తీసుకొచ్చారు. ఈ సభలోనే మా రాష్ట్రానికి ఎలా అన్యాయం జరిగిందో మీరు చూశారు. గత ప్రభుత్వ హయాంలో మా రాష్ట్రం ఎదుర్కొన్న అన్యాయాన్ని ప్రస్తుత మోదీ ప్రభుత్వం సరిదిద్దాలని అభ్యర్థిస్తున్నాం. మా రాష్ట్రానికి ఇవ్వవలసిన బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని కోరుతున్నాం. పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేలా త్వరితగతిన నిధులు కేటాయించాలి. మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కు కూడా న్యాయం చేయాలి. బకింగ్çహామ్ కెనాల్, కొవ్వూరు–భద్రాచలం రైల్వే లైన్ పెండింగ్ పనులపై దృష్టి పెట్టాలి’ అని కోరారు. -
రాజధానిపై రెఫరెండానికి సిద్ధమా?
తెనాలి: రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో కోరుతుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే అమరావతిగా రాజధానిని కొనసాగించడం, మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రజల్లో రెఫరెండం నిర్వహించాలని సవాలు విసిరారు. రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులకు అంగీకరిస్తే, తాను మరొక్కమాట కూడా మాట్లాడనని అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో జేఏసీ దీక్షా శిబిరంపై దాడిని ఖండిస్తూ మంగళవారం స్థానిక వీఎస్సార్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ మైదానంలో నిరసన బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా ప్రసంగించారు. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ 2015లో జీవో జారీ చేశామని, వచ్చే ఏప్రిల్‌కు ఐదేళ్లవుతుందని చెప్పారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సాక్ష్యాధారాలుంటే చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని అన్నారు. ఆస్తులమ్మి అభివృద్ధి చేస్తామనడం వినాశనానికే.. హుద్‌హుద్ తుఫాను తర్వాత విశాఖపట్నం రూపురేఖలు మార్చిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇప్పుడు విశాఖపట్నంలో 6 వేల ఎకరాల ఎస్సీల భూములను బలవంతంగా లాండ్‌పూలింగ్ పేరుతో తీసుకోవాలని చూస్తున్నారని, నాలుగు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మాలనే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు. ఆస్తులమ్మి ఎవరైనా అభివృద్ధి చేస్తామంటే అది వినాశనానికేనని తేల్చిచెప్పారు. అంతకుముందు సీపీఐ నేత ఎ.రామకృష్ణ మాట్లాడుతూ... నెలాఖరులోగా మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోకపోతే తామంతా ఢిల్లీకి వెళ్లి పోరాడతామని చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతీయ విభేదాలతో ప్రజల్లో చిచ్చు రేపేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని టీడీపీ కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఆరోపించారు. తెనాలి సభలో చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం, స్వోత్కర్షను జనం భరించలేకపోయారు. చాలామంది మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. -
వెనకుండి నడిపిందెవరు?
సాక్షి, అమరావతి: ఏపీ రాజధాని పేరుతో అమరావతిలో టీడీపీ నేతలు సాగించిన ఇన్సైడర్ ట్రేడింగ్‌లో మనీ ల్యాండరింగ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)– 2002, ఫారిన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఎఫ్ఇఎంఎ–ఫెమ) –1999 ప్రకారం కేసులు నమోదు చేసిన ఈడీ కీలక ఆధారాలపై దృష్టి సారించింది. రాజధాని భూ కుంభకోణంలో ప్రత్యక్ష పాత్ర.. వెనకుండి నడిపిందెవరనే విషయాలతో పాటు పలు కోణాల్లో ఆరా తీస్తోంది. చంద్రబాబు హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ ముఖ్య నేతలు సీఆర్డీఏ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాలు కారు చౌకగా కొనుగోలు చేసి భూ కుంభకోణానికి పాల్పడినట్లు మంత్రివర్గ ఉపసంఘం నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. అనంతరం ప్రభుత్వం ఈ కేసును ఏపీ సీఐడీకి అప్పగించడం.. ఈ కుంభకోణం నిజమేనని సీఐడీ నిర్ధారించడం.. కేసులు నమోదు చేసింది. ఇందులో మనీ ల్యాండరింగ్, అక్రమ ఆదాయం వంటి అంశాలు ముడిపడి ఉండటంతో ఈడీ, ఆదాయ పన్ను శాఖ(ఐటీ)లకు ఏపీ సీఐడీ నివేదించిన సంగతి విదితమే. చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఈడీ కేసు బదిలీ రాజధాని అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇవ్వాలంటూ ఈడీ.. ఏపీ సీఐడీని కోరింది. ఈ బాగోతంపై ఇప్పటికే సీఐడీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్ చెన్నైలోని ఎన్ఫోర్స్మెంట్ సదరన్ రీజియన్ స్పెషల్ డైరెక్టర్ డి.సుశీల్‌కుమార్‌కు లేఖ రాసిన సంగతి తెల్సిందే. దీంతో ఈ కేసును హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ కార్యాలయానికి బదిలీ చేసి, దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసును పర్యవేక్షిస్తున్న ఈడీ జేడీ (హైదరాబాద్) అభిషేక్ గోయల్ సీఐడీ ఇచ్చిన నివేదికలోని పలు అంశాలను పరిశీలించారు. మరిన్ని కీలక ఆధారాల కోసం సీఐడీని సంప్రదించగా, మంగళవారం మెయిల్ చేశారు. కీలక ఆధారాల కోసం ఈడీ ఆరా.. ఈడీ జేడీ అభిషేక్ గోయల్.. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి అన్ని పరిణామాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. రాజధాని భూముల కొనుగోళ్లు, వాటిలో అక్రమాలు, పెద్ద ఎత్తున డబ్బు మారకం, తెల్లకార్డుదారులు కోట్లు పెట్టి భూముల కొనుగోలు వెనుక ఉన్న వారెవరు?.. నల్ల డబ్బు చేతులు మారిందా, విదేశాల నుంచి హవాలా మార్గాల్లో డబ్బు వచ్చిందా.. రూ.10 కోట్లకు మించి భూములు కొనుగోలు చేసిన వారి వివరాలేమిటి లాంటి తదితర వివరాలు కోరినట్టు తెలిసింది. బెదిరింపులకు పాల్పడి భూములు తక్కువ ధరకు కొట్టేయడం, మోసం చేసి భూములు రాయించుకోవడం, చంపుతామనే బెదిరింపులు, కిడ్నాపులు, ప్రలోభాలు తదితర కీలక సమాచారంపై ఆరా తీసినట్లు సమాచారం. రాజధాని అమరావతిలో చోటు చేసుకున్న అక్రమాలపై 2015 నుంచి 2019 వరకు ఏమైనా కేసులు నమోదు అయ్యాయా? వాటికి సంబంధించిన వివరాలను ఈడీ కోరినట్టు తెలిసింది. ఇన్సైడర్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్‌లో ప్రత్యక్ష పాత్ర.. వెనకుండి నడిపిందెవరు.. అనే వివరాలపై కూడా ఆరా తీసినట్టు సమాచారం. వీటన్నింటిపై సీఐడీ వెంటనే వివరాలు అందించినట్టు విశ్వసనీయ సమాచారం. -
ఎలాగు జైలుకు పోయేదేకదా అని..
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నాయకులపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ బయటపడి ఎలాగో జైలుగు పోయేదేకదా అని పిచ్చి కూతలు కూస్తున్నారని విమర్శించారు. ‘మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకుల ఉక్రోషం కట్టలు తెంచుకుంటోంది. సీఎం హోదాను సైతం అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ బండారం బయట పడేటప్పటికి ఎలాగూ జైలుకు పోయేదేకదా అని పిచ్చి కూతలు కూస్తున్నారు. మీ రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయి’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (చదవండి : ‘ఇన్సైడర్’పై ఈడీ కేసు!) కాగా, అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, మరికొందరు టీడీపీ నేతలపై సీఐడీ ఇచ్చిన ఆధారాల నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు హయాంలో రాజధాని ఏర్పాటుపై పథకం ప్రకారం ముందే లీకులు ఇచ్చి అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి లబ్ధి పొందేలా దోహదపడ్డారనే అభియోగాలున్నాయి. దీనిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే విషయాన్ని నిర్ధారించింది. -
అమరావతిలో మనీల్యాండరింగ్ బాగోతం..
-
‘ఇన్సైడర్’పై ఈడీ కేసు!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై దర్యాప్తునకు ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమైంది. రాజధాని పేరుతో సాగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌లో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఈడీ సోమవారం ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కేసు నమోదు చేసింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, మరికొందరు టీడీపీ నేతలపై సీఐడీ ఇచ్చిన ఆధారాల నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు హయాంలో రాజధాని ఏర్పాటుపై పథకం ప్రకారం ముందే లీకులు ఇచ్చి అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి లబ్ధి పొందేలా దోహదపడ్డారనే అభియోగాలున్నాయి. దీనిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే విషయాన్ని నిర్ధారించింది. 2014 జూన్ నుంచి డిసెంబర్ లోపు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా సీఆర్డీఏ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు మంత్రివర్గ ఉపసంఘం నిగ్గు తేల్చింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఎన్ఆర్ఐ వేమూరి రవికుమార్ ప్రసాద్, పరిటాల సునీత, జీవీ ఆంజనేయులు, లింగమనేని రమేష్, పయ్యావుల కేశవ్, పుట్టా మహేష్ యాదవ్, దూళిపాళ నరేంద్ర, లంకా దినకర్, కంభంపాటి రామ్మోహన్రావు తదితర టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టు మంత్రివర్గ ఉప సంఘం స్పష్టం చేసిన సంగతి తెలిందే. అంతటితో ఆగకుండా టీడీపీ నేతల బంధుమిత్రులకు చెందిన భూములు ఉన్న ప్రాంతాన్ని సీఆర్డీఏ పరిధిలోకి తేవడం, అవసరమైన చోట వారి భూములకు మినహాయింపు ఇవ్వడం, రాజధాని ప్రాంతంలో నిర్మాణాల విషయమై పథకం ప్రకారం వారికి ఉప్పందించి లాభపడేలా చేయడంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు మంత్రివర్గ ఉప సంఘం నిర్ధారించింది. తెల్లకార్డుదారులు 761.34 ఎకరాల భూమి కొనుగోలు మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా తీగలాగిన రాష్ట్ర నేర పరిశోధన శాఖ (సీఐడీ) గత ప్రభుత్వ పాలనలో జరిగిన భూ కుంభకోణాలను నిగ్గు తేల్చింది. అమరావతిలో నాలుగు వేల ఎకరాల భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించింది. అమరావతి రాజధాని కోర్ ఏరియాలో 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారు. పేద వర్గాలుగా తెల్లకార్డులు పొందిన వారు దాదాపు రూ.276 కోట్లు పెట్టి ఆ భూములు ఎలా కొన్నారనే దానిపై సీఐడీ కూపీ లాగింది. పచ్చ నేతలకు బినామీలుగా తెల్లకార్డుదారుల పేర భూములు కొన్నట్టు నిర్ధారణ కావడంతో ఇందులో మనీ ల్యాండరింగ్, అక్రమ ఆదాయం వంటి అంశాలు ముడిపడ్డాయి. టీడీపీ మాజీ మంత్రులపై కేసు నమోదు ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. మభ్యపెట్టి తన భూమి కొనుగోలు చేశారని వెంకటాయపాలెంకు చెందిన దళిత మహిళ పోతురాజు బుజ్జి ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. టీడీపీ మాజీ మంత్రులు పి.నారాయణ, పత్తిపాటి పుల్లారావులతోపాటు టీడీపీ నాయకుడు బెల్లంకొండ నరసింహారావుపై సెక్షన్ 420, 506 రెడ్‌విత్ 120(బి)తోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 3(1)(జి)(పి) కేసు నమోదు చేసిన సీఐడీ.. పలు ప్రాథమిక ఆధారాలు సేకరించింది. అమరావతి ,పెద్దకాకాని, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి గ్రామాల్లో తెల్లకార్డు దారులను బినామీలుగా అడ్డుపెట్టుకుని 720 ఎకరాలను కొనుగోలు చేసినట్టు నిర్ధారించింది. ఈ కేసును సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాలతో సహా ఈడీకీ లేఖ రాసిన సీఐడీ రాజధాని ఇన్సైడర్ ట్రేడింగ్‌లో మనీ ల్యాండరింగ్ జరిగిందని, దీనిపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చెన్నై రీజినల్ కార్యాలయానికి సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ గత నెలలో లేఖ రాశారు. ఈ మేరకు ఎన్పోర్సుమెంట్ సదరన్ రీజియన్ స్పెషల్ డైరెక్టర్‌కు రాజధాని ప్రాంతంలో తెల్లకార్డుదారుల పేరుతో కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లతోపాటు, తెల్లరేషన్ కార్డు హోల్డర్ల వివరాలను పంపించారు. 2015 అక్టోబర్‌లో వెంకటపాలెంకు చెందిన పి.బుజ్జి భూమిని అప్పటి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ దన్నుతో వారి బినామీలు మోసం చేసి, బెదిరించి, బలవంతంగా తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఆ లేఖలో సునీల్‌కుమార్ పేర్కొన్నారు. రాజధాని భూముల కొనుగోల్‌మాల్‌లో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరడంతో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేపట్టనుంది. ఐటీ ‘తెల్ల’బోయేలా.. తెల్లకార్డు కలిగిన పేద వర్గాలు కోట్లు పెట్టి రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వ్యవహారంలో సీఐడీ అందించిన వివరాలను పరిశీలిస్తే ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు సైతం తెల్లబోయేలా చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ (ఆంధ్రప్రదేశ్ – విజయవాడ)కు గత నెల 22న సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ ఆధారాలతో సహా లేఖ రాశారు. 2014 – 2015లో పేద వర్గాల వారు భారీ మొత్తాలను పెట్టుబడి పెట్టి రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని, తెల్లకార్డు కలిగిన వారికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది దర్యాప్తు చేస్తే వారి వెనుక టీడీపీ నేతల పెట్టుబడి బయటకు వస్తుందని సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్ రాసిన లేఖలో పేర్కొన్నారు. వీరిలో కొంత మంది పాన్‌కార్డు సమర్పించారని, అత్యధిక శాతం వారికి పాన్‌కార్డులు లేవని, వారి పేర్లు, తెల్లకార్డు నంబర్లు, కొనుగోలు చేసిన భూముల దస్తావేజులు, వాటి మార్కెట్ విలువ తదితర వివరాలను ఐటీ శాఖకు ఆయన అందజేశారు. వీటిపై సమగ్ర దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని కోణాల్లో దర్యాప్తు రాజధానిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు రాజధాని భూముల కొనుగోలులో జరిగిన మనీ ల్యాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు చేస్తుంది. తెల్లకార్డు కలిగిన పేదలు అంత పెద్ద మొత్తాలు పెట్టి భూములు ఎలా కొనుగోలు చేశారనే దానిపై ఐటీ శాఖ దర్యాప్తు చేయాల్సి ఉంది. రాజధానిలో జరిగిన అక్రమాలపై సంబంధిత అన్ని శాఖలు దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి. – సునీల్‌కుమార్, సీఐడీ ఏడీజీ నిరుపేదలు భూములు కొన్నారట! దేవతల రాజు ఇంద్రుని రాజధాని అమరావతిని తలదన్నేలా ఆంధ్రులకు కొత్త రాజధాని నిర్మించడం మాటేమోగానీ.. కటిక నిరుపేదలను బినామీలుగా చేసుకుని వేలాది కోట్ల రూపాయల భూములను కాజేయడంలో చంద్రబాబు బృందం సఫలీకృతమైంది. ఓత్ ఆఫ్ సీక్రసీని తుంగలో తొక్కి.. రాజధానిపై అధికారిక ప్రకటన చేయక ముందే లీకులు ఇచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తక్కువ ధరలకే భారీగా భూములు కొల్లగొట్టి అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడింది. ఏడాదికి రూ.60 వేలలోపు ఆదాయం ఉండే వారిని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిగా గుర్తిస్తారు. ఇలాంటి వారికి తెల్లరేషన్‌కార్డును సర్కార్ జారీ చేస్తుంది. ఇలాంటి నిరుపేదలకు ప్రభుత్వం ప్రకటన చేయక ముందే.. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నది తెలిసే అవకాశమే లేదు. కానీ, ఇలాంటి వారు 797 మంది రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయక ముందే.. అంటే 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 30 వరకు 761.34 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. వీరిలో ఏ ఒక్కరూ ఆదాయపు పన్ను చెల్లించ లేదు. ఈ దృష్ట్యా వీరంతా గత ప్రభుత్వ పెద్దల బినామీలని స్పష్టమవుతోంది. చంద్రబాబు బృందం తమ కుటుంబ సభ్యులు, వ్యాపార సంస్థలు, సమీప బంధువుల పేర్లతో తక్కువ ధరకే వేలాది ఎకరాలను కాజేసింది చాలక.. తమ డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసే వారు, అనుచరులను ముందు పెట్టి భూములను కొనుగోలు చేసినట్లు సీఐడీ తేల్చింది. - తెల్లరేషన్‌కార్డు పొందడానికి ఏడాదిలో గరిష్ట ఆదాయం రూ.60,000 - ఏడాదిలో గరిష్టంగా ఆదా చేసే మొత్తం రూ.5,000 - 20 ఏళ్లున్న వ్యక్తి 65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆదా చేసే మొత్తం రూ.2.25 లక్షలు - 797 మంది తెల్లరేషన్‌కార్డుదారులు కొన్న భూమి(ఎకరాల్లో) 761.34 - పాన్‌కార్డు కలిగిన వారు 268 - పాన్‌కార్డులు లేని వారు 529 - రిజిస్ట్రేషన్ (ప్రభుత్వం నిర్ణయించిన) ధర ప్రకారం ఆ భూమి విలువ (రూ.కోట్లలో): 38.56 - బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఆ భూమి విలువ (రూ.కోట్లలో) రూ.220 ఇన్సైడర్ ట్రేడింగ్ ఇలా.. - 2014 మే 16న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. సింగపూర్‌ను తలదన్నేలా రాజధాని నిర్మిస్తామంటూ అదే రోజు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆ వెంటనే ఓత్ ఆఫ్ సీక్రసీని తుంగలో తొక్కుతూ.. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో రాజధానిని ఏర్పాటు చేస్తామని కీలకమైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. తన సామాజిక వర్గానికి చెందిన వారికి చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇస్తూ.. రాజధాని అక్కడ.. ఇక్కడ అంటూ ఇన్సైడర్ ట్రేడింగ్‌కు ఇలా తెర తీశారు. - 2014 జూన్ 9న కృష్ణా జిల్లా నూజివీడు పరిసర ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తామని తమ అనుకూల ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయించారు. - 2014 జూన్ 12న కృష్ణా జిల్లా ఆగిరిపల్లి, బాపులపాడు పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు కొందరు మంత్రుల ద్వారా ప్రకటింపజేశారు. - 2014 జూలై 5న కృష్ణా జిల్లా ముసునూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ ఇంకొందరు మంత్రులతో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయించారు. - 2014 ఆగస్టు 5న కృష్ణా జిల్లా గన్నవరం పరిసర ప్రాంతాలు రాజధాని ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రాంతమంటూ మరికొందరు మంత్రులు చెప్పుకొచ్చారు. - చంద్రబాబునాయుడు, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు 2014 ఆగస్టు 9న వేర్వేరు సమావేశాల్లో మాట్లాడుతూ గుంటూరు – విజయవాడ మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. - 2014 సెప్టెంబరు 4న విజయవాడ – గుంటూరు పరిసర ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. - తీరా 2014 డిసెంబర్ 30న తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు 2015 జనవరి 1న ఈ మండలాల్లో 29 గ్రామాల్లో అవసరమైన భూమిని సమీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసి.. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. పక్కా ప్లాన్‌తో భూ దందా టీడీపీ పెద్దలు, నేతలు.. లంకలు, పోరంబోకు, ప్రభుత్వ భూములను కాజేసి ఆ భూములను ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. ప్రభుత్వ పెద్దలకు మంచి రేటు వచ్చే ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయించి, రైతులను వెనక్కు నెట్టేసి తీవ్ర నష్టం చేశారు. 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు గుంటూరు జిల్లాలోని రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2,279.91 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 1,790 ఎకరాలు కొనుగోలు చేశారు. మొత్తం 4,069.91 ఎకరాలు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా లబ్ధి పొందారు. చంద్రబాబు నాయుడు కుటుంబీకులు తాడికొండ మండలం కంతేరు గ్రామంలో 14.22 ఎకరాల భూమిని హెరిటేజ్ ఫుడ్స్ కోసం కొనుగోలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే ఈ కొనుగోలు జరగడం ఇన్సైడర్ ట్రేడింగ్‌కు అద్దం పట్టింది. జోన్ల అలైన్‌మెంట్లలోనూ మాయ రాజధానిలో జరిగిన భూ కుంభకోణంలో మరో కోణం ఇష్టాను సారంగా సరిహద్దులు నిర్ణయించడం. జోన్ల అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చడం. అప్పటి అధికార పార్టీ నాయకులు, వారి బంధువులు, అనుయాయుల భూములేవీ ల్యాండ్ పూలింగ్ జోన్లోకి రాకుండా చేయడానికి ఉద్దేశపూర్వకంగా సరిహద్దులను మార్చారు. 2015 జూన్‌లో రాజధాని పరిధిని 217 చదరపు కిలోమీటర్లుగా ప్రకటించారు. ఆ తర్వాత సింగపూర్‌కు చెందిన సుర్బానాజురాంగ్‌కు డ్రాఫ్ట్ ప్లాన్ బాధ్యతలను ప్రభుత్వం అందించింది. సుర్బానాజురాంగ్ ప్రభుత్వానికి రాజధాని ప్లాన్ అందించింది. ఈ ప్లాన్ ప్రకారం 391.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని డ్రాఫ్ట్ ప్లాన్‌ను రూపొందించింది. అయితే దీన్ని అప్పటి ప్రభుత్వం పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా కేవలం 217 చదరపు కిలోమీటర్లకు పరిమితి చేస్తూ ఫిబ్రవరి 2016లో నోటిఫికేషన్ జారీ చేసి, ఆ మేరకు ల్యాండ్ పూలింగ్ చేపట్టింది. జురాంగ్ కంపెనీ ఇచ్చిన డ్రాఫ్ట్ ప్లాన్‌కు భిన్నంగా రాజధాని నగరాన్ని కుదించడం వెనుక తమకు రాజకీయంగా అనుకూలమైన వ్యక్తులను పూలింగ్ నుంచి మినహాయించి, వాటి విలువ పెరిగేలా చేసి వారికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం వెల్లడవుతోంది. - మంగళగిరి సమీపంలోని కాజా టోల్గేట్ సమీపంలో ఉన్న రామకృష్ణా హౌసింగ్‌ను సీఆర్డీయే జోన్ పరిధిలోకి రాకుండా తప్పించి ఆ కంపెనీకి ప్రయోజనం చేకూర్చారు. - నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు కంపెనీ వీబీసీ ఫెర్టిలైజర్స్‌కు చందర్లపేటలో కేటాయించిన 498.3 ఎకరాల విషయంలో వారికి అత్యంత అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ కంపెనీకి భూములు కేటాయించిన తర్వాత సీఆర్డీయే ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి విస్తరించారు. త ద్వారా ఆ భూములకు మంచి రేటు వచ్చేలా చేశారు. - రాజధాని నగరం చుట్టూ నిర్మించ దలచిన ఇన్నర్ రింగురోడ్డు, దాన్ని అనుసంధానిస్తూ నిర్మించ దలచిన రోడ్ల విషయంలో కూడా అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ పేరుమీద కొనుగోలుచేసిన భూములు ఇన్నర్ రింగ్‌రోడ్డుకు పక్కనే ఉన్నాయి. మురళీ మోహన్ కుంచనపల్లె సమీపంలో కొనుగోలు చేసిన 53.29 ఎకరాలకు ఆనుకుని ఇన్నర్ రింగు రోడ్డు వచ్చేలా చేశారు. అసైన్డ్ చట్టానికి తూట్లు.. రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన వారికి 900 ప్లాట్లు కేటాయించారు. తద్వారా పీఓటీ చట్టాన్ని తుంగలో తొక్కారు. రాజధానికి భూములు తీసేసుకుంటారని ఎస్సీ, ఎస్టీలను భయపెట్టి.. టీడీపీ నేతలు కారుచౌకగా వారి భూములను కొన్నారు. మంగళగిరి సబ్ రిజిస్టార్ వాటిని రిజిస్టర్ చేయకుండా పక్కన పెడితే.. జీఓ ఎంఎస్ నెంబర్ 258, 580, 575 జారీ చేసి, భూములు కొనుగోలు చేసిన వారిని శివాయి జమేదార్లుగా పరిగణించి వారి నుంచి ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకున్నారు. లేని లంక భూములు కూడా ఉన్నట్లు సృష్టించి ప్లాట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీల నుంచి కొల్లి శివరాం 47.39 ఎకరాల అసైన్డ్ భూమి కొన్నారు. ఇతను లోకేశ్‌కు బినామీ అని బయట ఎవరిని అడిగినా చెబుతారు. గుమ్మడి సురేష్ 42.92 ఎకరాలు, బరసు శ్రీనివాసరావు (నారా లోకేష్ మనుషులు) 14.07 ఎకరాల అసైన్డ్ భూమి తక్కువ ధరకు కొన్నారు. మొత్తంగా 338.887 ఎకరాల అసైన్డ్ భూములను తక్కువ ధరకే కొనుగోలు చేసి ప్రతిఫలంగా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు పొంది ఆర్థికంగా లబ్ధి పొందారు. లింగమనేనికి భారీగా లబ్ధి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యాపార వేత్త లింగమనేని రమేష్ తన భార్య సుమన.. ఇతరులు ప్రశాంతి, స్వర్ణకుమారి, ఎల్.వి.రమేష్, ఎల్వీఎస్ రాజశేఖర్ పేర్లమీదే కాకుండా తన సంస్థలు లింగమనేని ఎస్టేట్స్, ఐజెఎం, లింగమనేని ఎడ్యుకేషనల్ అకడమిక్ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, కుముదల ఎస్టేట్స్, లింగమనేని ఆగ్రో ప్రై వేట్ లిమిటెడ్, లౌక్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, స్వర్ణిక ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, వల్లభ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, విఘ్నేష్ వెంచర్స్, వైట్‌సిటీ ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లమీద పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. విచిత్రంగా ఈ భూములేవీ రాజధాని నగరం పరిధిలోకిగానీ, సీఆర్డీయే పరిధిలోకి రాలేదు. లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూములకు కేవలం పది మీటర్ల దూరంలో రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోయింది. ఇందుకు ప్రతిఫలంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. లింగమనేనికి చెందిన గెస్ట్‌హౌస్‌ను తన నివాసంగా మార్చుకున్నారు. 158 ఎకరాలకు సంబంధించి ఇలాంటి అక్రమాలు జరిగాయని ఇప్పటి వరకు రికార్డులు లభించాయి. ప్లాట్ల కేటాయింపులో కూడా భారీగా అక్రమాలు జరిగాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న వారు, పైస్థానంలో ఉన్న వారు తమకు అనుకూలమైన ప్రాంతంలో ప్లాట్లను పొందగా, వీరి స్థానంలో ప్లాట్లు దక్కాల్సిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. -
రాజధాని భూ దందాపై రంగంలోకి ఈడీ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం పాల్పడిన ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ కుంభకోణంపై దర్యాప్తునకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమైంది. 797 మంది తెల్ల రేషన్ కార్డుదారుల పేర్లతో పలువురు టీడీపీ నేతలు 761.34 ఎకరాల భూములను కొనుగోలు చేయడంపై ఏపీ సీఐడీ అధికారులతో ఈడీ అధికారులు శుక్రవారం చర్చించారు. సీఐడీ దర్యాప్తులో వెల్లడైన అంశాలపై నివేదికతోపాటు బినామీల వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. వీటిని పరిశీలించిన అనంతరం ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. తొలుత తెల్ల రేషన్‌కార్డుదారులకు నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. అనంతరం బడా బాబులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. మాజీ మంత్రులపై ఇప్పటికే కేసులు రాజధానిపై అధికారిక ప్రకటన వెలువడక ముందే అంటే 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య చంద్రబాబు బృందం ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి బినామీ పేర్లతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. ఏడాదికి రూ.60 వేలలోపు ఆదాయం మాత్రమే ఉండే తెల్లరేషన్ కార్డుదారులు కోట్లాది రూపాయల విలువైన భూములు కొనుగోలు చేయడంపై సీఐడీ లోతుగా దర్యాప్తు చేసింది. వీరి వెనుక చంద్రబాబు బృందం ఉన్నట్లు ఆధారాలను సేకరించింది. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా బినామీ పేర్లతో భూములు కొన్న మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, చంద్రబాబుకు సన్నిహితుడైన బెల్లకొండ నరసింహారావుపై ఐపీసీ సెక్షన్ 320, 506, 120 బీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు సమాంతరంగా విచారణ చేయాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. విచారణకు రెండు బృందాలు! తొలిదశలో తెల్లరేషన్ కార్డుదారుల పేర్లతో కొనుగోలు చేసిన భూములపై విచారణ చేపట్టి మలిదశలో సీఐడీ దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆదారంగా రాజధాని ప్రాంతంలో జరిగిన భూ కుంభకోణంపై లోతుగా విచారణ చేసేందుకు ఈడీ సిద్ధమైంది. దీనిపై విచారణకు హైదరాబాద్, చెన్నై కార్యాలయాల్లో పనిచేసే అధికారులతో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భూముల కొనుగోళ్లపై సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వివరాలను సేకరించనుంది. ఆదాయపు పన్ను చెల్లించకుండా భూములు కొన్నవారిపై మనీల్యాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేసి విచారించాలని నిర్ణయించింది. ఈడీకి వివరాలు ఇచ్చాం ఈడీ అధికారుల సూచన మేరకు అమరావతిలో 761.34 ఎకరాల భూములు కొన్న 797 మంది తెల్లరేషన్‌కార్డుదారుల వివరాలు అందచేశాం. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలపై ఈడీకి ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తాం. – సునీల్‌కుమార్, సీఐడీ అదనపు డీజీ -
రాకేష్ ఝంఝన్‌వాలాకు సెబీ నోటీసులు
ముంబై : ఆప్టెక్ లిమిటెడ్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝంఝన్‌వాలాకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నోటీసులు జారీ చేసింది. రాకేష్‌కు చెందిన ఆప్టెక్ లిమిటెడ్ షేర్లకు సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్‌లో షేర్‌హోల్డర్లుగా ఉన్న రమేష్ ఎస్ దమానీ, డైరెక్టర్ మధు జయకుమార్ సహా ఇతర కుటుంబ సభ్యుల పాత్రపైనా సెబీ ఆరా తీస్తోంది. దర్యాప్తుకు సహకరించాలని నోటీసుల్లో సెబీ పేర్కొంది. కాగా ఇన్సైడర్ ట్రేడింగ్ ఎప్పుడు జరిగింది..దీనికి సంబంధించి లభించిన ఆధారాలు ఏమిటనేది ఇంకా వెల్లడికాలేదు. ఈ ఆరోపణలపై ఝంఝన్‌వాలా ఆయన భార్య రేఖ, సోదరుడు రాజేష్ కుమార్, అత్త సుశీలాదేవి గుప్తాలను తమ ఎదుట హాజరు కావాలని సెబీ కోరింది. కాగా సెబీ దర్యాప్తు అధికారి ఎదుట హాజరైన రాకేష్‌ను ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో దాదాపు రెండు గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. కుటుంబ సభ్యుల తరపున తాను హాజరైనట్టు రాకేష్ ఝంఝన్‌వాలా తెలిపారు. షేర్‌మార్కెట్ ఆనవాళ్లను ఔపోసన పట్టిన రాకేష్ ఝంఝన్‌వాలను భారత వారెన్ బఫెట్‌గా అభివర్ణిస్తారు. రేర్ ఎంటర్ప్రైజెస్ అధినేత రాకేష్ ఝంఝన్‌వాలా అత్యంత సంపన్న ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్‌గా ప్రాచుర్యం పొందారు. -
టీడీపీలో ఇన్సైడర్ ట్రేడింగ్ వణుకు
-
ప్రత్తిపాటి, నారాయణలపై కేసులు
సాక్షి, అమరావతి/మంగళగిరి: రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ అధికారులు టీడీపీకి చెందిన మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణలతో పాటు తాడికొండ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బెల్లంకొండ నరసింహారావులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పుల్లారావు, నారాయణ, నరసింహారావులపై ఐపీసీ సెక్షన్ 320, 506, 120/బిలతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి గురువారం మంగళగిరిలో మీడియాకు వివరాలు వెల్లడించారు. (చదవండి: అమరావతిని చుట్టేశారు) 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు.. 761 ఎకరాల కొనుగోలు రాజధాని రాకముందే రంగంలోకి దిగిన బెల్లంకొండ నరసింహారావు అసైన్డ్ భూములకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా లాక్కుంటుందని భయపెట్టాడు. నరసింహారావు తన పేరిట ఉన్న 99 సెంట్ల అసైన్డ్ భూమిని బలవంతంగా రాయించుకుని భూ సమీకరణ కింద పరిహారం కూడా పొందినట్లు వెంకటపాలెం గ్రామానికి చెందిన దళిత మహిళ పోతురాజు బుజ్జి సీఐడీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టగా ఇన్సైడర్ ట్రేడింగ్ వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో పాత్ర ఉందని ఆధారాలు ఉండటంతో ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణపై సీఐడీ కేసు నమోదు చేసింది. 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు రాజధానిలో 761 ఎకరాలు కొనుగోలు చేసినట్టు సీఐడీ విచారణలో నిర్ధారణ అయింది. వీటి రిజిస్ట్రేషన్ విలువ రూ.38,56,84,000 ఉంటుందని తేలింది. (చదవండి: తెల్లబోయే దోపిడీ) తెల్ల రేషన్‌కార్డుదారుల పేరుతో బినామీలు కొన్న భూములు ►అమరావతి మండలంలో 131 మంది తెల్ల రేషన్ కార్డుదారులు 129 ఎకరాలు కొన్నారు. ►పెదకాకాని మండలంలో 43 మంది 40 ఎకరాలు కొన్నారు. ►తాడికొండలో 188 మంది 190 ఎకరాలు కొన్నారు. ►తుళ్లూరులో 238 మంది 242 ఎకరాలు కొనుగోలు చేశారు. ►మంగళగిరిలో 148 మంది 134 ఎకరాలు కొన్నారు. ►తాడేపల్లి మండలంలో 49 మంది తెల్ల రేషన్‌కార్డు దారులు 24 ఎకరాలు కొనుగోలు చేశారు. ►797 తెల్ల రేషన్ కార్డుదారుల్లో 268 మందికి పాన్ కార్డు ఉంది. ►761 ఎకరాల రిజిస్ట్రేషన్ విలువ రూ 38.50 కోట్లు కాగా మార్కెట్ విలువ రూ.220 కోట్లకుపైగా ఉంటుంది. నాలుగు బృందాలతో విచారణ.. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు వెలికి తీసేందుకు సీఐడీ అధికారులతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందం అసైన్ట్ భూములపై విచారిస్తుండగా మరో బృందం తెల్ల రేషన్ కార్డులపై దర్యాప్తు జరుపుతోంది. రాజధాని ప్రకటనకు ముందు భూములు కొన్నవారికి సంబంధించి మరో బృందం వివరాలు సేకరిస్తుండగా నాలుగో బృందం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై అందిన ఫిర్యాదులను విచారిస్తోంది. (చదవండి: ఆ ఎమ్మెల్యేలు దున్నేశారు..!) (చదవండి: రాజధానిలో అక్రమాలకు ఆధారాలివిగో..) -
మాజీ మంత్రులపై ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు
సాక్షి, అమరావతి: ఏపీ రాజధాని భూముల కొనుగోళ్లలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, పత్తిపాటి పుల్లారావు సహా స్థానిక టీడీపీ నేత, వెంకటాయపాలెం మాజీ సర్పంచ్ బెల్లంకొండ నరసింహాపై కేసులు నమోదు చేసినట్లు సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఈ సందర్బంగా ఆమె గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వెంకటాయపాలెంకు చెందిన పోతురాజు బుజ్జి అనే దళిత మహిళను మభ్యపెట్టి తన 99సెంట్ల భూమిని కొనుగోలు చేశారని సదరు మహిళా ఫిర్యాదు చేయడంతో వారిపై సెక్షన్ 420, 506,120(బి) కేసులను నమోదు చేసి విచారణ చేపట్టామని పేర్కొన్నారు. (చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ) విచారణలో ఆసక్తికర విషయాలు: మాజీ మంత్రులపై ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంతో 797 మంది తెల్ల రేషన్ కార్డుదారులు రూ. 3 కోట్ల చొప్పున భూములు కొనుగొలు చేసినట్లుగా సీఐడీ అధికారులు గుర్తించారు. మొత్తం రూ. 220 కోట్ల విలువైన భూములను తెల్ల రేషన్ కార్డు కలిగినవారు కొనుగొలు చేసినట్లు గుర్తిచామని మేరీ ప్రశాంతి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ రేషన్ కార్డుదారుల వివరాలపై ఆరా తీస్తున్నామన్నారు. (చదవండి: అమరావతిని చుట్టేశారు) అమరావతిలో 129 ఎకరాల భూమిని 131 మంది, పెద్దకాకానిలో 40 ఎకరాల భూమి 43 మంది, తాడికొండలో120 ఎకరాలను 188 మంది తెల్ల రేషన్ కార్డుదారుల పేరుపై రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. కాగా తుళ్లూరులో 133 ఎకరాల భూమిని 148 మంది తెల్ల కార్డుదారులు కొనుగొలు చేయగా, మంగళగిరిలో 133 ఎకరాలను 148 మంది కొన్నారని, తాడేపల్లిలో 24 ఎకరాల భూమిని, 49 మంది కొనుగొనులు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కాగా ఈ కేసులో విచారణను మరింత వేగవంతం చేశామని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. (చదవండి: తెల్లబోయే దోపిడీ) -
ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి భూముల కొనుగోళ్లలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ భూ కుంభకోణంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ప్రాథమి కంగా 4,070 ఎకరాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిర్ధారించి దీనిపై మరింత సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసర ముందని సూచించిందని తెలిపారు. రాజధాని ప్రకటన వెలువడకముందే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అమరావతిలో రాజధాని వస్తుందని తెలు సుకుని భారీగా భూములు కొనుగోలు చేశారని చెప్పారు. దీనిపై రెండు రోజుల క్రితం సభలో సమగ్ర చర్చ జరిగిందని, ఈ వ్యవహారంపై విచారణ జరిపించమని స్పీకర్ కూడా ఆదేశాలిచ్చారని, ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్‌పై తగిన ఏజెన్సీతో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. భూములను దోచిపెట్టారు.. తీర్మానంపై చర్చలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 4,070 ఎకరాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ ఎలా జరిగిందో అన్ని ఆధారాలతో సభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరిం చారని, ఈ నేపథ్యంలో దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. కంచే చేను మేసేలా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహరించారని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. కావాల్సిన వాళ్లకు భూములను చంద్రబాబు దోచిపెట్టారన్నారు. రాజధాని గురించి ముందే తెలుసుకుని ఈ ప్రాంతంలో తక్కువ ధరలకు భూములు కొని.. తర్వాత ఎక్కువ రేటుకు అమ్ముకుందామని చూశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దోచుకోవాలనే చూస్తారని మండిపడ్డారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజధాని నూజివీడులో రానుందని, మరో ప్రాంతమని చెబుతూ తొలుత లీకులిచ్చారని, అయితే చంద్రబాబు, ఆయన అనుచరులు మాత్రం అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని తెలిపారు. చంద్రబాబుకు కొట్టే బుద్ధి ఉంటే.. జగన్‌కు పెట్టే బుద్ధి ఉంటుందని వ్యాఖ్యానించారు. బాబు దోచుకునే, దాచుకునే విధానానికి అలవాటు పడ్డారన్నారు. సీబీఐతో విచారణ జరిపించి ఈ దొంగలందర్నీ లోపల వెయ్యాలన్నారు. భూసమీకరణను విధ్వంసం సృష్టించేలా చేశారు ఇన్సైడర్ ట్రేడింగ్ అంశంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీలో తానూ సభ్యుడినని, ప్రాథమికంగా 4,070 ఎకరాల మేరకు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు గుర్తించామని మంత్రి కన్నబాబు తెలిపారు. దీన్ని సమర్థిస్తూ టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ భూములు కొంటే తప్పేముందనడం దారుణమన్నారు. బినామీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కేశవ్ అడిగారని, ఆయన వినతి మేరకు ఆ చట్టం కింద కూడా చర్యలు చేపట్టాలని కోరారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిపిన వారిపై అసైన్డ్ ల్యాండ్ 1977 యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలన్నారు. అసైన్డ్ భూములు కొనడమే తప్పంటుంటే వాటిని లీకువీరుడు చంద్రబాబు తనకు, తన బినామీలకు కట్టబెట్టారని మండిపడ్డారు. రాజధాని భూసమీకరణను విధ్వంసం సృష్టించే విధంగా చేశారన్నారు. అనంతరం తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. -
ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఓకే
సాక్షి, ఏపీ అసెంబ్లీ : అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర దర్యాప్తుకు బుధవారం శాసనసభ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని హోం మంత్రి మేకతోటి సుచరిత సభలో చదివి వినిపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 4,070 ఎకరాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ ఎలా జరిగిందో అన్ని రకాల ఆధారాలతో సభలో చర్చించిన విషయాన్ని గుర్తుచేశారు. స్పీకర్ కూడా విచారణ జరిపించమని ఆదేశించారని చెప్పారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కంచె చేను మేసే విధంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహరించారని విమర్శించారు. కావాల్సిన వాళ్లకు చంద్రబాబు భూములు దోచిపెట్టారని తెలిపారు. రాజధాని ప్రకటన గురించి ముందే తెలుసుకుని.. అక్కడ తక్కువ ధరలకు భూములకు కొనుగోలు చేసి.. తర్వాత ఎక్కువ రేటుకు అమ్ముకుందామని చూశారని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన దోచుకోవాలనే చూస్తారని మండిపడ్డారు. ఇంతకన్నా ఘోరం ఎక్కడా కనపడదని చెప్పారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతం నూజివీడు అని కొందరు.. మరో ప్రాంతమని మరికొందరు లీకులు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు, ఆయన అనుచరులు మాత్రం అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని తెలిపారు. ఒక సీఎంకు కొట్టే బుద్ధి ఉంటే.. మరొక సీఎంకు పెట్టే బుద్ధి ఉంటుందని వ్యాఖ్యానించారు. బాబు దోచుకునే, దాచుకునే విధానానికి అలవాటు పడ్డారని మండిపడ్డారు. ఇన్సైడర్ ట్రేడింగ్ విచారణ జరిపాలని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. రాజధాని భూ సేకరణను విధ్వంసం సృష్టించే విధంగా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఒక లీకు వీరుడు అని విమర్శించారు. సొంత మనుషులకు మేలు చేసేలా నిబంధనలు తుంగలో తొక్కారని అన్నారు. అనంతరం ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. చదవండి: 'తండ్రి జపాన్,సింగపూర్.. కొడుకేమో అమెరికా అంటున్నాడు' -
భూకుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించండి
సాక్షి, అమరావతి: అమరావతి ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూకుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గుతేల్చాలని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సీఎం వైఎస్ జగన్‌కి సూచించారు. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమవారం మాట్లాడుతూ.. 2014లో రాజధాని ప్రాంత ప్రకటనకు ముందు అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు కొనుగోలు చేసిన భూముల వివరాలు వెల్లడించారు. చంద్రబాబు, ఆయన బినామీలు.. అప్పటి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి సాగించిన అవినీతిని ఆధారాలతో సహా వివరించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందిస్తూ.. ప్రభుత్వం శాసనసభలో చేసిన ప్రకటనను ఓ పబ్లిక్ డాక్యుమెంట్‌గా పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో అసలు ఏం జరిగిందో సవివరంగా తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని చెప్పారు. అందువల్ల అమరావతి ప్రాంతంలో జరిగిన భూ లావాదేవీలు, కుంభకోణాలపై సమగ్రంగా విచారించి వాస్తవాలను వెలికితీసి ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను స్పీకర్ సీతారాం సూచించారు. శాసనసభకు ఆ అధికారం ఉంది: ముఖ్యమంత్రి జగన్ స్పీకర్ ఆదేశాల మేరకు అమరావతి భూముల వ్యవహారాలపై తప్పకుండా విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభలో వెల్లడించారు. స్పీకర్ సూచనపై ఆయన స్పందిస్తూ ‘మీ దగ్గర నుంచి వచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తాం. దేనిమీద అయినా విచారణ జరిపించమని ఆదేశించే అధికారం శాసనసభకు ఉంది. స్పీకర్ అంటే క్వాసీ జ్యూడీషియల్ అథారిటీ. మీకు జడ్జి హోదా ఉంది. మీ ఆదేశాల మేరకు తప్పకుండా విచారణ జరిపిస్తాం’అని పేర్కొన్నారు. -
మూడు రాజధానులకే ప్రజల మొగ్గు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులకే ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చెప్పారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి వలసలు ఆగాలంటే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోన్రెడ్డి బిల్లు తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. అమరావతిలో జరిగిన అవినీతిని బట్టబయలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరాన్ని రూ.4 కోట్లకు అమ్మిన చంద్రబాబు ప్రభుత్వం తమ సొంత మనుషులకైతే కేవలం రూ.50 లక్షలకే కట్టబెట్టడాన్ని తప్పుబట్టారు. వికేంద్రీకరణపై రెఫరెండం నిర్వహించాలి: అనగాని పరిపాలనా వికేంద్రీకరణపై రెఫరెండం జరపాలని టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ కోరారు. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో రూ.40వేల కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని.. వికేంద్రీకరణ పేరిట రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని సూచించారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో చనిపోయిన రైతులకు సభ నివాళులు అర్పించాలన్నారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరిపించాలే తప్ప తరలించవద్దని కోరారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ నిర్వహించాలని సూచించారు. ఆ భవనాల్లో 65 వాళ్లవే: మంత్రి బుగ్గన ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన జోక్యం చేసుకుంటూ అమరావతిని సంపద సృష్టించే కేంద్రంగా టీడీపీ నేతలు మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతంలో అద్దెకు తీసుకున్న 120 భవనాలు ఎవరికి చెందినవో తెలుసుకునేందుకు.. 80 భవనాలపై సర్వే జరిపితే ఆశ్చర్యపరిచే వాస్తవాలు బయటపడ్డాయన్నారు. ఆ 80లో 65 భవనాలు టీడీపీ వాళ్లవేనని వివరించారు. -
రైతు వ్యవస్థ ఛిన్నాభిన్నం
సాక్షి, అమరావతి: అధికార వికేంద్రీకరణను మనస్ఫూర్తిగా సమర్ధిస్తున్నానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలో రైతు వ్యవస్థను చంద్రబాబు చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన చంద్రబాబు విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో ఆళ్ల మాట్లాడుతూ.. ‘అమరావతిలో రాజధాని వస్తుందని తెలిసి మొదట్లో సంతోషించినా ఆ తర్వాత అందులోని కుట్ర విషయం తెలిసి మోసపోయినట్టు గుర్తించాం. విభజన చట్టం ప్రకారం రాజధాని స్థలం ఎంపిక నుంచి నిర్మాణం వరకు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని తెలిసినా తన స్వార్థం కోసం చంద్రబాబు హైదరాబాద్ నుంచి తరలివచ్చారు. ఆ రోజు శివరామకృష్ణన్ కమిటీ 13 జిల్లాలు పర్యటించి అభిప్రాయాలు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. రాజధానికి 30 వేల ఎకరాలు కావాలంటే.. అది ప్రభుత్వ భూమి అయితేనే తమకు సమ్మతి అని అప్పట్లో వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అయితే ఆయన చెప్పిన విషయాన్ని వక్రీకరిస్తున్నారు. చంద్రబాబు అనుకూల మీడియాతో అవాస్తవాలు చెప్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల భూముల్ని బలవంతంగా లాక్కున్నారు రాజధాని ముసుగులో చంద్రబాబు చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రజలకు తెలిసిపోయింది. రాజధాని ప్రాంతంలో ప్రజలకు చంద్రబాబు కంటిమీద కునుకు లేకుండా చేశారు. కౌలురైతుల వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ ప్రాంతంలో మూడు నుంచి ఐదు పంటలు పండుతాయి. ఈ భూముల్ని నాశనం చేయవద్దని గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును పట్టించుకోలేదు. రాజధాని అంటే అందరిది కావాలి.. కొందరిది కాకూడదు. చంద్రబాబు వల్ల ఈ ప్రాంతంలో రైతులు, కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరూ నష్టపోయారు. వారి భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. చంద్రబాబు దళిత ద్రోహి. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా? అని అన్నారు. 15 ఏళ్లకు కౌలు పెంచడం హర్షణీయం అందరి అనుమతితోనే పరిపాలన వికేంద్రీకరణకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆలోచనలో నేను కూడా పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నా. రాజధాని ప్రాంతంలో రైతులకు పదేళ్ల నుంచి 15 ఏళ్లకు కౌలు పెంచడం హర్షణీయం. అమరావతిని అగ్రికల్చర్ జోన్‌గా ప్రకటించి.. రైతులు సాగు చేసుకుంటామంటే వారి భూముల్ని వారికి తిరిగి ఇవ్వాలి. ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని రద్దు చేయాలి. -
రాజధాని పేరుతో.. అంతర్జాతీయ స్థాయి కుంభకోణం
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆధారాలు, పేర్లతో సహా అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. అమరావతిని భ్రమరావతిగా మార్చి రియల్ ఎస్టేట్ రాజధానిగా మార్చారని దుయ్యబట్టారు. గుంటూరు, నూజివీడు అంటూ మొదట్లో రాజధానిపై లీకులు ఇచ్చి.. ప్రజలు అక్కడ భూములు కొనుగోలు చేసి నష్టపోయేలా చేసిన చంద్రబాబు అండ్ కో మాత్రం ఎక్కడ రాజధాని వస్తుందో అక్కడే కారుచౌకగా భూములు కొనుగోలు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ రహస్యాలను ఎవరికీ చెప్పబోనంటూ చేసిన ప్రమాణాన్ని (అధికార రహస్యాల చట్టాన్ని) చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు. రాష్ట్ర విభజన తేదీ 2014 జూన్ నుంచి రాజధాని ప్రకటన తేదీ 2014 డిసెంబరు నెలాఖరు వరకూ ఆరు నెలల కాలంలో ఇలా ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు, ఆయన అనుచరులు సొంత పేర్లు, బినామీ పేర్లతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,070 ఎకరాల భూమిని కారుచౌకగా కొనుగోలు చేశారని మంత్రి వివరించారు. చంద్రబాబు చెప్పినట్లుగా ఎకరా రూ.10 కోట్ల ప్రకారం లెక్కిస్తే 4,070 ఎకరాల విలువ రూ.40,700 కోట్లని, ఇది ఇప్పటి వరకూ తేలిన లెక్కని, విచారణలో ఇంకా ఎంత బయటకు వస్తుందో భవిష్యత్తులో తేలుతుందన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో 14.2 ఎకరాలను చంద్రబాబు నాయుడు తన సొంత సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ పేరుతో కొనుగోలు చేశారని కూడా సభ దృష్టికి తీసుకువచ్చారు. అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ వివరాలను కూడా ఆయన సభలో వెల్లడించారు. అక్కడ నుంచి ఇక్కడకు వచ్చి.. ఎక్కడో కర్ణాటక సరిహద్దులోని అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్‌లు ఇక్కడ విజయవాడకు 20–30 కిలోమీటర్ల దూరంలోని మందడం, ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం గ్రామాలకు వచ్చి ఎందుకు భూములు కొంటారు. ఇక్కడ రాజధాని వస్తుందని పక్కాగా తెలిసినందునే వారు రాజధాని ప్రకటనకు ముందే ఇక్కడ భూములు కొన్నారు. దీనిని బట్టే ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తేటతెల్లమవుతోంది. ఇంతకంటే ఏమి ఆధారాలు కావాలి. బినామీ పేర్లతో కొనుగోళ్లు.. - టీడీపీ నేతలు సొంతంగానూ, బంధువుల పేర్లతోనే కాకుండా బినామీల పేర్లతో కూడా రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారు. ఇలా భూములు కొనుగోలు చేసిన వారిలో అప్పటి మంత్రి నారాయణ ప్రధానంగా కనిపిస్తున్నారు. ఆయనకు ఆవుల మునిశంకర్, రాపూరి సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తవు వర్మకుమార్ బినామీలు. - వేమూరి రవికుమార్, నారా లోకేశ్‌కు చెందిన బినామీలు వందల ఎకరాల భూములు కొన్నారు. మురళీమోహన్, యార్లగడ్డ రవికిరణ్, యార్లగడ్డ గీతాంజలి, యార్లగడ్డ నిఖిల్ ఆదిత్య, జయభేరి ప్రాపర్టీస్ పేర్లతో భూములు కొనుగోలు చేశారు. బుచ్చయ్య చౌదరి గోరంట్ల ఝాన్సీలక్ష్మీ పేరు మీద కొనుగోలు చేశారు. సరిహద్దులు మార్చి.. చంద్రబాబు అండ్ కో ఇన్సైడర్ ట్రేడింగ్‌తో సరిపెట్టుకోలేదు. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూములనూ వదల్లేదు. సీఆర్డీఏ సరిహద్దులు మార్చారు. కోర్ రాజధానిని జూలై 2015లో 395 చ.కి.మీలకు ప్లాన్ చేశారు. కానీ, 2016లో దానిని 217 చ.కి.మీ.కు తగ్గించారు. దీని వెనక.. తమ భూమిని ల్యాండ్‌పూలింగ్‌కు ఇవ్వకుండా మొత్తం భూమిని ఉంచుకుని అధిక విలువ పొందడమే లక్ష్యం. రింగ్ రోడ్డును కూడా వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు. లేని భూములు ఇచ్చి.. అనంతవరంలో వీరి బాగోతం ఇంకో రూపంలో సాగింది. లేని ప్రభుత్వ భూమి, పొరంబోకు భూములిచ్చి ప్లాట్లు తీసుకున్నారు. ఐనవోలులో 2.98 ఎకరాలు, బోరుపాలెం, కేఆర్ పాలెంలో 6.47 ఎకరాలు లేని భూమిని ఇచ్చినట్లుగా చూపి ప్లాట్లు తీసుకున్నారు. లింగాయపాలెంలో మొత్తం 158 ఎకరాల ప్రభుత్వ భూమి.. నేలపాడు, పిచ్చుకలపాలెంలో 9 ఎకరాలు, శాఖమూరులో 3 ఎకరాలు, వెలగపూడి 3 ఎకరాలు తీసుకున్నారు. చట్ట విరుద్ధంగా అసైన్డు భూములను కైవసం చేసుకున్నారు. శివాయ్ జమీందార్ పేరుతో జీఓలు ఇచ్చి దాదాపు 289 ఎకరాలను బదలాయించుకున్నారు. చెరువుల భూములూ ఇలాగే చేశారు. 28వేల మంది రైతులు 34 వేల ఎకరాలను రాజధాని కోసం ఇస్తే అందులో 14వేల మంది రైతులు ఇప్పటికే భూములు అమ్ముకున్నారు. ప్లాట్లు ఇస్తే.. 8వేల లావాదేవీలు జరిగాయి. దీనిని రాజధాని నిర్మాణం అంటారా.. లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటారా? టీడీపీ వారే చెప్పాలి’’.. అని బుగ్గన ప్రశ్నించారు. - పయ్యావుల విక్రమసింహ (పయ్యావుల కేశవ్ కొడుకు), ధూళిపాళ్ల వీరవైష్ణవి (ధూళిపాళ్ల నరేంద్ర కూతురు).. - కంభంపాటి స్వాతి (కంభంపాటి రామ్మోహన్రావు కుటుంబీకురాలు) నంబూరులో, పుట్టా మహేష్ యాదవ్ (మంత్రి యనమల వియ్యంకుడి తనయుడు) - దమ్మాలపాటి శ్రీధర్ పిచ్చుకలపాలెం, నేలపాడులో, పల్లె రఘునాథరెడ్డి ఉద్దండరాయపాలెం, మందడంలో.. - దివంగత కోడెల శివప్రసాద్ శశిఇన్‌ఫ్రా పేరున 17 ఎకరాలు.. - మాజీమంత్రి పరిటాల సునీత పీఆర్ ఇన్ఫ్రా పేరుతో కొనుగోలు చేశారు. - పీఆర్ ఇన్ఫ్రాలో పరిటాల సునీత కొడుకు, అల్లుడు డైరెక్టర్లుగా ఉన్నారు. ఇష్టారాజ్యంగా భూ కేటాయింపులు అప్పటి పాలకులు రాజధాని అమరావతిని సొంత రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చుకున్నారనడానికి అడ్డగోలుగా భూ కేటాయింపులూ నిదర్శనాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. అమరావతిలో మాదిరిగా ఓ విధానం, ప్రాతిపదిక లేకుండా దేశంలో మరెక్కడా భూకేటాయింపులు జరగలేదని ఆయన అసెంబ్లీ సాక్షిగా వివరాలతో వెల్లడించారు. ఎవరైనా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు సరసమైన ధరలకు భూకేటాయింపులు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలని చూస్తారని.. కానీ, బాబు సర్కారు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించిందని ఆయన దుయ్యబట్టారు. ‘కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎవరైనా ఎకరా రూ.4 కోట్లకు భూమి కేటాయించి ప్రైవేటు సంస్థలకు రూ.50 లక్షలకే ఇస్తారా?’ అని బుగ్గన సభా సాక్షిగా నిలదీశారు. భూకేటాయింపులపై మంత్రి బుగ్గన అసెంబ్లీలో వివరించిన అంశాలు ఆయన మాటల్లోనే.. 125 సంస్థలకు 1,648 ఎకరాలు రాజధాని ప్రాంతంలో అప్పటి బాబు సర్కారు 125 సంస్థలకు 1,648 ఎకరాలను కేటాయించింది. ఏడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 68 ఎకరాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు 180 ఎకరాలు.. ప్రైవేటు సంస్థలకు 1,366 ఎకరాలు కేటాయించింది. వీటితోపాటు మరికొన్నింటికి కూడా కేటాయించింది. అయితే, ఇందుకు ఒక విధానం పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. నాలుగు ఏపీ ప్రభుత్వ సంస్థలకు ఏడెకరాలు, పబ్లిక్ అండర్ టేకింగ్ సంస్థలకు 87ఎకరాలు కేటాయించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్‌కు ఎకరాకు రూ.కోటి చొప్పన 60 సంవత్సరాలకు లీజుకు ఇచ్చారు. అలాగే, ప్రైవేటు సంస్థలైన విట్ ఏపీకి 200 ఎకరాలు, ఎస్ఆర్ఎంకు 200 ఎకరాలు, అమృతా యూనివర్సిటీకి 200 ఎకరాలు, ఇండో–యూకే యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ 150 ఎకరాలు, మెడిసిటీ హెల్త్ 100 ఎకరాలు, బీఆర్ఎస్ మెడిసిటీ.. ఇలా ప్రైవేటు సంస్థలకు ఎకరాకు రూ.50 లక్షల చొప్పున కట్టబెట్టారు. వరుణ్ హాస్పిటాలిటీకి నాలుగు ఎకరాలు, మహాలక్ష్మి ఇన్ఫ్రా వెంచర్స్‌కు నాలుగు ఎకరాలు రూ.కోటిన్నరతో ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయం చంద్రబాబు లాగా ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదు. శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్లో పట్టుబడటం దేనికి సంకేతం? ప్రతిపక్ష నేత మొదట్లో రాజధాని నిర్మాణానికి రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లు అవసరమవుతుందని చెప్పారు. హడ్కో, వరల్డ్‌బ్యాంకు నుంచి రుణాలు తెస్తామని చంద్రబాబు అన్నారు. మొత్తానికి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. మరోవైపు.. రాయలసీమలో తీవ్రమైన దుర్భిక్షంలో ఉంది. వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో డొక్కల కరువు.. ముష్టికరువు అని పేర్లు కూడా పెట్టారు. గతంలో నెహ్రూ కూడా ఇక్కడకు వచ్చి కన్నీరు కార్చారు. ఈ నేపథ్యంలో భారీ రాజధాని నిర్మాణం కంటే.. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడమే మన ముందున్న కర్తవ్యం. -
అమరావతిని చుట్టేశారు
అదిగదిగో రాజధాని అంటూ ఓ వైపు చూపించి, మరో వైపు ఉన్న భూములను కారు చౌకగా కొట్టేసిన గత పాలకుల బండారం బట్టబయలవుతోంది. అమాయకపు రైతులను నమ్మించి, బెదిరించి బంగారం లాంటి భూములను కాజేసిన వైనం విస్తుగొలుపుతోంది. అధికారం అండ చూసుకుని బంధువులు, అనుచరుల పేరుతో విచ్చలవిడిగా సాగించిన అనైతిక, అక్రమ లావాదేవీల నిగ్గు తేలుతోంది. రాజధాని పేరుతో గత సర్కారు పెద్దలు సాగించిన ఇన్సైడర్ ట్రేడింగ్‌ను చూస్తున్న దర్యాప్తు అధికారులు.. ‘అబ్బబ్బబ్బబ్బా.. నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆప్టర్’ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో గత ఐదేళ్లలో చంద్రబాబు బృందం సాగించిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై చేపట్టిన సీఐడీ దర్యాప్తులో తీగలాగితే డొంక కదులుతోంది. పచ్చ గద్దల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర రాజధాని ఎంపిక కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను బుట్ట దాఖలు చేసి.. అప్పటి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ నేతృత్వంలో వ్యాపారులు, తన బినామీలతో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చంద్రబాబు రాజధానిపై నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కీలక భూమిక పోషించిన మాజీ మంత్రి పి.నారాయణ, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరిలు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తక్కువ ధరకే భూములు కాజేయడంలో నువ్వా–నేనా అన్న రీతిలో పోటీపడినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి పరిటాల సునీత, మరో మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, చంద్రబాబు కోటరీలో కీలక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరామకృష్ణ రైతుల నుంచి తక్కువ ధరలకే భూములు కాజేసి కోట్లకు పడగలెత్తారు. మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం ప్రైవేటు సైన్యంతో రాజధాని ప్రాంతంలో సాగించిన ఆకృత్యాలు, భూ దందాలు, సెటిల్మెంట్లపై సీఐడీ ప్రత్యేకంగా విచారణ చేస్తోంది. కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణ రాజధాని ప్రాంతంలో భూములను కోడె దూడలా దున్నేయడమూ సీఐడీ విచారణలో బహిర్గతమైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగమనేని రమేష్‌తో చంద్రబాబు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ల్యాండ్ పూలింగ్ స్కీం పరిధిని నిర్ణయించడం.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా లింగమనేని సంస్థలు దోచేసిన భూములు.. ఆ సంస్థల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులకు దక్కిన రహస్య వాటాలపై సీఐడీ విచారణను ముమ్మరం చేసింది. బినామీ పేర్లతో నారాయణ దూకుడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంలో కీలక భూమిక పోషించిన మాజీ మంత్రి పి.నారాయణ తన సమీప బంధువులు, విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బంది పేర్లతో రాజధానిపై అధికారిక ప్రకటన వెలువడక ముందే భారీగా భూములు కొనుగోలు చేశారు. తన బంధువు ఆవుల మునిశంకర్ పేరుతో తుళ్లూరు మండలం రాయపూడిలో సర్వే నంబర్ 167/8 లోని 1.18 ఎకరాలను.. ఎకరం రూ.9.44 లక్షల వంతున కొనుగోలు చేసి, అగ్రిమెంట్ చేసుకున్నారు. రాజధానిపై అధికారిక ప్రకటన వెలువడ్డాక 2015 జూలై 23న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నారాయణ.. తన బావమరిది, నారాయణ విద్యా సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాపూరి సాంబశివరావు పేరుతో రాయపూడిలో 3.54 ఎకరాలు, ఆవుల మునిశంకర్ పేరుతో ఏడు ఎకరాలు, బెంగళూరులో తన విద్యా సంస్థల్లో పని చేసే కోతపు వరుణ్‌కుమార్ పేరుతో 0.4 ఎకరాలు.. వెరసి 12.12 ఎకరాలను 15 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సీఐడీ దర్యాప్తుల్లో వెల్లడైంది. మందడంలో ఆవుల మునిశంకర్, రాపూరి సాంబశివరావు, కోతపు వరుణ్కుమార్లతోపాటు.. హైదరాబాద్, బెంగళూరుల్లో నారాయణ విద్యా సంస్థలను పర్యవేక్షించే పోతూరి ప్రమీల పేర్లతో 33.43 ఎకరాలను కొనుగోలు చేశారు. లింగాయపాలెంలో ఆవుల మునిశంకర్, పోతూరి ప్రమీల పేర్లతో 8.89 ఎకరాలను 12 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఉద్దండరాయుని పాలెంలో పోతూరి ప్రమీల పేరుతో 1.43 ఎకరాలను కొన్నారు. మొత్తమ్మీద ఈ 4 గ్రామాల్లో 57.05 ఎకరాలను బినామీ పేర్లతో నారాయణ కొనుగోలు చేసినట్లు సీఐడీ తేల్చింది. కుటుంబ సభ్యులు, షెల్ కంపెనీల పేర్లతో సుజనా భూదందా టీడీపీలో నంబర్ టూగా పేరొందిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అలియాస్ యలమంచిలి సత్యనారాయణ చౌదరి.. జాతీయ బ్యాంకులకు రూ.6 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టిన ఘనుడు. బ్యాంకులకు కన్నం వేసి దోచేసిన సొమ్ముతో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరకే భూములు కాజేశారు. సీఆర్డీఏ పరిధిలోని చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 120 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సర్వే నెంబర్లు 432–1, 403–5, 433, 434, 402–1ఏ, 429, 428, 412, 410–2, 427–2, 413, 415, 416, 431, 437, 399–7, 404–11, 407–4లలో 110.6 ఎకరాల భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందే ఎకరం రూ.ఐదు లక్షల చొప్పున రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. రాజధాని ప్రకటన వెలువడ్డ తర్వాత గుడిమెట్లలో ఎకరం భూమి విలువ రూ.50 లక్షలకుపైగా పలుకుతోంది. ఈ లెక్కన రూ.50 కోట్లకుపైగా సుజనా చౌదరి కొట్టేసినట్లు స్పష్టమవుతోంది. తమను మోసం చేశారని నిలదీసేందుకు యత్నించిన రైతులపై అప్పట్లో ఉక్కుపాదం మోపి, ఆ భూములను 2018లో తన సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సోదరుడు యలమంచిలి జతిన్ కుమార్ పేరుతో ఏర్పాటు చేసిన శివజ్యోతి ఫ్లైకాన్ బ్లాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సర్వే నెంబర్లు 404–1, 404–5, 404–6లో 11.56 ఎకరాలను రాజధాని ప్రకటన వెలువడక ముందే ఎకరం రూ.5 లక్షల చొప్పున కొనుగోలు చేసి 2014లోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కుటుంబ సభ్యులు, షెల్ కంపెనీల పేర్లతో రాజధాని ప్రాంతంలో 623.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిగ్గు తేల్చింది. సీఐడీ విచారణలోనూ ఇదే అంశం వెల్లడైంది. కుమారుడి పేరుతో చినరాజప్ప చేతివాటం మాజీ డిప్యూటీ సీఎం.. హోం శాఖ మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తన కుమారుడు నిమ్మకాయల రంగనాథ్ పేరుతో తుళ్లూరు మండలం నేలపాడులో సర్వే నంబరు 59లో ఒక ఎకరం, తన అనుచరుడు జగతా వెంకట గంగాధర్ పేరుతో ఒక ఎకరం.. ఎకరం రూ.మూడు లక్షల చొప్పున 2014 జూన్ 10న కొనుగోలు చేసినట్లుగా సీఐడీ దర్యాప్తుల్లో వెల్లడైంది. ఆ భూమిని 2014 అక్టోబరు 31న రిజిష్టర్ చేసుకున్నట్లు తేలింది. మిగతా గ్రామాల్లోనూ తన కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లతో భూమి కొనుగోలు చేసినట్లు అంచనాకు వచ్చిన సీఐడీ.. ఆ దిశగా విచారణ చేస్తోంది. చంద్రబాబు–లింగమనేని బంధం బట్టబయలు మంగళగిరి మండలం కాజ, తాడికొండ మండలం కంతేరు గ్రామాల్లో 636.32 ఎకరాల్లో లింగమనేని రమేష్ భూములు కొనుగోలు చేసి 2014కు ముందే అపార్ట్మెంట్లను నిర్మించారు. టీడీపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే రాజధాని ఏర్పాటుపై లింగమనేనితో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 30 మధ్య లింగమనేని రమేష్ తన సంస్థ పేరుతో కాజ, కంతేరు గ్రామాల్లో 168 ఎకరాలకుపైగా భూమిని ఎకరం కనిష్టంగా రూ.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.40 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. కాజా, కంతేరు గ్రామాలకు ఆనుకుని 804.32 ఎకరాలకుపైగా భూమిలో ఎస్టేట్‌ను ఏర్పాటు చేశారు. తుళ్లూరు మండలం రాయపూడిలో లింగమనేని ఎస్టేట్స్ డైరెక్టర్ బొబ్బా శివప్రకాష్ తన డ్రైవర్ బోడెపూడి హరిబాబు పేరుతో రాయపూడిలో సర్వే నంబర్ 369–2లో 0.65 ఎకరాలు, 369–2లో 1.13 ఎకరాలు, 371–2లో 0.65 ఎకరాలు.. మొత్తం 2.43 ఎకరాలను కొనుగోలు చేశారు. ముందస్తు ఒప్పందం మేరకు చంద్రబాబు కుటుంబ సభ్యులకు అందులో రహస్యంగా లింగమనేని వాటా ఇచ్చినట్లు అప్పట్లో టీడీపీ వర్గాలే వెల్లడించాయి. దీనికి ప్రతిఫలంగా రాజధాని ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి లింగమనేని ఎస్టేట్స్ భూములు రాకుండా చంద్రబాబు సహకరించారు. ఈ విషయంపై సీఐడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. సెటిల్మెంట్లతో పరిటాల వీరంగం మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం, అల్లుడు వడ్లమూడి హర్షవర్దన్ డైరెక్టర్లుగా ఉన్న పీఆర్ ఇన్ఫ్రా అవెన్యూస్ పేరుతో అమరావతి మండలం ధరణికోటలో సర్వే నంబర్ 38–1లో ఎకరం భూమిని రూ.3.50 లక్షలకు కొనుగోలు చేసి 2014 ఆగస్టు 27న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పెదకూరపాడు మండలం బలుసుపాడులో సర్వే నంబర్ 371లో ఎకరం రూ.2 లక్షల చొప్పున రెండు ఎకరాల భూమిని ఆ సంస్థ పేరుతో కొనుగోలు చేసి.. 2014 ఆగస్టు 21న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తన భర్త పరిటాల రవి సోదరి కుమార్తె వడ్లమూడి మౌనిక పేరుతో అమరావతి మండలం నెమలికల్లులో 71/1, 71/2బీ సర్వే నంబర్లలో ఒక ఎకరం భూమిని రూ.2 లక్షలకు కొనుగోలు చేసి 2014 నవంబర్ 24న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అమరావతి మండలం ధరణికోటలో అల్లుడు హర్షవర్దన్ పేరుతో 38/1 సర్వే నంబర్లో 1.3 ఎకరాల భూమిని ఎకరం రూ.2.10 లక్షల చొప్పున కొనుగోలు చేసి 2014 ఆగస్టు 21న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పరిటాల రవి సోదరి వడ్లమూడి సుధాశారద పేరుతో తుళ్లూరు మండల కేంద్రంలో సర్వే నంబర్ 193లో ఎకరం భూమిని రూ.4 లక్షలకు కొనుగోలు చేసి.. 2014 అక్టోబర్ 11న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం.. రాజధాని ప్రకటన వెలువడక ముందే రాజధాని ప్రాంతంలో ప్రైవేటు సైన్యాన్ని మోహరింపజేసి.. వివాదాస్పద భూములపై సెటిల్మెంట్లు చేసి బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. కారుచౌకగా 11.60 ఎకరాలు కొట్టేసిన కోడెల మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణ తుళ్లూరు మండలం కొండమరాజుపాలెంలో సర్వే నంబర్ 21–సీలో ఎకరం రూ.1.87 లక్షల చొప్పున 1.66 ఎకరాలను రాజధానిపై ప్రకటన వెలువడక ముందే కొనుగోలు చేసి, 2015 మార్చి 7న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రాజధాని ప్రాంతంలో వివాదాస్పద భూములను గుర్తించి, అధికార బలంతో వాటిని తక్కువ ధరలకే సొంతం చేసుకోవడంలో దూసుకెళ్లారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో సర్వే నంబర్లు 167–1ఏ, 167–1సీ, 168–1, 168–3లో 11.60 ఎకరాల భూమికి సంబంధించి ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం నడుస్తుండటాన్ని పసిగట్టిన కోడెల శివరామకృష్ణ.. ఆ భూమిని చౌకగా కొట్టేశారు. అన్నదమ్ముల్లో ఒకరిని తన వద్దకు పిలిపించుకుని.. తన వ్యక్తిగత సహాయకుడు గుత్తా నాగప్రసాద్ మేనేజింగ్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్న శశి ఇన్ఫ్రా పేరుతో ఎకరం రూ.8 లక్షల చొప్పున కొనుగోలు చేసి, 2015 ఆగస్టు 1న రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. వాస్తవంగా ఆ ప్రాంతంలో అప్పటికే ఎకరం రూ.1.50 కోట్లకుపైగా పలుకుతుండేది. కేసుల నమోదుకు రంగం సిద్ధం సీఐడీ అధికారులు ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో రాజధాని ప్రాంతంలో చంద్రబాబు బృందం ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి 4,069.94 ఎకరాల భూమిని కాజేసినట్లు తేలింది. 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్31 మధ్య కాలంలో అంటే రాజధాని ప్రాంతాన్ని అధికారికంగా ప్రకటించక ముందే కుటుంబ సభ్యులు, కుటుంబ సంస్థలు, బినామీల పేర్లతో ఆ భూములను దోచేయడం వెల్లడైంది. నిబంధనలు ఉల్లంఘించి భూములు కొనుగోలు చేసిన చంద్రబాబు బృందం, వ్యాపార సంస్థలపై ఐపీసీ 418, 420, 406, 403, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేసేందుకు సీఐడీ సిద్ధమైంది. ‘రాజధాని ప్రాంతంపై ప్రభుత్వం ప్రకటన చేయక ముందే ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడంలో ఆంతర్యమేమిటి? అక్కడే రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు మీకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ఆ భూములు కొనుగోలు చేయడానికి డబ్బులు ఎలా వచ్చాయి? వాటికి ఆదాయ మార్గాలు ఏమిటి? ఆదాయపు పన్ను చెల్లించారా?’ అంటూ ఇన్సైడర్ ట్రేడింగ్‌లో భూములు కొనుగోలు చేసిన వారికి చట్ట ప్రకారం నోటీసులు జారీ చేయడానికి సీఐడీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా కేసులు నమోదు చేయడంతోపాటు ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు సమాచారం ఇచ్చి ఆ సంస్థలతో కూడా కేసులు నమోదు చేయించి సమాంతరంగా విచారణ చేపట్టనున్నారు. -
తెల్లబోయే దోపిడీ
సాక్షి, అమరావతి: రాజధానిగా అమరావతిని ప్రకటించటానికి ముందే టీడీపీ నేతలు 797 మంది తెల్లరేషన్‌కార్డుదారుల ద్వారా భారీగా భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో గుర్తించింది. పొట్ట గడవటమే కష్టమైన కొందరు నిరుపేదలు రూ.కోట్లు వెచ్చించి ఖరీదైన భూములను కొనుగోలు చేయడం విస్తుగొల్పుతోంది. వీరి వెనుక టీడీపీ పెద్దల ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా వెల్లడవుతోంది. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 30 వరకు ఈ భూ దందాలు జరిగాయి. సీఐడీ అధికారులు వారి ఆధార్ నంబర్లను ఆదాయపు పన్ను శాఖకు అందచేసి పాన్‌కార్డులు, ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలపై ఆరా తీస్తున్నారు. ఐటీ శాఖ ఇప్పటిదాకా వీరిలో 477 మంది వివరాలను పరిశీలించగా 157 మంది పాన్ కార్డులు కలిగి ఉన్నట్లు సీఐడీకి నివేదిక ఇచ్చింది. అయితే వీరిలో ఒక్కరూ ఆదాయపు పన్ను చెల్లించలేదని వెల్లడైంది. మిగతా 320 మంది వివరాలను ఆదాయపు పన్ను శాఖ విశ్లేషిస్తోంది. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కుటుంబ సభ్యులు, వ్యాపార సంస్థలు, సమీప బంధువుల పేర్లతో అమరావతిలో తక్కువ ధరకే వేలాది ఎకరాలను కాజేసింది చాలక తమ డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసేవారు, అనుచరులను ముందు పెట్టిన చంద్రబాబు బృందం భారీగా భూములను కొనుగోలు చేసినట్లు సీఐడీ తేల్చింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు ఎన్నో సాక్ష్యాలు.. - గుంటూరు జిల్లా పొన్నూరులోని చింతలపూడి ఇంటి నెంబర్ 4–83లో నివాసం ఉండే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కుమార్తె ధూళిపాళ్ల వీరవైష్ణవి (ఆధార్ నెంబర్ 465580884906) వయసు 26 ఏళ్లు. మాజీ ఎమ్మెల్యే కుమార్తె అయినా ఆమె తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ 074800500478) లబ్ధిదారురాలే. వీరవైష్ణవి తుళ్లూరు మండలం ఐనవోలు సర్వే నెంబర్ 69/2లో మూడు ఎకరాల భూమిని 2014 అక్టోబర్ 13న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడ మార్కెట్ ధర ఎకరం రూ.2 కోట్లు పలుకుతోంది. వీర వైష్ణవి తెల్లకార్డు కలిగి ఉండటం ఓ విశేషం కాగా సుమారు రూ.6 కోట్లు వెచ్చించి మూడు ఎకరాలు కొనుగోలు చేయడం మరో విశేషం. అంటే ఆ ముసుగులో దాగిన పచ్చగద్ద ధూళిపాళ్ల నరేంద్రకుమారే అన్నది స్పష్టమవుతోంది. నరేంద్ర మాజీ ఎమ్మెల్యే అయి ఉండీ కుమార్తెకు తెల్లరేషన్‌కార్డు మంజూరు చేయించుకోవడంపైనా సీఐడీ దర్యాప్తు చేస్తోంది. - గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు ఇంటి నెంబర్ 3–108లో నివసించే పిన్నిబోయిన రామారావు (ఆధార్ నెంబర్ 206532486739) వయసు 81 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ 071204102522) లబ్ధిదారుడైన ఆయన 20 ఏళ్ల వయసు నుంచి ఏటా రూ.ఐదు వేల చొప్పున ఆదా చేసినా 2014 జూన్ నాటికి రూ.3.05 లక్షలకు మించదు. పోనీ ఏడాదికి రూ.పదివేల చొప్పున ఆదా చేసినా రూ.6.10 లక్షలకు మించదు. పిన్నబోయిన రామారావు 2014 జూన్ 6న తుళ్లూరు మండలం ఐనవోలు సర్వే నెంబర్ 26లో ఎకరం రూ.7.68 లక్షల (ప్రభుత్వం నిర్ణయించిన ధర) చొప్పున మూడు ఎకరాలను రూ.23.04 లక్షలకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ అక్కడ మార్కెట్ రేటు ఎకరం రూ.1.50 కోట్లు పలుకుతోంది. అంటే రూ.4.50 కోట్లు వెచ్చించి ఆ భూమిని కొన్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం తీసుకున్నా ఆయన ఏడాదికి రూ.పది వేల చొప్పున గరిష్టంగా ఆదా చేయగలిగే రూ. 6.10 లక్షలు ఎక్కడ? భూమి కొనుగోలు చేయడానికి వెచ్చించిన రూ.23.04 లక్షలు ఎక్కడ? ఈ నిరుపేద ఏ బడా‘బాబు’ బినామీనో తేల్చేపనిలో సీఐడీ నిమగ్నమైంది. - గుంటూరు జిల్లా మంగళగిరి చెరువుకట్ట సమీపంలో ఇంటి నెంబర్ 7–9లో నివాసం ఉండే పెనుమళ్లి శ్రీనివాసరావు (ఆధార్ నెంబర్ 459984228049) వయసు 52 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ 0712049ఏ0213) లబ్ధిదారుడైన ఆయన తుళ్లూరు మండలం పెదపరిమిలో సర్వే నెంబరు 202/2ఏ1లో ఎకరం రూ.11.34 లక్షల (ప్రభుత్వం నిర్ణయించిన ధర) చొప్పున రూ.45.36 లక్షలు వెచ్చించి నాలుగు ఎకరాలను 2014 జూన్ 6న కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడ మార్కెట్ ధర ఎకరం రూ.1.50 కోట్లకుపైగా ఉంది. అంటే రూ.ఆరు కోట్లు వెచ్చించి ఆ భూమిని కొన్నట్లు స్పష్టమవుతోంది. అప్పటివరకు గరిష్టంగా రూ.3.20 లక్షలకు మించి ఆదా చేసే అవకాశం లేని తెల్లకార్డుదారుడైన శ్రీనివాసరావుకు అంత డబ్బు వెచ్చించి భూమి కొనే శక్తి ఉంటుందా? ఉండనే ఉండదు. శ్రీనివాసరావు వెనుక దాగిన పచ్చగద్దను గుర్తించే దిశగా సీఐడీ అడుగులు వేస్తోంది. - విజయవాడలోని ఫన్‌టైమ్ క్లబ్ రోడ్డులో ఇంటి నెంబర్ 59ఏ–8–6లో నివాసం ఉండే అన్నే వీరభోగవసంతరావు (ఆధార్ నెంబర్ 998504554110) వయసు 58 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ 068427000095) లబ్ధిదారుడైన ఆయన తాడేపల్లి మండలం ఇప్పటంలో సర్వే నెంబర్ 163/బీలో ఎకరం రూ.55.70 లక్షల చొప్పున ఆరు ఎకరాలకు రూ.3.35 కోట్లు వెచ్చించి 2014 అక్టోబర్ 18న కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం అక్కడ ఎకరం విలువ రూ.పది కోట్లు ఉంది. అప్పటివరకు గరిష్టంగా రూ.3.80 లక్షలకు మించి ఆదా చేసే అవకాశం లేని తెల్లకార్డుదారుడు వీరభోగవసంతరావు రూ.కోట్లు వెచ్చించి భూమిని కొనగలడా? ఈ మాయను చేధించేందుకు సీఐడీ సిద్ధమైంది. - విజయవాడ రామచంద్రరావు వీధిలో ఇంటి నెంబర్ 57–12–10లో నివాసం ఉండే జువ్వా అంజలీదేవి (ఆధార్ నెంబర్ 859261831867) వయసు 60 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ061605610058) లబ్ధిదారైన అంజలీదేవి తుళ్లూరు మండలం నేలపాడు సర్వే నెంబర్ 5/2లో ఎకరం రూ.10.50 లక్షల చొప్పున నాలుగు ఎకరాలను రూ.42 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. మార్కెట్ ధర అక్కడ ఎకరం రూ.రెండు కోట్లు ఉంది. అప్పటివరకు గరిష్టంగా రూ.నాలుగు లక్షలకు మించి ఆదా చేసే అవకాశం లేని తెల్లకార్డుదారైన అంజలీదేవి రూ.కోట్లు కుమ్మరించి భూములు కొనగలరా? ఆమె వెనుక ఉన్న పచ్చగద్ద ఎవరన్నది సీఐడీ అన్వేషిస్తోంది. - గుంటూరు కొరిటెపాడులో ఇంటి నెంబర్ 67–4–177లో నివసించే గొల్లపూడి శారద (ఆధార్ నెంబర్ 674763182727) వయసు 55 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్లూఏపీ0731022ఏ0458) కలిగిన శారద అమరావతి మండలం నరుకుళ్లపాడు సర్వే నెంబరు 114/బీ, 114/ఏ, 113/బీ, 113/ఏలో ఎకరం రూ.7.53 లక్షల చొప్పున (ప్రభుత్వం నిర్ణయించిన ధర) మూడు ఎకరాలను రూ.22.59 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి 2014 ఆగస్టు 12న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడ మార్కెట్ విలువ ఎకరం రూ.2.50 కోట్లు ఉంది. అంటే ఆ భూమిని రూ.7.50 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోంది. అప్పటివరకు ఆమె ఆమె గరిష్టంగా ఆదా చేయగలిగే మొత్తం రూ.3.50 లక్షలకు మించదు. అలాంటప్పుడు ఆ భూమిని కొనగలిగే తాహతు ఆమెకు ఉంటుందా? - ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం సర్వారెడ్డిపాలెంలో నివాసం ఉండే కాకుమాని కోటేశ్వరరావు (ఆధార్ నెంబర్ 410227073379) వయసు 65 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ 084408360243) లబ్ధిదారుడైన ఆయన తుళ్లూరు మండలం వెలగపూడి సర్వే నెంబర్ 181/బీలో ఎకరం రూ.16.76 లక్షల చొప్పున (ప్రభుత్వం నిర్ణయించిన ధర) నాలుగు ఎకరాలకు రూ.67.04 లక్షలు వెచ్చించి 2014 సెప్టెంబరు 16న కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మార్కెట్ ధర అక్కడ ఎకరం రూ.ఏడు కోట్లు ఉంది. కానీ తెల్లకార్డుదారుడైన కోటేశ్వరావు అప్పటిదాకా గరిష్టంగా ఆదా చేయగలిగే మొత్తం రూ.4.50 లక్షలకు మించదు. మరి ఆయనకు అంత డబ్బు పోసి భూములు కొనడం ఎలా సాధ్యమైంది? కోటేశ్వరరావు వెనుక ఉన్న బడాబాబును బయటకు రప్పించే దిశగా సీఐడీ చర్యలు చేపట్టింది. - కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం ఇంటి నెంబరు 1–132లో నివాసం ఉండే ముక్కపాటి పట్టాభిరామారావు (ఆధార్‌కార్డు నెంబర్ 287486854021) వయసు 71 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు(డబ్ల్యూఏపీ 060607028ఏ0043) లబ్ధిదారుడైన ఆయన అమరావతి మండలం కర్లపూడి సర్వే నెంబర్ 23/2డీ, 23/2ఈ, 26/1, 27/2, 27/1లో ఎకరం రూ.12.04 లక్షలు (ప్రభుత్వం నిర్ణయించిన ధర) చొప్పున రూ.36.12 లక్షలు వెచ్చించి మూడు ఎకరాలను 2014 సెప్టెంబరు 20న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడ మార్కెట్ రేటు ఎకరం రూ.1.50 కోట్లు ఉంది. ఈ లెక్కన ఆయన రూ.4.50 కోట్లు వెచ్చించి భూమిని కొన్నట్లే. తెల్లకార్డున్న పట్టాభిరామారావు అప్పటిదాకా ఆదా చేయగలిగే మొత్తం గరిష్టంగా రూ.5.10 లక్షలకు మించదు. - గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక వైఎస్సార్ సెంటర్ ఇంటి నెంబర్ 1–37లో నివాసం ఉండే మేకా వెంకటరెడ్డి (ఆధార్ కార్డు నెంబర్ 934736078913) వయసు 67 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు(డబ్ల్యూఏపీ071100200217) లబ్ధిదారుడైన ఆయన పెదకాకాని మండలం అనుమర్లపూడి సర్వే నెంబర్ 15/3, 15/4, 15/6, 15/7, 15/8లో ఎకరం రూ.29.35 లక్షలు (ప్రభుత్వం నిర్ణయించిన ధర) చొప్పున రూ.1.47 కోట్లు వెచ్చించి ఐదు ఎకరాలను 2014 సెప్టెంబరు 29న కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడ మార్కెట్ ధర ఎకరం రూ.రెండు కోట్లు పలుకుతోంది. ఈ లెక్కన రూ.పది కోట్లు వెచ్చించి భూమిని కొన్నట్లే. అప్పటివరకు గరిష్టంగా రూ.4.70 లక్షలకు మించి ఆదా చేసే అవకాశం లేని తెల్లకార్డుదారుడైన వెంకటరెడ్డిని బినామీగా చేసుకున్న పచ్చగద్దను తేల్చేపనిలో సీఐడీ నిమగ్నమైంది. - గుంటూరు జిల్లా నాదెండ్లలో పటమటబజార్ ఇంటి నెంబర్ 6–70లో నివాసం ఉండే నెల్లూరి మంగమ్మ (ఆధార్ నెంబర్ 782400477863) వయసు 61 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ073801000059) లబ్ధిదారైన ఆమె తుళ్లూరు మండలం రాయపూడి సర్వే నెంబర్ 357/బీ1ఏలో ఎకరం రూ.33.60 లక్షల (ప్రభుత్వం నిర్ణయించిన ధర) చొప్పున రూ.1.35 కోట్లు వెచ్చించి నాలుగు ఎకరాలను 2014 నవంబర్ 10న కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం అక్కడ ఎకరం రూ.ఏడు కోట్లు ఉంది. అప్పటిదాకా గరిష్టంగా రూ.4.10 లక్షలు మాత్రమే ఆదా చేసే అవకాశం ఉన్న మంగమ్మకు రూ.కోట్లు వెచ్చించే శక్తి ఎలా ఉంటుంది? - గుంటూరు జిల్లా నరసరావుపేటలోని రామిరెడ్డిపేట ఇంటి నెంబర్ 11–12–12లో నివాసం ఉండే రావెల సత్యనారాయణ (ఆధార్ నెంబర్ 667104733878) వయసు 65 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ 0784024ఏ0122) కలిగిన సత్యనారాయణ అమరావతి మండలం అమరావతిలో సర్వే నెంబర్ 185/బీ, 185/సీ, 185/డీలో ఎకరం రూ.11.90 లక్షల (ప్రభుత్వం నిర్ణయించిన ధర) చొప్పున రూ.35.7 లక్షలు వెచ్చించి మూడు ఎకరాలను 2014 డిసెంబర్ 31న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మార్కెట్ విలువ అక్కడ ఎకరం రూ.మూడు కోట్లు ఉంది. ఎంత కష్టపడ్డా అప్పటిదాకా రూ.4.50 లక్షలకు మించి ఆదా చేసే అవకాశాల్లేని రావెల సత్యనారాయణకు రూ.కోట్లు కుమ్మరించే శక్తి ఎలా వచ్చింది? భూములు కొన్న తెల్లకార్డుదారులకు నోటీసులు.. రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన 797 మంది తెల్లరేషన్‌కార్డు లబ్ధిదారులకు సీఐడీ నోటీసులు జారీ చేస్తోంది. ‘మీ ఆదాయ వనరులు ఏమిటి? ఎంత ఆదా చేశారు? ఆదా చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను చెల్లించారా? ఎలాంటి ఆదాయం లేకుండా రూ.కోట్లు వెచ్చించి భూములు ఎలా కొనుగోలు చేయగలిగారు? మీ పేర్లతో భూములు కొనుగోలు చేయడం వెనుక ఉన్నదెవరు?’ అనే అంశాలపై నిగ్గు తేల్చనుంది. పచ్చగద్దల పేర్లను వెల్లడించని వారిపై ఐపీసీ సెక్షన్ 420, 418, 406 కింద కేసులు నమోదు చేయడంతోపాటు చర్యలు తీసుకోవాలని ఆదాయపు పన్ను శాఖను కోరనున్నట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు. ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధించడంతోపాటు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. బడాబాబులను గుర్తించి ఐపీసీ 409, 420, 418, 406, 403 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతోపాటు ఆదాయపుపన్ను శాఖకు వివరాలు పంపి చర్యలు తీసుకోవాలని కోరతామని సీఐడీ అధికారులు వెల్లడించారు. తెల్ల రేషన్‌కార్డు ఎవరికంటే? ఏడాదికి రూ.60 వేల లోపు ఆదాయం ఉన్నవారు మాత్రమే తెల్లరేషన్ కార్డుకు అర్హులు. దారిద్య్రరేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న నిరుపేదలకే తెల్ల రేషన్‌కార్డును ప్రభుత్వం జారీ చేస్తుంది. మరి నిరుపేదలు ఏడాదికి ఎంత ఆదా చేసే అవకాశం ఉంటుంది? రాబడిలో ఖర్చులు పోనూ వారు ఏటా రూ.ఐదు వేలకు మించి ఆదా చేసే పరిస్థితి ఉండదు. 20 ఏళ్లలో రూ.లక్షకు మించి ఆదా చేయలేరు. ఏటా సగటున రూ.పది వేల చొప్పున ఆదా చేసినా 20 ఏళ్లలో రూ.రెండు లక్షలను మాత్రమే ఆదా చేయగలరు. ఇన్సైడర్ ట్రేడింగ్‌లో మనీల్యాండరింగ్.. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు బృందం ఇన్సైడర్ ట్రేడింగ్‌తోపాటు మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు సీఐడీ ప్రాథమికంగా ఆధారాలు సేకరించింది. తెల్లరేషన్‌కార్డు లబ్ధిదారులను ముందు పెట్టి నల్లధనం వెదజల్లి వారి పేర్లతో భూములు కొనుగోలు చేసినట్లు తేల్చింది. ఇందులో మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఆధారాలు పంపేందుకు సీఐడీ సిద్దమైంది. భూములు కొన్న 797 మంది తెల్లరేషన్ కార్డుదారులతోపాటు వారి వెనుక దాగిన చంద్రబాబు బృందాన్ని బయటకు రప్పించే పనులను సీఐడీకి సమాంతరంగా ఈడీ కూడా చేపట్టనుంది. బినామీలను నమ్మని బడాబాబులు.. బినామీలను ముందు పెట్టి అమరావతిలో తక్కువ ధరలకే భూములను కాజేసిన బడాబాబులు రిజిస్ట్రేషన్ ముగిశాక జాగ్రత్త పడ్డారు. అధికారికంగా రాజధాని ప్రకటన వెలువడ్డాక భూముల ధరలు అమాంతం పెరిగితే బినామీలు ఎదురుతిరిగే అవకాశం ఉందని గుర్తించారు. రిజిస్ట్రేషన్ ముగిశాక ఆ భూములతో తమకు సంబంధం లేదని బినామీలతో అగ్రిమెంట్లు చేయించుకున్నారు. -
బాబూ.. రేపు సాక్ష్యాలతో సహా మీడియా ముందుంచుతాం!
అమరావతి: రాజధాని పేరుతో చంద్రబాబు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, ఆయనపై సుప్రీం కోర్టు, హైకోర్టు సుమోటో కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ధర్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో అనేక మంది అమాయక రైతుల మాగాణి భూములను చంద్రబాబు తన సన్నిహితులకు, కోటరీకి ధారదత్తం చేశారు. రైతుల సొమ్మును నొక్కేశారు. ఇక్కడి రైతుల ఆవేదనను పట్టించుకోలేదు. భూ దందా విధానం హుందాగా వ్యవహరిస్తున్నట్లు బయటకు చెబుతూనే.. మరోపక్క లోకేష్, అప్పటి మంత్రులు యనమల, పత్తిపాటి, దూళిపాళ్ల నరేంద్ర, పయ్యవుల కేవశ్ ఇలా ఎంతో మందితో రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేయించారు. రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. చంద్రబాబు రాజ్యాంగ ప్రమాణాన్ని తుంగలో తొక్కారు. చదవండి: ఆ ఎమ్మెల్యేలు దున్నేశారు..! చదవండి: ‘ఆ వసూళ్లకు లెక్కలు లేవు.. ఇప్పుడు మరో జోలె’ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెబుతూ ప్రజలను మోసం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు మరోలాగా మాట్లాడుతున్నారు. రైతులను అడ్డం పెట్టుకొని చేస్తున్న నాటకాలు, బూటకాలు తేటతెల్లం చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబును యూటర్న్ పితామహుడని అందరూ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ హిట్లర్‌గా ఆయన పేరు సార్ధకం చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విలువైన భూములు తీసుకొని కోట్లకు పడగలెత్తారు. ఇప్పుడేమో జోలె పట్టి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసమే. రాజధాని ప్రాంతంలోని అమాయక రైతులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ రోజు వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిపై సీబీఐ విచారణను డిమాండ్ చేయగా.. చంద్రబాబు సభలో బెదిరిస్తూ మాట్లాడారు. మా ప్రభుత్వం రాజధానిపై సీబీఐ విచారణ చేయిస్తుంది. ఇప్పటికే సీఐడీ కూడా రంగంలోకి దిగింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ సుమోటాగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన చంద్రబాబు రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడు. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సీఎంగా ఉంటూ కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్‌కు 14 ఎకరాలు ధారదత్తం చేశారు. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 30 వరకు చంద్రబాబు ఎల్లో గ్యాంగ్ అమరావతి పేరుతో భూదందాకు పాల్పడింది. ఈ రోజు జోలె పట్టి చందాలు వసూలు చేస్తున్నారు. పక్షపాతం వచ్చినట్లు మాట్లాడితే మీకు శిక్ష పడక తప్పదు. మీ అవినీతిని ప్రజల ముందు ఉంచబోతున్నాం. నల్లధనాన్ని కప్పి పుచ్చుకునేందుకు భూములు తక్కువ రేట్లకు కొన్నట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందరిపై కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. బినామీదారుల వివరాలు కూడా మీడియా ముందు పెడతాం. చంద్రబాబు హయాంలో షేర్ మార్కెట్లో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష వేయాలన్నారు. ఆ రోజు రాజధాని పేరుతో కోట్లాది రూపాయాలు నొక్కేశారు. మిమ్మల్ని ఎన్నేళ్లు జైల్లో పెట్టాలో చెప్పాలి. సీఎం వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత భూదందాకు పాల్పడినట్లు రుజువు చేస్తే ఎలాంటి చర్యలకైనా తాను సిద్ధం. చదవండి: ఈలోగా ఇటు వాళ్లను అటు పంపిస్తాడు! రాజధాని ప్రాంతం రైతులు చంద్రబాబు హయాంలో బాగుపడింది లేదు. చంద్రబాబు మిమ్మల్ని అడ్డుపెట్టుకొని వ్యాపారం చేశారు. అన్ని ప్రాంతాలు వైఎస్సార్సీపీకి సమానమే. కృష్ణా, గుంటూరు జిల్లాలను కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. జీఎన్ రావు, బోస్టర్ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ, హైపవర్ కమిటీల నివేదికల ఆధారంగా రాజధాని విషయంలో ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలి. రాజధాని రైతులు మోసం చేసిన చంద్రబాబుపై పోరాటం చేయాలి. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. గతంలో ఇచ్చిన దానికంటే మెరుగైన ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటికే హైపవర్ కమిటీ రాజధాని రైతుల మనోభావాలను సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లింది. అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి జరగాలని, ఇక్కడ మూడు ప్రాంతాల్లో రాజధాని నిర్మాణాలు ఉండాలని, ఏ ప్రాంతం వివక్షకు గురికాకూడదని, గత ప్రభుత్వం మాదిరిగా అమాయకప్రజలను అడ్డుపెట్టుకొని మేం నాయకులుగా చలామణి అవ్వాలన్న ఆలోచన ఎప్పుడు కూడా మాకు ఉండదు. ఎందుకంటే వైయస్ జగన్ రైతు పక్షపాతి. రైతులకు మేలు చేయాలనే మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు చేసిన భూదందాల విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టు, కేంద్రం సుమోటోగా స్వీకరించాలి. చంద్రబాబు ఇకనైనా నాటకాలు ఆపేసి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు ఇప్పటికైనా మారాలి. రాజధాని ప్రాంతంలో జరిగిన అన్ని అంశాలను రేపు ఆధారాలతో సహా మీడియా ముందు ఉంచుతుంది. ఇప్పటికే సీఐడీ విచారణ పూర్తి చేసింది. ఇదే వివరాలను కోర్టు ముందు కూడా ఉంచుతాం. చదవండి: 'గుండు సున్నా దేనితో కలిసినా ఫలితం జీరోనే' -
ఆ ఎమ్మెల్యేలు దున్నేశారు..!
రాజధానే లేకుండా రాష్ట్రాన్ని విభజించి కేంద్రం సృష్టించిన సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని.. దేవతల రాజు ఇంద్రుడి అమరావతిని తలదన్నే రీతిలో ఆంధ్రులకు అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నగరాన్ని నిర్మిస్తానన్న నారా చంద్రబాబు నాయుడు ఆ ముసుగులో అంతర్జాతీయ కుంభకోణానికి తెర తీశారు. సన్నిహితులైన నేతలు, అనుచరులు, బినామీలకు రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తామనే అంశంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చి ‘ఓత్ ఆఫ్ సీక్రసీ’కి పాతరేసి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు బాటలు పరిచారు. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లతోపాటు టీడీపీ కీలక నేతలు, బినామీలు 2014 జూన్ 1 నుంచి రాజధానిపై అధికారికంగా ప్రకటన చేసే వరకూ అంటే 2014 డిసెంబర్ 30 దాకా రైతుల నుంచి కారుచౌకగా వేలాది ఎకరాలను కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంపై ‘సీఐడీ’ దర్యాప్తు చేస్తోంది. సీఐడీ దర్యాప్తులో వెల్లడైన అంశాల్లో చంద్రబాబు, నారా లోకేష్, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా, యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, జీవీఆర్ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తదితరులు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడటానికి సంబంధించి ఒక భాగం ఈ కథనం. సాక్షి, అమరావతి: ఓత్ ఆఫ్ సీక్రసీ (అధికారిక రహస్యాల ప్రమాణం)ని తుంగలో తొక్కి.. రాజధాని ఏర్పాటు చేయబోయే ప్రాంతంపై సన్నిహితులకు లీకులిచ్చి.. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు తెరతీసి.. రైతుల నుంచి చౌకగా భూములు కాజేశాక.. తాపీగా ‘అమరావతి’ని ప్రకటించి రూ.వేల కోట్లు దోచేసిన మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ నేతల బాగోతం సీఐడీ (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) దర్యాప్తులో బట్టబయలైనట్లు తెలిసింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, జీవీఆర్ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తదితరులపై ఐపీసీ 418, 420, 406, 403, 409 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు సీఐడీ సిద్ధమైంది. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన వారి ఆదాయ మార్గాలు, ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించిన కీలక ఆధారాలను సీఐడీ సేకరించింది. ఆదాయపు పన్ను చెల్లించకుండా నల్లధనం(బ్లాక్ మనీ)తో భూములు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. పన్నులు ఎగవేసిన భూచోళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదాయపు పన్ను శాఖను కోరనున్నట్లు తెలిసింది. నేతల భూ దోపిడీకి ఆధారాలు ఇవిగో.. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో జూన్ 1, 2014 నుంచి డిసెంబర్ 31, 2014 మధ్య జరిగిన భూముల క్రయవిక్రయాలపై సీఐడీ దర్యాప్తు చేసింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి సేకరించిన పత్రాలను క్షుణ్నంగా అధ్యయనం చేసింది. దర్యాప్తులో వెల్లడైన అంశాల్లో మచ్చుకు కొన్ని ఇవీ.. - రాజధానికి కూత వేటు దూరంలో ఉండే తాడికొండలో 2014 జూన్ 6న అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు సర్వే నెంబర్ 93–బీలో 7.12 ఎకరాలను తన అల్లుడు పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్ కుమార్ పేరుతో కొనుగోలు చేశారు. విజయవాడకు చెందిన జీబీఆర్ హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ గడ్డం బుచ్చారావుకు చెందిన ఈ భూమిని ఎకరం రూ.21 లక్షల చొప్పున కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరో రెండు రోజులకు అంటే జూన్ 8న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. - అమరావతి మండలం వైకుంఠపురం సర్వే నెంబర్ 257లో 1.12 ఎకరాలను ఎకరం రూ.1.12 కోట్ల చొప్పున గుమ్మడి సురేష్ అనే వ్యక్తి కొనుగోలు చేసి నవంబర్ 21, 2014న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అనంతవరం, నిడమర్రు, మంగళగిరి, పెదపరిమి గ్రామాల్లో కూడా 30.32 ఎకరాల భూమిని ఆయన కొనుగోలు చేశారు. గుమ్మడి సురేష్ ఆదాయ మార్గాలు, ఆదాయపు పన్ను చెల్లింపులను పరిశీలించిన సీఐడీ అతడికి అంత భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసే స్థోమత లేదని నిర్దారణకు వచ్చింది. గుమ్మడి సురేష్‌కు, ప్రత్తిపాటి పుల్లారావుకు ఉన్న సన్నిహిత సంబంధాలపై ఆధారాలను సేకరించింది. - చంద్రబాబు సన్నిహితుడు, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఫిరంగిపురం, జి.కొండూరు మండలం వెంకటాపురం, నవులూరు, ఆత్మకూరు, కంకిపాడు మండలం పమిడిముక్కల, జగన్నాథపురం, ఇబ్రహీంపట్నంలలో జూన్ 19, 2014న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 5704, 5704, 5706ల ద్వారా, జూలై 22, 2014న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 7627 నుంచి 7637 వరకు 60 ఎకరాలను రాజధానిపై అధికారిక ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు కొన్నట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. - చంద్రబాబు మరో సన్నిహితుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీఆర్ ఆంజనేయులు తుళ్లూరు మండలం మందడంలో సర్వే నెంబర్ 430/1, 430/3లలో సెప్టెంబరు 23, 2014న ఎకరం రూ.22.62 లక్షల చొప్పున తన తండ్రి గోనుగుంట్ల సత్యనారాయణ పేరుతో భూములు కొన్నారు. మందడంలో గోనుగుంట్ల సత్యనారాయణ, కుమార్తె లక్ష్మీ సౌజన్య పేరుతో 9.65 ఎకరాలు కొన్నారు. వెలగపూడిలో 4.71, కొండమరాజుపాలెంలో 2.04, ఐనవోలులో 2.43, నేలపాడులో 4.03, నీరుకొండలో 1.29, వెంకటపాలెంలో 0.7 ఎకరాలను లక్ష్మీసౌజన్య పేరుతో కొన్నారు. లింగాయపాలెంలో సత్యనారాయణ పేరుతో 1.25 ఎకరాలు, సన్నిహితుడు కొత్త వెంకట ఆంజనేయులు, కొత్త శివరామకృష్ణల పేర్లతో వెంకటపాలెంలో 0.60 ఎకరాలు కొన్నారు. మందడంలో 2.985 ఎకరాలను జీవీఆర్ ఆంజనేయులు కొనుగోలు చేశారు. వీటిని డిసెంబర్ 30, 2014కు ముందే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సీఐడీ తేల్చింది. - ధూళిపాళ్ల నరేంద్ర తుళ్లూరు మండలం కొండమరాజుపాలెం 1.21 ఎకరాలను ఎకరా రూ.6.05 లక్షల చొప్పున తన కుమార్తె ధూళిపాళ్ల వీరవైష్ణవి పేరుతో కొనుగోలు చేశారు. ఐనవోలులో 69–1లో 0.22, 69–2లో 1.86 ఎకరాలను కుమార్తె పేరుతో కొన్నారు. ఈ భూములను డిసెంబర్ 2014కు ముందే కొనుగోలు చేసి రాజధాని ప్రకటన వెలువడ్డాక రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సీఐడీ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. - చంద్రబాబు కుటుంబానికి సన్నిహితుడైన వేమూరి రవికుమార్ ప్రసాద్ డైరెక్టర్‌గా ఉన్న సెవెన్ హిల్స్ లాజిస్టిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, గోష్ఫాద గ్రీన్ ఫీల్డ్స్ ప్రైవేటు లిమిటెడ్ పేర్లతో తుళ్లూరు, వైకుంఠపురం, మందడం, వెంకటపాలెం, ధరణికోటలలో 25.91 ఎకరాలు కొనుగోలు చేశారు. నారా లోకేష్ సన్నిహితుడైన కనుమూరి కోటేశ్వరరావు ప్రతినిధిగా ఉన్న ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున శాఖమూరు, వెలగపూడి, ధరణికోటలో 5.16 13.15 ఎకరాలు కొన్నారు. ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున కంతేరులో 13.15 ఎకరాల కొన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ భూములన్నీ డిసెంబర్ 30, 2014లోపు కొన్నవే. - పయ్యావుల కేశవ్ తుళ్లూరు మండలం ఐనవోలులో సర్వే నెంబరు 48/3లో 2.13 ఎకరాలను ఎకరం రూ.6.39 లక్షల చొప్పున తన కుమారుడు విక్రమసింహా పేరుతో కొనుగోలు చేసి అక్టోబర్ 13, 2014న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఐనవోలులోనే ఎకరం రూ.5.88 లక్షల చొప్పున మరో 1.96 ఎకరాలను విక్రమసింహా పేరుతో నవంబర్ 3, 2014న కేశవ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కొండమరాజుపాలెంలో పయ్యావుల విక్రమసింహా పేరుతో 4.84 ఎకరాలు, తన సోదరుడి కుమార్తె హారిక పేరుతో 1.18 ఎకరాలను కేశవ్ కొనుగోలు చేశారు. - ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న తెలంగాణ నేత వేం నరేంద్రరెడ్డి తన కుమారుడు వేం కృష్ణ కీర్తన్ పేరుతో ఐనవోలులో 1.99 ఎకరాలు, కొండమరాజుపాలెంలో 0.50 ఎకరాలను కొనుగోలు చేశారు. తనకు సన్నిహితుడైన వేమీశ్వర్‌రెడ్డి పేరుతో కొండమరాజుపాలెంలో 1.20 ఎకరాలను డిసెంబర్ 30, 2014కు ముందే కొన్నట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. - తుళ్లూరు మండలం నేలపాడు సర్వే నెంబర్ 112/డీలో తన కుమారుడు పల్లె కృష్ణ కిశోర్‌రెడ్డి పేరుతో ఎకరం రూ.5.07 లక్షల చొప్పున 1.69 ఎకరాలను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి డిసెంబర్, 2014కు ముందే కొనుగోలు చేసి మార్చి 30, 2016న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నేలపాడులోనే మరో 0.84 ఎకరాలను తన కుమారుడి పేరుతో మే 5, 2016న పల్లె రఘునాథరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ సెక్షన్లు ఏం చెబుతున్నాయంటే? ఐపీసీ సెక్షన్ 418: ఓ లావాదేవీకి సంబంధించి ప్రయోజనాలను పరిరక్షించి తీరాల్సి ఉన్నా, నష్టం వస్తుందని తెలిసీ మోసానికి పాల్పడటం. ఇందుకు మూడేళ్ల జైలు శిక్ష. జరిమానా, రెండూ విధించవచ్చు. 420: వంచన లేదా మోసం ద్వారా ఆస్తిని బదలాయించడం. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా. రెండూ విధించవచ్చు. 403: దురుద్దేశంతో ఆస్తిని దుర్వినియోగం చేయడం. ఈ నేరానికి గాను రెండేళ్ల జైలు శిక్ష. జరిమానా. రెండూ విధించవచ్చు. 406: నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడటం. ఇందుకు గాను మూడేళ్ల జైలు శిక్ష. జరిమానా. రెండూ విధించవచ్చు 409: ఆస్తి విషయంలో పబ్లిక్ సర్వెంట్ లేదా బ్యాంకర్ లేదా వ్యాపారి, ఏజెంట్ నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడటం. ఇందుకు గాను పదేళ్ల జైలు శిక్ష, జరిమానా. రెండూ విధించవచు. పక్కా ప్రణాళికతో... - జూన్ 12, 2014న విశాఖపట్నంలో చంద్రబాబు తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. రాజధాని ప్రాంతంపై అప్పటికే నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ఆ విషయం వెల్లడించకుండా చినబాబు, తన కోటరీ ప్రధాన నేతలకు మాత్రమే ఉప్పందించారు. ఆ తర్వాత రహస్య అజెండాలో భాగంగా నూజివీడు, ఆగిరిపల్లి, బాపులపాడు పరిసరాల్లో రాజధాని అంటూ కొందరు మంత్రులు ప్రచారం చేశారు. ఇదే అదనుగా ఈ ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేసి పది రోజుల్లోనే ఎన్నారైలకు విక్రయించిన కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు రూ.400 కోట్లకుపైగా లబ్ధి పొందినట్లు టీడీపీ కీలక ఎంపీ ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. - టీడీపీ నేతలు మారుబేరాలు చేసి కనిష్ఠంగా రూ.15 వేల కోట్లను కొల్లగొట్టినట్లు రియల్ వర్గాల అంచనా. ఇలా దోచేసిన డబ్బులతోనే మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు ప్రాంతాల్లో చంద్రబాబు బృందం భారీగా భూములు కొనుగోలు చేసింది. - గుంటూరు–విజయవాడ మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ సీఎం చంద్రబాబు, కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు ఆగస్టు 9, 2014న వేర్వేరు సమావేశాల్లో ప్రకటించారు. దీంతో నూజివీడు, గన్నవరం, ముసునూరు ప్రాంతాల్లో భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అక్కడ భూములు కొన్న ఎన్నారైలు, చిన్న వ్యాపారులు సంక్షోభంలో కూరుకుపోయారు. దిక్కుతోచక కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. - తాడికొండ మండలం కంతేరు వద్ద సర్వే నంబర్లు 27/3బి, 22/2ఎ, 63/1, 62/2బి, 27/3ఎలలో 7.21 ఎకరాలను రూ.67.88 లక్షలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందే కొనుగోలు చేసి తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ పేరుతో అగ్రిమెంట్ చేసుకున్నారు. జూలై 7, 2014న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబరు 8, 2014న కంతేరులోనే సర్వే నెంబర్లు 63/బి, 56లలో ఉన్న 2.46 ఎకరాలను రూ.19.68 లక్షలకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. లింగమనేని ఇన్ఫో సిటీ సంస్థకు చెందిన చిగురుపాటి వెంకటగిరిధర్ నుంచి జీపీఏ ద్వారా కంతేరు వద్దే సర్వే నెంబర్లు 63/2బి, 63/1, 56 సర్వే నెంబర్లలో ఉన్న 4.55 ఎకరాలను రూ.36.40 లక్షలకు కొనుగోలు చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ఇలా 14.22 ఎకరాలను కేవలం రూ.1.23,76,000లకు కొనుగోలు చేసింది. అధికారిక రహస్యాలను కాపాడతానని ప్రమాణం చేసిన మరుక్షణమే చంద్రబాబు వాటికి తిలోదకాలు ఇచ్చారనేందుకు హెరిటేజ్ పుడ్స్ కొనుగోలు చేసిన భూములే నిదర్శనం. - మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు నన్నపనేని లక్ష్మీనారాయణ అత్యంత సన్నిహితుడు. రాజధానికి కూత వేటు దూరంలో చంద్రబాబు, యనమల కొనుగోలు చేసిన భూమికి సమీపంలోనే నన్నపనేని లక్ష్మీనారాయణ పేరుతో సర్వే నెంబర్ 397–బీ, 398–బీ లో 1.5 ఎకరాలు, 397–ఎ2, 397–ఎ1, 398–ఎ, 397–బీ, 398–బీలో 4.505 ఎకరాలు, 380లో ఒక ఎకరాతోపాటు మరో సర్వే నంబర్‌తో కలిపి మొత్తం 7.50 ఎకరాల భూమిని రూ.కోటికే కొనుగోలు చేసి ఆగస్టు 13, 2014న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రాజధానిపై దేవినేని ఉమాకు నాడు చంద్రబాబు ముందే సమాచారం ఇచ్చి భూమిని కొనుగోలు చేయించారు అనడానికి ఈ రిజిస్ట్రేషన్ పత్రాలే రుజువు. -
వరదొస్తే అమరావతికి ముప్పే
రాష్ట్ర రాజధాని నిర్మాణానికి టీడీపీ సర్కార్ ఎంపిక చేసిన ప్రాంతంపై ఐఐటీ–చెన్నై ఇటీవల అధ్యయనం చేసింది. దాని ప్రకారం.. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది గరిష్ట వరద నీటి మట్టం 21.50 మీటర్లు.. కృష్ణా నదికి దక్షిణాన రాజధాని ప్రాంతం ఉంది. కృష్ణా నదిలో వరద ప్రవాహం ఆరు, ఏడు లక్షల క్యూసెక్కులు దాటితే రాజధాని గ్రామాల్లోకి వరద నీరు చేరి 71 శాతం ప్రాంతాన్ని ముంచెత్తుతుంది. కొండవీటివాగు రాజధాని గుండా ప్రవహించి ఉండవల్లి అవుట్‌ఫాల్ స్లూయిజ్‌కు ఎగువన కృష్ణా నదిలో కలుస్తుంది. కొండవీటి వాగు గరిష్ట వరద మట్టం 17.50 మీటర్లు. స్థానికంగా వర్షాలు కురిస్తే కొండవీటివాగుకు వరద ఉప్పొంగుతుంది. కృష్ణా నది, కొండవీటి వాగులకు వరద వస్తే రాజధాని గ్రామాల్లో 71 % ప్రాంతంలో 0.5 నుంచి 1 మీటరు ఎత్తున నీళ్లు చేరి.. ముంచెత్తుతాయి. సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతం ఏమాత్రం అనుకూలం కాదు.. వరద ముప్పు పొంచి ఉంది.. ఇదేదో రాజకీయ విమర్శ కానే కాదు.. దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)–చెన్నై పరిశోధన చేసి తేల్చిచెప్పిన నగ్నసత్యం. అమరావతి నిర్మాణం చేపట్టిన 29 గ్రామాల్లో కనీసం 71 శాతం.. అంటే 21 గ్రామాలపై కృష్ణా నది వరదలు తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించింది. ఆ ప్రాంతంలో భూములన్నీ నల్లరేగడి కావడంతో 2.5 నుంచి 5 మీటర్ల లోతులోనే భూగర్భజలాల లభ్యత ఉందని.. అందువల్ల రాజధాని గ్రామాల్లో భవన, రహదారుల నిర్మాణం కోసం రెట్టింపు వ్యయం తప్పదని స్పష్టం చేసింది. వరద ముంపు నుంచి రక్షణ కోసం రాజధాని భూముల్ని 3–4 మీటర్ల ఎత్తున మట్టితో నింపి అభివృద్ధి చేయాలని సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ను చెన్నై ఐఐటీ ఈ సందర్భంగా ఎత్తిచూపింది. వరద ముంపు నేపథ్యంలోనే మాస్టర్‌ప్లాన్‌లో ఈ సూచనలు చేశారని పరోక్షంగా ప్రస్తావించింది. భారీ భవంతులకు ఈ భూములు అనుకూలం కావు ‘రాజధానికి ఎంపిక చేసినవి నల్లరేగడి భూములు. కృష్ణా నది సమీపంలోనే ప్రవహిస్తుండటం వల్ల అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో భూగర్భజలాలు తక్కువ లోతులోనే లభ్యమవుతాయి. అందువల్ల ఈ భూములు భారీ భవన నిర్మాణాలకు అనుకూలం కావు. ప్రభుత్వ భవనాల సముదాయం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫైనాన్స్ సిటీ, టూరిజం సిటీల పనులు చేపట్టనున్న ప్రాంతాలపై వరదల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ భూముల్లో భవనాలను నిర్మించడానికి ర్యాప్ట్ ఫౌండేషన్(పునాదులు తవ్వి.. రెండు వైపులా ఇనుప రేకులు దించి.. కాంక్రీట్ వేయడం) పనికి రాదు’ అని చెన్నై ఐఐటీ స్పష్టంచేసింది. చాలా లోతు నుంచి పునాది వేయాలి 1. రాజధాని భూముల్లో 40 మీటర్ల లోతుకు తవ్వితేగాని రాతిపొర తగలదు. ఆ ప్రాంతంలో భవనాలు నిర్మించాలంటే.. పైల్ ఫౌండేషన్(రిగ్‌ల ద్వారా చాలా లోతుకు పైల్లు దించి.. అక్కడి నుంచి కాంక్రీట్ వేయడం) అవసరం. 2. పైల్ ఫౌండేషన్ విధానంలో పునాదుల నిర్మాణానికి భారీ వ్యయం అవుతుంది. ఇది భవన నిర్మాణ వ్యయాన్ని రెట్టింపు చేస్తుంది. రోడ్ల నిర్మాణమూ సవాలే.. భూగర్భజలాలు ఉబికి వచ్చే నల్లరేగడి నేలల్లో రహదారుల నిర్మాణం సవాలుతో కూడిందని ఐఐటీ–చెన్నై వెల్లడించింది.. రహదారుల నిర్మాణానికి కూడా పైల్ ఫౌండేషన్ విధానంలోనే పునాదులు వేయాలని.. అందువల్ల వ్యయం రెట్టింపు అవుతుందని స్పష్టం చేసింది. రాజధాని ప్రాంతాన్ని వరదల ముప్పు నుంచి తప్పించాలంటే కనీసం 3–4 మీటర్ల ఎత్తున మట్టిని నింపి.. అభివృద్ధి చేయాలని, ఇందుకు భారీ వ్యయం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ముంపు ప్రాంతంలోని.. నిర్మాణాలకు అనుకూలంగా లేని భూముల్లో రాజధాని నిర్మించడం క్షేమకరం కాదని తేల్చిచెప్పింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, నిపుణుల కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(బీసీజీ)లు కూడా ఇదే రీతిలో నివేదికలు ఇవ్వడం గమనార్హం. జాతీయ మహిళా కమిషన్‌ను తప్పుదారి పట్టించే యత్నం రైతుల పేరుతో మహిళల్ని ముందుంచి అరాచకాలు సృష్టిస్తున్నారు టీడీపీ నేతలపై వాసిరెడ్డి పద్మ ధ్వజం సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట/పెనుగంచిప్రోలు: జాతీయ మహిళా కమిషన్ సభ్యులను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. రైతుల పేరుతో మహిళల్ని ముందుంచి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఎస్జీఎస్ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలోని పరిస్ధితులను పరిశీలించేందుకు వచ్చిన మహిళా కమిషన్‌కు ఇక్కడ ఏదో జరిగిపోతోందనే రీతిలో వివరించేందుకు టీడీపీ మహిళా నేతలు ప్రయత్నించారని మండిపడ్డారు. కమిషన్ సభ్యులకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారని పేర్కొన్నారు. మహిళలను రాజకీయ క్రీడా చదరంగంలో పావులుగా వాడుకోవడం తెలుగుదేశం పార్టీకి తగదన్నారు. టీడీపీ మహిళానేతలు మహిళలకు మెసేజ్‌లు పెట్టి.. కమిషన్ సభ్యులు ఎక్కడికి వెళ్తే అక్కడికి రప్పించి అరాచకాలు సృష్టించే ప్రయత్నాలు చేశారన్నారు. పెయిడ్ ఆర్టిస్టులు పోలీసులను రెచ్చగొట్టడంతో పాటు బూతులు తిడుతున్నారని మండిపడ్డారు. 2017లో తుందుర్రులో మహిళలపై జరిగిన లాఠీచార్జి, పుష్కరాల్లో తొక్కిసలాటతోపాటు పొరుగు రాష్ట్రంలో ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని రైతు చనిపోతే దాన్ని కూడా ఇక్కడే జరిగినట్లు ఫేక్ వీడియోలు సృష్టించి టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ కుటిల యత్నాలను జాతీయ మహిళా కమిషన్‌కు వివరించామన్నారు. రైతులతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా మహిళలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేయటం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు పెంచారని గుర్తు చేశారు. సంక్రాంతి కానుకగా అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ప్రజలు వీటన్నింటినీ గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రజల మొగ్గు మూడు రాజధానులకే శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర సమగ్రాభివృద్ధికే మూడు రాజధానులను కమిటీలు ప్రతిపాదించాయని, ప్రజలూ దీనికే మొగ్గు చూపిస్తున్నారని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజాభిప్రాయాన్ని అందరూ గౌరవించాలన్నారు. ఆదివారం విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని పేరుతో ఒకేచోట అభివృద్ధి కేంద్రీకరణ జరిగితే మిగతా ప్రాంతాలవారిలో అసంతృప్తి పెరుగుతుందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఏ ఒక్క కేంద్ర సంస్థనైనా ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలంటే పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ఒక్కటే మార్గమన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన రాకపోయుంటే ఉత్కళ కళింగ ఉద్యమం మళ్లీ ఊపందుకునేదన్నారు. రాజధానిపై బాబు అనవసర రాద్ధాంతం ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారంపూడి (మాచర్ల): రాజధాని విషయంలో చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని గిమ్మిక్కులు చేసినా రాజధాని విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశమే లేదని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కారంపూడి మండలంలోని కాచవరంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల సంక్షేమం విషయంలో సీఎం వైఎస్ జగన్ రాజీ పడకుండా ప్రతి ఒక్కరికీ మేలు చేసే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనే సదాశయంతో ఉన్న ప్రభుత్వానికి వస్తున్న జనాదరణ ముందు ఎవరు ఏమి చేసినా అవి చెల్లవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. రాజధాని అంటే 29 గ్రామాలు కాదు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగల శశిభూషణ్‌రెడ్డి కడప కోటిరెడ్డి సర్కిల్: రాజధాని అంటే 29 గ్రామాలతో ముడిపడిన విషయంగా పరిగణించడం సమంజసం కాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగల శశిభూషణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేసిందని, లక్ష కోట్లతో రాజధానిని నిర్మించడం రాష్ట్ర ఆర్థిక వనరులపై భారమేనని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసిందని చెప్పారు. ఈ విషయాన్ని దాచిపెట్టి అమరావతి ప్రజలను చంద్రబాబు మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. రాజధానికి రూ.లక్ష కోట్లు ఖర్చవుతుందని మీరు గతంలో చెప్పలేదా? టీడీపీ, బీజేపీలకు మంత్రి వెలంపల్లి ప్రశ్న సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లు ఖర్చవుతుందని గతంలో బీజేపీ, టీడీపీ చెప్పలేదా? అని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిపాలన వికేంద్రీకరణ అంశాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు రానున్న రోజుల్లో మూడు ఎమ్మెల్యే సీట్లకే పరిమితమవుతారన్నారు. పవన్‌కు ఒక విజన్ లేదని, ప్యాకేజీ ఇస్తే చాలన్నారు. పరిపాలన వికేంద్రీకరణపై బీజేపీలోనే భిన్నాభిప్రాయాలున్న విషయాన్ని కన్నా గమనించాలన్నారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ఉరవకొండ: అధికార, పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ఇదే విషయాన్ని శివరామకృష్ణన్, జీఎన్ రావు కమిటీలతో పాటు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదిక కూడా చెబుతోందని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని పెన్నహోబిళం శ్రీలక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ప్రతిపాదనను స్వాగతిస్తున్నామన్నారు. రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. అమరావతిలో చంద్రబాబు ‘రియల్’ దందా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ధ్వజం కర్నూలు(రాజ్‌విహార్): అమరావతి నిర్మాణంలో మాజీ సీఎం చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి.. వేల ఎకరాలతో ‘రియల్’ దందాకు శ్రీకారం చుట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ విమర్శించారు. ఆదివారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలుకు రావాల్సిన రాజధానిని ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా అమరావతి ప్రాంతంలో ప్రకటించారన్నారు. దీనివల్ల ఆయనతోపాటు మిగతా టీడీపీ నేతలు లబ్ధిపొందారు తప్ప రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలు ఏదీ లేదన్నారు. పాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇందుకు సీఎం జగన్మోహన్రెడ్డి కార్యాచరణ చేపట్టారని తెలిపారు. -
ఇన్సైడర్ ట్రేడింగ్ బయటపడుతుందనే బాబు భయం
మడకశిర: అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ ఎక్కడ బయటపడుతుందోనని చంద్రబాబు భయపడుతున్నారని, అందుకే రైతులను పావులుగా వాడుకుంటూ నీచ రాజకీయం చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా మడకశిరలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను రెచ్చగొట్టేందుకు చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కూడా తోడయ్యారని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, టీడీపీ నేతలు, చంద్రబాబు సామాజికవర్గం వారు పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు తెలిపారు. ఈ వ్యవహారం బయటికి రాకుండా చంద్రబాబు రాజధాని రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. రాజధాని రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, అన్ని ప్రాంతాల అభివృద్ధికే సీఎం వైఎస్ జగన్ పాలనా వికేంద్రీకరణ ప్రతిపాదన చేశారని, ప్రస్తుతం రాజధానిపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని, కమిటీ నివేదిక రాకుండానే చంద్రబాబు రాజధానిపై రాద్ధాంతం చేయడం తగదని శంకరనారాయణ హితవుపలికారు. -
హడావుడి.. నక్కజిత్తుల కపట గుణం!
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ దళారి స్థాయికి దిగజారి పోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. యూ-టర్నులతో ఎల్లకాలం ప్రజలను మోసగించలేరని తెలుసుకోలేక పోవడం ఆయన కర్మ అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. అమరావతి చుట్టూ నాలుగు గ్రామాల్లో మొసలి కన్నీరు కారుస్తూ పగటి వేషగాడిలా మారిపోయారంటూ ఎద్దేవా చేశారు. రాజధాని అంశంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై విజయసాయిరెడ్డి ట్విటర్లో స్పందించారు. ఈ మేరకు... ‘ ఇన్సైడర్ ట్రేడింగులో తన వాళ్లు కొన్న భూముల విలువ పెంచడానికి రాజధాని గురించి చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. హైపర్ లూప్ రవాణా, బుల్లెట్ ట్రెయిన్ కనెక్టివిటీ... ఒలంపిక్స్ నిర్వహణ, అక్కడ నివసించే వారి ఆయుష్షు పదేళ్లు పెంచడం...లాంటి నమ్మశక్యం కాని కోతలెన్నో కోశాడు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (టీడీపీ ఇన్సైడర్ ట్రేడింగ్.. ఒక్కొక్కరు ఎంత కొన్నారంటే..) నక్కజిత్తుల కపట గుణం.. ‘రాష్ట్రం నిప్పుల కుంపటి కాదు చంద్రబాబూ. ఐదేళ్ల మీ పాలనలో దోపిడీ, అరాచకాలకు అంతేలేదు. రావణ కాష్టంలా మండించావు రాష్ట్రాన్ని. అందుకే ప్రజలు తరిమి కొట్టారు’ అని విజయసాయిరెడ్డి చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ మాట తప్పరని.. అది ఆయనకు వారసత్వంగా వచ్చిన స్వభావమన్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎప్పడూ మాట మీద ఉండరని.. అది ఆయన నక్కజిత్తుల కపట గుణమని విమర్శించారు. బాబు యూ-టర్నులతో కాలం వెళ్లదీస్తారని.. ఆయన మారాలని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. మీరు అలాగే ఉండండి అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు. చదవండి: ఫలించిన ఎంపీ విజయసాయి రెడ్డి ప్రయత్నాలు మీకు అభినందనలు.. ఆంధ్రప్రదేశ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ దిశ చట్టం-2019 పటిష్ట అమలుకు ప్రత్యేక అధికారికారులుగా నియమితులైన కృతికా శుక్లా, దీపికాకు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. వీరిద్దరి నేత్వత్వంలో దిశ చట్టం పూర్తిస్థాయిలో అమలు అవుతుందని ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా ఏపీ దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఐఏఎస్ విభాగంలో కృతికా శుక్లా, ఐపీఎస్ విభాగంలో దీపికలను దిశ ప్రత్యేక అధికారిణిలుగా ప్రభుత్వం నియమించిన విషయం విదితమే.(ప్రతిష్టాత్మక ‘దిశ’ యాక్ట్‌లోని ముఖ్యాంశాలివే..) -
ఇన్సైడర్ ట్రేడింగ్
-
టీడీపీ ఇన్సైడర్ ట్రేడింగ్
-
రాజధానిలో అక్రమాలకు ఆధారాలివిగో..
సాక్షి, అమరావతి : రాజధాని ప్రాంతంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన నేరం బయట పడటం వల్ల శిక్ష అనుభవించాల్సి వస్తుందనే భయంతోనే రైతులను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని విషయంలో గత టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతికి సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా బయట పెట్టింది. ఇందుకు సంబంధించి గురువారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిలు వివరాలు వెల్లడించారు. రాజధానిలో జరిగిన భూ అక్రమాలపై 21 నిమిషాల నిడివిగల వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో వివరాలు ఇలా ఉన్నాయి. భూ దందాలో మరో కోణం క్విడ్ ప్రో కో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యాపార వేత్త లింగమనేని రమేష్ తన భార్య సుమన.. ఇతరులు ప్రశాంతి, స్వర్ణకుమారి, ఎల్.వి.రమేష్, ఎల్వీఎస్ రాజశేఖర్ పేర్లమీదే కాకుండా తన సంస్థలు లింగమనేని ఎస్టేట్స్, ఐజెఎం, లింగమనేని ఎడ్యుకేషనల్ అకడమిక్ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, కుముదల ఎస్టేట్స్, లింగమనేని ఆగ్రో ప్రై వేట్ లిమిటెడ్, లౌక్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, స్వర్ణిక ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, వల్లభ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, విఘ్నేష్ వెంచర్స్, వైట్‌సిటీ ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లమీద పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. విచిత్రంగా ఈ భూములేవీ రాజధాని నగరం పరిధిలోకిగానీ, సీఆర్డీయే పరిధిలోకి గానీ రాలేదు. లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూములకు కేవలం పది మీటర్ల దూరంలో రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోయింది. ఇందుకు ప్రతిఫలంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. లింగమనేనికి చెందిన గెస్ట్‌హౌస్‌ను తన నివాసంగా మార్చుకున్నారు. 158 ఎకరాలకు సంబంధించి ఇలాంటి అక్రమాలు జరిగాయని ఇప్పటి వరకు రికార్డులు లభించాయి. ప్లాట్ల కేటాయింపులో కూడా భారీగా అక్రమాలు జరిగాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న వారు, పైస్థానంలో ఉన్న వారు తమకు అనుకూలమైన ప్రాంతంలో ప్లాట్లను పొందగా, వీరి స్థానంలో ప్లాట్లు దక్కాల్సిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అసైన్డ్ భూముల వ్యవహారం.. రాజధాని అసైన్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు అన్నీ ఇన్నీకావు. దళితులు, నిరుపేదలు దారుణంగా మోసపోయారు. అధికార పార్టీ నేతలు రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములకు ప్లాట్లు రావని ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేశారు. అసైన్డ్ భూములు అమ్మేయాలంటూ బెదిరింపులకు దిగారు. బలవంతంగా వాటిని కొనుగోలు చేశారు. దీనికోసం సబ్రిజిస్ట్రార్లపై అప్పటి అధికార పార్టీ నాయకులు విపరీతంగా ఒత్తిడి తీసుకు వచ్చారు. తర్వాత ఈ భూములను భూ సమీకరణలో తీసుకోవడానికి, తీసుకున్న వాటికి ప్రతిఫలంగా ప్లాట్లు ఇవ్వడానికి అనుకూలంగా జీఓలు జారీ చేశారు. ఇలా అసైన్డ్ భూములను కొనుగోలు చేసి, వాటిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన వారిలో దాదాపు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడం విశేషం. అసైన్డ్ భూములను తక్కువకు కొనుగోలు చేసి రాజధానిలో ప్లాట్లు పొందిన వారిలో ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నట్టు రికార్డుల్లో వెలుగు చూసింది. నారా లోకేష్ సన్నిహితుడు కొల్లి శివారం 47.39 ఎకరాలను ఇలా కొని దానికి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. నారా లోకేష్‌కు మరో సన్నిహితుడు గుమ్మడి సురేష్ 42.925 ఎకరాల అసైన్డ్ ల్యాండ్‌ను చేజిక్కించుకున్నారు. ఇంకో సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరా తక్కువ ధరకు లాక్కున్నారు. మొత్తంగా 338.887 ఎకరాల అసైన్డ్ భూములను తక్కువ ధరకే కొనుగోలు చేసి ప్రతిఫలంగా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు పొంది ఆర్థికంగా లబ్ధి పొందారు. జోన్ల అలైన్మెంట్ల కుంభకోణం.. రాజధానిలో జరిగిన మరో కుంభకోణంలో మరో కోణం ఇష్టాను సారంగా సరిహద్దులు నిర్ణయించడం. జోన్ల అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చడం. అప్పటి అధికార పార్టీ నాయకులు, వారి బంధువులు, అనుయాయుల భూము లేవీ ల్యాండ్ పూలింగ్ జోన్లోకి రాకుండా చేయడానికి సరిహద్దులను మార్చారు. 2015 జూన్‌లో రాజధాని పరిధిని 217 చదరపు కిలోమీటర్లుగా ప్రకటించారు. ఆ తర్వాత సింగపూర్‌కు చెందిన సుర్బానాజురాంగ్‌కు డ్రాఫ్ట్ ప్లాన్ బాధ్యతలను ప్రభుత్వం అందించింది. సుర్బానాజురాంగ్ ప్రభుత్వానికి రాజధాని ప్లాన్ అందించింది. ఈ ప్లాన్ ప్రకారం 391.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని డ్రాఫ్ట్ ప్లాన్‌ను రూపొందించింది. అయితే దీన్ని అప్పటి ప్రభుత్వం పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా కేవలం 217 చదరపు కిలోమీటర్లకు పరిమితి చేస్తూ ఫిబ్రవరి 2016లో నోటిఫికేషన్ జారీ చేసి, ఆ మేరకు ల్యాండ్ పూలింగ్ చేపట్టింది. జురాంగ్ కంపెనీ ఇచ్చిన డ్రాఫ్ట్ ప్లాన్‌కు భిన్నంగా రాజధాని నగరాన్ని కుదించడం వెనుక తమకు రాజకీయంగా అనుకూలమైన వ్యక్తులను పూలింగ్ నుంచి మినహాయించి, వాటి విలువ పెరిగేలా చేసి వారికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం ఇక్కడ వెల్లడవుతోంది. ► మంగళగిరి సమీపంలోని కాజా టోల్గేట్ సమీపంలో ఉన్న రామకృష్ణా హౌసింగ్‌ను సీఆర్డీయే జోన్ పరిధిలోకి రాకుండా తప్పించి ఆ కంపెనీకి ప్రయోజనం చేకూర్చారు. ► చంద్రబాబు బావమరిది, నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు కంపెనీ వీబీసీ ఫెర్టిలైజర్స్‌కు చందర్లపాడులో కేటాయించిన 498.3 ఎకరాల భూమి విషయంలో వారికి అత్యంత అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ కంపెనీకి భూములు కేటాయించిన తర్వాత సీఆర్డీయే ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి విస్తరించారు. త ద్వారా ఆ భూములకు మంచి రేటు వచ్చేలా చేశారు. ► రాజధాని చుట్టూ నిర్మించ దలచిన ఇన్నర్ రింగురోడ్డు, దాన్ని అనుసంధానిస్తూ నిర్మించ దలచిన రోడ్ల విషయంలోనూ అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ పేరుమీద కొనుగోలుచేసిన భూములు ఇన్నర్ రింగ్‌రోడ్డుకు పక్కనే ఉన్నాయి. ► చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు మురళీ మోహన్ కుంచనపల్లె సమీపంలో కొనుగోలు చేసిన 53.29 ఎకరాలకు ఆనుకుని ఇన్నర్ రింగు రోడ్డు వచ్చేలా చేశారు. పక్కా ప్లాన్‌తో భూ దందా 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 31 వరకు అంటే రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాజధాని ప్రకటన జరిగేంత వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాజధాని ఎక్కడ రాబోతున్నదనే ముందస్తు సమాచారంతో అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, అమరావతి, తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చందర్లపాడు మండలాల్లో భూముల లావాదేవీలు చేశారు. రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై 2014 ఆగస్టు 27న శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన సమగ్ర నివేదికను పూర్తిగా పక్కన పడేశారు. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 25 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తూ 2014 డిసెంబర్ 30న ఏపీ సీఆర్డీయే చట్టాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆమోదించింది. రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రాజధాని ప్రకటన జరిగిన 2014 సెప్టెంబర్ 4లోపు తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో తమ బంధువులు, బినామీల పేర్ల మీద భూములు కొనుగోలు చేశారు. 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు గుంటూరు జిల్లాలోని రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2,279.91 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 1,790 ఎకరాలు కొనుగోలు చేశారు. మొత్తం 4,069.91 ఎకరాలు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా లబ్ధి పొందారు. లంకా దినకర్ (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు), కంభంపాటి రామ్మోహన్రావు కుమార్తె కంభంపాటి స్వాతి , పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం, అల్లుడు వడ్లమూడి శ్రీహర్ష.. వారు నడుపుతున్న ఆర్.ఆర్.ఇన్ఫ్రా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్.. కూడా భారీగా భూములు కొనుగోలు చేశారు. (పైన పేర్కొన్న వాటికి అసైన్డ్ భూములు అదనం) రాష్ట్రం మొత్తం మీద 800 మంది తెల్లరేషన్ కార్డు దారులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో 60 మంది తెల్లరేషన్ కార్డు దారులు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. చదవండి: ‘వారి బినామీలే భూములు కొనుగోలు చేశారు’ ఇన్సైడర్ ట్రేడింగ్ నిజమే రాజధాని దందా నిగ్గు తేలుస్తాం బట్టబయలైన అమరావతి కుంభకోణం ‘మొదట గుంటూరు, నూజివీడు అని చెప్పి..’ రాజధానిలో తవ్వేకొద్దీ ‘ఇన్సైడర్’ బాగోతాలు రాజధానిలో మరో భారీ భూ కుంభకోణం నారా లోకేశ్ తోడల్లుడి అబద్ధాలు వంద శాతం ఇన్సైడర్ ట్రేడింగే -
టీడీపీ ఇన్సైడర్ ట్రేడింగ్.. ఒక్కొక్కరు ఎంత కొన్నారంటే..
సాక్షి, తాడేపల్లి: అమరావతి విషయంలో టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతికి సంబంధించిన వివరాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వీడియో ప్రజెంటేషన్ రూపంలో విలేకరుల ముందుకు తీసుకువచ్చింది. గురువారం ఇందుకు సంబంధించిన విజువల్స్‌ను పార్టీ కార్యాలయంలో ప్రసారం చేసింది. ఆ వీడియోలో ఉన్న వివరాల ప్రకారం... రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం మార్చి 1, 2014 ఏపీ పునర్విభజన చట్టం చేసింది. హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిశీలనకై మార్చి 28, 2014 కేంద్రం శివరామకృష్ణన్ కమిటి వేసింది. ఈ కమిటీ ఆగస్టు 27, 2014లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే శివరామకృష్ణన్ నివేదిక ఇవ్వకుండానే చంద్రబాబు రాజధాని విజయవాడలో ఉంటుందని ప్రకటించేశారు. ఈ క్రమంలో డిసెంబరు 30, 2014లో సీఆర్డీఏ చట్టాన్ని ప్రభుత్వం ఆమోదించింది. చంద్రబాబు నిర్ణయాన్ని శివరామకృష్ణన్ అనేక సందర్భాల్లో తప్పుపట్టిన పట్టించుకోలేదు. నిజానికి శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకముందే చంద్రబాబు తన మంత్రులు, నాయకులతో ఒక కమిటీ వేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌తో 4070 ఎకరాల భూములను టీడీపీ నేతలు అమరావతిలో కొన్నారు. గుంటూరు జిల్లాలో మంగళగిరి, తుళ్లూరు, అమరావతి, తాడికొండ, పెదకూరపాడు, పెదకకాని, తాడేపల్లి మండలాల్లో 2279 ఎకరాలు టీడీపీ నేతలు సొంతం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చంద్రళ్ళపాడులో 1790 ఎకరాల భూమి టీడీపీ నేతలు కొన్నారు. జూన్ 1, 2014 నుంచి డిసెంబరు 31 2014 వరకు టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ కొనసాగింది. జూన్ 1, 2014 నుంచి డిసెంబరు 31, 2014 వరకు రాజధానిలో కొన్న భూముల వివరాలు జూన్‌లో 530 ఎకరాలు జూలైలో 685 ఎకరాలు ఆగస్టులో 353 ఎకరాలు సెప్టెంబర్ లో 567 ఎకరాలు అక్టోబర్ లో 564 ఎకరాలు నవంబర్ లో 836 ఎకరాలు డిసెంబరులో 531 ఎకరాల భూమిని టీడీపీ నేతలు కొన్నారు. హెరిటేజ్ కంపెనీ 14.22 ఎకరాలు పయ్యావుల కుటంబ సభ్యలు పేరు మీద భూములు వేం నరేందర్‌రెడ్డి కుటంబ సభ్యుల పేరు మీద 15.30 ఎకరాలు పల్లె రఘునాథ్ రెడ్డి కుటంబ సభ్యుల పేరుతో 7.50 ఎకరాలు కొమ్మలపాటి శ్రీధర్ 68.6 ఎకరాలు లంక దినకర్, కంభంపాటి మోహన్ రావు వారి కుటంబ సభ్యుల పేరుతో భూములు కొన్నారు. పరిటాల సునీత తన కుమారుడు, అల్లుడు పేరు మీద భూములు కొన్నారు. కోడెల బినామీ పేరుతో 17.31 ఎకరాల భూమి కొన్నారు. పత్తిపాటి పుల్లారావు బినామిల పేరుతో 38.84 ఎకరాలు భూములు కొన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర కుటంబ సభ్యుల పేరు మీద 13.5 ఎకరాలు నారాయణ తన దగ్గర పని చేసే సబ్బంది పేరుతో 55.27 ఎకరాలు రావెల కిషోర్ బాబు తన కంపెనీ పేరుతో 40.85 జీవీ ఆంజనేయులు 37.84 ఎకరాలు వేమూరి రవి 25 ఎకరాలు.. కంపెనీ పేర మీద 6.2 ఎకరాలు నారా లోకేష్ బినామిలు కొల్లు శివరాం 47.39 ఎకరాలు నారా లోకేష్ బినామీ గుమ్మడి సురేష్ 42.9 ఎకరాలు నారా లోకేష్ బినామీ బలుసు శ్రీనివాస్ 14 ఎకరాలు భూమి కొన్నారు. ఇక నారా లోకేశ్ మామ బాలకృష్ణ వియ్యంకుడు రామారావుకు 498 ఎకరాలు కేటాయించారు. తరువాత ఆ భూమి ఉండే పరిధిని సీఆర్డీఏలోకి తెచ్చారు. హెరిటేజ్ 14 ఎకరాల భూములు, మురళీమోహన్ 53.29 భూములు ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కకు వచ్చేలా అలైన్మెంట్ మార్చారు. లింగమనేనికి చెందిన వందలాది ఎకరాలు ల్యాండ్ పూలింగ్‌లోకి రాకుండా చక్రం తిప్పారు. లింగమనేని భూమికి 10 మీటర్ల వరకు వచ్చి ల్యాండ్ పూలింగ్ ఆపేశారు. దీనికి ప్రతిఫలంగా లింగమనేని గెస్ట్ హౌస్ చంద్రబాబుకు లింగమనేని ఇచ్చారు. అంతేకాదు 800 మంది తెల్ల రేషన్ కార్డుదారులు రాజధానిలో భూములు కొన్నారు. తెలంగాణకు చెందిన 60 మంది తెల్ల రేషన్ కార్డుదారులు సైతం రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారు. అంతేకాదు 2 వేల ఎకరాల అసైన్డ్ భూములను దళితులను బెదిరించి, భయపెట్టి టీడీపీ నాయకులు తక్కువ ధరకు కొన్నారు. -
ఏం లేకపోతే మీకెందుకు భయం
-
మీరు అంత నిప్పు, పత్తి గింజ అయితే....
సాక్షి, విశాఖ : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి విజయ సాయిరెడ్డి ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘నిన్నటి చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్సు సంతాప సమావేశంలా ఉంది. మీరు అంత నిప్పు, పత్తి గింజ అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగనే లేదు. మా అందరికీ ఒకేసారి కల వచ్చి 4 వేల ఎకరాల భూములు కొనుగోలు చేశామని చెప్పండి. దీనిపై దర్యాప్తు చేసి మాపై పడిన నింద తొలగించమని సీబీఐని కోరండి. ఏం లేకపోతే మీకెందుకు భయం. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగక పోతే టీడీపీ నాయకులు, చంద్రబాబు వర్గం రియల్ ఎస్టేట్ వ్యాపారులు నాలుగు వేల ఎకరాల భూమిని కూడబలుక్కున్నట్టు ఎలా కొంటారు? 2014 జూన్ లో బాబు సిఎం అయ్యారు. డిసెంబర్ లో అమరావతిని క్యాపిటల్ గా ప్రకటించే లోపే ఐదు నెలల్లో ఎగబడి కొన్నారంటే తెలియడం లేదా?’ అని సూటిగా ప్రశ్నించారు. రాజధాని కోసం చంద్రబాబు మార్కెటింగ్ మేనేజర్ అవతారం ఎందుకెత్తారో ఢిల్లీ మీడియా వర్గాలకు అప్పట్లో అంతుబట్టలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమని ఇప్పుడర్థమైంది. ప్రజా ధనంతో దేశాలు తిరిగి అమరావతిపై ప్రెజెంటేషన్లు ఇచ్చాడు. పెట్టుబడుల కోసమైతే వెనకబడిన జిల్లాల గురించి ప్రస్తావించొచ్చు కదా?.. అని విజయ సాయిరెడ్డి విమర్శించారు. కాగా విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిదంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని ఎంపీ విజయ సాయిరెడ్డి అన్నారు. ఆరోపణలపై సీబీఐతో విచారణ కోరవచ్చని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు తన కుటుంబం మాత్రమే బాగుండాలనే వ్యక్తి అని, ఆయనది కుటిలమైన మనస్తత్వం అని అన్నారు.చంద్రబాబు తాను తప్ప ఎవరూ ఎదగకూడదనుకునే నైజం ఉన్న వ్యక్తి అని మండిపడ్డారు. కాగా నేటి నుంచి రెండు రోజుల పాటు విశాఖ ఉత్సవ్ సందర్భంగా ఎంపీ విజయ సాయిరెడ్డి ఇవాళ ఉదయం వైఎస్సార్ సెంట్రల్ పార్క్‌లో ఫ్లవర్ షో ను ప్రారంభించారు. చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్ నిజమే -
ఇన్సైడర్ ట్రేడింగ్ వాస్తవమే
-
‘వారి బినామీలే భూములు కొనుగోలు చేశారు’
సాక్షి, మచిలిపట్నం: అమరావతి పేరుతో గత ప్రభుత్వ హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి పేర్ని నాని అన్నారు. శనివారం ఉదయం సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడారు. రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు బినామీలతో భూములు కొనుగోలు చేయించారన్నారు. చంద్రబాబు ఊహజనిత కలల రాజధాని కట్టాలనుకున్నారని.. చంద్రబాబు నిర్ణయాలతో కొంతమంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ‘లక్ష కోట్ల మౌలిక వసతులు కల్పించినా 30 ఏళ్ల తర్వాతైనా.. హైదరాబాద్, చెన్నై లాంటి నగరాలతో పోటీ పడే పరిస్థితి వస్తుందా.. ఒక్క ప్రాంతంలోనే లక్ష కోట్లు ఖర్చుచేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితేంటి.. స్వయం సంవృద్ధి ప్రాంతమైతే వేల కోట్లు అప్పు ఎందుకు తెచ్చారు. ఏడాదికి రూ.570 కోట్ల వడ్డీ ఎందుకు చెల్లించారు’ అని పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఐదేళ్లలో కేవలం రూ.5,400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరికి సమస్య వచ్చినా సీఎం సానుకూలంగా స్పందిస్తారని తెలిపారు. కచ్చితంగా రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. అందరికీ సానుకూలమైన పరిష్కారమే ప్రభుత్వం చూపిస్తుందన్నారు. హెరిటేజ్‌తో తన కుమారుడు లోకేష్‌కు చంద్రబాబు సంపద సృష్టించారన్నారు. గత ప్రభుత్వంలో పోలవరం ఏటీఎంలా మారిందని సాక్ష్యాత్తూ ప్రధానే చెప్పారని పేర్ని నాని పేర్కొన్నారు. (చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్ నిజమే) -
రాజధాని భూ కుంభకోణంపై సమగ్ర నివేదిక
-
ఇన్సైడర్ ట్రేడింగ్ నిజమే
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో అప్పటి సీఎం చంద్రబాబు, ఆయన బ్యాచ్ పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని, రాజధాని ప్రకటన సమాచారం ముందే తెలుసుకుని భూములు కొనుగోలు చేసి అక్రమాలకు తెగించారని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. ఈ విధంగా టీడీపీ నేతలు 4,069.94 ఎకరాల భూమిని కాజేశారని.. జూన్ 1, 2014 – డిసెంబర్31, 2014 మధ్యకాలంలో బినామీల పేరిట ఆ భూములను దోచేశారని నివేదికలో స్పష్టం చేసింది. ఇలా ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన వారిలో సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ సన్నిహితుడు వేమూరు రవికుమార్ ప్రసాద్, మాజీ మంత్రులు పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు జీవీఎస్ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహన్రావు, లంకా దినకర్, పుట్టా మహేష్‌యాదవ్(అప్పటి ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు) తదితరులు ఉన్నారని గుర్తించింది. అసైన్డ్, లంక భూముల్లోనూ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని.. అస్మదీయుల కోసం రాజధాని సరిహద్దులను మార్చేసి లబ్ధి పొందారని ఉపసంఘం నిర్ధారించింది. ప్రైవేటు సంస్థలకు భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు నివేదికలో పొందుపర్చారు. టీడీపీ సర్కార్ హయాంలో అమరావతి ప్రాంతంలో జరిగిన భూఅక్రమాలపై విచారణకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డిల నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంతంలోని భూదోపిడీపై ఉపసంఘం విచారణ చేసి సీఎంకు శుక్రవారం నివేదిక అందచేసింది. మంత్రివర్గ ఉపసంఘం నివేదికలోని ముఖ్య వివరాలు అధికారిక రహస్యాలు వెల్లడించనని చేసిన ప్రమాణాన్ని(ఓత్ ఆఫ్ సీక్రసీ) తుంగలోకి తొక్కి.. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే అంశంపై తన వందిమాగధులకు లీకులిచ్చి అప్పటి సీఎం చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు తెరదీశారు. తన కోటరీ నేతలు, బినామీలు తక్కువ ధరకు భూములు దోచేశాక, రాజధానిపై అధికారిక ప్రకటన చేశారు. ఇదో అంతర్జాతీయ కుంభకోణమని అప్పట్లో ప్రసార మాధ్యమాలు, రాజకీయ పక్షాలు, మేధావులు ఆరోపించారు. ►టీడీపీ సర్కార్ అధికారంలోకి రాగానే చంద్రబాబు ఇచ్చిన లీకుల మేరకు ఆయన, ఆయన బినామీలు, మంత్రుల బినామీల ద్వారా రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున భూముల్ని తక్కువ ధరకు కాజేశారు. జూన్ 1, 2014 నుంచి డిసెంబర్ 31, 2014 మధ్య జరిగిన రిజిస్ట్రేషన్లు పరిశీలించాక.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా 4,069.94 ఎకరాలను కొల్లగొట్టారు. ►చంద్రబాబుకు సన్నిహితుడైన లింగమనేని రమేష్.. తన పేరిట, భార్య ఎల్.సుమన, బంధువులు ఎల్.ప్రశాంతి, ఎల్.స్వర్ణకుమారి, ఎల్వీ రమేష్, ఎల్వీఎస్ రాజశేఖర్ల పేరిట భారీగా భూములు కొనుగోలు చేశారు. ►మాజీ మంత్రి నారాయణ.. తన వద్ద పనిచేసే అవుల మునిశంకర్, రాపూరు సాంబశివరావు, పొత్తూరి ప్రమీల, కోతపు వరుణ్‌కుమార్‌ల పేర్లతో 55.27 ఎకరాల భూమిని కొన్నారు. ►నాటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్ పేరిట 38.84 ఎకరాల భూమి.., అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తన బినామీ సంస్థ అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 68.6 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ►చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు సన్నిహితుడైన వేమూరు రవికుమార్ ప్రసాద్ ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గోష్పాద గ్రీన్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ ట్రెండ్స్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ పేరిట 62.77 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. ►మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు తన బినామీ సంస్థ మైత్రి ఇన్ఫ్రా పేరిట 40.85 ఎకరాలు.. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ బినామీ సంస్థ శశి ఇన్ఫ్రా పేరిట 17.13 ఎకరాలు కొనుగోలు చేసినట్లు స్పష్టమైంది. అసైన్డ్, లంక భూముల పేరిట దగా రాజధాని ప్రాంతంలో 2353.28 ఎకరాల అసైన్డు, లంక భూములను మాజీ సైనికులు, రాజకీయ బాధితులు మొదలైనవారికి 1954కు ముందు, ఆ తర్వాత అసైన్డ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములున్నాయి. అసైన్డ్ భూముల మార్పిడి అక్రమం. అడ్డగోలుగా అసైన్డు, లంక భూములు కొనుగోలు చేసిన చంద్రబాబు అండ్ కో ల్యాండ్ పూలింగ్ కింద వాటిని ఇచ్చినట్లు గుర్తించారు. ►నవులూరు, కురగల్లు గ్రామాల్లో అటవీ భూమిని డీ–రిజర్వ్‌గా వర్గీకరించారు. అటవీ భూమిని పోరంబోకు భూమిగా మార్చేసి వాటిని 1954కు ముందు సిపాయిలు తదితరులకు అసైన్ చేసినట్లు చూపారు. నిజానికి ఈ భూములను నిషేధిత జాబితా(సెక్షన్22(1) కింద చేర్చి రిజిస్ట్రేషన్లు నిషేధించారు. అయితే వాటిని ఆ జాబితా నుంచి తొలగించి దోచుకున్నారని మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారించింది. సన్నిహితుల సంస్థలకు 850 ఎకరాలు ధారాదత్తం భూసమీకరణ ద్వారా రైతుల నుంచి తీసుకున్న భూముల కేటాయింపులోనూ టీడీపీ సర్కార్ అక్రమాలకు పాల్పడినట్లు మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. రాజధాని ప్రాంతంలో 850 ఎకరాల భూములను సన్నిహితుల సంస్థలకు ధారాదత్తం చేసినట్లు గుర్తించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఒక ధరకు.. ప్రైవేటు సంస్థలకు మరో ధరకు కేటాయించారని ఎత్తిచూపింది. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పేరుతో 1691 ఎకరాలను సింగపూర్ సంస్థలు అసెండాస్–సిన్బ్రిడ్జ్–సెమ్బ్కార్ప్లకు కట్టబెట్టారని.. ఈ సంస్థలతో కలిసి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏర్పాటు చేసిన ఏడీపీ(అమరావతి డెవలప్ పార్టనర్)లో 58 శాతం సింగపూర్ సంస్థలకైతే.. రాష్ట్ర ప్రభుత్వం వాటా 42 శాతమేనని తేల్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇతర రహదారుల అలైన్మెంట్లు మార్చడం ద్వారా అస్మదీయులకు భారీగా చంద్రబాబు ప్రయోజనం చేకూర్చినట్లు మంత్రివర్గ ఉప సంఘం గుర్తించింది. -
రాజధాని దందా నిగ్గు తేలుస్తాం
సాక్షి, అమరావతి: ‘రాజధాని ముసుగులో అమరావతి వేదికగా గత సర్కారు పాలనలో అంతులేనన్ని అక్రమాలు చోటు చేసుకోవడంపై లోకాయుక్త, సీఐడీ, సీబీఐలలో ఏదో ఒక సంస్థతో దర్యాప్తు చేయించాలని శుక్రవారం రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని గత పాలకులు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని మంత్రివర్గ ఉపసంఘం నిగ్గు తేల్చడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై పలు రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు లభ్యం కావడంతో మరింత లోతుగా సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. కేబినెట్ సమావేశం అనంతరం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో జరిగిన కుంభకోణంపై మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని చెప్పారు. రాజధాని వ్యవహారంలో చాలా తప్పులు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రికి వాటాలు ఉన్న సంస్థ కూడా ఈ ప్రాంతంలో 2014 డిసెంబర్‌కు ముందు (రాజధాని ఈ ప్రాంతంలో వస్తుందని అధికారికంగా ప్రకటించడానికి ముందు) భూములు కొనుగోలు చేసిన విషయం బట్టబయలైందని చెప్పారు. రాజధాని ప్రకటించడానికి కొంత ముందు అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరెవరు ఆ ప్రాంతంలో భూములు కొన్నారో పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కచ్చితంగా బయట పెడతాం ‘రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలిసినందున గత పాలకులు.. డ్రైవర్లు, పనివాళ్లు, బంధువుల పేర్లతో కారు చౌకగా భూములు కొన్నారు. నైతిక విలువలు వదిలేసి అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా తేలింది. 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ నెలాఖరు మధ్య (రాజధాని ఎక్కడ పెడతారో ప్రకటించక ముందు) టీడీపీ నేతలు ఇక్కడ 4,075 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అని మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. ఇలా చేయరాని తప్పులు చేసిన వారే ఇప్పుడు రోడ్డెక్కి మాట్లాడుతున్నారు. రైతులను రెచ్చగొడుతున్నారు. దమ్ముంటే అక్రమాలు నిరూపించాలని సవాలు చేస్తున్నారు. జరిగిన తప్పును ఎవరూ దాచలేరు. అందుకే మొత్తం వ్యవహారంపై లోకాయుక్త లేదా సీఐడీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెచ్చగొడుతూ.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేస్తున్న పెద్ద మనుషుల కోరికను తప్పకుండా మా ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఎవరెవరు ఏమేరకు అక్రమాలకు పాల్పడ్డారో అన్ని విషయాలు విచారణలో బయటకు వస్తాయి’ అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. -
బట్టబయలైన అమరావతి కుంభకోణం
-
బట్టబయలైన అమరావతి కుంభకోణం
సాక్షి, అమరావతి : రాజధాని పేరుతో అమరావతి వేదికగా టీడీపీ ప్రభుత్వం పాల్పడిన కుంభకోణం బట్టబయలైంది. రాజధాని అవినీతిపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం కీలక నివేదికను సమర్పించింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో దీనిని బహిర్గతం చేసింది. ఉపసంఘం బయటపెట్టిన నివేదికలో అమరావతిలో వేలకోట్ల అవినీతి జరిగినట్టు తేలింది. ఆధారాలతో సహా ఇన్ సైడర్ ట్రేడింగ్‌ను బయటపెట్టింది. టీడీపీ నేతల బండారాన్ని మంత్రివర్గ ఉపసంఘం పూస గుచినట్టు వివరించింది. రాజధాని ప్రకటన కంటే ముందు టీడీపీ నేతలు 4,075 ఎకరాల భూములను కొనుగోలు చేసినట్టు నివేదిక పేర్కొంది. (ఏపీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు) మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ సంస్థ, లింగమనేని, వేమూరి హరిప్రసాద్‌ల పేర్లతో భారీగా భూ కొనుగోలు చేసినట్టు వివరాలతో కూడిన నివేదికన ప్రభుత్వానికి సమర్పించింది. గత ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, పరిటాల సునీతతో సహా టీడీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలందరి భూ కుంభకోణాలను కమిటీ బట్టబయలు చేసింది. 900 ఎకరాల అసైన్డ్ భూములను ఎస్సీ, ఎస్టీల నుంచి టీడీపీ నేతలు బలవంతంగా కొనుగోలు చేసినట్టు కూడా కమిటీ నివేదికలో తెలిపింది. తెల్ల రేషన్ కార్డు దారులు కూడా కోట్ల విలువైన భూములు కొనుగోలు చేసినట్టు స్పష్టం చేసింది. హైద్రాబాద్‌లో తెల్ల రేషన్ కార్డు దారులు కూడా అమరావతిలో భూములు కొన్నట్టు, టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ తో భూములు కొన్నట్టు కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ కోసమే సీఆర్డీఏ పరిధిని అనేక మార్లు మార్చినట్టు ఆధారాలు గుర్తించిన ఉపసంఘం, దానిని ప్రభుత్వానికి సమర్పించింది. భారీ కుంభకోణం బయటకు రావడంతో టీడీపీ నేతలు బండారం బయటపడినట్లయింది. కాగా రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబుకు వాటాలు ఉన్న కంపెనీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన భూములపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని విచారణ జరిపిస్తామని మంత్రి పేర్ని నాని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. లోకయుక్త, సీబీఐ లేదా సీఐడీతో విచారణ జరిపించేలా నిర్ణయం ఉంటుందని మంత్రి ప్రకటించారు. -
‘మొదట గుంటూరు, నూజివీడు అని చెప్పి..’
సాక్షి, అమరావతి : రాజధానిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలతోనే బాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని విమర్శించారు. రాజధాని అంశంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. రాజధానిపై శిమరామకృష్ణ నివేదిక ఇస్తే చర్చ కూడా జరపలేదని మంత్రి అన్నారు. మొదట గుంటూరు, నూజివీడు అని చెప్పి ఆ తర్వాత అమరావతి రాజధాని అని ప్రకటించారని వెల్లడించారు. 4070 ఎకరాలు బాబు తన అనుచరులకు కట్టబెట్టారని బుగ్గన ఆరోపించారు. ‘చంద్రబాబు చేసింది కచ్చితంగా ఇన్సైడర్ ట్రేడింగే. రింగ్ రోడ్డు కూడా వారి భూములను ఆనుకుని పోయేటట్టు చేశారు. రైతులను బెదిరించి అసైన్డ్ భూములను తక్కువ ధరలకు లాక్కొన్నారు. లేని లంక భూములను ఉన్నట్టు సృష్టించి దోపిడీ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చంద్రబాబు సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు తీసుకొచ్చారు. రిజర్వు బ్యాంకుకైతే ఎకరా రూ.4 కోట్లా..! తన అనుచరులైతే ఎకరాకు రూ.20 లక్షలా..! ప్లాట్లు వేసి ఒక బిల్డింగ్ కట్టడం కోసం చంద్రబాబు సింగపూర్ కంపెనీలను తీసుకొచ్చారు. ఐదేళ్లలో విజయవాడలో ఫ్లైఓవర్ కట్టలేకపోయారు. అప్పులు తీసుకొచ్చి పండగలు చేసుకున్నారు. ప్రతి ఏడాది భూములు అమ్మి సంపద సృష్టిస్తారట’అని బుగ్గన అన్నారు. -
‘మొదట గుంటూరు, నూజివీడు అని చెప్పి..’
-
రాజధానిలో తవ్వేకొద్దీ ‘ఇన్సైడర్’ బాగోతాలు
సాక్షి, అమరావతి: రాజధానిలో తవ్వే కొద్దీ టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ బాగోతాలు మరిన్ని వెలుగుచూస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం నూతన రాజధాని గురించి అధికారికంగా ప్రకటించకముందే చంద్రబాబు తన టీమ్‌కు లీకులు ఇవ్వడంతో పచ్చ కోటరీ అమరావతి ప్రాంతంలో భారీగా భూకొనుగోళ్లు జరిపినట్లు తెలుస్తోంది. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్‌కుమార్ జూన్ 6, 2014న తాడికొండలో 7 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 31, 2014న నేలపాడులోని సర్వే నంబర్ 59లో టీడీపీ నేత నిమ్మకాయల చిన్నరాజప్ప తన కుమారుడు రంగనాథ్ పేరుతో రెండు ఎకరాలు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఎకరం 7 లక్షలకు కొని కోటి రూపాయలకు చినరాజప్ప అమ్మినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మరో మూడు గ్రామాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూకొనుగోళ్లు బయటపడ్డాయి. కొండంరాజుపాలెంలో సర్వే నెంబర్ 23/బీ1లో అక్టోబర్10, 2014న ఎకరం భూమి, కొండంరాజుపాలెంలో సర్వే నెంబర్ 51/డీలో అక్టోబర్ 10, 2014న ఎకరం 4సెంట్లు, కొండంరాజుపాలెంలో సర్వే నెంబర్ 63/ఏలో అక్టోబర్ 10, 2014న 67సెంట్లు, కురగల్లులో సర్వే నెంబర్ 8/2 అక్టోబర్ 14, 2014న ఎకరం 29సెంట్లు కూతురు గోనుగుంట్ల లక్ష్మీసౌజన్య పేరుతో కొనుగోలు చేసినట్లు తెలిసింది. 2014 నవంబర్ 27న లింగాయపాలెంలో సర్వే నెంబర్ 149లో ఎకరం 25సెంట్లు తండ్రి గోనుగుంట్ల సత్యనారాయణ పేరుతో ఆంజనేయులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
రాజధానిలో మరో భారీ భూ కుంభకోణం
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. రాజధాని ఎక్కడ వస్తుంది అనే అంశం గురించి చంద్రబాబు తన టీమ్‌కు ముందుగానే లీకులిచ్చారు. దాంతో రాజధాని ప్రకటించకముందే చంద్రబాబు కోటరీ భారీగా భూములు కొన్నది. సాక్షి టీవీ ఇన్విస్టిగేషన్లో టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ వెలుగు చూసింది. ఈ కుంభకోణానికి సంబంధించి సాక్షి టీవీ కీలక ఆధారాలు సంపాదించింది. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్‌లో కీలక సూత్రధారుగా వ్యవహరించారు. ప్రభుత్వం రాజధాని గురించి ప్రకటించకముందే ఆంజనేయులు, తన కుమార్తె లక్ష్మీ సౌజన్య, తండ్రి సత్యనారాయణ పేరుతో భూములు కొనుగోలు చేసిన వ్యవహారం బట్టబయలైంది. రాజధాని ప్రాంతంలోని మందడం, కొండమరాజుపాలెం, కురగల్లు, లింగాయపాలెం, నేలపాడు, వెలగపూడి, వెంకటపాలెం, ఐనవోలులో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా ఆంజనేయులు భూములు కొనుగోలు చేశారు. సర్వే నెంబర్ 106/1, 106/2 లో అక్టోబర్ 2014లో 2ఎకరాల 22సెంట్ల భూమిని కుమార్తె లక్ష్మీ సౌజన్య పేరుతో కొన్నట్టు తేలింది. సర్వే నెంబర్ 374/సీ అక్టోబర్ 9, 2014న ఎకరం 79సెంట్లు, సర్వే నెంబర్ 420/1ఏ అక్టోబర్ 9 2014న 96 సెంట్లు, సర్వే నెంబర్ 430/1ఏ సెప్టెంబర్ 23, 2014న 98 సెంట్ల భూమిని తండ్రి గోనుగుంట్ల సత్యనారాయణ పేరుతో ఆంజనేయులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. (చదవండి: నారా లోకేశ్ తోడల్లుడి అబద్ధాలు) -
నారా లోకేశ్ తోడల్లుడి అబద్ధాలు
సాక్షి, విజయవాడ: రాజధాని భూముల విషయంలో టీడీపీ నేత నారా లోకేశ్ తోడల్లుడు శ్రీభరత్ అబద్ధాలు బట్టబయలైయ్యాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామం సమీంలోని సర్వే నంబర్ 93లో 498 ఎకరాల భూమిపై శ్రీభరత్ అవాస్తవాలు చెప్పినట్టు సీఆర్డీఏ అధికారులు తేల్చారు. ఈ భూములను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తమకు కేటాయించినట్టు భరత్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చంద్రబాబు హయాంలో 2015, జూలై 15న జయంతిపురం భూములను విఎఫ్‌సీఎల్ ఫెర్టిలైజర్ కంపెనీకి కేటాయించినట్టు సీఆర్డీఏ అధికారులు వెల్లడించారు. లోకేశ్ తోడల్లుడికి భూములు కేటాయించిన తర్వాత ఈ ప్రాంతాన్ని చంద్రబాబు సర్కారు 2015, సెప్టెంబర్ 22న సీఆర్డీఏ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. తన బంధువులు, బినామీలతో భూములు కొనిపించి వాటిని రాజధాని పరిధిలోకి వచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం చక్రం తిప్పినట్టు దీన్నిబట్టి తెలుస్తోంది. రాజధాని భూముల్లో వందశాతం ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఆధారాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి తన కుటుంబ సభ్యులు, షెల్ కంపెనీల పేరుతో అమరావతి ప్రాంతంలో 623.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బట్టబయలు చేసిన విషయం విదితమే. (చదవండి: సుజనా.. భూ ఖజానా) -
వంద శాతం ఇన్సైడర్ ట్రేడింగే
సాక్షి, అమరావతి: రాజధాని భూముల్లో వంద శాతం ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, దీనిపై తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వీటన్నిటిపై ప్రభుత్వం విచారణ చేసి నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. మంగళవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. వరదలు వస్తే రాజధాని ప్రాంతం ముంపునకు గురవుతుందని అనగానే టీడీపీ నేతలు ఉలిక్కిపడి రాజధానిని అమరావతి నుంచి మారుస్తున్నారంటూ దుష్ప్రచారం ప్రారంభించారని విమర్శించారు. ‘సుజనా చౌదరి రాజధానిలో సెంటు భూమి లేదంటున్నారు. సుజనాకు ఉన్న 120 కంపెనీల్లో కళింగ గ్రీన్‌టెక్ కంపెనీ డైరెక్టర్ జతిన్‌కుమార్‌కు చందర్లపాడు గుడిమెట్ల గ్రామంలో 110 ఎకరాలు ఉండటం అవాస్తవమా? సుజనా సోదరుడి కుమార్తె యలమంచిలి రుషికన్యకు వీరులపాడు మండలం గోకరాజుపాలెంలో 14 ఎకరాలు ఉండటం నిజం కాదా? బాలకృష్ణ వియ్యంకుడు (నారా లోకేష్ తోడల్లుడి తండ్రి) రామారావుకి 493 ఎకరాలను ఏపీఐఐసీ ద్వారా ఎకరం రూ.లక్ష చొప్పున ఇచ్చి ఆ తర్వాత ఆ భూములను సీఆర్డీఏ పరిధిలోకి తేవడం నిజం కాదా? ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా?’ అని బొత్స ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలు డీకేటీ భూములను పట్టాలుగా మార్చి రాజధానికి ఇవ్వవచ్చని జీవో ఇస్తే వాటిని తీసుకుని ల్యాండ్‌పూలింగ్‌కు ఇచ్చారని, ఓ వ్యక్తి పేరిట 25 వేల చదరపు గజాలు ఉన్నట్టు తేలిందని దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అనక ఇంకేమంటారో చంద్రబాబే చెప్పాలని బొత్స వ్యాఖ్యానించారు. ఇంతకంటే ఇంకేం ఆధారాలు కావాలని నిలదీశారు. ‘రాజధానిలో అభివృద్ధి ఆగిపోయిందని, రియల్ ఎస్టేట్ దెబ్బ తిందని చంద్రబాబు చెబుతున్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు ఇలా పలు పట్టణాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకున్న విషయం గమనించాలి. రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది వినకుండా నారాయణ కమిటీ చెప్పినట్టు చేశారు’ అని బొత్స పేర్కొన్నారు. మెట్రో రైలు డీపీఆర్ అందింది.. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నివేదిక వచ్చిందని, మంగళవారం దీన్ని పరిశీలించామని బొత్స తెలిపారు. 67 కిలోమీటర్ల ప్రాజెక్టుకు రూ.24,460 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారన్నారు. సాధారణంగా రోడ్డుపై నిర్మిస్తే కిలోమీటరుకు రూ.169 కోట్లు వ్యయం అయితే భూగర్భ లైనుకు రూ.490 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారన్నారు. అమరావతిలో భూగర్భ రైలు మార్గం ఎందుకో అర్థం కావడం లేదని, అన్నీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజధాని రైతులందరికీ కౌలు చెల్లింపులు రాజధానికి భూములిచ్చిన రైతులందరికీ రెండు రోజుల్లో కౌలు చెల్లిస్తామని బొత్స చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అమెరికా పర్యటనకు వెళ్లే ముందే ఈ విషయం చెప్పామని, రైతులకు ఇబ్బంది కలగకుండా సమస్యను తక్షణమే పరిష్కరించాలని సూచించారని, త్వరలోనే రూ.187.40 కోట్ల కౌలు పరిహారం చెల్లిస్తామన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, రైతుకు చీమకుట్టినా సహించదన్నారు. ప్రతి సంవత్సరం జూలై నుంచి ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో భూములిచ్చిన రైతులకు కౌలు ఇస్తామన్నారు. కృష్ణా వరదలపై పెయిడ్ ఆర్టిస్టులతో బురద చల్లేందుకు ప్రయత్నించి చంద్రబాబు అభాసుపాలయ్యారని బొత్స పేర్కొన్నారు. -
టెక్నాలజీతో ఇన్‌సైడర్స్‌కి చెక్
♦ సోషల్ మీడియాపైనా నిఘా ∙ ♦ ఇన్సైడర్లు, ఇన్వెస్టర్ల మధ్య లింకులపై సెబీ దృష్టి ముంబై: ఇన్సైడర్ ట్రేడింగ్‌ను అరికట్టే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా కొత్త వ్యూహాలు అనుసరిస్తోంది. తాజాగా ఫేస్బుక్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాలపైనా దృష్టి పెట్టింది. సంప్రదాయ మార్గాల్లో పట్టుబడని ఇన్సైడర్లు, ఇన్వెస్టర్ల మధ్య లింకులను మరింత లోతుగా పరిశీలిస్తోంది. ఇటీవల వెలుగుచూసిన కొన్ని కేసులే దీనికి ఉదాహరణ. కొన్నాళ్ల క్రితం ఒక కంపెనీ కీలక ప్రకటన చేయడానికి సరిగ్గా కొద్ది రోజుల ముందు ఒక అరవై ఐదేళ్ల మహిళ అసాధారణ స్థాయిలో ఆ కంపెనీ షేర్లు కొనుగోలు చేయడం సెబీ దృష్టికి వచ్చింది. ఇందులో కచ్చితంగా ఇన్సైడర్ కోణం ఉంటుందని భావించిన సెబీ.. పలు సంప్రదాయ మార్గాల్లో కేసును పరిశీలించినా సరైన ఆధారాలు చిక్కలేదు. దీంతో సామాజిక మాధ్యమాలపై దృష్టి పెట్టింది. డీల్‌లో కీలకపాత్ర పోషిస్తున్న ఓ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకరుకు, ఆమెకు సోషల్ మీడియాలో పరిచయం ఉన్నట్లు గుర్తించింది. ఆమె కుమార్తెను వివాహమాడే ప్రయత్నాల్లో ఉన్న బ్యాంకరు .. ఒక వివాహ పరిచయ వేదిక ద్వారా కీలకమైన కార్పొరేట్ సమాచారాన్ని ఆమెకు చేరవేసి ఉండొచ్చని, తద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్‌కు తెరతీశారని గుర్తించిన సెబీ తదనుగుణంగా చర్యలకు శ్రీకారం చుట్టింది. అలాగే, ఫేస్బుక్ మాధ్యమం ద్వారా చెన్నైకి చెందిన ఒక ఇన్వెస్టరు, ఓ కంపెనీ అధికారి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన సంగతీ సెబీ కనిపెట్టింది. కంపెనీ షేరు భారీగా పెరిగే సమాచారం గల సదరు అధికారి.. ఫేస్బుక్ మాధ్యమం ద్వారా చెన్నై ఇన్వెస్టరును బినామీగా ఉపయోగించుకుని ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన అంశాన్నీ నిర్ధారించింది. ఈ రెండు కేసుల్లోనూ సెబీ ఇంకా ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. ఇక, ఈ కోవకే చెందిన పాల్రెడ్ టెక్నాలజీస్ కేసు విషయంలో దాదాపు 15 మంది రూ. 2.2 కోట్ల మేర అనుచిత లబ్ధి పొందినట్లు గుర్తించిన సెబీ ఆ మొత్తాన్ని జప్తునకు ఆదేశించింది. వాదనలు నిలబడేనా...: ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడే వారిని పట్టుకునేందుకు సెబీ సోషల్ మీడియాను సైతం జల్లెడపడుతున్నప్పటికీ.. వాటి ఆధారంగా నేరాన్ని రుజువు చేయడం కష్టతరం కావొచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో మిత్రులైనంత మాత్రాన వారు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి ఉంటారని నిర్ధారించడానికి వీలు ఉండదని వారు చెబుతున్నారు. ఇందుకోసం మరింత బలమైన సాక్ష్యాధారాలు అవసరమవుతాయని, లేదంటే నిందితులు అప్పీలుకు వెళ్లిన పక్షంలో సెబీ వాదనలు వీగిపోవచ్చని అంటున్నారు. ఇక, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై చాటింగ్, కాల్ రికార్డులు కూడా సెబీకి అందుబాటులో ఉండవు. మిగతా యూజర్ల తరహాలోనే బహిరంగంగా కనిపించే సమాచారం పైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇన్సైడర్ ట్రేడర్లు ఎటువంటి ఆధారాలు లభించకుండా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారనేది న్యాయనిపుణుల అభిప్రాయం. వినూత్న వ్యూహాలు... ఇన్సైడర్ సమాచారంతో చట్టవిరుద్ధమైన మార్గాల్లో స్టాక్‌మార్కెట్ల నుంచి ప్రయోజనం పొందుతున్న వారిని గుర్తించే క్రమంలో సోషల్ మీడియాను క్షుణ్నంగా పరిశీలించేందుకు సెబీ.. టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తోంది. చట్టాలను ఉల్లంఘించేవాళ్లు చాలా తెలివిగా సంప్రదాయ మాధ్యమాల్లో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడతారని, అందుకే సెబీ ఈ తరహా వినూత్న వ్యూహాలను అమలు చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. చాలా మటుకు ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుల్లో లావాదేవీలు ఇన్సైడర్ లేదా వారికి సన్నిహితులు కాకుండా పూర్తిగా అపరిచితుల పేర్ల మీద జరుగుతూ ఉంటాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటివి గుర్తించేందుకే సెబీ కూడా అసాధారణ వ్యూహాలు అమలు చేస్తోందని అధికారులు తెలిపారు. స్టాక్ మార్కెట్లో నల్లధనంపై సెబీ ఉక్కుపాదం! అనుమానిత సంస్థలు, బ్రోకర్లపై నిఘా రికార్డుల తనిఖీలు ఇతర దర్యాప్తు సంస్థలకు సహకారం న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లను నల్లధన ప్రవాహానికి వేదిక చేసుకోకుండా నివారించే చర్యల్ని నియంత్రణ సంస్థ సెబీ ముమ్మరం చేసింది. అనుమానిత సంస్థలు, బ్రోకర్లపై దృష్టి సారించింది. అంతేకాదు, ఈ విషయంలో ఇతర నియంత్రణ సంస్థలు, దర్యాప్తు సంస్థలతో సహకారాన్ని ముమ్మరం కూడా చేసింది. చాలా షేర్లలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాలకు సంబంధించి ఆదాయపన్ను శాఖ నుంచి 2016–17లో తమ దృష్టికి వచ్చిన కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉందని సెబీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. దర్యాప్తు కోసం మొత్తం 245కేసులను తీసుకోగా, వాటిలో 155 కేసుల్లో దర్యా ప్తు పూర్తయినట్టు తెలిపింది. 2015–16లో మొత్తం కేసులు 133గా ఉండగా, 123 కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసినట్టు వివరించింది. ఐటీ, ఇతర పరికరాల సాయంతో దర్యాప్తు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నట్టు పేర్కొంది. నిఘా చర్యల్లో భాగంగా స్టాక్ ఎక్సే్చంజ్‌లు, డిపాజిటరీలతో గతేడాది భేటీ కూడా నిర్వహించినట్టు తెలిపింది. పన్ను ఎగవేతకు స్టాక్ ఎక్సే్చంజ్‌లను దుర్వినియోగం చేసుకున్న కేసుల్లో అనుమానిత బ్రోకర్లు, డిపాజిటరీ పార్టిసిపెంట్లపై తనిఖీలను ముమ్మరం చేసినట్టు పేర్కొంది. వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల ఖాతా పుస్తకాలు, ఇతర పత్రాలను తనిఖీ చేసినట్టు వివరించింది. మోసపూరిత ఎస్ఎంఎస్లను ఇన్వెస్టర్లకు పంపడం పెరిగిపోయిందని, కొన్ని కేసుల్లో చర్యలు కూడా తీసుకున్నట్టు తెలిపింది. ఏఎంఎల్, సీఎఫ్‌టీ నిబంధనల అమలులో లోపాలకు సంబంధించి బీఎస్ఈ 195 సంస్థలపై, సీడీఎస్ఎల్ 236 సంస్థలపై, ఎంసీఎక్స్ 59 సంస్థలపై, ఎన్ఎస్ఈ 27 సంస్థలపై చర్యలు తీసుకున్నట్టు వివరించింది. -
ఏ షేర్లు పెరుగుతాయో ముందే తెలుసుకొని..
న్యూయార్క్: షేర్ విలువ ముందే తన భార్య ద్వారా తెలుసుకొని ఆ విషయం మిత్రులతో పంచుకొని ఓ భారత సంతతి వ్యక్తి జైలు పాలయ్యాడు. చట్ట విరుద్ధంగా షేర్ మార్కెట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడిన అతడికి ఇరవై నెలల జైలు శిక్ష పడింది. అంతేకాకుండా రెండు లక్షల అమెరికన్ డాలర్ల జరిమానా విధించడంతోపాటు వంద గంటలు కమ్యూనిటీ సేవ చేయాలని జిల్లా కోర్టు న్యాయమూర్తి నతనెయిల్ గార్టన్ తీర్పిచ్చారు. అమిత్ కనోడియా (49) అనే వ్యక్తి గతంలో ఓ ప్రైవేట్ ఇక్విటీలో పెట్టుబడులు పెట్టేవాడు. అతడి భార్య అపోలో టైర్స్ (భారత ఆధారిత కంపెనీ)లో జనరల్ కౌన్సిల్లో పనిచేస్తోంది. తన భార్య ద్వారా ఆ కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజ్ లో షేర్ విలువల విషయాలు తెలుసుకున్న గార్టన్, 2013లో తన మిత్రులు ఇఫ్తికర్ అహ్మద్, స్టివెన్లతో పంచుకుని అనంతరం షేర్లు కొనుగోలు చేశారు. వారికి ముందుగా తెలిసిన ప్రకారమే ఆ రోజు కూపర్ టైర్ కంపెనీ షేర్ విలువ అమాంతం 41 శాతం పెరిగింది. దీంతో వెంటనే వారు కొన్న షేర్లను అమ్మేశారు. ఇలా చేయడం ద్వారా వారికి ఒక మిలియన్ యూస్ డాలర్లు వచ్చాయి. అక్రమాలకు పాల్పడటం ద్వారా వారు ఈ సొమ్మును ఆర్జించారని అనంతరం గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ గతేడాది అక్టోబర్ నుంచి కొనసాగింది. తాజాగా గురువారం జ్యూరి సభ్యులు అమిత్ ను దోషిగా తేల్చారు. నవంబర్‌లో అహ్మద్ కు రెండేళ్ల శిక్షతో పాటు, 25వేల అమెరికన్ డాలర్ల జరిమానా విధించారు. -
హెడ్జ్ ఫండ్ మేనేజర్ ఆత్మహత్య
వాషింగ్టన్: భారతీయ సంతతికి చెందిన హెడ్జ్ ఫండ్ మేనేజర్ సంజయ్ వాల్వానీ (44)ఆత్మహత్యకు పాల్పడ్డారు. బ్రూక్లిన్ లోని తన ఇంటి పడకగదిలో చనిపోయివున్నాడని, ఆతహత్య చేసుకొని వుండొచ్చని బుధవారం స్థానిక మీడియా వెల్లడించింది. హెడ్జ్ ఫండ్ సంస్థ విసుం అసెట్ మేనేజ్మెంట్ ఎల్పీ లో పోర్ట్‌ఫోలియో మేనేజర్ గా పనిచేసిన వాల్వానీ జెనెరిక్ డ్రగ్ ఆమోదాలకు సంబంధించిన రహస్య సమాచారంతో స్టాక్ ఎక్స్చేంజ్ వ్యాపారంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ ఇటీవల నివేదించింది. గత వారం వచ్చిన ఈ ఇన్ సైడర్ ట్రేడింగ్ నేపథ్యంలో వాల్వానీ ఆత్మహత్య ఆందోళన సృష్టించింది. మెడపైన తీవ్ర గాయంతో చనిపోయివుండడాన్ని గమనించిన ఆయన భార్య పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలంలో కత్తితోపాటు, సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నామని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతినిధి తెలిపారు. ఇదొక భయంకరమైన విషాదమని, నమ్మశక్యంగా లేదని వాల్వాని న్యాయవాదులు తెలిపారు. అతను ఒక మంచి భర్త, తండ్రి, సోదరుడు,కుమారుడు అంకిత స్నేహితుడు, సహచరుడు మరియు గురువు అని న్యాయవాదులు ఒక ప్రకటనలో తెలిపారు. అతనిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని నిరూపితమైతేతప్ప అతని కుటుంబానికి శాంతి లేదని వ్యాఖ్యానించారు. వాల్లాని ఎల్లప్పుడూ తన నిజాయితీని పాటించేవాడని తెలిపారు. -
అది రాజకీయ వ్యభిచారమే
ఎమ్మెల్యేల కొనుగోళ్లపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు ♦ ఒక్కొక్కరికీ రూ.30 కోట్ల అవినీతి సొమ్ము ఇస్తున్నారు ♦ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే పరిస్థితి ఉందా? ♦ రెండెకరాల బాబుకు రూ.వేల కోట్ల ఆస్తులెలా వచ్చాయి? ♦ బాబు కుంభకోణాలను అందరూ ప్రశ్నించాలి ♦ ప్రజా గొంతుకగా ఉన్న ప్రతిపక్షంపై సీఎం చంద్రబాబు అక్కసు న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం రాజకీయ వ్యభిచారం లాంటిదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, కొనుగోళ్లను కట్టడి చేయకపోతే వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం ఢిల్లీలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, కోరుముట్ల శ్రీనివాసులు, దేశాయి తిప్పారెడ్డి, గౌతంరెడ్డి, సునీల్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పార్టీ రూపొందించిన ‘చంద్రబాబు.. అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు. ఈ రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.1,34,295 కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం కల్పించిన 31 కుంభకోణాల వివరాలను పుస్తకంలో వివరించామని తెలిపారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అంత నల్లధనం ఎలా వచ్చింది? ఏపీలో ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఎర చూపుతూ కొనుగోలు చేస్తున్నారు. మనం ప్రజాస్వామ్యలో ఉన్నాం. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మన కళ్లముందే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఇస్తుంటే.. ఇంతింత డబ్బు ఎలా వచ్చింది? అని అడిగే పరిస్థితి ఉందా? తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోతే.. ఇంత నల్లధనం ఎలా వచ్చింది చంద్రబాబూ? అని అడిగే పరిస్థితి ఉందా? నల్లధనాన్ని ఎమ్మెల్యేలకు ఇచ్చి విచ్చలవిడిగా కొనుగోలు చేస్తా ఉంటే.. ఆ డబ్బు ఎక్కడిదని అడగలేని దుస్థితి నెలకొంది. ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఇంతింత డబ్బులు ఎరచూపుతూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంతో ఆగిపోకుండా.. కొంతమందికి మంత్రి పదవులూ ఇస్తామని, శాసనసభ్యత్వానికి అనర్హులు కాదని చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇదెలా సాధ్యం? అని అడగలేకపోతున్నాం. వేరే పార్టీ టికెట్‌పై గెలిచిన అభ్యర్థులు శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండా.. వారితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తానని బాబు చెబుతున్నారు. ఇంతకంటే దిక్కుమాలిన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉంటుందా? ఇలాంటివి ఎక్కడా జరగలేదు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారు. ఎమ్మెల్యే పోతే మరో నాయకుడు వస్తారు మాకు 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 13 మంది పోయారు. వారికి ఇద్దరో ముగ్గురో జత అయినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఎమ్మెల్యేలను గెలిపించే వారు ప్రజలు. దేవుడి ఆశీర్వాదం, ప్రజల గుండెల్లో స్థానం ఉంటే.. ఈ ఎమ్మెల్యే కాకుంటే మరో నాయకుడిని తెచ్చుకుంటారు. గత ఎన్నికల్లో మా పార్టీకి వచ్చిన ఓట్లు 45 శాతం. చంద్రబాబు, ఆయన కూటమికి కలిపి వచ్చిన ఓట్లు 46.86 శాతం. ఓట్ల తేడా 1.86 శాతం. రాష్ట్రం మొత్తం మీద చూస్తే.. ఇరు పార్టీల మధ్య తేడా 5 లక్షల ఓట్లే. అదేమీ పెద్ద తేడా కాదు. రాష్ట్రంలో ప్రధానంగా పోటీపడినవి రెండే పార్టీలు. కొంతమంది ఎమ్మెల్యేలు పోయినా ఎక్కడా నష్టం ఉండదు. ప్రజల గొంతు నొక్కుతున్నారు ఇక్కడ జరుగుతున్నది... ప్రజల గొంతుకను నొక్కడం. ఎన్నికల ముందు బాబు అబద్దాలు చెప్పి మోసం చేయడంతో.. రైతులు, డ్వాక్రా మహిళలు, చదువుకున్న పిల్లలు బాధ పడుతున్నారు. బాబు ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో ప్రతిచోటా వ్యతిరేకత కనిపిస్తోంది. వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు. మొత్తం మాఫీ చేస్తానని బాబు హామీ ఇచ్చారు. టీడీపీ మేనిఫెస్టోలోనూ పెట్టా రు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలంటూ ఊదరగొట్టారు. దానిపై వడ్డీలే రూ.24 వేల కోట్లు. ఆయన చేస్తున్న రుణమాఫీ.. వడ్డీలో మూడో వంతుకు కూడా సరిపోలేదు. రైతులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ప్రశ్నించే గొంతు ఉండకూడదనే... చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజలు నినదిస్తున్నారు. ప్రజలకు గొంతుక ఇస్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తున్నారు. ప్రజల గొంతు వినపడకూడదని బాబు భావిస్తున్నారు. జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించే గొంతు ఉండకూడదని సీఎం దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. మీడియాలో ఉన్న మనం, చదువుకున్న మనం.. చంద్రబాబు చేస్తున్న అనైతిక రాజకీయాలను చూస్తూ ఊరుకోవడం, ప్రశ్నించకపోవడం తప్పు కాదా? ఎమ్మెల్యేల కొనుగోళ్లు హర్షించాల్సిన విషయమా? రెండేళ్లలో 1.34 లక్షల కోట్ల అక్రమ సంపాదన చంద్రబాబు రెండేళ్లలో రూ.1.34 లక్షల కోట్ల అక్రమ సంపాదన మూటగట్టుకున్నారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు చేసిన 31 కుంభకోణాల వివరాలు ‘చంద్రబాబు.. అవినీతి చక్రవర్తి’ పుస్తకంలో ఉన్నాయి. ఆయన ఏ విధంగా అన్యాయం చేశారు? ప్రభుత్వానికి ఎలా నష్టం చేశారు? ఆధారాలు, జీవోలతో సహా స్కాన్ చేసిన కాపీలు పెట్టాం. కరెంట్ కొనుగోలులో గోల్మాల్.. ఇసుక మాఫియా దగ్గర నుంచి ల్యాండ్ మాఫియా వరకు కుంభకోణాలు ఉన్నాయి. రూ.1.34 లక్షల కోట్ల కుంభకోణాల గురించి చంద్రబాబును ప్రశ్నించాల్సిన సమయం ఇది. రూ.లక్ష కోట్ల రాజధాని భూ కుంభకోణం రాజధాని పేరిట ల్యాండ్ డీల్స్‌లో చంద్రబాబు బినామీలు ఎవరు? వారు కొన్న భూముల వివరాలన్నీ ఉన్నాయి. ఎవరి పేరుతో కొన్నారో వారి వివరాలూ ఇచ్చాం. లోతుగా విచారణ చేస్తే ఇంకా ఎక్కువ లావాదేవీలు బయటపడతాయి. రాజధాని పేరుతో ఎన్ని వేల ఎకరాలు మోసం చేశారో.. ఆ భూముల వాస్తవ మార్కెట్ విలువ చూస్తే రాజధానిలోనే రూ.లక్ష కోట్ల అవినీతి జరిగినట్లు తేలింది. మిగతా రూ.34 వేల కోట్లు వివిధ కుంభకోణాలకు సంబంధించినవి. ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా? 2014 మే నెలలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్కడ రాజధాని ఏర్పాటు చేస్తున్నారనే విషయాన్ని బుర్రలో పెట్టుకొని, వేరే చోట వస్తుందంటూ లీకులు ఇచ్చారు. కానీ, బినామీలతో రాజధాని ప్రాంతంలో తక్కువ రేట్లకు రైతుల నుంచి భూములు కొనుగోలు చేయించారు. ఆరేడు నెలల తర్వాత.. బినామీలు కొనుగోలు చేసిన ప్రాంతంలో వస్తుందని ప్రకటించారు. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా? సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ ‘ఓత్ ఆఫ్ సీక్రసీ’ చంద్రబాబు తీసుకున్నారు. దాన్ని ఉల్లంఘించి, భారీగా సొమ్ము చేసుకున్నారు. పూర్తిగా విచారణ జరిగితే రాజధానిలో బాబు బినామీల భూ లావాదేవీలన్నీ బయటపడతాయి. రాజధాని జోనింగ్లోనూ మతలబు రాజధాని వచ్చిన తర్వాత బినామీలకు మేలు చేయడం కోసం జోనింగ్ చేశారు. బినామీల భూములు పట్టణ ప్రాంతం, అగ్రిజోన్-3లో ఉన్నాయి. మిగతా రైతుల భూములు వ్యవసాయానికి తప్ప మిగతా కార్యకలాపాలకు వీల్లేని విధంగా అగ్రిజోన్-1లో ఉన్నాయి. చంద్రబాబు బినామీల భూములకు ఎక్కువ ధర కల్పించడం కోసం వాటిని రియల్ఎస్టేట్ జోన్లో పెట్టారు. మిగతా రైతులను భూములను అమ్ముకోలేని దశలోకి నెట్టేశారు. ఇది మోసం కాదా? చంద్రబాబు కుంభకోణాల్లో ఇదొక ఉదాహరణ మాత్రమే. ఎమ్మెల్యేలను కొనేయడం ఘనకార్యమా? లింగమనేని రమేష్ భూములకు 10 అడుగుల అవతల ల్యాండ్‌పూలింగ్ ఆగిపోయింది. ఎందుకు అలా ఆగిపోయింది? చంద్రబాబు ప్రస్తుతం లింగమనేని రమేష్ ఇంట్లోనే ఉన్నారు. 2014 మే-డిసెంబర్ మధ్య జరిగిన రిజిస్ట్రేషన్ల కాపీలను పుస్తకంలో పొందుపరిచాం. మరింత లోతుగా సీబీఐ విచారణ జరిగితే జీపీఏలు కూడా బయటపడతాయి. భారీగా సంపాదించిన అవినీతి సొమ్ముతో నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంటే అడిగే దిక్కు లేదు. బాధాకరమైన విషయం ఏమిటంటే.. చంద్రబాబు సోదర మీడియా సంస్థలు దాన్ని ఘనమైన విషయంగా చూపిస్తున్నాయి. ఘనకార్యం చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నాయి. ఇంత నల్లధనం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించకుండా వాళ్లు పోతున్నారు, వీళ్లు పోతున్నారంటూ.. చంద్రబాబు కొనుగోళ్లను పెద్ద ఘనకార్యంగా చూపిస్తున్నాయి. చంద్రబాబును నిలదీయండి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదు? వారిపై అనర్హత వేటు ఎందుకు వేయించడం లేదు? ఫిరాయించిన ఎమ్మెల్యేలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు వేయించే ధైర్యం చంద్రబాబుకు లేదు. మీ పరిపాలన మీద మీకు ఎందుకు నమ్మకం లేదు అని చంద్రబాబును మీడియా ప్రతినిధులు నిలదీయాలి. 1978లో రెండెకరాల ఆస్తితో చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభించారు. ఇప్పుడు ఆయనకు రూ.వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోకుండా విచారణకు అంగీకరిస్తే బాబు బండారం బయటపడుతుంది. పార్టీ ఫిరాయింపులను కట్టడి చేయకపోతే.. అధికారంలో ఉన్నవాళ్లు అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కండువాలు కప్పుకుంటూ పోతారు. -
రజత్ గుప్తా కార్యకలాపాలు షురూ!
♦ స్నేహితుడు ఛటర్జీ కంపెనీలో.. ఇంటి నుంచే పని ♦ రెండు నెలలుగా ఇంట్లోనే నిర్బంధంలో... ♦ ఇపుడు స్వేచ్ఛ రావటంతో పూర్తిస్థాయి కార్యకలాపాలు ♦ మునుపటి ప్రతిష్ఠ కోసం కోర్టులోనూ పోరు మార్క్ క్యూబన్ తెలుసా? బిలియనీర్ ఇన్వెస్టర్ మాత్రమే కాదు. అమెరికాకు చెందిన డల్లాస్ మావెరిక్స్ బాస్కెట్‌బాల్ జట్టు యజమాని కూడా. ఇక అమెరికన్ టీవీ చానెళ్లు చూసేవారిలో లైఫ్‌స్టైల్ స్టార్ మార్తా స్టివార్ట్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో!! వీరి గురించి ఇపుడెందుకంటే... 2004లో 44 ఏళ్ల క్యూబన్ తన ఇంటర్నెట్ సెర్చ్ కంపెనీ ‘మమ్మా.కామ్’లో వాటాలు విక్రయించారు. సమాచారం తెలిసి వాటాల్ని ముందే విక్రయించి, నష్టాలు తగ్గించుకున్నారని, ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై అమెరికన్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజీ కమిషన్ (సెక్) కేసు పెట్టింది. 2015 వరకూ ఈ కేసు నడిచింది. కోర్టు ఫీజులు, లాయర్ల ఫీజుల రూపంలో... సెక్ పేర్కొన్న జరిమానా కన్నా ఎక్కువే క్యూబన్ చెల్లించారు. 2015లో క్యూబన్ గెలిచి.. నిర్దోషిగా బయటపడ్డారు. దాతగా ఇపుడు పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. క్యూబన్కిపుడు 56 ఏళ్లు. మార్తా స్టివార్ట్దీ ఇలాంటి కథే. ఆమె 2001లో ‘ఐఎంక్లోన్’ కంపెనీలో 2.3 లక్షల డాలర్ల విలువైన తన షేర్లు అమ్మేశారు. ఆ మర్నాడే షేరు ధర కుప్పకూలింది. దీనిపై ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలొచ్చి, అవి రుజువై ఆమెకు జైలు శిక్ష కూడా పడింది. శిక్ష పూర్తయి బయటకు వచ్చాక... ఆమె మళ్లీ టీవీ షోలలో పాల్గొన్నారు. తన కంపెనీ బోర్డులో కూడా మళ్లీ స్థానం సంపాదించుకున్నారు. ఇవన్నీ ఎందుకంటే... హైదరాబాద్‌లోని ఐఎస్బీ వ్యవస్థాపకుల్లో ఒకరైన రజత్ గుప్తా... ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై రెండేళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకుని రెండురోజుల కిందటే విడుదలయ్యారు. ఒకప్పుడు మెకిన్సే ఎండీగా, గోల్డ్‌మన్ శాక్స్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన రజత్ గుప్తా... నిజానికి జనవరి 5నే అమెరికా ఫెడరల్ కరెక్షనల్ కేంద్రం నుంచి విడుదలయ్యారు. అప్పటి నుంచీ మన్‌హటన్‌లోని తన ఇంట్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. అపార్ట్మెంట్ నుంచి బయటకు రాకుండా... చేతికి జైలు అధికారులిచ్చే బ్రేస్‌లెట్‌ను ధరించి ఉండేవారు. అయితే కరెక్షనల్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన దగ్గర్నుంచీ మెకిన్సేకు చెందిన తన పాత మిత్రుడు పూర్ణేందు ఛటర్జీ నిర్వహిస్తున్న వ్యాపారం కోసం పనిచేసేవారని ‘న్యూయార్క్’ టైమ్స్ వెల్లడించింది. నిజానికి గుప్తాకు జైలు శిక్ష పడినపుడు ఆయన్ను గట్టిగా సమర్థించింది ఛటర్జీ ఒక్కరే. తాజాగా గుప్తా పూర్తిస్థాయిలో విడుదల కావటంతో ఇకపై ఆయన పూర్తిస్థాయిలో కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని తెలుస్తోంది. రెండువారాల కిందటే కోర్టు స్వీకరణ నిజానికి మళ్లీ బిజినెస్‌లోకి ప్రవేశించటం మాత్రమే కాదు. తనపై పడ్డ మచ్చను చెరుపుకోవటం కూడా గుప్తా మనసులో ఉన్న ఆలోచనగా చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లో అమెరికాలోని మన్‌హటన్‌లో ఉన్న పప్పీళ్ల సెకండ్ సర్క్యూట్ కోర్ట్... గుప్తా వేసిన ఈప్పీలును విచారణకు స్వీకరించింది కూడా. రాజరత్నం నుంచి గుప్తాకు కనిపించని లాభమేదీ రాలేదని గుప్తా తరఫు న్యాయవాది చేసిన వాదనతో కోర్టు ఏకీభవించి ఈ అపీలును తీసుకుంది. కేసు నుంచి బయటపడి మునుపటి తన పరువు ప్రతిష్ఠల్ని తిరిగి సంపాదించుకోవటం కూడా గుప్తా ఆలోచనగా తెలుస్తోంది. -
ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే...
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే ఇన్సైడ్ ట్రేడింగ్ అంటున్నారు. కానీ అది ఇన్సైడ్ ట్రేడింగ్ కాదు. విపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగా ఇన్సైడర్ ట్రేడింగ్. ఒక్కమాటలో చెప్పాలంటే రహస్య సమాచారం తెలిసిన లేదా తెలిసే అవకాశం ఉన్న ఇన్సైడర్ (లోపలి మనిషి).. దానిద్వారా లబ్ధి పొందటానికి జరిపే బహిరంగ లావాదేవీ. స్టాక్ మార్కెట్ పరిభాషలో చెప్పాలంటే... షేర్ మార్కెట్లో లిస్టయిన ఏ సంస్థయినా దానికి సంబంధించిన కీలక ప్రకటనల్ని అందరికన్నా ముందు స్టాక్ మార్కెట్‌కు తెలపాలి. ఆ కీలక ప్రకటన వల్ల మార్కెట్లో ఆ సంస్థ షేరు ధర పెరగొచ్చు... లేదా తగ్గొచ్చు. స్టాక్ మార్కెట్లకు తెలిపితే... అందుకు తగ్గట్టు మదుపరులు ఆ షేర్లు కొనటమో, అమ్మటమో చేస్తారు. కానీ మార్కెట్లకు చెప్పడానికన్నా ముందు... ఆ సమాచారాన్ని ఆధారం చేసుకుని సంస్థలోని కీలక వ్యక్తులు తమ సొంతంగానో, బంధుమిత్రుల ద్వారానో షేర్లను అమ్మటమో, కొనటమో చేసి లబ్ధి పొందితే... దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్‌గా పరిగణిస్తారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై దేశాల్లో నిషేధం ఉంది. ఇలా చేసినవారికి జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఈ రెండు ఉదాహరణలూ చూస్తే... హైదరాబాద్‌లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ సహ వ్యవస్థాపకుడైన రజత్ గుప్తాకు ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఇన్వెస్ట్మెంట్ సంస్థ గోల్డ్‌మాన్ శాక్స్ డెరైక్టర్‌గా ఉన్నప్పుడు గుప్తా కీలకమైన కంపెనీ సమాచారాన్ని అమెరికాలో హెడ్జ్ ఫండ్ మేనేజర్ రాజరత్నంకు అందించడం, ఇది కోర్టులో రుజువవటంతో ఇద్దరికీ శిక్షలు పడ్డాయి. 1997లో ఐఎస్బీని ఏర్పాటు చేసిన గుప్తా... అప్పటి సీఎం బాబుకు అత్యంత సన్నిహితుడు. ఇక ప్రభుత్వం విషయానికొస్తే... కేబినెట్‌కు తెలిసిన రహస్య సమాచారాన్ని ఎవరు స్వలాభానికి ఉపయోగించుకున్నా, లబ్ధి పొందినా అధికార రహస్యాల చట్టం కింద అది నేరం. కేంద్ర కేబినెట్ తీసుకోనున్న నిర్ణయానికి సంబంధించి కొన్ని పత్రాల్ని చేజిక్కించుకున్న నేరానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికారులు గతంలో జైలుకెళ్లారు. -
సత్యం స్కాం.. రూ. 1800 కోట్ల జరిమానా
దాదాపు ఏడేళ్లుగా నలుగుతున్న సత్యం కంప్యూటర్స్ స్కాం మరో కొత్త మలుపు తిరిగింది. ఈ స్కాంలో ప్రధాన నిందితుడు రామలింగరాజుకు చెందిన పది సంస్థలు అక్రమంగా పోగేసుకున్న రూ. 1800 కోట్ల సొమ్మును తిరిగి చెల్లించాలని సెబి ఆదేశించింది. 2009 జనవరి ఏడో తేదీ నుంచి జరిమానా విధించాల్సి ఉన్నందున.. ఆ మొత్తం మీద వడ్డీగా మరో రూ. 1500 కోట్లు కూడా చెల్లించాలని తెలిపింది. ఈ పది సంస్థలు రామలింగరాజు సమీప బంధువులవే. వాళ్లలో ఆయన తల్లి, సోదరుడు, కుమారుడు.. కూడా ఉన్నారు. తన కుటుంబ సభ్యుల పేర్లతో అకౌంట్లు తెరిచి, ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినందుకు గాను ఈ జరిమానాలు విధించారు. రామలింగరాజుతో పాటు మరో నలుగురిని 14 ఏళ్ల పాటు మార్కెట్ల నుంచి సెబి బహిష్కరించిన విషయం తెలిసిందే. అక్రమ పద్ధతుల ద్వారా ఆర్జించిన రూ. 1849 కోట్లను వడ్డీతో సహా చెల్లించాలని గత సంవత్సరం జూలైలోనే సెబి ఆదేశించింది. రామలింగరాజు, ఆయన సోదరుడు (నాటి సత్యం ఎండీ) రామరాజు, వడ్లమాని శ్రీనివాస్ (మాజీ సీఎఫ్ఓ), జి.రామకృష్ణ (నాటి వైస్ ప్రెసిడెంట్), వీఎస్ ప్రభాకర గుప్తా (అంతర్గత ఆడిట్ విభాగం మాజీ అధిపతి)లపై ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో.. రామలింగరాజు, ఆయన ఇద్దరు సోదరులు, ఇతర వ్యక్తులు, కంపెనీలను కూడా సెబి ఈ కేసులో పెట్టింది. ఈ కంపెనీలలో ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ (ఇంతకుముందు మేటాస్ ఇన్ఫ్రా) ఉన్నాయి. రామలింగరాజు తల్లి అప్పలనరసమ్మ, ఆమె ఇద్దరు కుమారులు తేజరాజు, రామరాజు, సోదరుడు సూర్యనారాయణ రాజు, ఆయన భార్య ఝాన్సీ రాణి, చింతలపాటి శ్రీనివాస్ (నాటి డైరెక్టర్), ఆయన తండ్రి దివంగత అంజిరాజు తదితరులు కూడా ఉన్నారు. -
ఇన్సైడర్ ట్రేడింగ్‌లో మరో ఎన్నారై
న్యూయార్క్: అమెరికాలో ఇన్సైడర్ ట్రేడింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న భారత సంతతి వ్యక్తి ఆశిష్ అగర్వాల్ (27), ఆయన మిత్రులు ఇద్దరు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ముందు లొంగిపోయారు. అయితే, తామే నేరం చేయలేదని వారు న్యాయస్థానానికి విన్నవించారు. 2011 జూన్-2013 జూన్ మధ్య కాలంలో జేపీ మోర్గాన్ సెక్యూరిటీస్‌కి చెందిన శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలో ఆశిష్ అగర్వాల్ సెక్యురిటీ అనలిస్టుగా పనిచేశారు. ఆ సమయంలో పీఎల్ఎక్స్ టెక్నాలజీస్‌ను ఇంటిగ్రేటెడ్ డివైజ్ టెక్నాలజీ, ఎగ్జాక్ట్టార్గెట్ను సేల్స్‌ఫోర్స్‌డాట్‌కామ్ కొనుగోలు చేసే డీ ల్స్‌కు జేపీ మోర్గాన్ సలహాదారుగా వ్యవహరించింది. అభియోగాల ప్రకారం.. ఈ రెండు డీల్స్‌కి సంబంధించిన కీలక విషయాలను ఆశిష్.. తన స్నేహితుడు షహర్యార్ బొలాందియాన్కు చేరవేశారు. ఆ వివరాలను షహర్యార్ తన మిత్రుడు కేవన్ సాదిఘ్కు అందించారు. ఈ కీలక ఇన్సైడర్ సమాచారాన్ని ఉపయోగించి వీరు 6,72,000 డాలర్ల మేర లాభపడ్డారని, అగర్వాల్, షహర్యార్ ఈ సొమ్మును గతంలో వచ్చిన ట్రేడింగ్ నష్టాలను భర్తీ చేసుకునేందుకు, రుణాలు తీర్చేందుకు ఉపయోగించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అగర్వాల్ ఈ ఆరోపణలు ఖండించారు. -
ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలు కఠినతరం
ముంబై: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరోసారి సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా డీలిస్టింగ్‌కు తాజా నిబంధనలు ప్రకటించడంతోపాటు దాదాపు రెండు దశాబ్దాల కాలంనాటి ఇన్సైడర్ నియంత్రణలను సంస్కరించే బాటలో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈ అంశంలో స్పష్టతనిస్తూ ఇన్సైడర్లకు అర్థాన్ని విసృ్తతం చేసింది. అంతేకాకుండా వీటివల్ల చట్టబద్ధ బిజినెస్ లావాదేవీలకు ఇబ్బందులు తలెత్తకుండా మార్గదర్శకాలను జారీ చేసింది. ఏదైనా ఒక కంపెనీకి చెందిన ఒప్పందాలు, విశ్వాసపాత్రులు, కీలక ఉద్యోగ సంబంధాలు వంటి అంశాలకు సంబంధించిన బయటకు వెల్లడించని సమాచారాన్ని తెలుసుకోగలిగిన వ్యక్తులను ఇన్సైడర్లుగా సెబీ వ్యక్తీకరించింది. సంబంధిత కంపెనీ షేరు ధర ప్రభావితమయ్యే ఇలాంటి సమాచారాన్ని అందుకోగలిగిన వ్యక్తులను ఇన్సైడర్లుగా పేర్కొంది. అయితే వీరికి దగ్గరి బంధువులు, తదితర సంబంధీకులు ఇన్సైడర్ సమాచారాన్ని పొందలేదన్న విషయంలో తమ నిజాయితీని నిరూపించుకోవాలని సెబీ తెలిపింది. లేనిపక్షంలో వీరు కూడా ఇన్సైడర్లకిందకు వస్తారని తెలిపింది. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు(విల్‌ఫుల్ డిఫాల్టర్లు) క్యాపిటల్ మార్కెట్లను వినియోగించుకోకుండా ఆంక్షలు విధించింది. బుధవారం సమావేశమైన బోర్డు సమావేశంలో తాజా నిబంధనలను ఆమోదించింది. కనీసం 25% ఓకే అంటేనే: మొత్తం విధానాలు ప్రతిబంధకంగా నిలవకుండా సెబీ కొన్ని నిబంధనల్లో సవరణలు చేపట్టింది. ఎక్స్ఛేంజీల నుంచి కంపెనీలు డీలిస్టింగ్ కావడానికి పట్టే సమయాన్ని సగానికి కుదించింది. ఇందుకు ప్రస్తుతం 137 రోజుల సమయం పడుతుండగా, ఇకపై 76 రోజులకు పరిమితంకానుంది. రివర్స్ బుక్ బిల్డింగ్ విధానంలో కనీసం 25% వాటాదారులు పాల్గొంటే డీలిస్టింగ్ విజయవంతంకానుంది. ఇన్సైడర్ నిబంధనలకు సంబంధించి అంతర్జాతీయ చట్టాలతో అనుసంధానం చేయనుంది. విల్‌ఫుల్ డిఫాల్టర్స్‌గా ముద్రపడిన కంపెనీలు, ప్రమోటర్లు, డెరైక్టర్లు క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధులను సమీకరించకుండా నిబంధనల్లో మార్పు చేసింది. రెండు పథకాలకే చాన్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీల కనీస నెట్‌వర్త్‌ను రూ. 10 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు పెంచింది. ఇందుకు మూడేళ్ల కాలాన్ని గడువుగా సెబీ ప్రకటించింది. కనీసం రూ. 50 కోట్ల నెట్‌వర్త్‌ను అందుకోని ఫండ్ హౌస్‌లు ఏడాదికి గరిష్టంగా 2 పథకాలనే ప్రవేశపెట్టేందుకు వీలుంటుంది. -
సన్, ర్యాన్‌బాక్సీల విలీనానికి తొలగిన అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్: సన్‌ఫార్మా, ర్యాన్‌బాక్సీల విలీనానికి అడ్డంకులు తొలగిపోయాయి. ర్యాన్‌బాక్సీలో సన్‌ఫార్మా విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు శనివారం ఎత్తివేసింది. అంతేకాక విలీన ప్రక్రియకు సంబంధించి సన్‌ఫార్మా అనుబంధ కంపెనీ సిల్వర్ స్ట్రీట్ భారీ ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందన్న పిటిషనర్ల ఆరోపణలపై చేస్తున్న విచారణను చట్ట ప్రకారం పూర్తిస్థాయిలో చేపట్టాలని సెబీని ఆదేశించింది. న్యాయమూర్తి గుండా చంద్రయ్య శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విలీన ప్రకటనకు ముందే సిల్వర్ స్ట్రీట్ భారీ ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని, ఈ మొత్తం వ్యవహారంపై సెబీ విచారణకు ఆదేశించాలంటూ ఇద్దరు వాటాదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై ర్యాన్‌బాక్సీ, సన్‌ఫార్మాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి హైకోర్టు నివేదించి, రెండు రోజుల్లో ఈ వ్యవహారంపై నిర్ణయం వెలువరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం జస్టిస్ గుండా చంద్రయ్య ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు విని నిర్ణయాన్ని శనివారం వెలువరిస్తానని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆయన శనివారం ఉత్తర్వులు జారీ చేస్తూ, విలీన ప్రక్రియపై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ, ఇన్సైడర్ ట్రేడింగ్‌పైనే తమ ప్రధాన అభ్యంతరమని, దానిపై సెబీ విచారణ జరుపుతున్నందున, దానిని రికార్డ్ చేసి ఈ వ్యాజ్యాలను పరిష్కరించాలని కోరారు. నిర్ణీత వ్యవధిలోపు విచారణ పూర్తి చేసేలా సెబీని ఆదేశించాలని అభ్యర్థించారు. దీనిపై సెబీ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణను నిర్దిష్ట కాల వ్యవధిలోపు పూర్తి చేయడం సాధ్యం కాదని తెలిపారు. దీంతో న్యాయమూర్తి, ఇన్సైడర్ ట్రేడింగ్‌పై చట్ట ప్రకారం పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సెబీని ఆదేశిస్తూ, ఈ వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీ విలీనంపై నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఔషధ రంగంలో దిగ్గజాలైన సన్‌ఫార్మా, రాన్బాక్సీల విలీన ప్రక్రియపై హైకోర్టు శనివారం తన నిర్ణయాన్ని వెలువరించనున్నది. తమ విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో శనివారం ఇచ్చే ఉత్తర్వులపై సర్వత్రా ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. రాన్‌బాక్సీలో సన్‌ఫార్మా విలీన ప్రకటనకు ముందే సన్‌ఫార్మాకు చెందిన అనుబంధ సంస్థ భారీ ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని, ఈ మొత్తం వ్యవహారంపై సెబీ విచారణకు ఆదేశించాలంటూ ఇద్దరు వాటాదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై రాన్‌బాక్సీ, సన్‌ఫార్మాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి హైకోర్టు నివేదించి, రెండు రోజుల్లో ఈ వ్యవహారంపై నిర్ణయం వెలువరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం జస్టిస్ గుండా చంద్రయ్య విచారణ జరిపారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై తాము ఇప్పటికే దర్యాప్తు చేపట్టామని, తాము ఏమీ చేయడం లేదన్న పిటిషనర్ల ఆరోపణల్లో అర్ధం లేదని సెబీ తరఫు న్యాయవాది వై.సూర్యనారాయణ కోర్టుకు నివేదించారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సెబీ దర్యాప్తు సాగుతోందని, అందువల్ల మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని సన్‌ఫార్మా, రాన్‌బాక్సీ, దైచీ కంపెనీల తరఫు సీనియర్ న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు, విలీన ప్రక్రియకు సంబంధం లేదని, అందువల్ల విలీన ప్రక్రియను ఆమోదించాలని వారు కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారంపై శనివారం తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని స్పష్టం చేశారు. -
ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో ఇద్దరు ఎన్నారై డాక్టర్లు
న్యూయార్క్: ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా 3,00,000 డాలర్ల మేర అనుచిత లబ్ధ్ది పొందారంటూ ఆరుగురిపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. వీరిలో సుకేన్ షా, షిముల్ షా అనే ఇద్దరు ప్రవాస భారతీయ డాక్టర్లు ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. జీఎస్ఐ కామర్స్ అనే సంస్థను 2011లో ఈబే సంస్థ కొనేందుకు సిద్ధమైంది. సదరు జీఎస్ఐ కామర్స్ సీఈవో క్రిస్టొఫర్ సారిడాకిస్.. ఈ విషయాన్ని అనధికారికంగా సుకేన్, షిముల్ తదితరులకు తెలియజేశారు. దీంతో ఆ కంపెనీ షేర్లలో ట్రేడింగ్ చేయడం ద్వారా వీరు లాభాలు పొందారని అభియోగాలు ఉన్నాయి. మొత్తం మీద కేసు సెటిల్ చేసుకోవాలంటే ఎన్నారై డాక్టర్లతో పాటు అయిదుగురు ట్రేడర్లు 4,90,000 డాలర్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదే శించింది. క్రిస్టోఫర్‌పై 6,64,822 డాలర్ల పెనాల్టీ విధించింది. -
తెలియకచేసే తప్పుల్ని వేరుగా చూడాలి
ముంబై: స్టాక్ మార్కెట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ మోసాలను ఎదుర్కోవడానికి త్వరలో కొత్త నిబంధనలను తీసుకురానున్నామని సెబీ చైర్మన్ యూకే సిన్హా పేర్కొన్నారు. లిస్టెడ్ కంపెనీల స్టాక్స్‌లో ట్రేడింగ్‌కు సంబంధించి టాప్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, బ్రోకర్లు, ఇతరత్రా ఇన్వెస్టర్లు, సంస్థలు ఎలాంటి ఉల్లంఘనలకూ పాల్పడకుండా నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తామని చెప్పారు. అయితే, తీవ్రమైన నేరాలకు తెలియకుండా చేసే ఉల్లంఘనల మధ్య స్పష్టమైన విభజన అనేది ఉండాలని, కొత్త నిబంధనల్లో వీటిని చేరుస్తామని కూడా ఆయన వెల్లడించారు. నిపుణుల కమిటీ, అన్నిపక్షాల అభిప్రాయలనూ పరగణనలోకి తీసుకొని వీటిని ఖరారు చేస్తామన్నారు. -
‘ఇన్సైడర్’ నిబంధనలు మరింత కఠినతరం
ముంబై: ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. షేర్ల ధరలను ప్రభావితం చేసే కీలక సమాచారాన్ని ముందుగానే తెలుసుకొని దానికి అనుగుణంగా ట్రేడింగ్ చేసే వారిపై (ఇన్సైడర్స్) కఠిన చర్యలు తీసుకునే విధంగా పలు చర్యలను సూచిస్తూ 18 మంది సభ్యులతో కూడిన జస్టీస్ ఎన్కే సోధీ కమిటీ 75 పేజీల నివేదికను సెబీకి సమర్పించింది. ఇన్సైడర్ ట్రేడింగ్ పరిధిలోకి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మ్యూచువల్ ఫండ్స్, ట్రస్టీలనూ చేర్చింది. షేర్ల ధరలను ప్రభావితం చేసే సమాచారం అందుబాటులో ఉన్న ప్రభుత్వాధికారులు అందరినీ ఈ నిబంధనల పరిధిలోకి తీసుకొచ్చారు. ఇవి అమల్లోకి వస్తే కంపెనీలో పనిచేసే ప్రతీ ఉద్యోగి, వారి సమీప బంధువులు ఈ కంపెనీ షేర్లను కొన్నా, లేక అమ్మినా ఆ వివరాలను తప్పకుండా కంపెనీకి చెప్పాల్సి ఉంటుంది. గతంలో కంపెనీలోని కీలక వ్యక్తులకు మాత్రమే ఈ నిబంధనలుండేవి. అలాగే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైనా ముందుకొచ్చి, కంపెనీ విలువను మదింపు చేస్తే ఆ విషయాన్ని వాటాదారులకు బహిరంగంగా కనీసం 2 రోజుల ముందే తెలియచేయాల్సి ఉంటుంది. ఈ కమిటీ సిఫార్సులపై డిసెంబర్ 31 వరకు సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత తుది మార్గదర్శకాలను విడుదల చేస్తారు. -
ఇన్సైడర్ల పరువు తీయాలి
బెంగళూరు: ఇన్సైడర్ ట్రేడింగ్ వంటి నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అంతర్జాతీయ అడ్వైజరీ బోర్డు సూచించింది. ఇందులో భాగంగా ఈ నేరాలకు పాల్పడే వారి పరువు తీసే విధంగా కఠినమైన చర్యలు (నేమింగ్, షేమింగ్) తీసుకోవాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అంతర్జాతీయ అడ్వైజరీ బోర్డు సూచించింది. ఇలాంటి కేసుల్లో ఎలాంటి సెటిల్మెంట్కి అంగీకరించరాదని, భారీ పెనాల్టీలు విధించాలని పేర్కొంది. భారీ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులను సెబీ వెబ్సైట్లో ప్రత్యేక సెక్షన్లో పొందుపర్చాలని తెలిపింది. అలాగే, ఇన్సైడర్ ట్రేడింగ్ మోసాల్లో నష్టపోయిన బాధితులకు తగు స్థాయిలో పరిహారం లభించేలా నిబంధనలు రూపొందించాలని బోర్డు తెలిపింది. అన్ని కేసులకూ ఒకే ఫార్ములా రీతిలో కాకుండా ఆయా సందర్భాలను బట్టి పరిహారం పరిమాణాన్ని నిర్ణయించాలని అభిప్రాయపడింది. రెండు రోజుల పాటు జరిగిన సమావేశం అనంతరం ఐఏబీ ఈ మేరకు సూచనలు చేసింది. -
బీబీఎం, వాట్స్యాప్లపై సెబీ కన్ను
న్యూఢిల్లీ: ఇన్సైడర్ ట్రేడింగ్‌కు చెక్ పెట్టే బాటలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ... ఫండ్ మేనేజర్లు, ట్రేడర్లు, బ్రోకర్లు వినియోగించే బ్లాక్‌బెర్రీ ఫోన్ల మెసెంజర్(బీబీఎం) సర్వీసులు, వాట్స్యాప్లపై దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా వెబ్ ఆధారిత సోషల్ నెట్వర్కింగ్ యాప్స్, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకోవడం ద్వారా క్లయింట్ల తరఫున వీళ్లు చేపట్టే ట్రేడింగ్(ఆర్డర్లు)ను పరిశీలించనుంది. ఈ వివరాలను సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే క్లయింట్ల తరఫున ఆర్డర్లను చేపట్టేందుకు బ్రోకర్లు, ఫండ్ మేనేజర్లకు సంబంధించి వ్యక్తిగత మొబైళ్ల వినియోగాన్ని సెబీ నిషేధించిన సంగతి తెలిసిందే. ఒక జట్టుగా ఏర్పడి(కార్టెల్) క్లయింట్ల లావాదేవీలు తదితర కీలక సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా షేర్ల ధరల రిగ్గింగ్‌కు పాల్పడటం వంటి అక్రమాలను అడ్డుకోవాలని సెబీ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా క్లయింట్ల లావాదేవీల వివరాలను భద్రపరచాల్సిందిగా బ్రోకింగ్ సంస్థలు, ఫండ్ హౌస్‌లను ఆదేశించినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో అవసరమైతే పరిశీలించేందుకు వీలుగా క్లయింట్ల రికార్డులను భద్రపరచి ఉంచమని సెబీ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోషల్ నెట్వర్కింగ్, వెబ్ ఆధారిత మెసేజింగ్ సర్వీసులు పెరిగిన నేపథ్యంలో డీలింగ్ రూమ్ కార్యకలాపాలకు సంబంధించి నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్లు వెల్లడించాయి. ప్రధానంగా షేర్లు, డెరివేటివ్స్, కరెన్సీ ఫ్యూచర్స్ వంటివి నిర్వహించే వ్యక్తులు సంస్థలపై నిఘా పెరగనున్నట్లు తెలిపాయి. స్టాక్ మార్కెట్ కార్యకలాపాలపై నిఘాలో భాగంగా సెబీ ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లపై దృష్టిపెట్టింది. వీటి ద్వారా జరుగుతున్న విశ్లేషణలను పరిశీలించేందుకు సాఫ్ట్వేర్ టూల్స్‌ను ఏర్పాటు చేసుకుంది కూడా. క్యాపిటల్ మార్కెట్ కేసుల్లో టెలికం కంపెనీల నుంచి కాల్ డేటా రికార్డులు, తదితర సమాచారాన్ని పొందే అధికారాలను సెబీ ఇప్పటికే పొందిన విషయం విదితమే. ఈ బాటలోనే బీబీఎం, వాట్స్‌యాప్ వంటి సర్వీసులపై సైతం కన్నేసింది.