సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. రాజధాని ఎక్కడ వస్తుంది అనే అంశం గురించి చంద్రబాబు తన టీమ్‌కు ముందుగానే లీకులిచ్చారు. దాంతో రాజధాని ప్రకటించకముందే చంద్రబాబు కోటరీ భారీగా భూములు కొన్నది. సాక్షి టీవీ ఇన్విస్టిగేషన్‌లో టీడీపీ నేతల ఇన్‌సైడర్ ట్రేడింగ్ వెలుగు చూసింది. ఈ కుంభకోణానికి సంబంధించి సాక్షి టీవీ కీలక ఆధారాలు సంపాదించింది. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఈ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో కీలక సూత్రధారుగా వ్యవహరించారు. ప్రభుత్వం రాజధాని గురించి ప్రకటించకముందే ఆంజనేయులు, తన కుమార్తె లక్ష్మీ సౌజన్య, తండ్రి సత్యనారాయణ పేరుతో భూములు కొనుగోలు చేసిన వ్యవహారం బట్టబయలైంది.
రాజధాని ప్రాంతంలోని మందడం, కొండమరాజుపాలెం, కురగల్లు, లింగాయపాలెం, నేలపాడు, వెలగపూడి, వెంకటపాలెం, ఐనవోలులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా ఆంజనేయులు భూములు కొనుగోలు చేశారు. సర్వే నెంబర్ 106/1, 106/2 లో అక్టోబర్ 2014లో 2ఎకరాల 22సెంట్ల భూమిని కుమార్తె లక్ష్మీ సౌజన్య పేరుతో కొన్నట్టు తేలింది. సర్వే నెంబర్ 374/సీ అక్టోబర్ 9, 2014న ఎకరం 79సెంట్లు, సర్వే నెంబర్ 420/1ఏ అక్టోబర్ 9 2014న 96 సెంట్లు, సర్వే నెంబర్ 430/1ఏ సెప్టెంబర్ 23, 2014న 98 సెంట్ల భూమిని తండ్రి గోనుగుంట్ల సత్యనారాయణ పేరుతో ఆంజనేయులు కొనుగోలు చేసినట్లు తెలిసింది.
(చదవండి: నారా లోకేశ్ తోడల్లుడి అబద్ధాలు)
Comments
Please login to add a commentAdd a comment