నారా లోకేశ్‌ తోడల్లుడి అబద్ధాలు | Sri Bharat Lies About Jayanthipuram Lands | Sakshi
Sakshi News home page

నారా లోకేశ్‌ తోడల్లుడి అబద్ధాలు

Published Thu, Aug 29 2019 7:14 PM | Last Updated on Fri, Aug 30 2019 7:51 AM

Sri Bharat Lies About Jayanthipuram Lands - Sakshi

సాక్షి, విజయవాడ: రాజధాని భూముల విషయంలో టీడీపీ నేత నారా లోకేశ్‌ తోడల్లుడు శ్రీభరత్‌ అబద్ధాలు బట్టబయలైయ్యాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామం సమీంలోని సర్వే నంబర్‌ 93లో 498 ఎకరాల భూమిపై శ్రీభరత్‌ అవాస్తవాలు చెప్పినట్టు సీఆర్‌డీఏ అధికారులు తేల్చారు. ఈ భూములను కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే తమకు కేటాయించినట్టు భరత్‌ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చంద్రబాబు హయాంలో 2015, జూలై 15న జయంతిపురం భూములను విఎఫ్‌సీఎల్‌ ఫెర్టిలైజర్‌ కంపెనీకి కేటాయించినట్టు సీఆర్‌డీఏ అధికారులు వెల్లడించారు. లోకేశ్‌ తోడల్లుడికి భూములు కేటాయించిన తర్వాత ఈ ప్రాంతాన్ని చంద్రబాబు సర్కారు 2015, సెప్టెంబర్‌ 22న సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. తన బంధువులు, బినామీలతో భూములు కొనిపించి వాటిని రాజధాని పరిధిలోకి వచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం చక్రం తిప్పినట్టు దీన్నిబట్టి తెలుస్తోంది.

రాజధాని భూముల్లో వందశాతం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగినట్టు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఆధారాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి తన కుటుంబ సభ్యులు, షెల్‌ కంపెనీల పేరుతో అమరావతి ప్రాంతంలో 623.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బట్టబయలు చేసిన విషయం విదితమే. (చదవండి: సుజనా.. భూ ఖజానా)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement