Lands allocation
-
‘కుమురం’ మ్యూజియానికి భూమి ఏదీ?
సాక్షి, వరంగల్: స్వాతంత్య్ర సమరయోధుడు కుమురం భీమ్, రాంజీ గోండు స్మారక మ్యూజి యంల కోసం కేంద్రం రూ.30కోట్లు మంజూరు చేసి రెండేళ్లైనా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ భూములు కేటాయించలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. డీపీఆర్ సిద్ధం చేసేందుకు రూ.కోటిచ్చినా ఇప్పటికీ అడుగుముందుకు పడలేదని మండి పడ్డారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామ రాజు మ్యూజియం పనులు కూడా ప్రారంభమ య్యాయని తెలిపారు. వరంగల్‌లోని వేయి స్తంభా ల గుడి, భద్రకాళి దేవాలయాల్లో కిషన్ రెడ్డి మంగళ వారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేయి స్తంభాల గుడి నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్య్రోద్యమంలో జైలుకెళ్లిన ఘంటసాల జయంతి శతాబ్ది ఉత్సవాలను ఢిల్లీ, హైదరాబాద్, ఏపీలో ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుందన్నారు. జూలై 4న అల్లూరి సీతా రామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందు కు ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారని తెలిపారు. గవర్నర్‌పై కక్షసాధింపు..: కేంద్ర ప్రభుత్వ ఆస్పి రేషన్ డిస్ట్రిక్ట్స్ కింద ఎంపికైన భూపాలపల్లి జిల్లాలో వైద్యం, విద్య, వ్యవసాయం, మౌలిక వసతుల కల్ప నకు నీతి ఆయోగ్ ద్వారా నిధులు కేటాయిస్తున్నా మన్నారు. కౌశిక్‌రెడ్డిని నామి నేటెడ్ ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ పంపిన ప్రతిపాదనను ఒప్పు కోకపోవడంవల్లే గవర్నర్‌పై కక్షసాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపిం చారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ... వెంటనే వరి ధాన్యం కొనుగోలుకు ఐకేపీ కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. -
నారా లోకేశ్ తోడల్లుడి అబద్ధాలు
సాక్షి, విజయవాడ: రాజధాని భూముల విషయంలో టీడీపీ నేత నారా లోకేశ్ తోడల్లుడు శ్రీభరత్ అబద్ధాలు బట్టబయలైయ్యాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామం సమీంలోని సర్వే నంబర్ 93లో 498 ఎకరాల భూమిపై శ్రీభరత్ అవాస్తవాలు చెప్పినట్టు సీఆర్డీఏ అధికారులు తేల్చారు. ఈ భూములను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తమకు కేటాయించినట్టు భరత్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చంద్రబాబు హయాంలో 2015, జూలై 15న జయంతిపురం భూములను విఎఫ్‌సీఎల్ ఫెర్టిలైజర్ కంపెనీకి కేటాయించినట్టు సీఆర్డీఏ అధికారులు వెల్లడించారు. లోకేశ్ తోడల్లుడికి భూములు కేటాయించిన తర్వాత ఈ ప్రాంతాన్ని చంద్రబాబు సర్కారు 2015, సెప్టెంబర్ 22న సీఆర్డీఏ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. తన బంధువులు, బినామీలతో భూములు కొనిపించి వాటిని రాజధాని పరిధిలోకి వచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం చక్రం తిప్పినట్టు దీన్నిబట్టి తెలుస్తోంది. రాజధాని భూముల్లో వందశాతం ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఆధారాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి తన కుటుంబ సభ్యులు, షెల్ కంపెనీల పేరుతో అమరావతి ప్రాంతంలో 623.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బట్టబయలు చేసిన విషయం విదితమే. (చదవండి: సుజనా.. భూ ఖజానా) -
రెవెన్యూలో మాయగాళ్లు
అసైన్డ్, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుంటాయి. కానీ ప్రైవేటు భూములను కూడా ఆక్రమించేసి రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేయించి ఆ భూములు తమవే నంటూ ఏకంగా పంటలు సాగు చేస్తున్నారు. అసలు హక్కుదారులు విషయం తెలుసుకుని వచ్చి అదేంటని అడిగినా ఆ భూములు తమవేనంటూ బుకాయిస్తున్నారు. ఇలా ఒక్క గిద్దలూరు నియోజకవర్గంలోనే వేలాది ఎకరాల భూములు పరులపాలయ్యాయి. ఈ అక్రమాల్లో రెవెన్యూ సిబ్బందిదే కీలకపాత్ర. గిద్దలూరు : తమకు భూమి ఉంది...పాసు పుస్తకం కూడా ఉంది. నిశ్చింతగా ఉండొచ్చనుకుంటే పొరబడినట్టే. గ్రామాల్లో పనిచేస్తున్న వీఆర్ఏలకు పలానా ప్రాంతంలో భూమి బీడుగా ఉందని గుర్తించారంటే ఆ భూమి వారి ఖాతాలోకి చేరుతుంది. రెవెన్యూ శాఖలో కొందరు అధికారులతో జతకట్టి ప్రభుత్వ, ప్రైవేటు భూములను అన్యాక్రాంతం చేసేస్తున్నారు. రికార్డులను సైతం మార్చేసి వారి పేర్లు, వారి బంధువుల పేర్లను ఎక్కించేసుకుంటున్నారు. కొందరు వీఆర్వోలు వారికి సహకరిస్తూ పాత అడంగళ్లు, వన్ బీ రికార్డుల్లోనూ పదేళ్ల ముందు నుంచి అనుభవంలో ఉన్నట్లు నమోదు చేసేస్తున్నారు. ఇలా తమ అనుభవంలో ఉన్న భూమిని తహశీల్దారు ద్వారా వారి పేరుతో ఆన్లైన్ చేసేసుకుంటున్నారు. కొన్ని రోజులు గడిచాక రికార్డుల్లో తమ పేరు ఉందంటూ భూమిని దున్నేసి పంటలు సాగు చేసుకుంటారు. పంటలు సాగుచేసే సమయంలో గుర్తించి ఇదేమని ప్రశ్నిస్తే ఈ పొలం మాదనుకున్నాము. ఈ ఏడాది పంట వేసుకుంటాం. వచ్చే ఏడాది మీరే తీసుకోండని నమ్మబలికిస్తారు. వచ్చే ఏడాది భూమి నాదే, గతేడాది నేనే పంట సాగు చేసుకున్నాను. రికార్డుల్లో పేర్లు నావే ఉన్నాయంటూ ఘర్షణకు దిగుతారు. వారిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే రికార్డులను మార్చింది వారే కాబట్టి. ఇలా రెవెన్యూ అధికారులు పేద రైతులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములను, అమాయకంగా ఉండే రైతుల స్వంత భూములను సైతం కాజేస్తున్నారు. మండలంలోని ముండ్లపాడు గ్రామానికి చెందిన తల్లపురెడ్డి వెంకటరెడ్డికి చెందిన 1481వ సర్వే నంబర్లోని భూమిని ఇదే విధంగా గ్రామానికి చెందిన వీఆర్ఏ తన బంధువుల పేర్లతో ఆక్రమించేశారు. వీఆర్ఏకు మద్దతునిస్తూ వీఆర్వో 8 సంవత్సరాల అడంగళ్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు స్వయంగా ఆర్ఐ విచారణలో తేలింది. ఆయన తహశీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా వీఆర్ఓస్పందించడంలేదనిరైతువాపోతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన మోడి పుల్లయ్య స్వంత భూమిని ఇతరుల పేరుతో ఆన్లైన్ చేసేశారు. ముండ్లపాడు గ్రామానికి చెందిన ఓ వీఆర్ఓ గ్రామ రికార్డులను తన వద్ద పెట్టుకుని ఒకరి పేరును మరొకరికి రాస్తూ తారుమారు చేస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. 20 వేల ఎకరాలకు పైగా అనర్హులకు చేరిన ప్రభుత్వ భూములు: నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 20 వేల ఎకరాలకు పైగా అసైన్మెంట్ భూములు అనర్హులకు అప్పగించి రెవెన్యూ అధికారులు కోట్లు సంపాదించారు. అధికారులకు డబ్బు ఆశచూపి ఒక్కొక్కరు పది ఎకరాలకు పైగా భూములను కొల్లగొట్టేశారు. గ్రామాల్లో వ్యవసాయ కూలీలు, పేదలు పెంచుకునే పశువులు, గొర్రెలు మేసేందుకు అవసరమైన గ్రాసం కనిపించకుండా మేత బీడు భూములను సైతం అన్యాక్రాంతం చేసేశారు. ప్రభుత్వ భూములు అక్రమంగా పొందిన కొన్ని సంఘటనలు... కొమరోలు మండలంలోని దద్దవాడ రెవెన్యూలో అధికార పార్టీకి చెందిన ఓ డీలర్ 130 ఎకరాలు ఆక్రమించేశాడు. రాజుపాలెంలో 34 ఎకరాలకు ముగ్గురు పాసు పుస్తకాలు పొందారు. అనంతరం రూ.10 లక్షల వరకు బ్యాంకు రుణం పొందారు. ఇప్పుడు ఆ భూమిని ఆన్లైన్లో రస్తా పోరంబోకు భూమిగా చూపిస్తున్నారు. రాచర్ల మండలంలోని యడవల్లి రెవెన్యూలో గిద్దలూరుకు చెందిన టీడీపీ నాయకులకు అసైన్డ్ భూములు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రైవేటు భూములను సైతం ఆన్లైన్ చేసి ఈ–పాసు పుస్తకాలు ఇచ్చారు. సత్యవోలుకు చెందిన ఓ ఉద్యోగి తన భార్య పేరుతో అసైన్డ్ భూములను పొందాడు. యడవల్లికి చెందిన ఆలయ భూములను ఉద్యోగులు ఆక్రమించుకున్నా రెవెన్యూ, దేవాదాయ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గిద్దలూరు మండలంలోని వెల్లుపల్లెలో 1015 సర్వే నంబరులో ఆరు ఎకరాలు ఉన్న నాలుగుపాటి కుంటను క్రిష్ణా జిల్లాకు చెందిన సాంబశివరావు ఆక్రమించి కట్టను తొలగించి చదును చేసుకున్నాడు. ముండ్లపాడు రెవెన్యూలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు భూములను సైతం అన్యాక్రాంతం చేస్తూ ఆన్లైన్లో ఒకరి భూమిని మరొకరికి పేర్లు మార్చి అక్రమాలకు పాల్పడ్డారు. చనిపోయిన వారి ఖాతాలను కేటాయించి ఆన్లైన్లో ఇతరులుగా నమోదు కాబడిన ప్రభుత్వ భూమిని బినామీదార్ల పేర్లతో నమోదు చేస్తూ బ్యాంకుల్లో భారీ గా రుణాలు పొందినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నా భూమిని ఇంకొకరికి రాసిచ్చారు తన పూర్వీకులకు చెందిన 4.16 ఎకరాల భూమిని నేను అనుభవిస్తున్నాను. పాసు పుస్తకం ఇచ్చారు. రెండేళ్లుగా వర్షాలు కురవలేదని బీడు పెట్టడంతో వీఆర్ఏ బంధువులు ఆక్రమించుకున్నారు. తహశీల్దారుకు, ఆర్డీఓకు, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా వీఆర్వో పలకడం లేదు. ఆర్ఐ వచ్చి పరిశీలించి రికార్డుల్లో పేర్లు మార్చారని చెబుతున్నారు. – టి.వెంకటరెడ్డి, బాధితుడు, ముండ్లపాడు గ్రామం. మా భూమిని పక్కనున్న వారికి ఆన్లైన్ చేశారు మానాన్న యల్లా రాజేంద్రప్రసాద్ పేరుతో 702–2 సర్వే నంబర్లో ఉన్న 24 సెంట్ల భూమిని పక్కనే ఉన్న వారికి ఆన్లైన్ చేశారు. 1978 సంవత్సరం నుంచి మా అనుభవంలో ఉన్న 99 సెంట్ల భూమిని మానాన్న పేరున ఆన్లైన్ చేశారు. మాకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే 24 సెంట్ల భూమిని పక్కనే ఉన్న యల్లా సరస్వతి పేరున ఆన్లైన్ చేశారు. – యల్లా వెంకటమణికంఠ, గిద్దలూరు. ఫిర్యాదు అందిస్తే విచారించి చర్యలు తీసుకుంటాం రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లు మాకు ఫిర్యాదులు అందలేదు. బాధితులు నేరుగా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం. భూమిపై ఎవరికి హక్కు ఉందో విచారించి వారి భూములను వారికి ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ ట్యాంపరింగ్ జరిగిందో చెబితే సంబంధిత అధికారులను విచారించి చర్యలు చేపడతాం – పెంచల కిషోర్, ఆర్డీఓ, మార్కాపురం -
హునాన్ ప్రావిన్స్‌కు నిమ్జ్‌లో భూ కేటాయింపులు!
సాక్షి, హైదరాబాద్: చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన కంపెనీకి మెదక్ జిల్లాలోని నిమ్జ్‌లో భూములు కేటాయించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆసక్తి కనబరుస్తోంది. ముంబైలో మేక్ ఇన్ ఇండియాపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాల్‌ను శనివారం హునాన్ ప్రావిన్స్‌కు చెందిన 12 మంది ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌తో హునాన్‌కు చెందిన కంపెనీ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని, అందుకు 2,500 నుంచి 3 వేల ఎకరాలు కావాల్సిందిగా ప్రతినిధి బృందం విన్నవించింది. దీనికి స్పందించిన పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, మెదక్ జిల్లాలోని నిమ్జ్‌లో భూకేటాయింపులు చేస్తామన్నారు. -
పితాని పితలాటకం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మాజీ మంత్రి, ఆచంట శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ భూ సంతర్పణ రావణకాష్టంలా రగులుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పితాని తన అనుచరులకు కట్టబెట్టిన భూముల వ్యవహా రంపై ఇప్పుడు దళితులు, మహిళలు ఎడతెగని పోరాటం చేస్తున్నారు. రోజురోజుకీ తీవ్రతరమవుతున్న ఈ భూవివాదం పూర్వాపరాలను పరి శీలిస్తే.. ఆచంటలోని నటరాజ్ థియేటర్ వెనుక భాగంలో గల రెండెకరాల 70సెంట్ల పోరంబోకు స్థలం (ఆర్ఎస్ నెం.1246/3) కొన్నేళ్లుగా ఆక్రమణలకు గురవుతోంది. విలువైన ఈ భూమి మొత్తంగా కబ్జా అవుతున్న నేపథ్యంలో ఎప్పటినుంచో అక్కడ నివాసముంటున్న పేదలు ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల పట్టాలు ఇప్పించాల్సిందిగా కోరుతూ వచ్చారు. ఈ మేరకు గతంలో జిల్లా కలెక్టర్‌కు, రచ్చబండ కార్యక్రమాల్లో అధికారులకు పలుమార్లు దరఖాస్తులు అందజేశారు. స్పందించిన అధికారులు అర్హులైన 40మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయితే విలువైన ఈ భూమిపై కన్నేసిన అప్పటి మంత్రి పితాని సత్యనారాయణ అనుచరులు అర్హులైన 38మంది లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లను రాసుకుని సరిగ్గా ఎన్నికలకు ముందు మంత్రి చేతుల మీదుగా ఆయన ఇంట్లోనే పట్టాలు పొందారు. ఎన్నో ఏళ్లనుంచి అక్కడే ఉంటున్న తమకు కాకుండా అనర్హులకు పట్టాలివ్వడంపై స్థానికులు వెంటనే పితాని వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, అక్కడికి సమీపంలో శివారు గ్రామమైన పోర ప్రాంతంలో 15 మందికి పట్టాలిప్పిస్తామని ఆయన నచ్చజెప్పారు. అక్కడ ఎప్పటినుంచో నివాసముంటున్న తాము మరోచోటకు ఎందుకు వెళ్తామంటూ స్థానికులు ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో సదరు భూముల వ్యవహారం కొంతకాలం సద్దుమణిగింది. టీడీపీ వాళ్లే మిమ్మల్ని పంపించి ఉంటారు : పితాని ఆగ్రహం తాజాగా ఈ ప్రాంతవాసులు మళ్లీ తాము ఉంటున్న స్థలాలను తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టారు. ఈ విషయమై ఎమ్మెల్యే పితాని సత్యనారాయణను కలిసి అభ్యర్థించేందుకు సుమారు యాభైమంది మహిళలు కొద్దిరోజుల కిందట పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామంలోని పితాని స్వగృహానికి వెళ్లారు. అంతే.. వారిని చూడగానే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘పట్టాల్లేవ్.. స్థలాల్లేవ్.. మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలుసు. ఆచంట టీడీపీ వాళ్లే ఇదంతా చేస్తున్నారు. ఈ రాజకీయాలు నా దగ్గరొద్దు. ముందు ఇక్కడి నుంచి పోండి..’ అంటూ ఒకింత కటువుగా మాట్లాడినట్టు చెబుతున్నారు. పితాని వ్యవహార శైలిపై స్థానికులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత వారం రోజులుగా నిరసనలు చేపడు తున్నారు. నిరాహార దీక్షలు, ధర్నాలు.. ఇలా వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అయిన పితాని వద్దకు ఎప్పటినుంచో ఆ పార్టీకి సానుభూతిపరులుగా ఉన్న తాము వెళ్తే ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఆందోళనకారులను అవమానిస్తున్నారు మహిళలని కూడా చూడకుండా ఇంటికొచ్చిన వారి పై ఇష్టమొచ్చినట్టు నోరుపారేసుకున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఇప్పుడు భూముల కోసం నిరాహార దీక్షలు చేస్తున్న ఆందోళనకారులను కూడా అవమానిస్తున్నారు. వారం రోజులకుపైగా ఆచంట నియోజకవర్గ కేంద్రంలో పేదలు, మహిళలు నిరాహార దీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడం అన్యాయం. అర్హులైన వారికే పట్టాలు వచ్చాయని మంత్రి వాదిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులతో పూర్తి విచారణ చేపడితే వాస్తవాలు బయటపడతాయి. - వసంతాడ నాగేశ్వరరావు, దళిత ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు -
భూ కేటాయింపులపై రగడ: జగన్
* ధూళిపాళ్లకు జగన్ సవాల్ * బ్రహ్మణి స్టీల్ స్థలంపై లోన్ తీసుకున్నట్టు నిరూపిస్తారా? * సభలో లేని వ్యక్తిపై దాడేమిటి? * గాలి జనార్దన్‌రెడ్డిని కాల్వ శ్రీనివాసులు * సింగపూర్ తీసుకువెళ్లి చంద్రబాబుతో కలిపించారా? లేదా?: జగన్ సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్)కు భూము ల కేటాయింపుపై సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా అధికార టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చేసిన వ్యాఖ్యలు సభలో ఈ గందరగోళానికి దారితీశాయి. గవర్నర్ ప్రసంగంలో లేని జలయజ్ఞం, సెజ్‌లకు భూ కేటాయింపులు వంటి అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. బ్రహ్మణి స్టీల్స్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ... బల్లులు కూడా గుడ్లు పెట్టని పది వేల ఎకరాల భూముల్ని ఆ సంస్థకు అప్పగించామని ఆనాటి ముఖ్యమం త్రి చెప్పారని, కానీ ఆ సంస్థ నిర్వాహకులు అటువంటి స్థలాన్ని తాకట్టు పెట్టి రూ.300 కోట్లు రుణం తీసుకున్నారని, స్థలాభివృద్ధికి 20 కోట్లు మాత్రమే వ్యయం చేశారని ఆరోపించారు. ఈ తరహాలో దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. కాకినాడ సెజ్‌కు 20 వేల ఎకరాలు కేటాయించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. జగన్ రెండు సవాళ్లు... ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకుంటూ ధూళిపాళ్ల నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. కాకినాడ సెజ్ విషయంలో సభను తప్పుదోవ పట్టించేలా ధూళిపాళ్ల మాట్లాడుతున్నారంటూ... దానిపై నిజనిరూపణకు సిద్ధమా అంటూ శ్రీకాంత్‌రెడ్డి తరఫున సవాల్ విసిరారు. బ్రహ్మణి స్టీల్ స్థలాన్ని తాకట్టు పెట్టి రూ.300 కోట్ల రుణం తీసుకున్నట్టు నిరూపించగలిగితే శ్రీకాంత్‌రెడ్డి రాజీనామా చేస్తారని, లేకుంటే నరేంద్ర కుమార్ రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు. ధూళిపాళ్ల రాజీనామాకు సిద్ధమంటే విచారణ జరిపిద్దామన్నారు. ఇదే సందర్భంలో తానింకో సవాల్ కూడా చేస్తున్నానంటూ... కాల్వ శ్రీనివాసులు ద్వారా గాలి జనార్దన్‌రెడ్డి సింగపూర్‌లో చంద్రబాబును కలిసిన మాట నిజమా? కాదా? అని ప్రశ్నించారు. ‘చంద్రబాబు, జనార్దన్‌రెడ్డి, ఈ సభలోనే ఉన్న కాల్వ శ్రీనివాసుల పాస్‌పోర్టులు చెక్ చేయండి. వీసాలు ఉంటాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే గాలి జనార్దన్‌రెడ్డిని చంద్రబాబుతో కలిపించేందుకు కాల్వ శ్రీనివాసులు సింగపూర్ తీసుకువెళ్లారా? లేదా? ఈ విషయాన్ని ఎంతదాకా తీసుకువెళ్లేందుకైనా శ్రీకాంత్‌రెడ్డి సిద్ధం’’ అని సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి ఐదేళ్లయింది, ఆ తర్వాత పాలన చేసిన కాంగ్రెస్‌ను వదిలి నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్వ శ్రీనివాసులు జవాబిది.. కాల్వ శ్రీనివాసులు స్పందిస్తూ జగన్ వ్యాఖ్యలను తోసిపుచ్చా రు. ధూళిపాళ్ల మళ్లీ కాకినాడ భూములు, సెజ్‌ల వ్యవహా రాన్ని మొదలుపెట్టారు. దీనికి అభ్యంతరం తెలిపిన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి గవర్నర్ ప్రసంగంపై మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. మైనారిటీ వాణి విన్పించనివ్వరా? ఈ సందర్భంలో వైఎస్సార్సీపీ సభ్యులు జలీల్‌ఖాన్, జ్యోతు ల నెహ్రూ, శ్రీకాంత్‌రెడ్డి కూడా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. దానికి స్పీకర్ అంగీకరించలేదు. మైనారిటీ వాణి వినిపించడానికైనా అవకాశం ఇవ్వండని జలీల్‌ఖాన్ కోరారు. ఈ దశలో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని తమకు ఎవరిపైనా ద్వేషం లేదని తెలిపారు.