రాజధానిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేశారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలతోనే బాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని విమర్శించారు. రాజధాని అంశంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. రాజధానిపై శిమరామకృష్ణ నివేదిక ఇస్తే చర్చ కూడా జరపలేదని మంత్రి అన్నారు. మొదట గుంటూరు, నూజివీడు అని చెప్పి ఆ తర్వాత అమరావతి రాజధాని అని ప్రకటించారని వెల్లడించారు. 4070 ఎకరాలు బాబు తన అనుచరులకు కట్టబెట్టారని బుగ్గన ఆరోపించారు.