సాక్షి, విజయవాడ: రాజధాని అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. తాజాగా ఏడుగురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. తెల్లరేషన్ కార్డు దారుల పేర్లతో కోట్లాది రూపాయల విలువైలన భూములు కొనుగోలు చేసినట్టు కీలక ఆధారాలను సీఐడీ సేకరించింది. పాన్‌కార్డు లేని పేదలు కోట్లాది రూపాయల చెలామణి చేశారని గుర్తించింది. నాగమణి, నరసింహారావు, అనురాధ, కొండలరావు, భుక్యానాగమణి, అబ్దుల్, జమేదార్‌లపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఇప్పటికే మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావులపై కేసు నమోదైన సంగతి తెలిసింది. మరికొందరి ప్రమేయంపై విచారణ కొనసాగుతోంది. (చదవండి: టీడీపీలో ఈడీ దడ!)
కూపీ లాగుతున్న ఈడీ
అమరావతి : రాజధాని అమరావతిలో సాగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి మనీల్యాండరింగ్‌పై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్ట రేట్(ఈడీ) మరో అడుగు ముందుకేసింది. తెల్ల కార్డుదారులు ఎవరికి బినామీలనే కోణంలో ఆరా తీస్తోంది. కోట్లాది రూపాయలతో అక్కడ విలువైన భూములు కొనుగోలు చేసిన పేదల(తెల్లకార్డుదా రుల) జాబితాను సీఐడీ సేకరించడం తెలిసిందే. దీనిపై సీఐడీ ఇచ్చిన వివరాలతో క్రైమ్ నెంబర్ 3/ 2020 కేసు నమోదు చేసిన ఈడీ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టింది.
అమరావతి కోర్ ఏరియాలో 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు బహిరంగ మార్కెట్లో రూ.276 కోట్ల విలువైన 761.34 ఎకరా ల్ని రూ.38.56 కోట్లు(రిజిస్ట్రేషన్ విలువ) పెట్టి ఎలా కొన్నారనే దానిపై ప్రధానంగా ఆరా తీస్తోంది. వీరిలో పాన్‌కార్డు కలిగినవారు 268 మంది ఉండగా.. లేనివారు 529 మంది. తెల్లకార్డులు కలిగిన వారి వివరాల్ని వివిధ కోణాల్లో సేకరిస్తున్న విషయాన్ని ఈడీ హైద రాబాద్ జోనల్ కార్యాలయ జాయింట్ డైరెక్టర్ (జేడీ) అభిషేక్ గోయల్ ఏపీ సీఐడీ అధికారులకు సమాచారమిచ్చినట్లు తెలిసింది.
అలాగే, రాజధాని రావడానికి ముందు నుంచి పథకం ప్రకారం బినామీలను వాడుకుని తక్కువ ధరకు భూములు కొట్టేసినట్లు ఈడీ పసిగట్టింది. తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, తుళ్లూరు, పెదకాకాని, అమరావతి మండలాల్లో ఈ కొనుగోళ్లు ఎక్కువగా జరిగినట్లు నిర్ధారించింది. మరోవైపు.. ఎన్ని లక్షల రూపాయిల చొప్పున ఎంతమంది పెట్టుబడి పెట్టి భూములు కొన్నారో ఈడీ లెక్క తీసింది.
Comments
Please login to add a commentAdd a comment