
6,50,000 ఈ-మెయిళ్లు చదివారా?
కేవలం ఎనిమిది రోజుల్లోనే డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ కు చెందిన ఆరున్నర లక్షల ఈ-మెయిళ్లను చదివారా? అంటూ అమెరికన్ అధ్యక్ష పదవి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ఆదివారం ఎఫ్ బీఐ డైరెక్టర్ ను ప్రశ్నించారు. మిచిగాన్ లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ట్రంప్ ఎఫ్ బీఐ డైరెక్టర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. (చదవండి: ఎన్నికల ముందు హిల్లరీకి భారీ ఊరట)
హిల్లరీ అక్రమాలపై చాలా కాలం విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో దారుణ అక్రమాలకు పాల్పడిన ఆమెను ఎఫ్ బీఐ అధికారులు విడిచిపెట్టరని అన్నారు. కానీ, ప్రస్తుతం రిగ్గ్ డ్ సిస్టం ఆమెను రక్షిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు చాఫెజ్ కూడా క్లింటన్ ను నిర్దోషిగా ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. నేరాలకు పాల్పడిన హిల్లరీని అధ్యక్ష పీఠాన్ని అధిష్టించనివ్వకూడదని ట్రంప్ అమెరికన్లకు పిలుపునిచ్చారు.