
ఆండ్రూ మెక్‌కాబె
వాషింగ్టన్: కీలక సమాచారాన్ని అనధికారికంగా మీడియాకు అందిస్తున్నారనే ఆరోపణలపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ)లో రెండో ర్యాంకు అధికారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేటు వేశారు. ఆదివారం పదవీ విరమణ చేయనున్న ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ ఆండ్రూ మెక్‌కాబెపై శుక్రవారం అర్ధరాత్రి ట్రంప్ యంత్రాంగం వేటు వేసింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై విచారణకు సంబంధించిన కీలక సమాచారాన్ని మీడియాకు వెల్లడిస్తున్నందువల్లే మెక్‌కాబెపై వేటు వేస్తున్నట్టు అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ శుక్రవారం ప్రకటించారు.