
అమెరికా ఎన్నికలపై ఎఫ్‌బీఐ విచారణ
అమెరికా ఎన్నికలపై దర్యాప్తు చేయనున్నట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కూమీ సోమవారం ప్రకటించారు. ఎన్నికల్లో రష్యా ప్రభుత్వం పాత్ర ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు కూమీ తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రచారానికి, రష్యాకు ఏవైనా సంబంధాలు ఉన్నాయా? అనే అంశంపై కూడా విచారణ చేస్తామని పేర్కొన్నారు. అయితే ఏ విధంగా కేసు విచారణలో ముందుకు వెళ్తామనే అంశాలను ఇప్పుడే చెప్పలేమని తెలిపారు.