జాతి విద్వేషంతో శ్వేతజాతి ఉన్మాది భారతీయ ఇంజినీర్ శ్రీనివాస్ కుచిభోట్ల (32)ను దారుణంగా కాల్చిచంపిన ఘటనపై ఇండియన్ అమెరికన్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. శ్రీనివాస్ కుచిభోట్ల హత్యను తీవ్రంగా ఖండించారు. దేశంలో మతిలేని హింసకు తావులేదని తేల్చిచెప్పారు.