Hate crime
-
Temple Vandalised: భారత్ స్ట్రాంగ్ రియాక్షన్
అమెరికాలోని స్వామినారాయణ్ మందిర్ గోడలపై విద్వేష రాతలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. తీవ్రవాదులు, వేర్పాటువాదుల ఆగడాలకు ఎట్టిపరిస్థితుల్లో చోటు ఇవ్వమని అన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్.. ప్రభుత్వానికి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై యూఎస్ అధికారులు విచారణ చేపట్టారని పేర్కొన్నారు. మందిర్ గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలతో గ్రాఫిటీ చేసిన ఘటనను తాను చూసినట్లు జైశంకర్ మీడియాకు తెలిపారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే.. తీవ్రవాదులు, వేర్పాటువాదులు ఇతర ఏ వ్యతిరేక శక్తులకు తాము చోటు ఇవ్వమని అన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలోని ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ‘ఈ ఘటన భారతీయుల మనోభావలను కించపరిచింది. వెంటనే దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేశాం. ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని యూఎస్ అధికారులకు విజ్ఞప్తి చేశాం’ అని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. #WATCH | On Swami Narayan temple in Newark, US defaced with pro-Khalistani slogans, EAM Dr S Jaishankar says, "I have seen it. Extremists, separatists and such forces should not be given space. Our Consulate there complained to the government and the police and an inquiry is… pic.twitter.com/dfEzsfeeT8 — ANI (@ANI) December 23, 2023 స్వామినారాయణ్ మందిర్ గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలతో పాటు ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా గ్రాఫిటీ చేసినట్లు హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేసింది. ‘గుడి గోడలపై ఖలిస్తానీ ఉగ్రవాది జర్నెయిల్ సింగ్ బింద్రాన్‌వాలే పేరు రాశారు. ఇది గుడికి వచ్చే వారిని భయాందోళనలకు గురి చేయడమే. ఇది విద్వేశాలు రెచ్చగొట్టే చర్యల కిందకి వస్తుంది. ఈ రాతలపై పోలీసులు దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్ ట్వీటర్లో కోరింది. చదవండి: గుడి గోడలపై ఖలిస్తానీ నినాదాలు -
America: గుడి గోడలపై ఖలిస్తానీ నినాదాలు
కాలిఫోర్నియా : అమెరికాలోని స్వామినారాయణ్ గుడి గోడలపై విద్వేష రాతలు వెలిశాయి. ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ మద్దతు నినాదాలతో గుడి గోడలను నింపేశారు. కాలిఫోర్నియాలోని నెవార్క్ పట్టణంలో ఉన్న ఈ స్వామినారాయణ్ మందిర్ గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలతో పాటు ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా గ్రాఫిటీ చేసినట్లు హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేసింది. ‘గుడి గోడలపై ఖలిస్తానీ ఉగ్రవాది జర్నెయిల్ సింగ్ బింద్రాన్‌వాలే పేరు రాశారు. ఇది గుడికి వచ్చే వారిని భయాందోళనలకు గురి చేయడమే. ఇది హేట్ క్రైమ్ కిందకే వస్తుంది. ఈ రాతలపై పోలీసులు దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం’అని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ట్వీట్లో కోరింది. హిందై అమెరికన్ ఫౌండేషన్ విజ్ఞప్తిపై నెవార్క్ పోలీసులు సానుకూలంగా స్పందించారు. గుడి గోడలపై విద్వేష పూరిత రాతలు రాసిన ఘటనపై విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అమెరికా, కెనడాలో ఇలాంటి విద్వేష నేరాలు తరచూ రికార్డవుతున్నాయి. జీ 20 సదస్సు సమయంలో ఢిల్లీలోని మెట్రో స్టేషన్లపైనా ఖలిస్తానీ అనుకూల రాతలు వెలిశాయి. #Breaking: Swaminarayan Mandir Vasana Sanstha in Newark, California was defaced with pro-#Khalistan slogans.@NewarkCA_Police and @CivilRights have been informed and full investigation will follow. We are insisting that this should be investigated as a hate crime. pic.twitter.com/QHeEVWrkDj — Hindu American Foundation (@HinduAmerican) December 22, 2023 ఇదీచదవండి..హిట్లర్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు -
పైశాచికం: మానసిక వికలాంగుడిపై దాడి.. విద్వేష హత్య!
భోపాల్: మతం పేరిట మానసిక వికలాంగుడు, అందునా వృద్ధుడిపై దాడి చేసిన హేయనీయమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. పైగా దాడి చేసింది బీజేపీ మాజీ కార్పొరేటర్ భర్త కావడంతో ఈ వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మానసిక వికలాంగుడైన ఓ వృద్ధుడిపై దాడి చేస్తూ వీడియో చిత్రీకరించడం, అందులో మతం పేరిట అతనిపై దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత ఆ వృద్ధుడు విగతజీవిగా కనిపించడంతో.. తీవ్ర దుమారం చెలరేగింది. రాజకీయ విమర్శలు రావడంతో.. పోలీసులు దాడి, హత్య కేసు నమోదు చేసుకున్నారు. పైగా దాడికి పాల్పడింది బీజేపీ మాజీ కార్పొరేటర్ భర్త కావడంతో.. ఘటన చర్చనీయాంశంగా మారింది. నీముచ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి పాల్పడింది దినేష్ కుష్వాహగా గుర్తించారు. మానసిక స్థితి సరిగా లేని వృద్ధుడిపై దాడికి పాల్పడుతూ.. ‘నీ పేరేంట్రా? మహమ్మదా? నీ ఆధార్ కార్డు తీయ్ ముసలోడా’ అంటూ పదే పదే ప్రశ్నిస్తూ.. దుర్భాషలాడుతూనే ముఖం మీద కొట్టడం ఆ వీడియోలో ఉంది. పాపం.. ఏ జరుగుతుందో కూడా అర్థంకానీ స్థితిలో ఆ వృద్ధుడు అవస్థ పడడం వీడియోలో గమనించొచ్చు. తన దగ్గరున్న డబ్బు సంచి చూపించే ప్రయత్నం చేయగా.. నిందితుడు పదే పదే ఆ వృద్ధుడిపై దాడి చేశాడు. గురువారం ఈ దాడి ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. బాధితుడిని రట్లమ్ జిల్లా సాస్రికి చెందిన భనర్వల్‌లాల్ జైన్‌గా గుర్తించారు. రాజస్థాన్‌లో దైవదర్శనానికి భనర్వల్‌లాల్ కుటుంబం. అయితే అక్కడే ఆయన తప్పిపోయాడు. మే 15వ తేదీ నుంచి భనర్వల్‌లాల్ కనిపించకుండా పోయాడని ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతలో భనర్వల్‌లాల్ మృతదేహం లభ్యంకాగా, ఆ తర్వాతే దాడి వీడియో వైరల్ అయ్యింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా రాజకీయంగా ఈ దాడి దుమారం రేపడంతో.. హోం మంత్రి నరోట్టమ్ మిశ్రా స్పందించారు. నేరస్తుడు.. నేరస్తుడే అని.. దీనికి రాజకీయ రంగు పులమడం సరికాదన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు దినేష్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. A murder case has been registered in after a 65-year-old with mental illness was found dead and a video showed Dinesh Kushwaha, husband of an ex BJP corporator asking him if his “name is Mohammed” and repeatedly assaulting him as he struggled to answer @ndtv @ndtvindia pic.twitter.com/jWNDlLKpFb — Anurag Dwary (@Anurag_Dwary) May 21, 2022 -
‘అసమ్మతి లేని ప్రజాస్వామ్యం ఉండదు’
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా దళితులు, మైనారిటీలపై హింసాత్మక ఘటనలు పెచ్చు మీరుతున్న నేపథ్యంలో.. ఈ ఘటనలను ఖండిస్తూ వివిధ రంగాల ప్రముఖులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సినిమా సెలబ్రిటీలు అదూర్ గోపాలకృష్ణ, మణిరత్నం, అనురాగ్ కశ్యప్‌లు, అపర్ణ సేన్, కొంకణా సేన్ శర్మలతో పాటు మొత్తం 49 మంది ప్రముఖులు ఈ లేఖపై సంతకం చేశారు. ‘అధిక వర్గాలకు జై శ్రీరాం పవిత్రమైనది.. దానిని అపవిత్రం చేయడం మనేయండి. దళితులు, క్రైస్తవులు, ముస్లింలపై జరుగుతున్న అమానుష ఘటనలను, ఊచకోతలను వెంటనే అరికట్టాలి. 2016లో ఇలాంటి ఘటనలు దాదాపు 840 కేసులు నమోదయిన విషయాన్ని నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) ద్వారా తెలిసి మేము అశ్చర్యపోయాము. జై శ్రీరాం నినాదం ఇప్పుడు దేశంలో హింసాత్మకంగా మారింది. ఈ దీన స్థితికి మేము చింతిస్తున్నాము’ అని ’ అని లేఖలో పేర్కొన్నారు. ‘దళితులు, ముస్లింల జరుగుతున్న ఊచకోతపై మీరు పార్లమెంటులో స్పందించిన విషయం తెలుసు గానీ.. వాటిని ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి’ అని ప్రధాని మోదీని కోరారు. కాగా చారిత్రకవేత్త రామచంద్ర గుహ, సామాజిక వేత్తలు డాక్టర్ బినాయక్ సేన్, ఆశిష్ నంద్యా కూడా లేఖపై సంతకాలు చేశారు. ‘అసమ్మతి లేని ప్రజాస్వామ్యం ఉండదు. అలాగని ప్రజలను దేశ వ్యతిరేకులుగా, అర్బన్ నక్సల్‌గా ముద్ర వేయకూడదని, అసమ్మతిని కారణంగా చూపి ప్రజలకే శిక్షలు వేయకూడదని వీరంతా లేఖలో పేర్కొన్నారు. -
‘ధ్రితి’ కోసం వారం రోజుల్లోనే రూ. 4 కోట్ల విరాళాలు
వాషింగ్టన్ : మతోన్మాదం మత్తులో తూగుతున్న ఓ వ్యక్తి ముస్లింలుగా భావించి ఓ కుటుంబాన్ని చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి.. కోమాలోకి వెళ్లిన ఓ చిన్నారి కోలుకోవడం కోసం ప్రపంచమంతా ప్రార్థిస్తుంది. అంతేకాక ఆ చిన్నారి వైద్య ఖర్చులకు కావాల్సిన మొత్తాన్ని విరాళాల ద్వారా సేకరిస్తుంది. వివరాలు.. ఇండో అమెరికన్ కుటుంబానికి చెందిన ధ్రితి(13) గత నెల 23న తన కుటుబంతో కలిసిన బయటకు వెళ్తోంది. అయితే వీరిని ముస్లింలుగా భావించిన ఓ మోటరిస్ట్.. వారిని చంపేందుకు ప్రయత్నించాడు. కావాలనే మోటర్‌సైకిల్‌తో వారిని ఢీకొట్టాడు. ఈ దాడిలో ధ్రితి తీవ్రంగా గాయపడగా.. ఆమె తండ్రి, సోదరులకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి చేర్చారు. అయతే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ధ్రితి కోమాలోకి వెళ్లింది. ఆమెకు వైద్యం చేయడానికి 5 లక్షల అమెరికన్ డాలర్లు(రూ.3,46,80,750) ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు. ఇంత భారీ మొత్తం ఖర్చు చేసి ధ్రితికి వైద్యం చేపించే స్థితిలో ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితులు లేవు. విషయం తెలుసుకున్న ‘గోఫండ్‌మి’ అనే ఫండ్ రైజింగ్ సంస్థ ధ్రితి పరిస్థితిని వివరిస్తూ.. ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలా చేసిన వారం రోజుల్లోనే.. దాదాపు 12,360 మంది జనాలు ధ్రితికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దాంతో కేవలం ఏడు రోజుల్లోనే 6 లక్షల అమెరికన్ డాలర్లు (రూ.4,16,18,700 )విరాళంగా వచ్చాయి. ఈ మొత్తం వైద్యం ఖర్చుల కోసం కావాల్సిన దానికంటే ఎక్కువే ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ధ్రితిపై దాడి చేసిన వ్యక్తి జైలులో ఉన్నాడు. -
అమెరికాలో విద్వేష దాడులు తగ్గుతాయట!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో రోజు రోజుకు పెరుగుతున్న విద్వేష దాడుల వల్ల స్థానికులే కాకుండా ఆ దేశంలో నివసిస్తున్న విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు భయాందోళనలకు గురవుతున్న విషయం తెల్సిందే. అమెరికాలో గత నాలుగేళ్లుగా వరుసగా పెరుగుతున్న విద్వేష పూరిత దాడులు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న 2017లో ఒక్కసారిగా 57 శాతం పెరిగాయని ‘యాంటీ డిఫమేషన్ లీగ్’ వెల్లడించింది. అలాగే అక్టోబర్ 27వ తేదీన పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో జరిగిన విద్వేషపూరిత దాడిలో 11 మంది మరణించిన విషయం తెల్సిందే. నవంబర్ 6వ తేదీన జరిగిన ప్రజా ప్రతినిధుల సభ ఎన్నికల్లో డెమోక్రట్లు మెజారిటీ సాధించిన నేపథ్యంలో దేశంలో విద్వేష పూరిత దాడులు తగ్గుముఖం పట్టవచ్చని యాంటీ డిఫమేషన్ లీగ్ సీఈవో జొనాథన్ గ్లీన్‌భట్ ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక విద్వేష దాడులు పెరగడానికి ఆయన విద్వేష పూరిత ప్రసంగాలే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. విద్వేషపూరిత దాడుల నుంచి తప్పించుకున్నవారికి ఆయన ఇటీవల ‘కరేజ్ అగనెస్ట్ అవార్డ్స్’ను అందజేశారు. విద్వేష దాడులు అనేవి అంటురోగం లాంటిదని, మనం సకాలంలో జోక్యం చేసుకొని అరికట్టలేకపోతే అంతటా వ్యాపిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధుల సభలో డెమోక్రట్ల ప్రాబల్యం వల్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు రిపబ్లికన్ల అధికారం తగ్గుతుందని, అది సామాజిక పరిస్థితులు మెరగుపడేందుకు దారితీస్తుందని, తద్వారా దేశంలో విద్వేష పూరిత దాడులు తగ్గుతాయని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు. అవంతట అవే తగ్గుతాయనుకోవడం పొరపాటే అవుతుందని, ఈ దిశగా డెమోక్రట్లు ప్రజా ప్రతినిధుల సభ ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. -
అమెరికాలో మరో విద్వేష దాడి
న్యూయార్క్: అమెరికాలో విద్వేష దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా న్యూయార్క్ లో సిక్కు క్యాబ్ డ్రైవర్ విద్వేష దాడికి గురయ్యాడు. హరకీరత్ సింగ్(25) అనే సిక్కు యువకుడిపై నలుగురు ప్రయాణికులు దాడి చేశారు. అతడి తలపాగాను ఎత్తుకెళ్లారు. దుర్భాషలాడుతూ అతడిపై చెప్పులు విసిరారు. చిత్తుగా తాగివున్న ప్రయాణికుడితో పాటు మరో ముగ్గురు తన కారులో ఎక్కారని బాధితుడు తెలిపాడు. కారులో ఎక్కిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో సరిగ్గా చెప్పకుండా తనను తిట్టడం మొదలు పెట్టారని వాపోయాడు. తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, వారిలో ఒకడు చేతిపై దాడి చేశాడని తెలిపాడు. సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే తలపాగాను ఊడదీసి ఎత్తుకెళ్లారని పోలీసులతో చెప్పాడు. ఈ ఘటనపై న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి జరిగినప్పటి నుంచి పనిచేయడానికి తనకు భయం వేస్తోందని హరకీరత్ సింగ్ అన్నాడు. రాత్రి వేళలో డ్రైవింగ్ చేయాలంటే వణుకు వస్తోందని వాపోయాడు. తన మతానికి అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దాడి జరగడానికి వారం రోజుల ముందే విద్వేష దాడులకు వ్యతిరేకంగా ప్రవాస సిక్కులు ప్రచారం నిర్వహించారు. అమెరికాలో ఇటీవల కాలంలో భారతీయుల పట్ల వరుసగా విద్వేష దాడులు జరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. -
‘అది విద్వేష దాడి కాదు’
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో ఆఫ్రికన్లపై దాడి దురదృష్టకరమని విదేశాంగ శాఖ పేర్కొంది. విదేశీయుల భద్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. నైజీరియా హైకమిషనర్ తో విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ మాట్లాడారని వెల్లడించింది. నైజీరియా పౌరుల రక్షణకు స్థానిక అధికారులు తీసుకుంటున్న చర్యలను వివరించారని విదేశాంగ శాఖ తెలిపింది. నైజీరియన్లపై జరిగింది విద్వేష దాడి కాదని గౌతమ్ బుద్ధ నగర్ డీఎం ఎన్పీ సింగ్ చెప్పారు. యువకుడి మరణానికి నైజీరియన్లు కారకులైయ్యారని కొంతమంది వదంతులు ప్రచారం చేయడంతో ఈ దాడి జరిగిందని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని, వీరిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దాడి నేపథ్యంలో పలువురు నైజీరియా ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. మరోవైపు కాస్నా పోలీస్ స్టేషన్ వెలుపల గ్రేటర్ నోయిడా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
‘మీరు వెదుకుతున్న హంతకుణ్ని నేనే’
న్యూయార్క్: అమెరికాలో జాత్యహంకారం బుసలు కొడుతూనే ఉంది. మన్ హటన్ లో సోమవారం జరిగిన విద్వేష దాడిలో 66 ఏళ్ల నల్ల జాతీయుడు తిమోతి కాగ్ మాన్ ప్రాణాలు కోల్పోయాడు. జాత్యహంకారంతోనే తిమోతిని హత్య చేసినట్టు శ్వేతజాతీయుడు జేమ్స్ హారిస్ జాక్సన్ అంగీకరించాడు. బుధవారం ఉదయం టైమ్ స్క్వేర్ వద్ద హఠాత్తుగా అతడు ప్రత్యక్ష మయ్యాడు. ‘మీరు వెదుకుతున్న వ్యక్తిని నేనే. తిమోతి మరణానికి నేనే కారణం. తన జేబులో కత్తులు ఉన్నాయ’ని హల్ చల్ చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మేరీల్యాండ్ లోని బాల్టిమోర్ లో నివసిస్తున్న 28 ఏళ్ల జాక్సన్ హారిస్ నల్లజాతీయుల పట్ల గత పదేళ్లేగా విద్వేషం పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. నల్లజాతీయులను చంపాలన్న ఉద్దేశంతో మార్చి 17న బస్సెక్కి న్యూయార్క్ కు వచ్చాడని వెల్లడించారు. తిమోతిపై వెనుక నుంచి కత్తితో దాడి చేసి పలుమార్లు పొడిచాడని తెలిపారు. తీవ్ర గాయాలపాలైన తిమోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడని, ఇది కచ్చితంగా జాత్యహంకార దాడి అని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి జాక్సన్ పారిపోయిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు కావడంతో పోలీసుల ఎదుట అతడు లొంగిపోవాడు. -
అతడి ఆచూకీ చెబితే లక్షలు ఇస్తాం!
న్యూయార్క్: భారత–అమెరికన్ దీప్ రాయ్ (39) అనే సిక్కు యువకుడిపై దాడి జరిగిన వారం రోజుల తర్వాత కాల్పులు జరిపిన అనుమానితుడి ఊహాచిత్రాలను కెంట్ పోలీసులు విడుదల చేశారు. శ్వేతజాతీయుడైన దుండగుడు ఆరు అడుగుల ఎత్తులో మధ్యస్తంగా ఉంటాడని, అతడి వయసు 35 నుంచి 40 ఏళ్లు ఉండే అవకాశముందని వెల్లడించారు. దట్టమైన, నల్లటి కనుబొమలు.. గోధుమ రంగు కళ్లు కలిగివున్నాడని వివరించారు. డార్క్ కలర్ దుస్తులు ధరించి, ముఖానికి ముసుగు వేసుకొచ్చి కాల్పులకు పాల్పడినట్టు తెలిపారు. విద్వేషంతోనే దుండగుడు దాడికి పాల్పడ్డాడని నిర్ధారించారు. నిందితుడి ఆచూకీ తెలిస్తే చెప్పాలని స్థానికులకు అర్బన్ సీటెల్, ఎఫ్ బీఐ అధికారులు విజ్ఞప్తి చేశారు. నిందితుడి గురించి చెప్పిన వారికి దాదాపు రూ. 4 లక్షలు(6 వేల డాలర్లు) నగదు ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంటిముందు కారు వద్ద నిలబడ్డ దీప్ రాయ్ దగ్గరకు వచ్చిన ఆగంతకుడు ‘మీ దేశానికి వెళ్లిపోండి’ అని అరుస్తూ కాల్పులు జరిపాడు. భుజంలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో దీప్ రాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంతకు ముందు కాన్సస్‌లో శ్రీనివాస్ కూచిభొట్ల, దక్షిణ కరోలినాలో హర్నీశ్ పటేల్‌పై జాత్యంహకార దాడులు జరిగాయి. మీ దేశానికి వెళ్లిపోండి.. అమెరికాలోని మనవారిపై మరో విద్వేషపు పడగ! మరో విద్వేషపు తూటా! ‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’ అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’ -
అమెరికాలో భారతీయుని ఇంటిపై దాడి
పీటన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతివిద్వేష వ్యాఖ్యల నేపథ్యంలో ప్రవాస భారతీయుడు కూచిభొట్ల శ్రీనివాస్ హత్య ఘటన మరువకముందే మరో భారతీయుడి ఇంటిపై దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దక్షిణ కొలరాడోలో జరిగిన ఈ దాడిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. పీటన్ నగరంలోని ఓ భారతీయుడి ఇంటిపై దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు అక్కడ దాదాపు 50కి పైగా జాతివిద్వేష పోస్టర్లు అతికించడంతో పాటు, గోడల మీద కోడిగుడ్లు కొట్టారు. గోడలపై కుక్క మలాన్ని పూశారు. తలుపు మీద, కిటికీల మీద, కారు అద్దాల మీద పోస్టర్లు అతికించారు. పోస్టర్లపై ‘గోధుమ వర్ణం వారు, లేదా ఇండియన్లు ఇక్కడ ఉండొద్దు’ అనే రాతలు రాశారు. అయితే.. ఈ దాడికి గురైన భారతీయుడు మాత్రం తన పేరు బయటపెట్టడానికి ఇష్టపడలేదు. అంతేకాదు.. ఎవరో ఒకరిద్దరు మాత్రమే అలా ఉన్నారు తప్ప అమెరికన్లంతా అలాంటివాళ్లు కారని, తన ఇంటి చుట్టుపక్కల వాళ్లంతా తనకు సాయంగా వచ్చి, ఇంటి గోడలను శుభ్రం చేశారని చెప్పారు. కానీ మళ్లీ తన ఇంటిపై ఇలాంటి దాడి జరుగుతుందోమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు గుంపుగా వచ్చి దాడి చేసి ఉంటారని ఎఫ్‌బీఐ భావిస్తోంది. అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి... అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’ -
ఇండియన్ అమెరికన్ ఎంపీల తీవ్ర స్పందన
-
కాన్సాస్ కాల్పులపై సత్య నాదెళ్ల స్పందన
-
తెలుగువారిపై కాల్పులు: స్పందించిన సత్య నాదెళ్ల
వాషింగ్టన్: తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కాన్సాస్ కాల్పులపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. మన సమాజంలో ఇలాంటి మతిలేని హింసకు, మతవిద్వేషానికి తావులేదని పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితులైన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి అండగా ఉంటానని ట్విట్టర్లో తెలిపారు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఓ శ్వేతజాతి ఉన్మాది జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనను ఇప్పటికే భారత సంతతికి చెందిన అమెరికన్ చట్టసభ సభ్యులు ఖండించారు. -
ఇండియన్ అమెరికన్ ఎంపీల తీవ్ర స్పందన
వాషింగ్టన్: జాతి విద్వేషంతో శ్వేతజాతి ఉన్మాది భారతీయ ఇంజినీర్ శ్రీనివాస్ కుచిభోట్ల (32)ను దారుణంగా కాల్చిచంపిన ఘటనపై ఇండియన్ అమెరికన్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. శ్రీనివాస్ కుచిభోట్ల హత్యను తీవ్రంగా ఖండించారు. దేశంలో మతిలేని హింసకు తావులేదని తేల్చిచెప్పారు. 'కాన్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటన తీవ్రంగా బాధ కలిగించింది. బాధితుల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. విద్వేషం విజయం సాధించకుండా చూడాల్సిన అవసరముంది' అని భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా సెనేటర్ కమల్ హారిస్ ట్వీట్ చేశారు. 'కాన్సాస్ కాల్పులతో ఛిన్నాభిన్నమైన కుటుంబం గురించే నేను మథనపడుతున్నా. మతిలేని హింసకు మన దేశంలో తావులేదు. జరిగిన ఘోరంతో నా గుండె పగిలింది' అని కాంగ్రెస్‌వుమెన్ పరిమళ జయపాల్ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయురాలిగా పరిమళ జయపాల్ నిలిచిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి దేశంలో విద్వేష నేరాలు పెరిగిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాన్సాస్ నగరంలో జరిగిన కాల్పులను ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యుడు రో ఖన్నా ఖండించారు. ఈ మతిలేని హింసలో బాధితులైన కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఓ శ్వేతజాతి ఉన్మాది జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది -
అమ్మో అమెరికా !
-
స్కార్ఫ్‌ను మెడకు చుట్టుకొని..చచ్చిపో!
వాషింగ్టన్: అమెరికాలో ఓ 24 ఏళ్ల ముస్లిం ఉపాధ్యాయురాలికి చేదు అనుభవం ఎదురైంది. తమ దేశంలో ఇక ఎంతమాత్రం హిజాబ్‌ను అంగీకరించబోమని, కాబట్టి స్కార్ఫ్‌ను మెడకు చుట్టుకొని ఉరేసుకొని చచ్చిపో అంటూ ఆమెకు బెదిరింపు లేఖ వచ్చింది. జార్జియా అట్లాంటాలోని గ్విన్నెట్ కౌంటీలో ఉన్న డకులా హై స్కూల్లో మిర్హా టెలి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ‘టెమి, ఇక నీ తలపై వేసుకొనే వస్త్రాన్ని ఎంతమాత్రం అంగీకరించబోం. ఎందుకు నువ్వు దానిని మెడకు చుట్టుకొని ఉరేసుకోవు’ అంటూ నల్లసిరాతో ఓ లేఖ ఆమెకు వచ్చింది. దీనిపై అమెరికా అని సంతకం చేసి ఉంది. ‘ఒక ముస్లింగా నా మతవిశ్వాసం ప్రకారం నేను తలపై వస్త్రాన్ని ధరిస్తాను. మా కమ్యూనిటీ ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని, నిజాల్ని తెలిపేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు నేను దీనిని షేర్ చేసుకుంటున్నాను. విద్వేషాన్ని వ్యాప్తి చేయడం వల్ల అమెరికా మళ్లీ గొప్ప దేశం కాబోదు’ అని ఆమె తన ఫేస్బుక్ పేజీలో తెలిపారు. మరోవైపు ఆమెకు వచ్చిన బెదిరింపు లేఖపై విచారణ జరుపుతున్నట్టు స్థానిక పాఠశాల తెలిపింది. -
అమెరికాలో మరో పెద్దాయనపై దాడి
న్యూయార్క్: అమెరికాలో భారతీయులపై విద్వేషపూరిత దాడులు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా న్యూజెర్సీలో భారతీయుడైన రోహిత్ పటేల్ (57)ను తీవ్రంగా కొట్టి, పళ్లూడిపోయేలా చేశాడో యువకుడు. గాయాలతో రక్తమోడుతున్న ఆ పెద్దాయనను రోడ్డుమీద పడేసి వెళ్లిపోయిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారతీయుడైనందువల్లే ఆయనను అవమానించి తీవ్రంగా కొట్టారని స్థానిక మీడియా రిపోర్టు చేసింది. దీనికి బాధ్యుడైన నైల్ కిల్గోర్ (24)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. వాకింగ్‌కు వెళ్లిన తన తండ్రిపై కొల్గోర్ అన్యాయంగా దాడి చేశాడని కొడుకు దీపేన్ పటేల్ ఆరోపించారు. తన తండ్రి చాలా అమాయకుడని, కావాలనే వెంబడించి మరీ ఈ దాడికి పాల్పడ్డాడని విమర్శించారు. ఈ సంఘటనతో స్థానికులతో పాటు, భారతీయులు బయటకు రావడానికే భయపడుతున్నారని వాపోయాడు. రెండు నెలల క్రితమే తాము యూకే నుంచి యూఎస్ వచ్చామని తెలిపారు. నిందితునికి బెయిల్ మంజూరు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కాగా ఈ ఏడాది ఆరంభంలో సురేష్ బాయ్ పటేల్‌పై పోలీసులు దాడిచేసిన సంఘటన పెను దుమారాన్ని రేపింది.