అమెరికాలో మరో పెద్దాయనపై దాడి | Indian-Origin Man's Teeth Broken in Hate Crime in New Jersey | Sakshi
Sakshi News home page

అమెరికాలో మరో పెద్దాయనపై దాడి

Jul 7 2015 4:05 PM | Updated on Sep 3 2017 5:04 AM

అమెరికాలో మరో పెద్దాయనపై దాడి

అమెరికాలో మరో పెద్దాయనపై దాడి

అమెరికాలో భారతీయులపై విద్వేష పూరిత దాడులు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా న్యూజెర్సీలో భారతీయుడైన రోహిత్ పటేల్(57)ను తీవ్రంగా కొట్టి, పళ్లూడిపోయేలా చేశాడో యువకుడు. గాయాలతో రక్తమోడుతుండగా రోడ్డుమీద పడేసి వెళ్లిపోయిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

న్యూయార్క్: అమెరికాలో భారతీయులపై విద్వేషపూరిత దాడులు  కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా న్యూజెర్సీలో భారతీయుడైన రోహిత్ పటేల్ (57)ను తీవ్రంగా కొట్టి, పళ్లూడిపోయేలా చేశాడో యువకుడు.  గాయాలతో రక్తమోడుతున్న ఆ పెద్దాయనను రోడ్డుమీద పడేసి వెళ్లిపోయిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారతీయుడైనందువల్లే ఆయనను అవమానించి తీవ్రంగా కొట్టారని స్థానిక మీడియా రిపోర్టు చేసింది.  దీనికి బాధ్యుడైన నైల్ కిల్గోర్ (24)ను పోలీసులు అదుపులోకి  తీసుకున్నారని తెలిపింది.

వాకింగ్కు వెళ్లిన తన తండ్రిపై కొల్గోర్ అన్యాయంగా దాడి చేశాడని కొడుకు దీపేన్ పటేల్ ఆరోపించారు. తన తండ్రి చాలా అమాయకుడని, కావాలనే  వెంబడించి మరీ ఈ దాడికి పాల్పడ్డాడని విమర్శించారు. ఈ సంఘటనతో  స్థానికులతో పాటు, భారతీయులు బయటకు రావడానికే భయపడుతున్నారని వాపోయాడు. రెండు నెలల క్రితమే తాము యూకే నుంచి యూఎస్ వచ్చామని తెలిపారు. నిందితునికి బెయిల్ మంజూరు  చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కాగా ఈ ఏడాది ఆరంభంలో సురేష్ బాయ్ పటేల్పై పోలీసులు దాడిచేసిన సంఘటన పెను దుమారాన్ని రేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement