అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలో బాలల సంబరాలను ఘనంగా నిర్వహించారు. సుమార 265 మంది విద్యార్ధిని, విద్యార్ధులు తమ ప్రతిభ పాటావాలను ప్రదర్శించారు. దాదాపు 800 మందికి పైగా తెలుగు వారు ఈ బాలల సంబరాల్లో పాలుపంచుకున్నారు.
తెలుగు ఆట, పాటలు, సంప్రదాయ నృత్యాలతో బాలల సంబరాలు కోలాహలంగా జరిగాయి. తెలుగు వారికి మధురానుభూతులు పంచాయి. బాలల సంబరాల్లో భాగంగానే సంక్రాంతి సంబరాలను కూడా జరిపి తెలుగు వారందరికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని నాట్స్ పంచింది. నాట్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీహరి మందాడి అనేక తెలుగు సంస్థల నాయకులను వేదికకు ఆహ్వానించి వారిని సత్కరించారు.
నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు బిందు యలమంచిలి, టీపీ రావు, నాట్స్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ భీమినేని, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ( మీడియా) మురళీకృష్ణ మేడిచెర్ల, నాట్స్ మార్కెటింగ్ నేషనల్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, నాట్స్ జాతీయ మహిళా సాధికారత బృందం శ్రీదేవి జాగర్లమూడి తదితరులు పాల్గొన్నారు.
నాట్స్ న్యూజెర్సీ నాయకులు మోహన్ కుమార్ వెనిగళ్ల, ప్రసాద్ టేకి, వెంకటేష్ కోడూరి, సురేంద్ర పోలేపల్లి, సునీత కందుల, ప్రణీత పగిడిమర్రి, గాయత్రి చిట్టేటి, అనూజ వేజళ్ల, సుధ టేకి, అరుణ గోరంట్ల, స్వర్ణ గడియారం, సమత కోగంటి, సుకేష్ సబ్బని, ప్రశాంత్ కుచ్చు, శ్రీనివాస్ నీలం, కృష్ణ సాగర్ రాపర్ల, కృష్ణ సాగర్ రాపర్ల, శ్రీనివాస్ నీలం, కృష్ణ సాగర్ రాపర్ల, నెక్కంటి, బ్రహ్మానందం పుసులూరి, కవిత తోటకూర, సాయిలీల మొగులూరి, సృజన, కావ్య ఇనంపూడి, బినీత్ చంద్ర పెరుమాళ్ల, ధర్మ ముమ్మడి, ఝాన్వీ సింధూర, అపర్ణ, చంద్రశేఖర్ కొణిదెల, వంశీకృష్ణ వెనిగళ్ల తదితరులు ఈ బాలల సంబరాల విజయంలో కీలక పాత్ర పోషించారు.
హర్షిత యార్లగడ్డ, అద్వైత్ బొందుగల, జాన్వీ ఇర్విశెట్టి చక్కటి తెలుగుపాటలు పాడి అందరిని అలరించారు. కిరణ్ మందాడి, సాయిలీలలు వ్యాఖ్యతలుగా వ్యవహారించి బాలల సంబరాలను దిగ్విజయంగా జరగడంలో సహకరించారు. న్యూజెర్సీలో బాలల సంబరాలను విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటిలు ప్రత్యేకంగా అభినందించారు.
(చదవండి: ట్రంప్ దూకుడు..ఇక స్వేచ్ఛ స్టాచ్యూ అయిపోనుందా..!)
Comments
Please login to add a commentAdd a comment