balala
-
న్యూజెర్సీలో ఘనంగా బాలల సంబరాలు..
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలో బాలల సంబరాలను ఘనంగా నిర్వహించారు. సుమార 265 మంది విద్యార్ధిని, విద్యార్ధులు తమ ప్రతిభ పాటావాలను ప్రదర్శించారు. దాదాపు 800 మందికి పైగా తెలుగు వారు ఈ బాలల సంబరాల్లో పాలుపంచుకున్నారు. తెలుగు ఆట, పాటలు, సంప్రదాయ నృత్యాలతో బాలల సంబరాలు కోలాహలంగా జరిగాయి. తెలుగు వారికి మధురానుభూతులు పంచాయి. బాలల సంబరాల్లో భాగంగానే సంక్రాంతి సంబరాలను కూడా జరిపి తెలుగు వారందరికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని నాట్స్ పంచింది. నాట్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీహరి మందాడి అనేక తెలుగు సంస్థల నాయకులను వేదికకు ఆహ్వానించి వారిని సత్కరించారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు బిందు యలమంచిలి, టీపీ రావు, నాట్స్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ భీమినేని, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ( మీడియా) మురళీకృష్ణ మేడిచెర్ల, నాట్స్ మార్కెటింగ్ నేషనల్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, నాట్స్ జాతీయ మహిళా సాధికారత బృందం శ్రీదేవి జాగర్లమూడి తదితరులు పాల్గొన్నారు. నాట్స్ న్యూజెర్సీ నాయకులు మోహన్ కుమార్ వెనిగళ్ల, ప్రసాద్ టేకి, వెంకటేష్ కోడూరి, సురేంద్ర పోలేపల్లి, సునీత కందుల, ప్రణీత పగిడిమర్రి, గాయత్రి చిట్టేటి, అనూజ వేజళ్ల, సుధ టేకి, అరుణ గోరంట్ల, స్వర్ణ గడియారం, సమత కోగంటి, సుకేష్ సబ్బని, ప్రశాంత్ కుచ్చు, శ్రీనివాస్ నీలం, కృష్ణ సాగర్ రాపర్ల, కృష్ణ సాగర్ రాపర్ల, శ్రీనివాస్ నీలం, కృష్ణ సాగర్ రాపర్ల, నెక్కంటి, బ్రహ్మానందం పుసులూరి, కవిత తోటకూర, సాయిలీల మొగులూరి, సృజన, కావ్య ఇనంపూడి, బినీత్ చంద్ర పెరుమాళ్ల, ధర్మ ముమ్మడి, ఝాన్వీ సింధూర, అపర్ణ, చంద్రశేఖర్ కొణిదెల, వంశీకృష్ణ వెనిగళ్ల తదితరులు ఈ బాలల సంబరాల విజయంలో కీలక పాత్ర పోషించారు. హర్షిత యార్లగడ్డ, అద్వైత్ బొందుగల, జాన్వీ ఇర్విశెట్టి చక్కటి తెలుగుపాటలు పాడి అందరిని అలరించారు. కిరణ్ మందాడి, సాయిలీలలు వ్యాఖ్యతలుగా వ్యవహారించి బాలల సంబరాలను దిగ్విజయంగా జరగడంలో సహకరించారు. న్యూజెర్సీలో బాలల సంబరాలను విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటిలు ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: ట్రంప్ దూకుడు..ఇక స్వేచ్ఛ స్టాచ్యూ అయిపోనుందా..!) -
లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆవిర్భవించినప్పటి నుండి “భాషే రమ్యం, సేవే గమ్యం” దిశగా పయనిస్తూ... భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ, ప్రతి ఏటా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే నాట్స్ లాస్ ఏంజెల్స్ బాలల సంబరాలు అత్యంత వైభవంగా అందరిని ఆకట్టుకునేలా చిన్నారుల నృత్య ప్రదర్శనలు, హాస్య నాటికలు, ఫాన్సీ డ్రెస్ ప్రదర్శన, ఫ్యాషన్ షో, మాథమాటిక్స్ అండ్ చెస్ పోటీలు ఘనంగా జరిగాయి.అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించిన ఈ సంబరాలలో దాదాపు 900 మందికిపైగా తెలుగు వారు ఈ బాలల సంబరాల్లో పాలుపంచుకున్నారు. ఈ బాలల సంబరాల్లో 300 మందికి పైగా చిన్నారులు సంప్రదాయ, జానపద, చలనచిత్ర నృత్యాల ద్వారా ప్రేక్షకులను కట్టిపడేసారు. ఆద్యంతం ఆహ్లదభరితంగా సాగిన ఈ ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. బాలల సంబరాల్లో ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రంగురంగుల దుస్తులు ధరించిన పిల్లలతో సాగిన ప్రదర్శన కన్నులపండుగగా ఆద్యంతం సాగింది. అదేవిధంగా ఫాన్సీ డ్రెస్ షో కూడా వివిధ ప్రముఖ పాత్రలతో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాట్స్ బాలల సంబరాలకు రాజ్యలక్ష్మి చిలుకూరి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఈ సంబరాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. బాలల సంబరాల్లో భాగంగా ఫ్యాషన్‌తో, విద్య, సాంస్కృతిక అంశాల్లో వివిధ పోటీల్లో చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. చదరంగం, గణిత పోటీలు విద్యార్ధుల్లో నైపుణ్యాలను వెలికి తీసి వారిని ప్రోత్సహించడమే నాట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం.ఈ బాలల సంబరాల్లో భాగంగా గురు కృష్ణ కొంకా అండ్ రావిలిశెట్టి వెంకట నరసింహారావు లకు వారి సామాజిక , నాట్స్ సేవలను గుర్తించి కమ్యూనిటీ సర్వీస్ అవార్డ్స్ తో పాటు సన్మాన పత్రాలు నాట్స్ బోర్డ్ గౌరవ సభ్యులు రవి ఆలపాటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ మధు బోడపాటి, నాట్స్ కార్యక్రమాల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ చిలుకూరితో వారికి సన్మానం చేశారు. లాస్ ఏంజిల్స్‌లో బాలల సంబరాలను దిగ్విజయం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ కృష్ణ కిషోర్ మల్లిన, నాట్స్ నేషనల్ కో ఆర్డినేటర్స్ కిషోర్ గరికపాటి, రాజలక్ష్మి చిలుకూరి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహార్, మెంటర్స్ హరి కొంక, వెంకట్ ఆలపాటి తదితరుల సహకారంతో ఈ బాలల సంబరాలు విజయవంతంగా జరిగాయి.బాలల సంబరాల నిర్వహణలో విశేష కృషి చేసిన లాస్ ఏంజిల్స్ చాప్టర్ కోఆర్డినేటర్ మురళి ముద్దన, జాయింట్ కోఆర్డినేటర్ బిందు కామిశెట్టి, నాట్స్ టీం సభ్యులు గురు కొంక, శ్రీనివాస్ మునగాల, సిద్ధార్థ కోలా, అరుణ బోయినేని, శంకర్ సింగంశెట్టి, శ్రీపాల్ రెడ్డి, చంద్ర మోహన్ కుంటుమళ్ల, ముకుంద్ పరుచూరి, సరోజ అల్లూరి, పద్మ గుడ్ల, రేఖ బండారి, లత మునగాల, నరసింహారావు రవిలిశెట్టి, సుధీర్ కోట, శ్యామల చెరువు, మాలతి, నాగ జ్యోతి ముద్దన, హారిక కొల్లా, అనూష సిల్లా, హర్షవర్ధన్ రెడ్డిచెర్ల, ప్రణవ్ ఆలపాటి, చంద్రర్క్ ముద్దనతో పాటు ఇతర వాలంటీర్లను నాట్స్ జాతీయ నాయకత్వం అభినందించింది. బాలల సంబరాలకు రుచికరమైన ఆహారాన్ని విష్ణు క్యాటరింగ్ గ్రూపుకు చెందిన రామ్ కడియాలను నాట్స్ అభినందించింది . సంబరాల ముగింపులో సాంస్కృతిక మహోత్సవం అందరికి సంతోషాలను, మధురానుభూతులను పంచింది.(చదవండి: ఫిలడెల్ఫియాలో నాట్స్ బాలల సంబరాలకు అద్భుత స్పందన) -
మలక్‌పేట ఎమ్మెల్యే అరెస్టు
మలక్‌పేట: గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అక్బర్‌బాగ్ ఎన్నికల అభ్యర్థిపై ఎంఐఎం నాయకులు దాడి చేసిన ఘటనలో మలక్ పేట ఎమ్మెల్యేను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరిగిన ఫిబ్రవరి 2న మలక్‌పేట ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రం వద్ద పరీశీలిస్తున్న ఎంబీటీ నాయకుడు అంజదుల్లా ఖాన్‌పై స్థానిక ఎమ్మెల్యే బలాల, కార్పొరేటర్ మినాజుద్దీన్తోపాటు మరో నలుగురు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై అంజదుల్లాఖాన్ మలక్‌పేట పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇటీవల నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఎమ్మెల్యే అహ్మద్ బలాల, షకీర్‌లను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ గంగారెడ్డి తెలిపారు. గతంలో అరెస్ట్ చేసిన వారందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు సమాచారం.