గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అక్బర్‌బాగ్ ఎన్నికల అభ్యర్థిపై ఎంఐఎం నాయకులు దాడి చేసిన ఘటనలో మలక్ పేట ఎమ్మెల్యేను శనివారం పోలీసులు అరెస్టు చేశారు.
మలక్‌పేట: గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అక్బర్‌బాగ్ ఎన్నికల అభ్యర్థిపై ఎంఐఎం నాయకులు దాడి చేసిన ఘటనలో మలక్ పేట ఎమ్మెల్యేను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరిగిన ఫిబ్రవరి 2న మలక్‌పేట ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రం వద్ద పరీశీలిస్తున్న ఎంబీటీ నాయకుడు అంజదుల్లా ఖాన్‌పై స్థానిక ఎమ్మెల్యే బలాల, కార్పొరేటర్ మినాజుద్దీన్‌తోపాటు మరో నలుగురు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు.
ఈ ఘటనపై అంజదుల్లాఖాన్ మలక్‌పేట పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇటీవల నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఎమ్మెల్యే అహ్మద్ బలాల, షకీర్‌లను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ గంగారెడ్డి తెలిపారు. గతంలో అరెస్ట్ చేసిన వారందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు సమాచారం.