Indian-origin man
-
అమెరికాలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తి హత్య
న్యూయార్క్: తెలంగాణాకు చెందిన యువకుడి హత్య సంఘటన మరువక ముందే భారత సంతతికి చెందిన మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. మేరీ ల్యాండ్‌లో సత్నామ్ సింగ్ హత్యకు గురయ్యాడు. తన ఇంటికి సమీపంలో సౌత్ ఓజోన్ పార్క్‌లో పార్క్ చేసిన బ్లాక్ జీప్ రాంగ్లర్ సహారా కారులో ఉండగానే అతణ్ని కాల్చి చంపిన ఘటన ఆందోళన రేపింది. సమీపంనుంచి సాయధ దుండగుడు అతనిపై కాల్పులు జరపాడని న్యూయార్క్ డైలీ న్యూస్ రిపోర్ట్ చేసింది. ఛాతీ, మెడపై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానిక జమైకా హాస్పిటల్‌కి తరలించారు. కానీ అప్పటికే సింగ్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు కాల్పులకు కొద్ది సమయానికి ముందు సత్నామ్ సింగ్ అతని స్నేహితుడి వద్ద నుంచి ఎస్‌యూవీని అరుపు తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎస్యూవీ యజమాని అనుకొని, సత్నామ్ సింగ్‌పై కాల్పులు జరిపారా? లేక అసలు హంతకుల టార్గెట్ ఎవరు? అనే దానిపై డిటెక్టివ్లు ఆరా తీస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. స్థానికుడు జోన్ కాపెల్లని కథనం ప్రకారం సింగ్ కారువైపు నడుస్తుండగానే మరో కారులో వచ్చిన దుండగుడు సింగ్‌పై అతిసమీపంనుంచి కాల్పులు జరిపి పారి పోయాడు. కాగా తెలంగాణ యువకుడు సాయి చరణ్ మేరీ ల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో కారులో హత్యకు గురైన కొన్ని రోజుల తర్వాత మరో సంఘటన నమోదు కావడం చర్చకు దారి తీసింది. -
ఆస్ట్రియా యువరాణి ఆకస్మిక మృతి
టెక్సాస్ : భారత సంతతికి చెందిన చెఫ్‌ను పెళ్లి చేసుకున్న ఆస్ట్రియా యువరాణి మరియా గాలిట్జీన్ (31) మృతి చెందారు. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో హ్యూస్టన్‌లో కన్నుమూశారు. అయితే మరియా మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 4న మరియా మృతి చెందగా స్థానిక మీడియాలో వచ్చిన సంతాప వార్త ఆధారంగా ప్రపంచానికి ఆమె మరణ వార్త తెలిసింది. 2017లో హ్యూస్టన్‌లో నగరంలో చెఫ్ రిషి రూప్ సింగ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు మాక్సిమ్ ఉన్నాడు. రిషి రూప్ ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా పనిచేస్తున్న హ్యూస్టన్లోనే మరియా ఇంటిరీయర్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. (ఇప్పట్లో స్కూళ్లు లేనట్లే! కాలేజీలకు మాత్రం.. ) మరియా.. ప్రిన్సెస్ మరియా- అన్నా,ప్రిన్స్ పియోటర్ గాలిట్జీన్ కుమార్తె. 1988లో లగ్జంబర్గ్‌లో జన్మించారు. మరియాకు ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నాడు. ఆమెకు అయిదు సంవత్సరాల వయస్సులోనే రష్యాకు మకాం మార్చారు. అక్కడే గ్యాడ్యూయేషన్ పూర్తిచేసుకున్న మరియా ఆర్ట్ ఆండ్ డిజైన్ కాలేజీలో చేరేందుకు బెల్జియంకు వెళ్లారు. బ్రస్సెల్స్తోపాటు చికాగో, ఇల్లినాయిస్, హ్యూస్టన్ వంటి నగరాలలో ఆమె పనిచేశారు. చిన్న వయస్సులోనే మరియా మరణించడంతో రాజ కుటంబీకులంతా సంతాపం ప్రకటించారు. (ప్రముఖ హస్యనటుడి మృతి ) -
హైదరాబాదీని చంపిన పాకిస్తానీ
లండన్: తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన ఓ పాకిస్తానీ, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో పాకిస్తాన్, యూకే పౌరసత్వం కలిగిన పెర్విజ్ (27)కు లండన్‌లోని క్రౌన్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పెరోల్ దరఖాస్తు చేసుకోవడానికి ముందు కనీసం 22 సంవత్సరాల శిక్ష అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. పదునైన ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు మరో 18 నెలల శిక్ష కూడా విధించింది. యావజ్జీవ శిక్షతో పాటే దీన్ని కూడా అనుభవించాలని పేర్కొంది. ‘మీ భార్య, కుటుంబ సభ్యులు, మరణించిన మొహమ్మద్‌లు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావని ఎంత చెప్పినా వినలేదు’ అని తీర్పు సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఏడాది మేలో ప్రజలు చూస్తుండగానే పెర్విజ్ హైదరాబాద్‌కు చెందిన తన సహోద్యోగి నదీమ్ ఉద్దీన్ హమీద్ మొహమ్మద్ (24)ను లండన్‌కు సమీపంలో పొడిని చంపాడు. మొహమ్మద్ చనిపోయే నాటికి అతడి భార్య అఫ్సా ఎనిమిది నెలల గర్భంతో ఉంది. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న మొహమ్మద్‌ను కిరాతకంగా చంపాడని మృతుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొంది. -
సైన్యాన్ని మోసగించబోయాడు
న్యూయార్క్: అమెరికా సైన్యంలో చేరడానికి తప్పుడు సమాచారం ఇచ్చిన భారత సంతతికి చెందిన ముస్లిం వ్యక్తి అరెస్టయ్యాడు. ఉగ్ర సంస్థ ఐసిస్‌కు మద్దతు పలకడంతో పాటు, దానిలో చేరడానికి ఆన్లైన్లో మార్గాలు వెతికాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అతడికి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష విధించే వీలుంది. వర్జీనియాలో నివసిస్తున్న 27 ఏళ్ల శివం పటేల్ ఏడేళ్ల క్రితం ఇస్లాం మతం స్వీకరించాడు. అమెరికా సైన్యంలో ఉద్యోగం కోసం పంపిన దరఖాస్తులో 2011–12లో కుటుంబంతో సహా భారత్‌లో పర్యటించడం మినహా ఏడేళ్లుగా అమెరికా దాటి వెళ్లలేదని పటేల్ పేర్కొన్నట్లు కోర్టు అఫిడవిట్‌ను ఉటంకిస్తూ ‘వర్జీనియా పైలట్’ పత్రిక తెలిపింది. పటేల్ గది, కంప్యూటర్ను పరిశీలిస్తే అతడు ఐసిస్ మేగజీన్‌ను డౌన్లోడ్ చేసుకుని, ఆ సంస్థలో చేరడానికి ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. -
ముస్లిం అనుకుని భారతీయుడిపై దాడి
వాషింగ్టన్: అమెరికాలో మరో జాతి విద్వేష దాడి ఆలస్యంగా వెలుగుచూసింది. గతేడాది నవంబర్ లో అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన కొన్నిరోజులకే భారత సంతతికి చెందిన అంకుర్ మోహతాపై ఓ అమెరికన్ వ్యక్తి జాతి విద్వేష దాడికి పాల్పడి ఆయనను తీవ్రంగా గాయపరిచాడు. ఈ కేసు తాజాగా విచారణకు రాగా, పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆ వివరాలిలా ఉన్నాయి.. జెఫ్రీ అల్లెన్ బర్గీస్(54) అనే పెన్సిల్వేనియాకు చెందిన వ్యక్తి సౌత్ హిల్స్ లో గత నవంబర్ 22న రెడ్ రాబిన్ రెస్టారెంట్ కు వెళ్లాడు. అంకుర్ మోహతా అదే రెస్టారెంట్ కు వచ్చి బర్గీస్ పక్క సీట్లో కూర్చున్నాడు. అంకుర్ మెహతాను చూసి ముస్లిం అనుకుని పొరబడిన బర్గీస్ అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు. మెహతా తన పని తాను చూసుకుంటున్నా.. బర్గీస్ తీరు మారలేదు. ముస్లింలు ఇక్కడ ఉండరాదు.. మీకు ఇక్కడే పని అంటూ దురుసుగా ప్రవర్తించాడు. ఆపై మెహతాపై పదునైన వస్తువుతో దాడిచేశాడు. దీంతో మెహతా ఓ దంతం ఊడిపోయిందని, రక్తం కారుతున్న ఆయనను సెయింట్ క్లేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. జాతి విద్వేష దాడిపై బెథల్ పార్క్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదుచేసి విచారణ చేపట్టగా.. అంకుర్ మెహతాను బర్గీస్ దూషిస్తూ కొట్టడం చూసినట్లు ప్రత్యక్షసాక్షులు పోలీసులకు చెప్పారు. పెన్సిల్వేనియా అసిస్టెంట్ అటార్నీ జనరల్ టామ్ వీలర్ మాట్లాడుతూ.. బర్గీస్ తప్పుచేశాడని.. ఉద్దేశపూర్వకంగానే జాతి విద్వేష దాడి చేసినట్లు తేలిందన్నారు. జాతి విద్వేషదాడికి పాల్పడిన బర్గీస్ కు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్షతో పాటు 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. -
ప్రియురాలికి చిత్రహింసలు.. పోలీసులకు తిట్లు
సింగపూర్: ప్రియురాలిని చిత్రహింసలు పెట్టడమే కాకుండా పోలీసులను నోటికొచ్చినట్టు తిట్టినందుకు సింగపూర్ లో భారతీయుడొకరు జైలు పాలయ్యాడు. నిందితుడు మురుగన్ సుబ్రమణియన్(44)కు కోర్టు 8 నెలల జైలు శిక్ష, సుమారు రూ. 2 లక్షల జరిమానా విధించిందని స్థానిక మీడియా వెల్లడించింది. తన మాజీ భర్త ఫోటోలు ఫేస్ బుక్ లో పెట్టినందుకు ప్రియురాలు రాధిక రాజావర్మ(31)తో మురుగన్ ఘర్షణ పడ్డాడు. అక్కడితో ఆగకుండా ఆమె ముఖంపై సిగరెట్ తో వాతలు పెట్టాడు. మార్చి 31న అతడీ దారుణానికి పాల్పడ్డాడు. దీనికి 15 రోజుల ముందు స్నేహితుల ముందు తనను అవమానించిందని రాధికతో గొడవపడ్డాడు. ఆమె గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోవడంతో పూలకుండీలు ధ్వంసం చేసి రభస సృష్టించాడు. సమాచారం అందుకుని తన ఇంటికి వచ్చిన పోలీసులపై నోరు పారేసుకున్నాడు. తన సోదరి మేడమ్ విలాహ్, ఆమె 16 ఏళ్ల కుమార్తెను కత్తితో బెదిరించాడు. ప్రియురాలిని హింసించిన కేసులో అతడికి విధించిన జైలు శిక్ష ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తుందని కోర్టు ప్రకటించింది. -
అమెరికాలో మరో పెద్దాయనపై దాడి
న్యూయార్క్: అమెరికాలో భారతీయులపై విద్వేషపూరిత దాడులు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా న్యూజెర్సీలో భారతీయుడైన రోహిత్ పటేల్ (57)ను తీవ్రంగా కొట్టి, పళ్లూడిపోయేలా చేశాడో యువకుడు. గాయాలతో రక్తమోడుతున్న ఆ పెద్దాయనను రోడ్డుమీద పడేసి వెళ్లిపోయిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారతీయుడైనందువల్లే ఆయనను అవమానించి తీవ్రంగా కొట్టారని స్థానిక మీడియా రిపోర్టు చేసింది. దీనికి బాధ్యుడైన నైల్ కిల్గోర్ (24)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. వాకింగ్‌కు వెళ్లిన తన తండ్రిపై కొల్గోర్ అన్యాయంగా దాడి చేశాడని కొడుకు దీపేన్ పటేల్ ఆరోపించారు. తన తండ్రి చాలా అమాయకుడని, కావాలనే వెంబడించి మరీ ఈ దాడికి పాల్పడ్డాడని విమర్శించారు. ఈ సంఘటనతో స్థానికులతో పాటు, భారతీయులు బయటకు రావడానికే భయపడుతున్నారని వాపోయాడు. రెండు నెలల క్రితమే తాము యూకే నుంచి యూఎస్ వచ్చామని తెలిపారు. నిందితునికి బెయిల్ మంజూరు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కాగా ఈ ఏడాది ఆరంభంలో సురేష్ బాయ్ పటేల్‌పై పోలీసులు దాడిచేసిన సంఘటన పెను దుమారాన్ని రేపింది. -
భార్యను పొడిచిన కేసులో ఎన్నారైకి జైలు శిక్ష
సింగపూర్: భార్యను కత్తితో పోడిచిన కేసులో భారతీయ సంతతికి చెందిన సురేష్ డేవిడ్ నర్శింహులకు 10 నెలల జైలుశిక్ష విధిస్తూ సింగపూర్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. గతేడాది అక్టోబర్‌లో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్శింహులు తన భార్య వసంతకుమారీతోపాటు తన ఇద్దరు చిన్నారులను లిటిల్ ఇండియాలోని రేస్ కోర్సు రోడ్డులో షాపింగ్‌కి తీసుకువెళ్లారు. ఆ క్రమంలో నర్శింహులు, వసంత కుమారీల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన నర్శింహులు తన వద్ద ఉన్న కత్తితో వసంతకుమారీ పొత్తికడుపులో పొడిచాడు. దీంతో రక్తపుమడుగులో ఆమె కుప్పకూలింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని.. బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నర్శింహులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు శుక్రవారం నిందితుడికి 10 నెలల జైలు శిక్ష ఖరారు చేస్తు తీర్పు వెలువరించింది. భార్య భర్తల మధ్య మనస్పర్థలు కారణంగా విడిపోయి జీవనం సాగిస్తున్నారని.... అయితే దీపావళి పండగ నేపథ్యంలో పిల్లలతో కలసి భార్య వసంత కుమారిని షాషింగ్ తీసుకువెళ్లాడని... ఆ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని స్థానిక మీడియా కథనాన్ని వెలువరించింది. -
సింగపూర్ లో ఎన్నారైకి జైలు
సింగపూర్: మైనర్ బాలిక పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన భారత సంతతి వ్యక్తి ఒకరు సింగపూర్ లో జైలు పాలయ్యాడు. నిందితుడు సమీర్ సింగ్ అలాక్ నేరానికి పాల్పడినట్టు రుజువు కావడంతో అతడికి కోర్టు నాలుగు వారాల జైలు శిక్ష విధించింది. ఓ హోటల్ కాల్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సమీర్ సింగ్ 2013, ఆగస్టులో కపాంగ్ బత్రు రోడ్డు నుంచి లోయర్ డెల్టా రోడ్డుకు వెళుతూ కారులో చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఎవరిలోనూ చెప్పొద్దని ఆమెను హెచ్చరించాడు. స్కూల్లో చిన్నారి మాటిమాటికి ఏడుస్తుండడంతో సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. చిన్నారి జరిగిందా బయటపెట్టడంతో బాధితురాలి తల్లిదండ్రులకు పోలీసులను ఆశ్రయించారు. -
న్యూజిలాండ్ లో భారత సంతతి వ్యక్తి అరెస్టు
వెల్టింగ్టన్: ఇద్దరు టీనేజ్ బాలికలపై దాడి చేసి కారణంగా ఒక భారత సంతతి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నఘటన న్యూజిలాండ్ లో చోటు చేసుకుంది. ధావల్ కదామ్ అనే వ్యక్తి ఇద్దరు అమ్మాయిలపై వేర్వేరు ప్రాంతాల్లో దాడి చేసినట్లు ఫిర్యాదు నమోదైంది. తొలుత ఆగస్టు 28 వ తేదీన ఆక్లాండ్ లో ఓ 16 ఏళ్ల బాలికపై దాడి చేశాడు. అనంతరం అదే రోజూ సాయంత్రం బాలికపై కెరికెరి నగరంలో 17 ఏళ్ల బాలికపై దాడికి పాల్పడ్డాడు. ఈ రెండు ఫిర్యాదులతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతనికి కోర్టులో బెయిల్ లభించగా, తదుపరి విచారణ డిసెంబర్ 4 వ తేదీన జరుగనుంది. -
భార్యను కొట్టిన ఎన్నారైకు 16 ఏళ్ల జైలు
లండన్: కట్టుకున్న భార్యను, కన్న కొడుకును విచక్షణారహితంగా కొట్టినందుకు ప్రవాస భారతీయుడొకరికి బ్రిటన్ కోర్టు 16 ఏళ్లకుపైగా జైలు శిక్ష విధించింది. దక్షిణ యార్క్‌షైర్‌లోని బమ్స్లే ప్రాంతంలో ఉంటున్న అజిత్ శేఖన్ గతేడాది అక్టోబర్‌లో తన భార్య మంజీత్ కౌర్ శేఖన్(55), కుమారుడు పాల్(31)పై దాడికి పాల్పడ్డాడు. టీవీ చూస్తున్నారనే కోపంతో లోహపు పాత్రతో వీరిపై విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో అజిత్ భార్య, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల నమోదు చేసిన కేసు ఆధారంగా విచారణ జరిపిన కోర్టు అజిత్‌ను దోషిగా తేల్చింది. కొడుకును కొట్టినందుకు 9 ఏళ్ల నెలలు, భార్యను గాయపరిచినందుకు 6 ఏళ్ల 9 నెలల జైలు శిక్ష విధించింది. ఈనెల 9న షిఫీల్డ్ క్రౌన్ కోర్టు ఈమేరకు తీర్పు వెలువరించింది. -
నగ్న వీడియోతో మహిళకు బెదిరింపులు
సింగపూర్: ఓ మహిళ వివస్త్రగా ఉన్నప్పటి వీడియోను బహిర్గతం చేస్తానంటూ బెదిరించిన ఓ భారత సంతత వ్యక్తికి సింగపూర్ కోర్టు 2.5 లక్షలు రూపాయలు జరిమానా విధించింది. కిషన్ రాజ్ (22) అనే ఫ్లయిట్ అటెండెంట్ గత జనవరిలో ఈ నేరానికి పాల్పడినట్టు అంగీకరించాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 21 ఏళ్ల మహిళ ఓ వెబ్సైట్ ద్వారా కిషన్‌కు పరిచయమైంది. అనంతరం ఇద్దరూ ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. వ్యక్తిగతంగా కలవాలని కిషన్ కోరగా ఆమె అంగీకరించింది. అయితే ఇందుకు 15 రూపాయిలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. గత జనవరిలో వీరిద్దరూ మొబైల్ యాప్ ద్వారా వీడియో చాటింగ్ చేశారు. వీడియో శృంగారానికి అంగీకరిస్తే తాను పది వేల రూపాయలు ఇస్తానని కిషన్ ఆఫర్ చేశాడు. అందుకు ఆమె అంగీకరించింది. అనంతరం అతను ఆమెకు డబ్బులు పంపలేదు. తనకు డబ్బులు పంపాల్సిందిగా ఆమె కిషన్‌ను సంప్రదించగా అతను నిరాకరించాడు. అంతేగాక, నగ్నంగా ఉన్నప్పటి వీడియో క్లిప్పింగ్‌లను బహిర్గతం చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. -
న్యూజిలాండ్ లో ఎన్నారైపై దాడి, పరిస్థితి విషమం
న్యూజిలాండ్ లో భారత సంతతికి చెందిన 25 ఏళ్ల తరుణ్ అస్థానాపై ఓ యువకుడు విచక్షణాత్మకంగా దాడి జరపడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. ట్రైనీ టీచర్ గా పనిచేస్తున్న తరుణ్ అక్లాండ్ లోని సిటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం రోజున సాయంత్రం 5.10 నిమిషాలకు తరుణ్ పై దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఓ యువతి డ్రస్ బాగుందని కామెంట్ చేయడంలో ఆ యువతి బాయ్ ఫ్రెండ్.. తరుణ్ ముఖం, తలపై బాదినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఈ దాడిలో తరుణ్ తలకు బలమైన గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. ఈ వ్యవహారంలో అక్లాండ్ లో ఓ ఒకర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
టాటూ తొలగించుకోబోయి ప్రాణం కోల్పోయాడు
ఓ వ్యక్తి ముచ్చటపడి టాటూ వేయించుకున్నాడు. ఉద్యోగానికి అది ప్రతిబంధకంగా మారడంతో దాన్ని తొలగించుకోవాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సరదా కోసం చేసిన పని.. అతని జీవితాన్ని విషాదాంతం చేసింది. మలేసియాలోని సుంగాయ్ పెటానీలో స్థిరపడ్డ దినేశ్ నాయర్ ((25) అనే భారత సంతతి వ్యక్తి పోలీస్ కావాలనుకున్నాడు. ఇంటర్వ్యూ కూడా వచ్చింది. అయితే అతనికో సమస్య వచ్చిపడింది. సరదాగా వేయించుకున్న టాటూ అతని ఉద్యోగవకాశానికి ప్రతికూలంగా మారింది. మలేసియా నిబంధనల ప్రకారం పోలీస్ ఉద్యోగాలు పొందాలంటే ఇలాంటివి నిషేధం. దీంతో దినేశ్ టాటూ తొలగించుకునేందుకు ఓ ప్రైవేట్ క్లినిక్‌ను సంప్రదించాడు. చికిత్స వికటించడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. కోమాలోకి వెళ్లిన దినేశ్ గురువారం మరణించాడు. అతని కుటుంబ సభ్యులు క్లినిక్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాటూలను పలు పద్ధతుల్లో తొలగిస్తుంటారు. ఒక్కోసారి వికటించి ప్రాణాంతకంగా మారుతుంది. -
మానభంగం, కిడ్నాప్ కేసులో న్యూజిలాండ్ లో ఎన్నారైకి శిక్ష
కిడ్నాప్, మానభంగం కేసులో భారత సంతతికి చెందిన ప్రవీణ్ ఫియా హరి ప్రసాద్ కుమార్ న్యూజిలాండ్ కోర్టు జైలుశిక్ష విధించింది. 2008 లో ఇద్దరు మహిళను కిడ్నాప్ చేసి మానభంగం చేసినట్టు నమోదైన కేసులో పునః విచారణ చేపట్టిన అక్లాండ్ కోర్టు శిక్ష ఖారారు చేసింది. ఈ కేసులో తీర్పు వెల్లడించిన వెంటనే నిందితుడిని రిమాండ్ లోకి తీసుకున్నారు. వచ్చే డిసెంబర్ లో జైలుశిక్ష అమలు చేస్తారని స్థానిక మీడియా వెల్లడించింది. మానభంగం కేసులో బెయిల్ బయటకు వచ్చిన నిందితుడు తదుపరి విచారణకు గైర్హాజరు కావడమే కాకుండా.. ఎలక్ట్రానికి మానిటరింగ్ నుంచి తప్పించుకున్నట్టు తెలిసింది. ఇంటర్నెట్ లో ఓ మహిళతో మాట్లాడిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా నిందితుడిపై మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్టు నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు.