సింగపూర్: ఓ మహిళ వివస్త్రగా ఉన్నప్పటి వీడియోను బహిర్గతం చేస్తానంటూ బెదిరించిన ఓ భారత సంతత వ్యక్తికి సింగపూర్ కోర్టు 2.5 లక్షలు రూపాయలు జరిమానా విధించింది. కిషన్ రాజ్ (22) అనే ఫ్లయిట్ అటెండెంట్ గత జనవరిలో ఈ నేరానికి పాల్పడినట్టు అంగీకరించాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
21 ఏళ్ల మహిళ ఓ వెబ్సైట్ ద్వారా కిషన్కు పరిచయమైంది. అనంతరం ఇద్దరూ ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. వ్యక్తిగతంగా కలవాలని కిషన్ కోరగా ఆమె అంగీకరించింది. అయితే ఇందుకు 15 రూపాయిలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. గత జనవరిలో వీరిద్దరూ మొబైల్ యాప్ ద్వారా వీడియో చాటింగ్ చేశారు. వీడియో శృంగారానికి అంగీకరిస్తే తాను పది వేల రూపాయలు ఇస్తానని కిషన్ ఆఫర్ చేశాడు. అందుకు ఆమె అంగీకరించింది. అనంతరం అతను ఆమెకు డబ్బులు పంపలేదు. తనకు డబ్బులు పంపాల్సిందిగా ఆమె కిషన్ను సంప్రదించగా అతను నిరాకరించాడు. అంతేగాక, నగ్నంగా ఉన్నప్పటి వీడియో క్లిప్పింగ్లను బహిర్గతం చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
నగ్న వీడియోతో మహిళకు బెదిరింపులు
Published Thu, Mar 6 2014 3:49 PM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
Advertisement
Advertisement