Report Says Indian-Origin Man Shot Dead While Sitting In Parked Car In US - Sakshi
Sakshi News home page

అమెరికాలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తి హత్య

Published Mon, Jun 27 2022 4:00 PM | Last Updated on Mon, Jun 27 2022 5:19 PM

Indian Origin Man Assassinated While Sitting In Parked Car In US - Sakshi

న్యూయార్క్: తెలంగాణాకు చెందిన యువకుడి హత్య సంఘటన మరువక ముందే భారత సంతతికి చెందిన మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. మేరీ ల్యాండ్‌లో సత్నామ్ సింగ్  హత్యకు గురయ్యాడు. తన ఇంటికి సమీపంలో సౌత్ ఓజోన్ పార్క్‌లో పార్క్ చేసిన బ్లాక్ జీప్ రాంగ్లర్ సహారా కారులో ఉండగానే అతణ్ని కాల్చి చంపిన ఘటన ఆందోళన  రేపింది.  సమీపంనుంచి సాయధ దుండగుడు అతనిపై కాల్పులు జరపాడని న్యూయార్క్ డైలీ న్యూస్  రిపోర్ట్‌ చేసింది. 

ఛాతీ, మెడపై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానిక జమైకా హాస్పిటల్‌కి తరలించారు. కానీ అప్పటికే సింగ్‌ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు కాల్పులకు కొద్ది సమయానికి ముందు సత్నామ్ సింగ్ అతని స్నేహితుడి  వద్ద నుంచి ఎస్‌యూవీని అరుపు తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎస్‌యూవీ యజమాని అనుకొని, సత్నామ్‌ సింగ్‌పై కాల్పులు జరిపారా? లేక అసలు హంతకుల టార్గెట్‌ ఎవరు? అనే దానిపై  డిటెక్టివ్‌లు ఆరా తీస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

స్థానికుడు జోన్ కాపెల్లని  కథనం ప్రకారం సింగ్‌ కారువైపు నడుస్తుండగానే మరో  కారులో వచ్చిన దుండగుడు  సింగ్‌పై  అతిసమీపంనుంచి కాల్పులు జరిపి పారి పోయాడు. కాగా తెలంగాణ యువకుడు సాయి చరణ్ మేరీ ల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో  కారులో హత్యకు గురైన కొన్ని రోజుల తర్వాత మరో సంఘటన నమోదు కావడం చర్చకు దారి తీసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement