హైదరాబాదీని చంపిన పాకిస్తానీ | Pakistani Origin Man Sentenced To Life For Murder Hyderabad Man | Sakshi
Sakshi News home page

హైదరాబాదీని చంపిన పాకిస్తానీ

Published Fri, Sep 13 2019 8:42 AM | Last Updated on Fri, Sep 13 2019 8:42 AM

Pakistani Origin Man Sentenced To Life For Murder Hyderabad Man - Sakshi

నదీమ్‌ ఉద్దీన్‌ హమీద్‌ మొహమ్మద్‌.. ఇన్‌సెట్‌లో పెర్విజ్‌

లండన్‌: తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన ఓ పాకిస్తానీ, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో పాకిస్తాన్, యూకే పౌరసత్వం కలిగిన పెర్విజ్‌ (27)కు లండన్‌లోని క్రౌన్‌ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పెరోల్‌ దరఖాస్తు చేసుకోవడానికి ముందు కనీసం 22 సంవత్సరాల శిక్ష అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. పదునైన ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు మరో 18 నెలల శిక్ష కూడా విధించింది. యావజ్జీవ శిక్షతో పాటే దీన్ని కూడా అనుభవించాలని పేర్కొంది. ‘మీ భార్య, కుటుంబ సభ్యులు, మరణించిన మొహమ్మద్‌లు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావని ఎంత చెప్పినా వినలేదు’ అని తీర్పు సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ ఏడాది మేలో ప్రజలు చూస్తుండగానే పెర్విజ్‌ హైదరాబాద్‌కు చెందిన తన సహోద్యోగి నదీమ్‌ ఉద్దీన్‌ హమీద్‌ మొహమ్మద్‌ (24)ను లండన్‌కు సమీపంలో పొడిని చంపాడు. మొహమ్మద్‌ చనిపోయే నాటికి అతడి భార్య అఫ్సా ఎనిమిది నెలల గర్భంతో ఉంది. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న మొహమ్మద్‌ను కిరాతకంగా చంపాడని మృతుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement