సింగపూర్ లో ఎన్నారైకి జైలు | Indian-origin man jailed for molesting a minor in Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్ లో ఎన్నారైకి జైలు

Published Fri, Feb 13 2015 9:41 PM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

సింగపూర్ లో ఎన్నారైకి జైలు

సింగపూర్ లో ఎన్నారైకి జైలు

సింగపూర్: మైనర్ బాలిక పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన భారత సంతతి వ్యక్తి ఒకరు సింగపూర్ లో జైలు పాలయ్యాడు. నిందితుడు సమీర్ సింగ్ అలాక్ నేరానికి పాల్పడినట్టు రుజువు కావడంతో అతడికి కోర్టు నాలుగు వారాల జైలు శిక్ష విధించింది.

ఓ హోటల్ కాల్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సమీర్ సింగ్ 2013, ఆగస్టులో కపాంగ్ బత్రు రోడ్డు నుంచి లోయర్ డెల్టా రోడ్డుకు వెళుతూ కారులో చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఎవరిలోనూ చెప్పొద్దని ఆమెను హెచ్చరించాడు.

స్కూల్లో చిన్నారి మాటిమాటికి ఏడుస్తుండడంతో సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. చిన్నారి జరిగిందా బయటపెట్టడంతో బాధితురాలి తల్లిదండ్రులకు పోలీసులను ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement