తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర | Visit to Shiva temples Telangana Cultural Society (Singapore) | Sakshi
Sakshi News home page

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర

Published Fri, Feb 28 2025 6:07 PM | Last Updated on Fri, Feb 28 2025 6:07 PM

Visit to Shiva temples Telangana Cultural Society (Singapore)

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను  ఈ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా  మూడోసారి  జరిగింది.  ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఫిబ్రవరి 27వ  తేదీ ఉదయం 7 గంటల వరకు  ఈ యాత్రలో సింగపూర్‌లో ఉన్న 11-12 ప్రముఖ శివాలయాలను సందర్శించారు. 

 సింగపూర్‌లోని జురాంగ్ ఈస్ట్ ,బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్- పుంగ్గోల్ మరియు టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుండి బస్సులను సమకూర్చి యాత్రను విజయవంతగా నిర్వహించడం జరిగింది. దీంతోప్రముఖ దేవాలయాలు భక్తుల భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగాయి.

ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా యాత్రను నిర్వహించిన  సొసైటీకి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులు  తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)కి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్,  దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి  ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, శివ రామ్ ప్రసాద్, కిరణ్ కైలాసపు, లక్ష్మణ్ రాజు కల్వ , అందరికి కృతజ్ణతలు తెలియజేశారు.

మహాశివరాత్రి సందర్భంగా  ఇంట్లోనే ఉండి జాగారం, ఉపవాసం చేసే భక్తుల కోసం హార్ట్‌ఫుల్‌నెస్ సింగపూర్ సహకారంతో, జూమ్ ద్వారా ఉచిత మెడిటేషన్ ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించారు. ఈ  సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ  అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి నంగునూరి వెంకట రమణ, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి,నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్ తదితర యాత్రను విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న ఈ భక్తి కార్యక్రమానికి సింగపూర్‌లో పని రోజు అయినప్పటికీ భారీ స్పందన వచ్చిందని, సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న సభ్యులకు, స్పాన్సర్స్ కి  నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement