ఓ వ్యక్తి ముచ్చటపడి టాటూ వేయించుకున్నాడు. ఉద్యోగానికి అది ప్రతిబంధకంగా మారడంతో దాన్ని తొలగించుకోవాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సరదా కోసం చేసిన పని.. అతని జీవితాన్ని విషాదాంతం చేసింది.
మలేసియాలోని సుంగాయ్ పెటానీలో స్థిరపడ్డ దినేశ్ నాయర్ ((25) అనే భారత సంతతి వ్యక్తి పోలీస్ కావాలనుకున్నాడు. ఇంటర్వ్యూ కూడా వచ్చింది. అయితే అతనికో సమస్య వచ్చిపడింది. సరదాగా వేయించుకున్న టాటూ అతని ఉద్యోగవకాశానికి ప్రతికూలంగా మారింది. మలేసియా నిబంధనల ప్రకారం పోలీస్ ఉద్యోగాలు పొందాలంటే ఇలాంటివి నిషేధం. దీంతో దినేశ్ టాటూ తొలగించుకునేందుకు ఓ ప్రైవేట్ క్లినిక్ను సంప్రదించాడు. చికిత్స వికటించడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. కోమాలోకి వెళ్లిన దినేశ్ గురువారం మరణించాడు. అతని కుటుంబ సభ్యులు క్లినిక్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాటూలను పలు పద్ధతుల్లో తొలగిస్తుంటారు. ఒక్కోసారి వికటించి ప్రాణాంతకంగా మారుతుంది.
టాటూ తొలగించుకోబోయి ప్రాణం కోల్పోయాడు
Published Fri, Nov 1 2013 5:22 PM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM
Advertisement
Advertisement