స్కార్ఫ్‌ను మెడకు చుట్టుకొని..చచ్చిపో!
స్కార్ఫ్‌ను మెడకు చుట్టుకొని..చచ్చిపో!
Published Sun, Nov 13 2016 5:08 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
వాషింగ్టన్: అమెరికాలో ఓ 24 ఏళ్ల ముస్లిం ఉపాధ్యాయురాలికి చేదు అనుభవం ఎదురైంది. తమ దేశంలో ఇక ఎంతమాత్రం హిజాబ్‌ను అంగీకరించబోమని, కాబట్టి స్కార్ఫ్‌ను మెడకు చుట్టుకొని ఉరేసుకొని చచ్చిపో అంటూ ఆమెకు బెదిరింపు లేఖ వచ్చింది. జార్జియా అట్లాంటాలోని గ్విన్నెట్ కౌంటీలో ఉన్న డకులా హై స్కూల్‌లో మిర్హా టెలి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ‘టెమి, ఇక నీ తలపై వేసుకొనే వస్త్రాన్ని ఎంతమాత్రం అంగీకరించబోం. ఎందుకు నువ్వు దానిని మెడకు చుట్టుకొని ఉరేసుకోవు’ అంటూ నల్లసిరాతో ఓ లేఖ ఆమెకు వచ్చింది. దీనిపై అమెరికా అని సంతకం చేసి ఉంది.
‘ఒక ముస్లింగా నా మతవిశ్వాసం ప్రకారం నేను తలపై వస్త్రాన్ని ధరిస్తాను. మా కమ్యూనిటీ ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని, నిజాల్ని తెలిపేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు నేను దీనిని షేర్ చేసుకుంటున్నాను. విద్వేషాన్ని వ్యాప్తి చేయడం వల్ల అమెరికా మళ్లీ గొప్ప దేశం కాబోదు’ అని ఆమె తన ఫేస్‌బుక్ పేజీలో తెలిపారు. మరోవైపు ఆమెకు వచ్చిన బెదిరింపు లేఖపై విచారణ జరుపుతున్నట్టు స్థానిక పాఠశాల తెలిపింది.
Advertisement
Advertisement