న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా దళితులు, మైనారిటీలపై హింసాత్మక ఘటనలు పెచ్చు మీరుతున్న నేపథ్యంలో.. ఈ ఘటనలను ఖండిస్తూ వివిధ రంగాల ప్రముఖులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సినిమా సెలబ్రిటీలు అదూర్ గోపాలకృష్ణ, మణిరత్నం, అనురాగ్ కశ్యప్‌లు, అపర్ణ సేన్, కొంకణా సేన్ శర్మలతో పాటు మొత్తం 49 మంది ప్రముఖులు ఈ లేఖపై సంతకం చేశారు. ‘అధిక వర్గాలకు జై శ్రీరాం పవిత్రమైనది.. దానిని అపవిత్రం చేయడం మనేయండి. దళితులు, క్రైస్తవులు, ముస్లింలపై జరుగుతున్న అమానుష ఘటనలను, ఊచకోతలను వెంటనే అరికట్టాలి. 2016లో ఇలాంటి ఘటనలు దాదాపు 840 కేసులు నమోదయిన విషయాన్ని నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) ద్వారా తెలిసి మేము అశ్చర్యపోయాము. జై శ్రీరాం నినాదం ఇప్పుడు దేశంలో హింసాత్మకంగా మారింది. ఈ దీన స్థితికి మేము చింతిస్తున్నాము’ అని ’ అని లేఖలో పేర్కొన్నారు.
‘దళితులు, ముస్లింల జరుగుతున్న ఊచకోతపై మీరు పార్లమెంటులో స్పందించిన విషయం తెలుసు గానీ.. వాటిని ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి’ అని ప్రధాని మోదీని కోరారు. కాగా చారిత్రకవేత్త రామచంద్ర గుహ, సామాజిక వేత్తలు డాక్టర్ బినాయక్ సేన్, ఆశిష్ నంద్యా కూడా లేఖపై సంతకాలు చేశారు. ‘అసమ్మతి లేని ప్రజాస్వామ్యం ఉండదు. అలాగని ప్రజలను దేశ వ్యతిరేకులుగా, అర్బన్ నక్సల్‌గా ముద్ర వేయకూడదని, అసమ్మతిని కారణంగా చూపి ప్రజలకే శిక్షలు వేయకూడదని వీరంతా లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment