ఎఫ్‌బీఐ వల్లే ఓడిపోయా
హిల్లరీ క్లింటన్ ఆరోపణ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమికి ఎఫ్‌బీఐయే కారణమని డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆరోపించారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తన ఈమెరుుళ్ల వ్యవహారంపై దర్యాప్తును పునఃప్రారంభించాలని ఎఫ్‌బీఐ డెరైక్టర్ జేమ్స్ కామే నిర్ణరుుంచడం ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపిందరు. ‘ఇలాంటి ఎన్నికల్లో గెలవలేకపోవడానికి అనేక కారణాలు ఉంటారుు. మా విశ్లేషణ ప్రకారం కామే లేఖ వల్ల అనేక అనుమానాలు ప్రజలకు వచ్చారుు. ఇదే నా గెలుపును అడ్డుకుంది’ అని శనివారం డెమొక్రటిక్ పార్టీ నిధుల సమీకరణవేత్తలు, దాతలతో జరిగిన భేటీతో అన్నారు. ఎఫ్‌బీఐ డెరైక్టర్ ప్రకటన రానంత వరకూ విజయం తనవైపే ఉందని, అరుుతే విచారణను పునఃప్రారంభిస్తున్నట్టు ప్రకటించడంతో తారుమారైందని అన్నారు.
సోషల్ మీడియా వల్లే నా గెలుపు: ట్రంప్
ఎన్నికల్లో గెలిచిన రిప్లబికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన విజయానికి సోషల్ మీడియానే కారణమన్నారు. ట్విటర్, ఫేస్‌బుక్ లాంటి సోషల్‌మీడియా తన చారిత్రక గెలుపులో కీలక పాత్ర పోషించిందని సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సోషల్‌మీడియా వల్ల తాను చెప్పింది ప్రజలకు సులువుగా చేరిందని, ప్రధాన మీడియా తనకు వ్యతిరేకంగా పనిచేసినా సోషల్‌మీడియా తనకు అండగా నిలిచిందని చెప్పారు. ప్రత్యర్థులు ఎక్కువ ఖర్చు చేసినా.. తాను తక్కువ ఖర్చు చేసినా.. సోషల్ మీడియాలో క్రియాశీలంగా ఉండటం వల్లే విజయం సాధించగలిగానని చెప్పారు. ట్రంప్‌కు ఫేస్‌బుక్, ట్వీటర్, ఇన్‌ట్రాగామ్‌ల్లో 28 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
హిల్లరీ చాలా స్మార్ట్..ట్రంప్:హిల్లరీ చాలా తెలివైన వారని ట్రంప్ ప్రశంసించారు. ఫలితాల అనంతరం హిల్లరీ తనకు మర్యాద పూర్వకంగా ఫోన్ చేశారని చెప్పారు. హిల్లరీ దయ, మర్యాద గల వ్యక్తి అని ప్రశసంల వర్షం కురిపించారు. ఫోన్ చేయడం ఇబ్బందైనా ఫలితాల తర్వాత ఫోన్ చేసి హిల్లరీ శుభాకాంక్షలు చెప్పగా ధన్యవాదాలు తెలిపానని, గట్టి పోటీ ఇచ్చారని తానన్నాని ట్రంప్ తెలిపారు. తానైతే ఫోన్ చేసేందుకు చాలా ఇబ్బంది పడేవాడినని చెప్పారు. హిల్లరీ భర్త కూడా మాట్లాడారని, ఎన్నికలు పోటాపోటీగా జరిగాయన్నారని వివరించారు. కాగా, ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆదివారం నాలుగో రోజూ లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, చికాగో, వోర్సెస్టార్, మసాచుసెట్స్, లోవా నగరాల్లో నిరసనలు కొనసాగారుు.
ముగ్గురు భారతీయ అమెరికన్ల గెలుపు
అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు భారతీయ అమెరికన్లు గెలిచారు. కాలిఫోర్నియాలోని 27వ అసెంబ్లీ డిస్ట్రిక్ ఎన్నికల్లో శాన్‌జోస్ కౌన్సిల్‌మెన్‌గా డెమొక్రటిక్ అభ్యర్థి ఆష్ కల్రా విజయం సాధించారు. 52.4 శాతం ఓట్లు సాధించిన కల్రా కాలిఫోర్నియా అసెంబ్లీకి ఎన్నికై న తొలి భారతీయ అమెరికన్. రిపబ్లికన్ నీరజ్ అతానీ(25 ఒహయో 42వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్‌కు తిరిగి ఎన్నికయ్యారు. ప్రత్యర్థిని 25% పారుుంట్ల తేడా ఓడించారు. నార్త్ కరోలినాలో జై చౌదురి(డెమోక్రటిక్) రాష్ట్ర సెనెట్‌కు ఎన్నికయ్యారు. న్యూజెర్సీలోని ఉడ్‌బ్రిడ్‌జ సిటీకౌన్సిల్‌కు వీరు పటేల్ ఎన్నికయ్యారు.