ఆ అద్భుత ‘ఫలితం’ వెనుక వాస్తవం..! | truth behind america election result | Sakshi
Sakshi News home page

ఆ అద్భుత ‘ఫలితం’ వెనుక వాస్తవం..!

Published Sun, Nov 13 2016 12:38 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ఆ అద్భుత ‘ఫలితం’ వెనుక వాస్తవం..! - Sakshi

ఆ అద్భుత ‘ఫలితం’ వెనుక వాస్తవం..!

డొనాల్డ్‌ ట్రంప్‌ విజయాన్ని అంచనా వేయడంలో మీడియా, దాని ఫ్యాన్సీ విశ్లేషకులు మొత్తంగా ఎక్కడ విఫలమ్యయారు అనే అంశంపై గురువారం రాత్రి నుంచి తీవ్ర అసంతృప్తి, విమర్శలు చెలరేగుతున్నాయి. ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో డేటా ఎలా విఫలమైందనే అంశంపై ప్రముఖ పత్రిక ‘ది టైమ్స్‌’ వరుసగా మూడు కథనాలు ప్రచురించింది. ఇక ట్రంప్‌ మద్దతు దారులైతే ప్రెస్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నారు. గురువారం ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి. కానీ ఈ విషయంలో దిగ్భ్రాంతి చెందింది జర్నలిస్టులు మాత్రమే కాదు. ట్రంప్‌ సీనియర్‌ సలహాదారు సైతం తమ గెలుపు అంశంలో అద్భుతమే జరిగిందని వెల్లడించారు.

పాపులర్‌ ఓటు ప్రకారం హిల్లరీ క్లింటన్‌ ఓడిపోలేదన్న విషయం మనం మర్చిపోకూడదు. శుక్రవారం గం. 6.30ల సమ యానికి హిల్లరీ 60,617,062 ఓట్లను సాధించగా, ట్రంప్‌కు 60,118,567 ఓట్లు వచ్చాయి. అంటే హిల్లరీకి 498,495 ఓట్ల మెజారిటీ ఉంది. కాలిఫోర్నియా ఓట్లు మాత్రమే లెక్కించాల్సి ఉండటంతో హిల్లరీ ఆధిక్యత మరింత పెరుగుతుందనే అందరూ భావించారు. భారత్‌ లాగే అమెరికాలోనూ ప్రత్యక్ష ఎన్నికల వ్యవస్థ ఉన్నట్లయితే వైట్‌హౌస్‌లో ప్రెసిడెంట్‌ ఒబామాతో హిల్ల రీయే భేటీ అయ్యేవారు. కానీ ట్రంప్‌ అనూహ్యంగా ఎలెక్టోరల్‌ కాలేజీని గెల్చుకున్నారు.
ట్రంప్‌ 270 ఎలెక్టోరల్‌ ఓట్లు సాధిస్తే చాలు.. తానే అధ్యక్షుడ వుతాడని మనందరికీ తెలుసు. కాని ఆ మ్యాజిక్‌ నంబర్‌ను అతడు సాధిస్తాడని చాలా కొద్దిమంది పరిశీలకులే ఎలా అంచనా వేశారు? మీడియా బుడగ ప్రభావానికి గురవడం చాలా సులభమే కానీ, విషయాలను సరిగా అంచనా వేయడంలో బలమైన వృత్తిగత అంశాలు కూడా జర్నలిస్టులకు తోడుగా ఉంటాయి. ఇవన్నీ ఈ సంవత్సరం ఎన్నికల అంచనాలో ఎందుకు సఫలం కాలేదన్నది ప్రశ్న. మిచిగాన్, విస్కాన్సిన్‌ లేదా వెస్ట్‌ వర్జీనియా వంటి ట్రంప్‌ ఆధిక్యత సాధించిన ప్రాంతాలను జర్నలిస్టులు పరిగణనలోకి తీసు కోనందుకే వారి అంచనాలు తప్పాయని కూడా చెప్పలేం. నిజంగా ఇది జర్నలిస్టుల వైఫల్యమే అయినట్లయితే, అది విశ్లేషణ వైఫ ల్యమే కానీ, పరిశీలన, రిపోర్టింగ్‌ వైఫల్యం కాదు.

శ్వేతజాతి కార్మికవర్గానికి నచ్చచెప్పడం మీదే ట్రంప్‌ ఎన్నికల వ్యూహం ఆధారపడిందని తొలినుంచి స్పష్టమవుతూనే వచ్చింది. పరాయీకరణకు గురైన కార్మికవర్గ శ్వేతజాతీయులే ట్రంప్‌ విజ యానికి కారకులయ్యారు. 2012లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి మిట్‌ రోమ్నీ పరాజయానికి కారణం కోట్లాది శ్వేతజాతి ఓటర్లు పోలిం గుకు దూరమై ఇళ్లకు పరిమితం కావడమేనని నాటి పరిశీలకులు తేల్చి పడేశారు. ఇలా ఎన్నికలకు దూరంగా ఉన్న శ్వేతజాతి ఓట రును ఒడిసిపట్టుకోగల అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంపేనని ఆ పరిశీలకులే అంచనా వేయడం కూడా వాస్తవమే. ట్రంప్‌ వ్యూహాన్ని తీవ్రంగా అధ్యయనం చేసిన ‘ది టైమ్స్‌’ నిపుణుడు నేట్‌ కోన్‌ కూడా ఇదే విషయాన్ని గతంలోనే చెప్పారు. శ్వేతేతర ఓటర్ల ఓట్లను పొంద కుండానే ట్రంప్‌ విజయాన్ని సాధించే పరిమిత మార్గం ఇప్పటికీ తనకు అందుబాటులో ఉందనీ, శ్వేత కార్మిక వర్గంలో ట్రంప్‌కున్న బలం అతడి విజయానికి నిజమైన అవకాశంగా పరిణమించనుం దని నేట్‌ కుండబద్దలు కొట్టారు. దేశవ్యాప్తంగా మైనారిటీ ఓటర్ల సంఖ్య బాగా పెరుగుతున్నప్పటికీ ఒహాయో, మిచిగాన్, విస్కా న్సిన్‌ వంటి రాష్ట్రాల్లోని తెల్లజాతి కార్మికవర్గ ఓటర్లను ట్రంప్‌ ఎలా తన వైపుకు తిప్పుకుంటారన్నదే కీలకమని, కానీ ఇది చాలా కష్ట సాధ్యమైన విషయమని గత మార్చి నెలలోనే ప్రముఖ పరిశీల కులు రూయ్‌ టెక్సెరియా విశ్లేషించారు. కానీ కష్టసాధ్యమైన విష యాన్ని ట్రంప్‌ సుసాధ్యం చేశారు. శ్వేత జాతి కార్మిక ఓటర్లలో 39 శాతాన్ని ట్రంప్‌ తనవైపుకు తిప్పుకోగలిగిరారు. 2012లో మిట్‌ రోమ్నీ వీరిలో 26 శాతాన్ని మాత్రమే ఆకర్షించారని గ్రహించాలి. ఈసారి ఎన్నికల ఫలితాన్ని వివరించడానికి ఈ ఒక్కకారణమే సరి పోతుందని పరిశీలకుల వ్యాఖ్య.

పైగా, చివరివరకు నిర్ణయించుకోని ఓటర్లలో ఎక్కువమంది ట్రంప్‌ వైపు మొగ్గు చూపారని, ట్రంప్‌ వైఖరికి సిగ్గుపడుతున్న మద్దతుదారులలో చాలామంది పోల్‌ సర్వేలలో తమ అభిప్రా యాన్ని స్పష్టంగా చెప్పలేదని కూడా కొన్ని అభిప్రాయాలు న్నాయి. మూడోది. ట్రంప్‌కు వ్యతిరేకంగా జతగట్టిన మీడియాకు తమ వైఖరిని చెప్పడానికి ట్రంప్‌ ఓటర్లు తిరస్కరించారని, కొందరి వ్యాఖ్య. ఇవన్నీ కలిసే మీడియా అంచనాలను తప్పుదోవ పట్టించాయని చెప్పక తప్పదని, శ్వేతజాతి కార్మికులు ట్రంప్‌కు ఇంత గట్టి మద్దతునిస్తారని ఊహించలేకపోవడమే ఈ దఫా ఫలి తాల దిగ్భ్రాంతికి కారణమని పరిశీలకుల వ్యాఖ్య.

మీడియా ఎన్నికల సర్వేల నమూనాలలో లోపాలెన్ని ఉన్న ప్పటికీ ఎన్నికలకు పది రోజుల క్రితం ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమే చేసిన ప్రకటన హిల్లరీ అవకాశాలను దారుణంగా దెబ్బతీసిందన్న విషయం మర్చిపోకూడదు. హిల్లరీ ప్రైవేట్‌ సర్వర్‌ నుంచి అధికా రిక ఈమెయిల్స్‌ను చూసిన అంశంపై మళ్లీ విచారించనున్నట్లు ఎఫ్‌బీఐ అధిపతి చేసిన ప్రకటన ఆమె విజయావకాశాలపై చివరి దెబ్బతీసింది. రిపబ్లికన్లలో ఇది కొత్త జీవం పోయగా, డెమో క్రాట్లను ఇది నీరసపరిచింది. అయితే కోమే ప్రకటన ఎన్నికల గతిని ఏమేరకు మార్చిందన్న విషయం సర్వే సాఫ్ట్‌వేర్లకు, పరి శీలకుల అంచనాలకు అందకపోవడమే కీలకమైన విషయం.
-జాన్‌ కసిడీ, ప్రముఖ పాత్రికేయుడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement