హీరోయిన్ను ప్రశ్నించిన పోలీసులు | angelina jolie questioned by fbi | Sakshi
Sakshi News home page

హీరోయిన్ను ప్రశ్నించిన పోలీసులు

Oct 27 2016 2:32 PM | Updated on Oct 1 2018 5:16 PM

మొన్నీమధ్యే భర్త నుంచి విడాకులు తీసుకున్న హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలీనా జోలీని ఎఫ్బీఐ పోలీసులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.

మొన్నీమధ్యే భర్త నుంచి విడాకులు తీసుకున్న హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలీనా జోలీని ఎఫ్బీఐ పోలీసులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. జోలీ మాజీ భర్త బ్రాడ్ పిట్ వాళ్లిద్దరి కొడుకు మాడాక్స్ (15)ను విమానంలో తీవ్రంగా తిట్టాడని, కొట్టాడని.. ఆ సమయంలో అతడు బాగా తాగి ఉన్నాడని జోలీ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ ఘటన సెప్టెంబర్ 14న జరగ్గా, ఆ తర్వాత కొద్దిరోజులకే జోలీ విడాకుల పిటిషన్ దాఖలుచేసింది. గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటన గురించి పోలీసులకు తెలిపారు. విమానం గాలిలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది కాబట్టి.. ఈ విషయాన్ని ఎఫ్బీఐ పరిశీలిస్తోంది. 
 
విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి అది తిరిగి ల్యాండయ్యేవరకు ఏం జరిగిందో మొత్తం అంతా ఎఫ్బీఐ వాళ్లు పరిశీలిస్తున్నారని, ఏంజెలీనా జోలీ కూడా వాళ్లకు పూర్తిగా సహకరిస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి. మరికొన్ని వారాల పాటు ఎఫ్బీఐ విచారణ కొనసాగనుంది. తర్వాత ఈ కేసును కోర్టుకు తీసుకెళ్తారు. అక్కడ విచారణ అనంతరం బ్రాడ్ పిట్పై ఆరోపణలు నమోదుచేయాలా వద్ద అన్నది నిర్ణయిస్తారు. ఇందుకు కొన్ని నెలల సమయం పడుతుంది. 
 
నిజానికి బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ ఇద్దరూ కూడా దీనిపై కేసు పెట్టకపోతేనే మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. అనవసరంగా లేనిపోని గొడవలు ఎందుకని అంటున్నారట. విమానంలో జరిగిన గొడవలో మాడాక్స్కు కూడా గాయాలు ఏమీ కాలేదని, అందువల్ల ఈ వివాదాన్ని ఇంతటితో వదిలిపెట్టడం మంచిదని భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement