Brad Pitt Sensational Comments On Angelina Jolie Over Their Wine Company Reputation Damage - Sakshi
Sakshi News home page

Brad Pitt Vs Angelina Jolie: తన మనసు నిండా విషమే: ఏంజెలీనాపై మాజీ భర్త సంచలన కామెంట్స్‌

Published Tue, Jun 7 2022 7:29 PM | Last Updated on Tue, Jun 7 2022 8:23 PM

Brad Pitt Accuses Angelina Jolie of Inflicting Harm Him By Selling Their Wine Company - Sakshi

మాజీ భార్య ఏంజెలీనా జోలీపై హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ సంచలన ఆరోపణలు చేశాడు. దంపతులుగా ఉన్నప్పుడు వీరిద్దరు కలిసి చేసిన వైన్ వ్యాపారాన్ని ఆమె నాశనం చేసి తనకు హానీ తలపెట్టే ప్రయత్నం చేస్తోందంటూ ఏంజెలీనాపై కోర్డులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ వ్యాపార సామ్రాజ్యంలో ఏంజెలీనా వాటా అమ్మకానికి సంబంధించి ప్రస్తుతం ఇద్దరి మధ్య నడుస్తున్న కేసులో భాగంగా బ్రాడ్ తాజాగా ఆరోపణలు చేశాడు. కాగా ఫ్రాన్స్ లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఓ వైన్ యార్డ్‌తో పాటు షాటూ మిరావళ్‌ను 2008లో ఈ మాజీ దంపతులు కొనుగోలు చేశారు.

చదవండి: భారీ భద్రత నడుమ హైదరాబాద్‌లో ల్యాండయిన సల్మాన్‌

2014లో ఆ మిరావళ్ లోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే, వివాహ బంధం నుంచి విడిపోయాక గత ఏడాది ఏంజెలీనా.. వ్యాపారంలోని తన వాటాను టెన్యూట్ డెల్ మోండో అనే సంస్థకు అమ్మేసింది. అయితే, దానిని బ్రాడ్ వ్యతిరేకించాడు. వ్యాపారాన్ని ఎవరికీ అమ్మబోమంటూ ఇద్దరం ఒప్పందం చేసుకున్నామని, కానీ, ఇప్పుడిలా అమ్మేయడం నమ్మకద్రోహమేనని పేర్కొంటూ కోర్టులో పిటిషన్‌ వేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ కేసుకు సంబంధించి మరిన్ని సంచలన ఆరోపణలు చేశాడు బ్రాడ్‌.

మిరావళ్ తన కలల ప్రాజెక్టు అని, దానిని సక్సెస్ చేయడంలో ఏంజెలీనా పాత్రంటూ ఏమీ లేదని పిటిషన్‌లో ఆరోపించాడు. ప్రస్తుతం తన వైన్ బిజినెస్ కొన్ని వందల కోట్లకు ఎదిగిందని, ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన రోజ్ వైన్ తయారీదారుల్లో తన సంస్థ స్థానం సంపాదించిందని చెప్పాడు. కేవలం తన కృషి వల్లే అది సాధ్యమైందని, ఏంజెలీనా పాత్ర ఏమీ లేదన్నాడు. అయితే, విడాకుల అనంతరం తనకు తెలియకుండానే తన వాటాను వేరే సంస్థకు అమ్ముకోవడం దారుణమని బ్రాడ్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. 

చదవండి: ఇండియన్‌ రెస్టారెంట్‌లో జానీ డెప్‌ పార్టీ, రూ. 49 లక్షల బిల్లుతో షాకిచ్చాడు

ఇక, ఏంజెలీనా జోలీ నుంచి వాటాను కొనుగోలు చేసిన టెన్యూట్ డెల్ మోండో సంస్థను రష్యాకు చెందిన యూరీ షెఫ్లర్ అనే వ్యాపారవేత్త పరోక్షంగా నడుపుతున్నాడని, ఇప్పుడు మిరావళ్‌ను చేజిక్కించుకునేందుకు రహస్య ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించాడు. తెలియని కొత్త వ్యక్తితో తన వ్యాపార భాగస్వామిగా చేయాలని చూసిందన్నాడు. తన సంస్థ పేరు ప్రతిష్ఠలను మంటగలిపి తనకు హాని చేయాలని చూస్తోందని, తన మనసు నిండా విషమే ఉందని మాజీ భార్య ఏంజెలీనాపై బ్రాడ్‌ సంచలన కామెంట్స్‌ చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement