wine business
-
మందు మీద మోజు.. వైన్ బిజినెస్‌తో కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ
'ఆకాశంలో సగం' అంటూ పోవూరి లలిత కుమారి (ఓల్గా) రాసిన కవిత ఒకప్పుడు సంచలనం రేపింది. ప్రతి రంగంలోనూ అవకాశాలు కల్పించాలని, పురుషాధిక్యం తగదని తన రచనల ద్వారా సమాజం మీద విరుచుకుపడిన విషయం దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. అయితే ఈ రోజు మహిళ అడుగుపెట్టని రంగం ఏదీ లేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ రోజు అన్ని రంగాల్లోనూ మహిళల హవా నడుస్తోంది. మహిళలకు పూర్తిగా విరుద్ధంగా భావించే వైన్ ఇండస్ట్రీలో కూడా మేము సైతం అంటున్నారు. ఇలాంటి రంగంలో అడుగు పెట్టి ప్రపంచ వ్యాపార రంగంలో ఎంతోమంది దృష్టిని ఆకర్శించి 'జోయా వోరా షా' (Zoya Vora Shah) మహిళ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికాలోని ప్రముఖ వైన్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో ముందుకెళ్తున్న 'జోయా వోరా షా' భారతదేశానికి చెందిన మహిళ కావడం గమనార్హం. నిజానికి ఈమె కొంత కాలం క్రితం మన దేశం నుంచి అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడింది. కొన్ని రోజుల తరువాత ఒక రెస్టారెంట్లో వైన్ బిజినెస్ ప్రారంభించింది. ఈ వ్యాపారం అతి తక్కువ కాలంలోనే బాగా లాభాల బాట పట్టింది. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) ఒక బ్రాంచ్‌తో మొదలైన ఆమె వ్యాపారం అదే నగరంలో ఎనిమిది బ్రాంచ్‌లకు చేరింది. ప్రస్తుతం ఈమె వైన్, స్పిరిట్ విక్రయాలకు ప్రతినిధిగా మారింది. కాలక్రమంలో ఆమె స్థాపించిన వైన్ టేస్టింగ్ రూమ్ తరువాత వైన్ బార్ అండ్ బాటిల్ షాప్‌గా రూపుదిద్దుకున్నాయి. అతి తక్కువ సమయంలో ఈమె బాగా ఎదగటానికి కారణం ఈ రంగంపై ఆమెకున్న అభిరుచే. (ఇదీ చదవండి: కుటుంబంలో 12 మంది డాక్టర్లు.. 16 సంవత్సరాలకే రికార్డు.. అసిస్టెంట్ కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలి..) ప్రారంభంలో ఇలాంటి రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావంటూ ఎంతో మంది ఆమెను విమర్శించారు. కానీ ఎవరి మాటను లెక్క చేయని జోయా వోరా షా చివరికి అనుకున్న విజయం సాధించింది. దీనికి ప్రధాన కారణం ఆమె భర్త అందించిన సహకారమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె బిజినెస్ కోట్లలో టర్నోవర్ పొందుతోంది. దీన్ని బట్టి చూస్తే మహిళ అనుకోవాలే కానీ ఆమె విజయం సాధించని రంగం అంటూ ఏది ఉండదని స్పష్టంగా తెలుస్తోంది. -
తన మనసు నిండా విషమే: ఏంజెలీనాపై మాజీ భర్త సంచలన కామెంట్స్
మాజీ భార్య ఏంజెలీనా జోలీపై హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ సంచలన ఆరోపణలు చేశాడు. దంపతులుగా ఉన్నప్పుడు వీరిద్దరు కలిసి చేసిన వైన్ వ్యాపారాన్ని ఆమె నాశనం చేసి తనకు హానీ తలపెట్టే ప్రయత్నం చేస్తోందంటూ ఏంజెలీనాపై కోర్డులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ వ్యాపార సామ్రాజ్యంలో ఏంజెలీనా వాటా అమ్మకానికి సంబంధించి ప్రస్తుతం ఇద్దరి మధ్య నడుస్తున్న కేసులో భాగంగా బ్రాడ్ తాజాగా ఆరోపణలు చేశాడు. కాగా ఫ్రాన్స్ లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఓ వైన్ యార్డ్‌తో పాటు షాటూ మిరావళ్ను 2008లో ఈ మాజీ దంపతులు కొనుగోలు చేశారు. చదవండి: భారీ భద్రత నడుమ హైదరాబాద్‌లో ల్యాండయిన సల్మాన్ 2014లో ఆ మిరావళ్ లోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే, వివాహ బంధం నుంచి విడిపోయాక గత ఏడాది ఏంజెలీనా.. వ్యాపారంలోని తన వాటాను టెన్యూట్ డెల్ మోండో అనే సంస్థకు అమ్మేసింది. అయితే, దానిని బ్రాడ్ వ్యతిరేకించాడు. వ్యాపారాన్ని ఎవరికీ అమ్మబోమంటూ ఇద్దరం ఒప్పందం చేసుకున్నామని, కానీ, ఇప్పుడిలా అమ్మేయడం నమ్మకద్రోహమేనని పేర్కొంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ కేసుకు సంబంధించి మరిన్ని సంచలన ఆరోపణలు చేశాడు బ్రాడ్. మిరావళ్ తన కలల ప్రాజెక్టు అని, దానిని సక్సెస్ చేయడంలో ఏంజెలీనా పాత్రంటూ ఏమీ లేదని పిటిషన్లో ఆరోపించాడు. ప్రస్తుతం తన వైన్ బిజినెస్ కొన్ని వందల కోట్లకు ఎదిగిందని, ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన రోజ్ వైన్ తయారీదారుల్లో తన సంస్థ స్థానం సంపాదించిందని చెప్పాడు. కేవలం తన కృషి వల్లే అది సాధ్యమైందని, ఏంజెలీనా పాత్ర ఏమీ లేదన్నాడు. అయితే, విడాకుల అనంతరం తనకు తెలియకుండానే తన వాటాను వేరే సంస్థకు అమ్ముకోవడం దారుణమని బ్రాడ్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. చదవండి: ఇండియన్ రెస్టారెంట్లో జానీ డెప్ పార్టీ, రూ. 49 లక్షల బిల్లుతో షాకిచ్చాడు ఇక, ఏంజెలీనా జోలీ నుంచి వాటాను కొనుగోలు చేసిన టెన్యూట్ డెల్ మోండో సంస్థను రష్యాకు చెందిన యూరీ షెఫ్లర్ అనే వ్యాపారవేత్త పరోక్షంగా నడుపుతున్నాడని, ఇప్పుడు మిరావళ్ను చేజిక్కించుకునేందుకు రహస్య ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించాడు. తెలియని కొత్త వ్యక్తితో తన వ్యాపార భాగస్వామిగా చేయాలని చూసిందన్నాడు. తన సంస్థ పేరు ప్రతిష్ఠలను మంటగలిపి తనకు హాని చేయాలని చూస్తోందని, తన మనసు నిండా విషమే ఉందని మాజీ భార్య ఏంజెలీనాపై బ్రాడ్ సంచలన కామెంట్స్ చేశాడు. -
లగ్జరీ ఉత్పత్తుల్లో వీటిపై అధిక లాభాలు...!
Knight Frank Luxury Investment Index: లగ్జరీ ఉత్పత్తులపై పెట్టుబడిపెడితే లాభాలను గడించే అవకాశం ఎక్కువగా ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తుంటారు. ఒక వేళ ఎవరైనా లగ్జరీ ఉత్పత్తులపై ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే వైన్ ఎక్కువ రాబడులను వచ్చాయని నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ తన ద్వితీయా త్రైమాసికం 2021 రిపోర్ట్‌లో వెల్లడించింది. తాజా డేటా ప్రకారం....వైన్ ఉత్పత్తి చేస్తోన్న కంపెనీలు ఏడాది కాలంలో 13 శాతం మేర గణనీయంగా లాభాలను పొందినట్లు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. అరుదైన విస్కీ, లగ్జరీ హ్యండ్బ్యాగుల తయారీ సంస్థల కంటే వైన్ కంపెనీలు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టాయని తేలింది. చదవండి: Bill Gates: అమెజాన్, టెస్లా అధినేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బిల్‌గేట్స్...! ఇటీవలి కాలంలో నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ లో టాప్ గెయినర్స్‌గా అరుదైన స్కాచ్ బాటిల్స్, హెర్మెస్ హ్యాండ్ బ్యాగుల కంపెనీలు ఏడాది కాలంలో ప్రతికూల వృద్ధిని నమోదుచేసి సూచిక అగ్రస్థానంలో నిలిచాయి. 10 ఏళ్లలో 13శాతం, 119శాతం మేర ధరలు పెరగడంతో జూన్ 2021 చివరి వరకు 12 నెలల్లో వైన్ కంపెనీలు ఇండెక్స్ ముందు వరుసలో ఉన్నాయని నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ ఎడిటర్ ఆండ్రూ షిర్లీ అన్నారు. ప్రముఖ వైన్ దిగ్గజం బోర్డియక్స్ కంపెనీ భారీ లాభాలను గడించింది. 12 నెలల వ్యవధిలో వైన్ ఉత్తమ రాబడులను చూసినప్పటికీ, 10 సంవత్సరాల వ్యవధిలో ఇతర పెట్టుబడుల కంటే ఇది చాలా ఎక్కువ. అరుదైన విస్కీ కంపెనీలు 10 సంవత్సరాలలో 483 శాతం రాబడిని నమోదు చేశాయి. లగ్జరీ ఉత్పత్తుల్లో క్లాసిక్ కార్లు, లగ్జరీ వాచీలు వరుసగా 4 , 5 శాతం ధరల పెరుగుదలతో 12 నెలల వ్యవధిలో భారీగా రాబడులను పొందాయి. చదవండి: ప్యాన్‌కేక్ .. ఆ రుచి వెనుక కష్టాల కథ -
ఫుల్ కిక్
భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు జనవరి 1 నుంచి 16 వరకూ రూ.65 కోట్లకు పైగా వ్యాపారం చాటుమాటుగా సారా విక్రయాలు నోట్ల రద్దు ప్రభావంతో స్వల్పంగా తగ్గిన వైనం మందుబాబులకు పండుగే... పండుగ సంక్రాంతి అంటే కొందరికి సంప్రదాయ పండగ. ఇంకొందరికి క్రీడా సంబరం. కానీ సర్కారుకు మాత్రం కాసుల సందడి. మందుబాబులు చిందులు తొక్కే ప్రాంతాలను ఎంపిక చేసుకొని మద్యం కేసులు డంప్ చేసి ‘తాగర బాబూ...తాగి ఊగర బాబు’ అంటూ తన ఎక్సైజ్ సిబ్బందిని, మద్యం తాగి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీసులను దింపుతుంది. ఓ వైపు చట్టబద్ధంగా మద్యం అక్రమాలు ... ఇంకో వైపు చట్టప్రకారం అరెస్టులు. ఇదే మద్యం మాయాజాలం. రాయవరం : కొత్త సంవత్సరంతో మొదలైన మద్యం హడావిడి సంక్రాంతి వరకూ కొనసాగి పదిహేను రోజుల్లోనే సర్కారుకు జిల్లాలోని మందుబాబులు రూ.65 కోట్ల ఆదాయం సమకూర్చారు. జిల్లాలో ఎక్కడ చూసినా మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. పల్లెలు, పట్టణాలు అనే భేదం లేకుండా జిల్లా అంతటా మద్యం గోదావరితో సమానంగా పరవళ్లు తొక్కింది. సంక్రాంతి పర్వదినాల్లో పందేలతోపాటు మద్యం కూడా ముఖ్య భూమిక పోషించడం బాధాకరమే అయినా వ్యాపారులకు మాత్రం కాసుల వర్షం కురిపించింది. ఆ రోజుల్లోనే... : ఏడాదిలో మద్యం అమ్మకాలు జనవరి మొదటి పక్షంలోనే ఎక్కువగా జరుగుతాయి. గతేడాది డిసెంబరు 31వ తేదీ నుంచి సంక్రాంతి పర్వదినం వరకు మద్యం అమ్మకాలదే పెద్ద పీట. కొత్త సంవత్సరం, భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో ఈ అమ్మకాలు మరింత ఊపందుకోవడం సహజమే. జిల్లాలోని ఎక్సైజ్ శాఖ పరిధిలో అధికారికంగా 500 మద్యం షాపులు, 34 బారులున్నాయి. అనధికారికంగా ప్రతి షాపు పరిధిలో బెల్టుషాపులున్నాయి. వీటి ద్వారా రోజుకు రూ.3కోట్ల పైబడి మద్యం విక్రయాలు సాగుతుంటాయి. రూ.65.77 కోట్ల అమ్మకాలు.. : ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో ఒక లక్ష 71 వేల ఇండియ¯ŒS మేడ్ లిక్కర్ (ఐఎంఎల్), 73,673 కేసుల బీరు విక్రయాలు సాగాయి. దీని ద్వారా రూ.65.77 కోట్ల విక్రయాలు జరిగాయి గతేడాదితో పోలిస్తే అమ్మకాలు తగ్గాయనే చెప్పాలి. గతేడాది జనవరి నెల మొత్తం మూడు లక్షల 30 వేల 981 మద్యం కేసులు, ఒక లక్షల 61 వేల 326 బీరు కేసుల అమ్మకాలు జరగ్గా...వీటి ద్వారా 132 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. దీన్ని బట్టి చూస్తే గతేడాది కంటే జనవరి మొదటి పక్షంలో దాదాపుగా రూ.5 కోట్ల వరకు అమ్మకాలు తగ్గాయని చెప్పవచ్చు. గతంతో పోల్చితే ఆదాయం కొంతమేర తగ్గినా ఈ 15 రోజుల్లో అమ్మకాలు రూ.50 కోట్లు అధిగమించి సాగాయి. ఎక్సైజ్ అమ్మకాలు కొంతమేర తగ్గడానికి పెద్ద నోట్ల రద్దు ప్రభావమేనని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. చాటుమాటుగా సారా అమ్మకాలు.. ఎక్సైజ్ అధికారులు సారా బట్టీలపై దాడులు కొనసాగిస్తున్నా..సారా తయారీ అమ్మకాలు కొనసాగుతున్నాయి. సారా తయారీదారులు రహస్య మార్గాల ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి సరఫరా చేశారు. లిక్కర్, కోడిపందాల కారణంగా జేబుల్లో డబ్బులు ఖర్సై పోయిన మందుబాబులు సారాకు ఎగబడ్డారు. లిక్కర్ క్వార్టర్ బాటిల్ కోసం రూ.80లు వెచ్చించాలి. కేవలం రూ.20కే గ్లాసు సారా లభించడంతో కొంతమంది వాటి వైపు పరుగులు తీశారు.