'ఆకాశంలో సగం' అంటూ పోవూరి లలిత కుమారి (ఓల్గా) రాసిన కవిత ఒకప్పుడు సంచలనం రేపింది. ప్రతి రంగంలోనూ అవకాశాలు కల్పించాలని, పురుషాధిక్యం తగదని తన రచనల ద్వారా సమాజం మీద విరుచుకుపడిన విషయం దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. అయితే ఈ రోజు మహిళ అడుగుపెట్టని రంగం ఏదీ లేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ రోజు అన్ని రంగాల్లోనూ మహిళల హవా నడుస్తోంది. మహిళలకు పూర్తిగా విరుద్ధంగా భావించే వైన్ ఇండస్ట్రీలో కూడా మేము సైతం అంటున్నారు.
ఇలాంటి రంగంలో అడుగు పెట్టి ప్రపంచ వ్యాపార రంగంలో ఎంతోమంది దృష్టిని ఆకర్శించి 'జోయా వోరా షా' (Zoya Vora Shah) మహిళ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
అమెరికాలోని ప్రముఖ వైన్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో ముందుకెళ్తున్న 'జోయా వోరా షా' భారతదేశానికి చెందిన మహిళ కావడం గమనార్హం. నిజానికి ఈమె కొంత కాలం క్రితం మన దేశం నుంచి అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడింది. కొన్ని రోజుల తరువాత ఒక రెస్టారెంట్‌లో వైన్ బిజినెస్ ప్రారంభించింది. ఈ వ్యాపారం అతి తక్కువ కాలంలోనే బాగా లాభాల బాట పట్టింది.
(ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!)
ఒక బ్రాంచ్‌తో మొదలైన ఆమె వ్యాపారం అదే నగరంలో ఎనిమిది బ్రాంచ్‌లకు చేరింది. ప్రస్తుతం ఈమె వైన్, స్పిరిట్ విక్రయాలకు ప్రతినిధిగా మారింది. కాలక్రమంలో ఆమె స్థాపించిన వైన్ టేస్టింగ్ రూమ్ తరువాత వైన్ బార్ అండ్ బాటిల్ షాప్‌గా రూపుదిద్దుకున్నాయి. అతి తక్కువ సమయంలో ఈమె బాగా ఎదగటానికి కారణం ఈ రంగంపై ఆమెకున్న అభిరుచే.
(ఇదీ చదవండి: కుటుంబంలో 12 మంది డాక్టర్లు.. 16 సంవత్సరాలకే రికార్డు.. అసిస్టెంట్ కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలి..)
ప్రారంభంలో ఇలాంటి రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావంటూ ఎంతో మంది ఆమెను విమర్శించారు. కానీ ఎవరి మాటను లెక్క చేయని జోయా వోరా షా చివరికి అనుకున్న విజయం సాధించింది. దీనికి ప్రధాన కారణం ఆమె భర్త అందించిన సహకారమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె బిజినెస్ కోట్లలో టర్నోవర్ పొందుతోంది. దీన్ని బట్టి చూస్తే మహిళ అనుకోవాలే కానీ ఆమె విజయం సాధించని రంగం అంటూ ఏది ఉండదని స్పష్టంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment