ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే.. తప్పకుండా కృషి, పట్టుదల చాలా అవసరం.. అప్పుడే అనుకున్నది సాధించడం సాధ్యమవుతుంది, ఇదే విజయ రహస్యమంటే! ఆధునిక కాలంలో వ్యాపార రంగాల్లో పురుషులు మాత్రమే కాకుండా మహిళలు సైతం తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో 'వందన లూత్ర' (Vandana Luthra) ఒకరు. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
1959 జులై 12న ఢిల్లీలో మంచి పలుకుబడి కలిగిన కుటుంబంలో వందన జన్మించింది. తల్లి ఆయుర్వేద వైద్యురాలు. తండ్రి మెకానికల్ ఇంజినీర్. ఈమె ఢిల్లీలో పాలిటెక్నిక్ పూర్తి చేసి.. ఆ తరువాత జర్మనీలో కాస్మెటిక్ అండ్ న్యూట్రిషన్ వంటి వాటి గురించి తెలుసుకుంది. ఆ సమయంలో సౌందర్య పరిశ్రమల గురించి తెలుసుకుని బ్యూటీ పరిశ్రమలో ముందుకు సాగాలని నిర్ణయించుకుంది.
రూ. 20వేలతో ప్రారంభం..
అనుకున్న విధంగానే తన భర్త ముఖేష్ లూత్రా సహకారంతో రూ. 20000తో ఢిల్లీలో 'లూత్ర కర్ల్స్ అండ్ కర్వ్స్' (VLCC) ప్రారంభించింది. ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ నేడు కంపెనీ విలువ రూ. 2225 కోట్లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే వందన లూత్ర ఎంతగా అభివృద్ధి చెందిందని విషయం అర్థమవుతోంది.
ప్రస్తుతం వీరి ఉత్పత్తులు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆఫ్రికాలోని సుమారు 139 నగరాలలో ప్రాచుర్యం పొందాయి. ప్రపంచం మొత్తం మీద దదాపు 12 దేశాలకు వీరి సంస్థ విస్తరించింది. కాగా బ్యూటీ & వెల్‌నెస్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ చైర్మన్‌గా కూడా పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి: ఇండియా పేరు 'భారత్'గా మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చవుతుందంటే?
ఒక చిన్న సంస్థగా అవతరించిన 'వీఎల్‌సీసీ' నేడు ఒక పాపులర్ కంపెనీగా ఎంతోమందికి ఉపాధి అందిస్తూ.. ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 3000 మంది ఉద్యోగులు ఉన్నట్లు, ఇందులో 75 శాతం కంటే ఎక్కువ మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది.
Comments
Please login to add a commentAdd a comment