VLCC Healthcare
-
రూ.20 వేలతో మొదలు.. 3వేల మందికి ఉపాధి.. వారెవ్వా వందన
ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే.. తప్పకుండా కృషి, పట్టుదల చాలా అవసరం.. అప్పుడే అనుకున్నది సాధించడం సాధ్యమవుతుంది, ఇదే విజయ రహస్యమంటే! ఆధునిక కాలంలో వ్యాపార రంగాల్లో పురుషులు మాత్రమే కాకుండా మహిళలు సైతం తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో 'వందన లూత్ర' (Vandana Luthra) ఒకరు. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1959 జులై 12న ఢిల్లీలో మంచి పలుకుబడి కలిగిన కుటుంబంలో వందన జన్మించింది. తల్లి ఆయుర్వేద వైద్యురాలు. తండ్రి మెకానికల్ ఇంజినీర్. ఈమె ఢిల్లీలో పాలిటెక్నిక్ పూర్తి చేసి.. ఆ తరువాత జర్మనీలో కాస్మెటిక్ అండ్ న్యూట్రిషన్ వంటి వాటి గురించి తెలుసుకుంది. ఆ సమయంలో సౌందర్య పరిశ్రమల గురించి తెలుసుకుని బ్యూటీ పరిశ్రమలో ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. రూ. 20వేలతో ప్రారంభం.. అనుకున్న విధంగానే తన భర్త ముఖేష్ లూత్రా సహకారంతో రూ. 20000తో ఢిల్లీలో 'లూత్ర కర్ల్స్ అండ్ కర్వ్స్' (VLCC) ప్రారంభించింది. ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ నేడు కంపెనీ విలువ రూ. 2225 కోట్లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే వందన లూత్ర ఎంతగా అభివృద్ధి చెందిందని విషయం అర్థమవుతోంది. ప్రస్తుతం వీరి ఉత్పత్తులు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆఫ్రికాలోని సుమారు 139 నగరాలలో ప్రాచుర్యం పొందాయి. ప్రపంచం మొత్తం మీద దదాపు 12 దేశాలకు వీరి సంస్థ విస్తరించింది. కాగా బ్యూటీ & వెల్నెస్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ చైర్మన్‌గా కూడా పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: ఇండియా పేరు 'భారత్'గా మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చవుతుందంటే? ఒక చిన్న సంస్థగా అవతరించిన 'వీఎల్సీసీ' నేడు ఒక పాపులర్ కంపెనీగా ఎంతోమందికి ఉపాధి అందిస్తూ.. ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 3000 మంది ఉద్యోగులు ఉన్నట్లు, ఇందులో 75 శాతం కంటే ఎక్కువ మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. -
వీఎల్సీసీ సీఈవోగా వికాస్ గుప్తా
న్యూఢిల్లీ: వెంటనే అమల్లోకి వచ్చే విధంగా వికాస్ గుప్తాను కొత్త సీఈవోగా నియమించినట్లు బ్యూటీ, స్కిన్‌కేర్ బ్రాండ్ వీఎల్సీసీ పేర్కొంది. జయంత్ ఖోస్లా స్థానే వికాస్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2022 డిసెంబర్లో మెజారిటీ వాటాను సొంతం చేసుకోవడంతో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కార్లయిల్ నిర్వహణలోకి వీఎల్సీసీ చేరింది. కాగా.. గుప్తా ఇంతక్రితం నైకాకు చెందిన ఈబీటూబీ బిజినెస్(సూపర్‌స్టోర్)కు సీఈవోగా వ్యవహరించారు. గ్లోబల్ దిగ్గజం వాల్‌మార్ట్ గ్రూప్ ఈకామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్లోనూ పనిచేశారు. 2019–21 మధ్య చీఫ్ కస్టమర్, మార్కెటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. తొలుత ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్)లో కెరీర్‌ను ప్రారంభించిన గుప్తా వివిధ హోదాలలో 21 ఏళ్లపాటు సేవలందించారు. 1989లో ఏర్పాటైన వీఎల్సీసీ గ్రూప్ ప్రస్తుతం స్కిన్‌కేర్, బ్యూటీ, వెల్నెస్ విభాగాలలో మల్టీఔట్లెట్ల ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించింది. -
ఐపీవో జోరు.. మరో నాలుగు కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: ఇటీవల సరికొత్త రికార్డుల బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ప్రైమరీ మార్కెట్‌కు సైతం జోష్ నిస్తున్నాయి. దీంతో కొద్ది నెలలుగా పలు కంపెనీలు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) వెళ్తున్నాయి. ప్రస్తుత కేలండర్ ఏడాది(2021)లో ఇప్పటికే ఐపీవోల ద్వారా వివిధ సంస్థలు భారీ స్థాయిలో నిధులు సైతం సమీకరించాయి. ఈ బాటలో తాజా గా మరో 4 కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తలుపు తట్టాయి. వివరాలు ఇలా.. గో ఫ్యాషన్ ఇండియా ఐపీవోకు అనుమతించమంటూ గో కలర్స్ బ్రాండుతో మహిళల దుస్తులను రూపొందిస్తున్న గో ఫ్యాషన్ ఇండియా సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం కంపెనీ రూ. 125 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1,28,78,389 షేర్లను విక్రయానికి ఉంచనుంది. కంపెనీలో ప్రస్తుతం పీకేఎస్, వీకేఎస్ కుటుంబ ట్రస్ట్‌లకు విడిగా 28.74 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. సమీకరించిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా మహిళలు ధరించే చుడీదార్లు, లెగ్గింగ్స్, ధోతీలు, ట్రౌజర్లు తయారు చేస్తోంది. వీఎల్సీసీ హెల్త్‌కేర్ వెల్నెస్, బ్యూటీ ప్రొడక్టుల దేశీ కంపెనీ వీఎల్సీసీ హెల్త్‌కేర్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లతోపాటు, కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు మరో 89.22 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. ఈక్విటీ జారీ ద్వారా సమీకరించనున్న నిధులను గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ప్రాంతంతోపాటు దేశీయంగా మరిన్ని వెల్నెస్ క్లినిక్‌ల ఏర్పాటుకు వినియోగించనుంది. హాట్‌న్యూస్: మస్త్ ఫీచర్లతో మడత ఫోన్లు.. చూసేయండి పారదీప్ ఫాస్ఫేట్స్ ఐపీవోకు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ ఫెర్టిలైజర్ కంపెనీ పారదీప్ ఫాస్ఫేట్స్ సెబీకి దరఖాస్తు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,255 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 12 కోట్లకుపైగా షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. వీటిలో జువారీ మారోక్ ఫాస్ఫేట్స్ 75,46,800 షేర్లు ఆఫర్ చేయనుండగా, కేంద్ర ప్రభుత్వం 11.24 కోట్ల షేర్లను విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీలో జువారీ మారోక్కు 80.45 శాతం వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం 19.55 శాతం వాటాను కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను గోవాలోని ఎరువుల తయారీ యూనిట్ కొనుగోలుతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇన్స్పిరా ఎంటర్ప్రైజ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా ఐటీ సొల్యూషన్లు అందించే ఇన్స్పిరా ఎంటర్ప్రైజ్ ఇండియా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 800 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని ప్రకాష్ జైన్‌తోపాటు, మంజులా జైన్, ప్రకాష్ జైన్ కుటుంబ ట్రస్ట్‌లు విక్రయానికి ఉంచనున్నాయి. వీటికి జతగా మరో రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వ్యక్తిగతంగా ప్రకాష్ జైన్ రూ. 131 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుండగా.. ట్రస్ట్ తరఫున రూ. 277 కోట్లు, మంజులా జైన్ ట్రస్ట్ రూ. 92 కోట్లు చొప్పున ఈక్విటీని విక్రయించనున్నాయి. ఐపీవో నిధులను రుణ చెల్లింపులతోపాటు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
ఐపీఓ పత్రాలు దాఖలు చేసిన వీఎల్సీసీ హెల్త్‌కేర్
న్యూఢిల్లీ: బ్యూటీ, వెల్నెస్ సంస్థ వీఎల్సీసీ హెల్త్‌కేర్ త్వరలో ఐపీఓకు రానున్నది. ఐపీఓకు సంబంధించిన పత్రాలను ఈ సంస్థ ఇటీవల మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ సంస్థ కనీసం రూ.400 కోట్లు సమీకరించనున్నది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులతో వీఎల్సీసీ వెల్నెస్ సెంటర్లను భారత్‌లో, విదేశాల్లో కూడా ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. అంతేకాకుండా వీఎల్సీసీ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేయాలని, రుణ భారం తగ్గించుకోవడానికి, బ్రాండ్ అభివృద్ధికి, ఇతర సాధారణ వ్యాపార కార్యకలాపాలకు ఈ ఐపీఓ నిధులను ఉపయోగంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది వీఎల్సీసీని 1989లో వందన లూత్రా ప్రారంభించారు.