న్యూఢిల్లీ: బ్యూటీ, వెల్‌నెస్ సంస్థ వీఎల్‌సీసీ హెల్త్‌కేర్ త్వరలో ఐపీఓకు రానున్నది. ఐపీఓకు సంబంధించిన పత్రాలను ఈ సంస్థ ఇటీవల మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ సంస్థ కనీసం రూ.400 కోట్లు సమీకరించనున్నది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులతో వీఎల్‌సీసీ వెల్‌నెస్ సెంటర్లను భారత్‌లో, విదేశాల్లో కూడా ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. అంతేకాకుండా వీఎల్‌సీసీ ఇన్‌స్టిట్యూట్స్ ఏర్పాటు చేయాలని, రుణ భారం తగ్గించుకోవడానికి, బ్రాండ్ అభివృద్ధికి, ఇతర సాధారణ వ్యాపార కార్యకలాపాలకు ఈ ఐపీఓ నిధులను ఉపయోగంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది వీఎల్‌సీసీని 1989లో వందన లూత్రా ప్రారంభించారు.