భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి తెలిసిన చాలా మందికి ఈమె సోదరి 'అనమ్ మీర్జా' గురించి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈమె 330 కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధినేత!.. ఆనం మీర్జా గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
సానియా మీర్జా మాదిరిగా కాకుండా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని వ్యాపార రంగంలో ముందుకు సాగుతున్న అనమ్ మీర్జా మాస్ కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్ పూర్తి చేసి వివిధ జాతీయ ఛానెల్‌లలో ఇంటర్న్‌గా జర్నలిజంలో తన వృత్తిని ప్రారంభించింది.
ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఈమెకు సొంతంగా ఏదైనా ప్రారభించాలనే ఆకాంక్ష ఎక్కువగా ఉండేది. ఈ కారణంగానే 2013లో ఔత్సాహిక జర్నలిస్టుల కోసం 'ఇంక్ టు చేంజ్' అనే వెబ్‌సైట్ ప్రారంభించింది. 2014లో అక్బర్ రషీద్‌తో వివాహం జరిగిన తరువాత ఆమె తన ఫ్యాషన్ లేబుల్ 'ది లేబుల్ బజార్'ని ప్రారంభించింది. 2022లో అనమ్ మీర్జా భారతదేశపు అతిపెద్ద రంజాన్ ఎక్స్‌పో, దావత్-ఎ-రంజాన్‌ను స్థాపించింది.
అనమ్ మీర్జా తన భర్త అక్బర్ రషీద్‌తో విడిపోయిన తరువాత భారత మాజీ కెప్టెన్ & రాజకీయ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు 'మహ్మద్ అసదుద్దీన్'ను వివాహం చేసుకుంది. వీరికి 'దువా' అనే పాప కూడా ఉంది. ఈ పాప పేరు మీద అనమ్ మీర్జా 2023లో మరో ఫ్యాషన్ లేబుల్ ప్రారంభించింది.
మహ్మద్ అసదుద్దీన్ తండ్రి బాటలోనే నడిచి బ్యాటర్‌గా మారారు, కానీ అయన క్రికెట్ కెరీర్ సజావుగా ముందుకు సాగలేదు. దీంతో క్రికెట్ వదిలిపెట్టారు. అసదుద్దీన్ క్రికెటర్ కాక ముందే న్యాయవాది.
ఇదీ చదవండి: జూన్ 4 నుంచి 'గూగుల్ పే' బంద్!.. మరో యాప్‌లోనే అన్నీ..
అనమ్ మీర్జా వ్యాపారాలు మాత్రమే కాకుండా 1,25,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లతో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దీని ద్వారా కూడా బాటుగా సంపాదిస్తోంది. వ్యాపార రంగంలో తనదైన రీతిలో దూసుకెళ్తున్న అనమ్ మీర్జా నికర విలువ 40 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఈమె ఆస్తుల విలువ రూ.331 కోట్లకంటే ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment