తప్పిన పెను ప్రమాదం | Backflipping FBI agent accidentally shoots man in bar | Sakshi
Sakshi News home page

తప్పిన పెను ప్రమాదం

Published Mon, Jun 4 2018 10:48 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

జాగ్రత్తగా ఉండాల్సిన అధికారి నిర్లక్ష్యంగా వహించాడు. బిత్తిరి చర్యతో నైట్‌ క్లబ్‌లో ప్రజలను బెంబేలెత్తించాడు. అయితే ఈ ఘటనలో ఓ వ్యక్తి మాత్రం గాయపడ్డాడు. డెన్వర్‌ నగరం(కొలరెడా)లోని ఓ నైట్‌ క్లబ్‌లో జరిగిన ఘటన తాలుకూ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఎఫ్‌బీఐ అధికారి(ఆఫ్‌ డ్యూటీలో ఉన్నాడు) ఒకరు శుక్రవారం రాత్రి డెన్వర్‌లోని మైల్‌ హైల్‌ స్పిరిట్‌ అనే నైట్‌ క్లబ్‌కు వెళ్లాడు. హుషారుగా ఫ్లోర్‌పై బ్రేక్‌ డాన్స్‌ చేయటం ప్రారంభించాడు. చుట్టూ అమ్మాయిలు, అబ్బాయిలు చేరి వావ్‌ అనుకుంటుంటే.. ఆ కోలాహలం చూసి తట్టుకోలేక తన ట్యాలెంట్‌ ప్రదర్శించాడు. బ్యాక్‌ఫ్లిప్‌ మూమెంట్‌తో అదరగొట్టాడు. ఆ ప్రయత్నంలో అతని వెనకభాగంలో దాచుకున్న గన్‌ ఎగిరి కింద పడిపోయింది. కంగారులో దాన్ని తీసుకునే క్రమంలో అది కాస్త పేలింది. బార్‌లో పని చేసే ఓ ఉద్యోగి కాలికి తగిలి గాయపడ్డాడు. అదృష్టవశాత్తూ బుల్లెట్‌ కింది దిశగా ప్రయాణించటంతో పెను ప్రమాదమే తప్పింది. ఘటన తర్వాత సారీ చెబుతూ అక్కడి నుంచి అతను గాయబ్‌ అయిపోయాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి రికార్డు చేసి వైరల్‌ చేశాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement