అమెరికాలో మళ్లీ విద్వేషపు తూటా పేలింది | Srinivas Kuchibhotla murder case: FBI to investigate at racial discrimination angle | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 25 2017 6:41 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

అమెరికాలో మళ్లీ విద్వేషపు తూటా పేలింది. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఆడమ్‌ పూరింటన్‌ అనే ఓ శ్వేతజాతి ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ కూచిభొట్ల అనే ఇంజనీర్‌ను పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఘటనలో శ్రీనివాస్‌ స్నేహితుడు అలోక్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్‌ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్‌ బార్‌లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. కాల్పులు జరిపిన పూరింటన్‌ అమెరికా నేవీ మాజీ ఉద్యోగి అని గుర్తించారు. ఘటన జరిగిన 5 గంటల్లోనే మిస్సోరి ప్రాంతంలోని ఓ బార్‌లో అతడిని అరెస్టు చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement