racial discrimination
-
విస్తుపోయే నిజాలు.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు క్షమాపణ
క్రికెట్ ప్రపంచాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) క్షమాపణ కోరడం ఆసక్తి కలిగించింది. ఇంగ్లండ్ క్రికెట్లో జాతి వివక్ష ఎదుర్కొన్న ప్రతీ బాధితుడు లేదా బాధితురాలికి ప్రత్యేకంగా క్షమాపణ కోరుతూ సోమవారం రాత్రి ఈసీబీ లేఖను విడుదల చేసింది. జాతి వివక్షపై ఇండిపెండెంట్ కమీషన్ ఫర్ ఈక్విటీ ఇన్ క్రికెట్(ICEC) నివేదికను ఈసీబీకి సమర్పించింది. ఈ రిపోర్టులో వివక్ష వల్ల ఎదుర్కొన్న దుష్ప్రవర్తనకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. మార్పులకు సంబంధించి 44 ప్రతిపాదనలను ఐసీఈసీ రిపోర్టులో పొందుపరిచింది. నివేదిక ప్రకారం.. '' ఇంగ్లండ్ క్రికెట్లో వివక్ష జరిగిన మాట నిజమే. బ్లాక్‌లైవ్ మ్యాటర్స్, మీటూ తరహాలో ఇక్కడా నల్లవారికి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో 85 శాతం భారత సంతతికి చెందిన బాధితులే ఉండడం గమనార్హం. ఇది తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం. నిర్మాణాత్మక, సంస్థాగత జాత్యహంకారం, లింగవివక్ష-వర్గ-ఆధారిత వివక్ష నుంచి విముక్తి పొందలేకపోయారు.'' అంటూ ఐసీఈసీ తన రిపోర్టులో పేర్కొంది. కాగా రిపోర్టును పరిశీలించిన ఈసీబీ తప్పుకు క్షమాపణ కోరుతూ తక్షణమే మార్పులు చేపడతామని తెలిపింది. ''క్రికెట్ అనేది అందరి గేమ్. ఇక్కడ వివక్షకు తావులేదు. ఇలాంటివి మళ్లీ జరగకుండా త్వరలోనే కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఐసీఈసీ పేర్కొన్న విధంగా జాతి వివక్ష పేరుతో మహిళలకు, నల్ల జాతీయులకు జరిగిన అవమానాలను పట్టించుకోలేదు. అందుకు క్షమాపణ కోరుతున్నాం. ఇలాంటివి ఉపేక్షించం. ఐసీఈసీ పేర్కొన్న 44 రికమెండేషన్స్‌ను పరిశీలించాం. వచ్చే మూడు నెలల్లో ICEC ప్రతిపాదించిన 44 సిఫార్సులకు ఒక బలమైన ప్రణాళికను రూపొందించడానికి ప్రయత్నిస్తాం.'' అంటూ ఈసీబీ చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ పేర్కొన్నారు. Read our response to the Independent Commission for Equity in Cricket which finds evidence of discrimination across the game. We apologise unreservedly for the experiences of those who have faced discrimination in cricket. https://t.co/vOpqMLmuoK — England and Wales Cricket Board (@ECB_cricket) June 26, 2023 చదవండి: #RohitSharma: 'పోటీ తీవ్రంగా ఉంది.. అంత సులభం కాదు; కష్టపడతాం' -
దుస్తులు విప్పించి సోదాలు!
లండన్: బ్రిటన్ పోలీసులు నల్లజాతి చిన్నారుల పట్ల జాతి వివక్షతో వ్యవహరిస్తున్నారని ఓ నివేదిక పేర్కొంది. తరచూ వారినే ఎక్కువగా దుస్తులు విప్పించి సోదాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ‘‘2018–2022 మధ్య ఇలా 3 వేల మంది పిల్లలను సోదాలు చేశారు. వీరిలో మూడొంతులు నల్లజాతి పిల్లలే. అంతా చూస్తుండగానే ఎనిమిదేళ్ల పిల్లలను కూడా బట్టలిప్పి తనిఖీలు చేయడం ఘోరం. అమ్మాయిలను తనిఖీ చేసేటప్పుడు పురుష అధికారులు, అబ్బాయిలకైతే మహిళా అధికారులు ఉండటం మరీ శోచనీయం’’ అని చిల్డ్రన్స్ కమిషనర్ రాచెల్ డిసౌజా అన్నారు. ‘‘2020లో లండన్‌లోని ఓ స్కూల్లో 15 ఏళ్ల నల్లజాతి బాలికను డ్రగ్స్ ఉన్నాయంటూ మహిళా అధికారులు దుస్తులు విప్పి సోదాలు జరిపారు. ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు. దీనికి జాతి వివక్షే కారణమని భావిస్తున్నాం’’ అని తెలిపారు. -
భారత సంతతి ప్రొఫెసర్‌పై అమెరికాలో జాతి వివక్ష!
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన లక్ష్మీ బాలచంద్ర అనే అసోసియేట్ ప్రొఫెసర్ మసాచుసెట్స్‌లో తాను పని చేస్తున్న బాబ్సన్ కాలేజీపై జాతి, లింగ వివక్ష ఆరోపణలు చేశారు. వీటి కారణంగా కెరీర్ అవకాశాలను కోల్పోయానంటూ కాలేజీపై కేసు కూడా పెట్టారు. అంతేగాక ఆర్థిక నష్టానికి, మానసిక కుంగుబాటుకు లోనయ్యానంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘కాలేజీ ఎంట్రప్రెన్యూర్షిప్ డివిజన్‌కు సారథ్యం వహించిన ప్రొఫె సర్ ఆండ్రూ కార్బెట్ ఇందుకు ప్రధాన బాద్యుడు. దీన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా విచారించి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. బాబ్సన్ కాలేజీ శ్వేత జాతీయులకు, అందులోనూ పురుషులకు మాత్రమే పెద్దపీట వేస్తుంది. వారికే ప్రివిలేజీలన్నీ కల్పిస్తుంది’’ అని ఆరోపించారు. ఆమె 2012 నుంచి కాలేజీలో పని చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలను తాము చాలా సీరియస్‌గా తీసుకుంటామని కాలేజీ ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిపై విచారణ జరిపి తప్పిదాలను సరిదిద్దేందుకు పకడ్బందీ వ్యవస్థ అమల్లో ఉందని చెప్పుకొచ్చింది. -
ఓ గృహిణి లక్ష్యం.. సవాళ్లే మన గురువులు
‘ఒక చిన్న అడ్డంకి కూడా నా ఎదుగుదలను ఆపలేదు’ అంటోంది మోడల్ తనూ గార్గ్ మెహతా. భారతదేశంలోని హర్యానాలో పుట్టి పెరిగిన తనూ కెనడా వెళ్లి, అటు నుంచి అమెరికా చేరుకొని ప్రసిద్ధ కంపెనీలలో పని చేస్తూ అక్కడి గ్లామర్ ప్రపంచంలో మహామహులతో పోటీ పడుతూ గుర్తింపును పొందుతోంది. బ్రిటిష్ ఎయిర్‌లైన్, వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్వేస్లో ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేసిన అనుభవం తనూ గార్గ్ సొంతం. రాబోయే మిసెస్ వరల్డ్ పోటీలకు సిద్ధం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. వర్ణ వివక్షను ఎదుర్కొంటూ ఒంటరి పోరుకు సిద్ధపడింది. అమెరికాలో పర్యావరణం కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేస్తోంది. ప్రకటనలలో నటిస్తోంది. కలల సాధనకు కృషితోపాటు కుటుంబం బంధాన్ని నిలుపుకోవాల్సిన విధానం గురించి కూడా వివరిస్తోంది. ‘‘భారతీయ మహిళ అనే కారణం ఏ దశలోనూ నన్ను తగ్గించలేదు. మోడల్‌గా రాణించాలనే నా కల నా పని షెడ్యూల్‌నూ మార్చలేదు. రంగుల ప్రపంచంలో విజయం సాధించడానికి ఏం అవసరమో నాకు తెలుసు. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో పుట్టి పెరిగాను. మధ్య తరగతి కుటుంబం. బి.టెక్ అయ్యాక పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాను. కానీ కుటుంబం ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి చాలా కష్టమైంది. కెనడా వెళితే కొంత ఖర్చు తగ్గుతుందనుకున్నా. అందుకు కుటుంబసభ్యులతో పాటు బంధువులు, స్నేహితుల సాయం తీసుకున్నాను. అప్పుడే అనుకున్నా ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడాలని. అడుగడుగునా సవాళ్లు కెనడాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాక పేరున్న ఐటి కంపెనీలలో ఉద్యోగం చేశాను. అక్కడే నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. మా ఇద్దరి బంధానికి గుర్తుగా కొడుకు పుట్టాడు. అందమైన కుటుంబం. హాయిగా సాగిపోతోంది జీవితం. కానీ, నా కల మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది. అమెరికాలోని అందాల పోటీలలో విజేతగా నిలవాలన్నది నా కల. అక్కడి రంగుల ప్రపంచంలో మోడల్‌గా రాణించాలన్నది లక్ష్యం. ఇందుకు నా భర్త మద్దతు లభించింది. బాబును నా భర్త వద్ద వదిలి, కొద్ది కాలంలోనే అమెరికా చేరుకున్నాను. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే చాలా విషయాలు స్పష్టమయ్యాయి. అమెరికాలో ఇతర దేశాల నుంచి వచ్చినవారికి ముఖ్యంగా స్త్రీకి చాలా సవాళ్లతో కూడిన జీవితం ఉంటుందని అర్థమైంది. మగవారితో పోల్చితే తక్కువ జీతం, వర్ణ వివక్ష, సాంస్కృతిక అడ్డంకులు .. ఎన్నో చూశాను. కానీ, అన్నింటినీ అధిగమించడమే నేను చేయాల్సింది అని బలంగా అనుకున్నాను. అప్పుడే అందరికీ సమాన అవకాశాలకు మద్దతు ఇచ్చే సేవాసంస్థ నిర్వాహకులతో పరిచయమైంది. దీంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి సేవా సంస్థ పనుల్లో నిమగ్నమయ్యాను. మోడలింగ్ చేస్తూ, అందాల పోటీల్లో పాల్గొంటూనే సంస్థ పనులు చేస్తున్నాను. అలాగే, పర్యావరణ రక్షణకు పాటు పడే సంస్థకోసం కృషి చేస్తున్నాను. ఫలితంగా ఆర్థిక వెసులుబాటు, సేవాభాగ్యం లభించింది. నా లక్ష్యం నెరవేర్చుకోవడానికి మార్గమూ సులువయ్యింది. దూరాన్ని దగ్గర చేసే నమ్మకం పెళ్లి అనేది ఒక అద్భుతమైన విషయం. ఒక కప్పు కింద ఉన్నా, సుదూరంగా, ఇతర దేశాలలో ఉన్నా భాగస్వామి కలను అర్థం చేసుకోవడంతో బంధం బలంగా ఉంటుంది. దూరం హృదయాలను మరింత మృదువుగా మార్చేస్తుందనడానికి నా జీవితమే ఉదాహరణ. నిజానికి భారతీయ సంస్కృతిలో భార్య–భర్త దూరంగా ఉండటం ఇప్పటికీ నిషేధం. కానీ, బదిలీలు, దేశ రక్షణలో సైనికులు, అతిగా క్యాంపులు ఉండే ఉద్యోగాలు ఇవన్నీ జీవిత భాగస్వామికి దూరంగా ఉంచుతాయి. దూరం అనేది వివాహానికి సవాల్‌గా ఉంటుంది. కానీ, సరిగ్గా నిర్వహిస్తే వారిద్దరి బంధం కచ్చితంగా బలంగా ఉంటుంది. ఒక మహిళ కుటుంబాన్ని పోషించగలదు, కలలను సాధించుకోవడానికి కృషి చేయగలదు. ఏదైనా సంబంధాన్ని కొనసాగించడంలో వారి మధ్య కమ్యూనికేషన్, నమ్మకం రెండూ కీలకమైన అంశాలు. ఇవి మా ఇద్దరి మధ్య ఉన్నాయి. అందుకే నా కల కోసం నేను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. ఉద్యోగం చేస్తున్నాను. ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడానికి ఫిట్నెస్, యోగా, ధ్యానం, పోషకాహారం .. అన్నింటిపైనా దృష్టిపెడుతున్నాను. తెలుపు–నలుపు, పొట్టి–పొడవు భేదాలేవీ మన కలలకు అడ్డంకి కావు. మానవ ప్రపంచంలో అందరూ సమానమే అని చాటాలన్నదే నా లక్ష్యం’’ అనే తనూ గార్గ్ ఎదుర్కొంటున్న సవాళ్లు మనకూ ఓ లక్ష్యాన్ని నిర్దేశిస్తాయి. -
అపరిపక్వత, సౌందర్యం, చిత్తశుద్ధి!
బరాక్ ఒబామా... అమెరికా మాజీ అధ్యక్షుడిగా, మాజీ సైనికుడిగా మనందరికీ చిరపరిచితమైన పేరిది. రచయితగా ఆయన గురించి తెలిసింది కొంతే. కానీ...‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’పేరుతో ఒబామా ఈ కొరతను తీర్చేశారు. 17న విడుదల కానున్న ఈ పుస్తకంలో అగ్రరాజ్యానికి తొలి నల్లజాతి అధ్యక్షుడిగా తన అనుభవాలను దేశాధినేతలు, రాజకీయ పార్టీల నాయకులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. లోతైన అధ్యయనం.. క్లుప్తత... కాసింత హాస్యం కలబోసి ఆయన ఎవరి గురించి ఏమన్నారంటే..? ధైర్యం లేని, అపరిపక్వమైన నాణ్యత! కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గాంధీ వంశ వారసుడు రాహుల్ గాంధీని బరాక్ ఒబామా అధైర్యంతో కూడిన, అపరిపక్వమైన నాణ్యత కలిగిన నాయకుడిగా తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో వర్ణించారు. ఇదే అంశాన్ని ఇంకాస్త వివరిస్తూ.. ‘‘రాహుల్‌గాంధీ ఓ విద్యార్థి అనుకుంటే... చదవాల్సిందంతా చదివి టీచర్ దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్న వాడిలా కనిపిస్తాడు. కానీ.. చదివిన విషయంపై పట్టు సాధించాలన్న అభిరుచి, మోహం రెండింటిలో ఏదో ఒకటి లోపించినట్లు అనిపిస్తుంది’’అని వ్యాఖ్యానించారు. అందం ఆమె సొంతం ‘‘చార్లీ క్రైస్ట్, రామ్ ఎమ్మాన్యుల్ వంటి మగవాళ్ల అందం గురించి అందరూ చెబుతూంటారు. మహిళల సౌందర్యం గురించి మాత్రం వాళ్లూ వీళ్లు చెప్పేది తక్కువే. ఒకట్రెండు సందర్భాలను మినహాయిస్తే సోనియాగాంధీ విషయంలోనూ ఇదే జరిగింది.’’అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా..కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురించి చేసిన వ్యాఖ్య ఇది. నిష్పాక్షికత..చిత్తశుద్ధి దేశంలో ఆర్థిక సరళీకరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తిగా.. పదేళ్లపాటు దేశ ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్‌ను బరాక్ ఒబామా అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి రాబర్ట్ గేట్స్‌తో పోల్చారు. ఇద్దరూ దయతో కూడిన నిష్పాక్షికత కలిగిన వారని, వారి చిత్తశుద్ధి, సమగ్రతలూ ఎన్నదగ్గ లక్షణాలని కొనియాడారు. కండల వీరుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు కండల వీరుడిని గుర్తుకు తెస్తాడని ఆయన శరీరాకృతి అద్భుతమని ఒబామా వ్యాఖ్యానించారు. షికాగో రాజకీయాల్లోని తెలివైన రాజకీయ నేతల మాదిరిగా పుతిన్ వ్యవహారం ఉంటుందని ఒబామా వర్ణించారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రష్యాతో సంబంధాలు అంత గొప్పగా లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. కొన్నిసార్లు కష్టమే అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గురించి మాజీ అధ్యక్షుడు, సహచర డెమోక్రాట్ అయిన బరాక్ ఒబామా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బైడెన్ మంచి మనిషి, నిజాయితీ కలవాడు అంటూనే.. కొన్నిసార్లు తనకు కావాల్సింది దక్కలేదు అనుకుంటే ఇబ్బందికరంగా మారగలగడని అన్నారు. తనకంటే తక్కువ వయసున్న బాస్‌తో (ఒబామా) వ్యవహరించేటప్పుడు ఈ నైజం మరింత ఎక్కువవుతుందని అన్నారు. ఒబామా అధ్యక్షుడిగా ఉండగా బైడెన్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. వైట్‌హౌస్‌లో నల్లవాడిని చూసి భయపడ్డారు అమెరికా అధ్యక్షుడిగా ఓ నల్లజాతీయుడు వైట్‌హౌ స్లో అడుగుపెట్టడం లక్షల మంది శ్వేతజాతీయుల కు భీతి కలిగించిందని, వీళ్లంతా రిపబ్లికన్ పార్టీలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న దుష్టశక్తులని ఒబామా తన పుస్తకంలో తెలిపారు. నల్లజాతీయుడి గా తనను వ్యతిరేకించిన వారు జినోఫోబియా (ఇతర జాతీయులపై తీవ్రమైన భయం)తో బాధపడే వారేనని, మేధావితనం అన్నా వీరికి అంతగా నచ్చదని, నిత్యం కుట్ర సిద్ధాంతాలను పట్టుకు వేళ్లాడేవారు, నల్లజాతి వారు ఇతరులపై ద్వేషం ఉన్న వారు తనను వైట్‌హౌస్‌లో ఓర్వలేక పోయారని ఒబామా వివరించారు. ఇలాంటి వారందరికీ డొనాల్డ్ ట్రంప్ అమృతాన్ని అందిస్తాన ని హామీ ఇచ్చి గద్దెనెక్కారని విమర్శించా రు. డొనాల్డ్ ట్రంప్ పదవి నుంచి వైదొలగినా అమెరికా రాజకీయాల్లోని విభేదాల అగాధాన్ని పూడ్చలేవని ఒబామా వ్యాఖ్యానించారు. అమెరికా అంటే ఏమిటి? అది ఎలా ఉండాలన్న భావనల విషయం లో మౌలికంగా ఉన్న అభిప్రాయ భేదాలు ఈ సంక్లిష్టపరిస్థితికి కారణమని.. దీనివల్ల ప్రజాస్వా మ్య వ్యవస్థ కూడా సంక్షోభంలో పడినట్లు కనిపిస్తోందని ఒబామా ప్రస్తుత రాజకీయ పరిస్థితి ని విశ్లేషించారు. రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇద్దరూ ఒకప్పుడు నమ్మకముంచిన వ్యవస్థలు, విలువలు, ప్రక్రియలపై నమ్మకం కోల్పోయేలా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమిలీ ముఖంలో ఏమీ కనిపించేది కాదు ఎన్నికల ప్రచారంలో భాగంగా అయోవాలోని తన సిబ్బందిలో ఒకరైన ఎమిలీ గురించి ఒబామా వ్యాఖ్యానిస్తూ... ‘‘ఎమిలీ ముందు నా వాక్చాతుర్యం, విమర్శలు మొత్తం కుప్పకూలిపోయేవి. కనురెప్ప వేయకుండా.. ఏ రకమైన భావం కనిపించకుండా ఎమిలీ చూపులు ఉండేవి. ఇక లాభం లేదనుకుని ఆమె ఏం చెబితే అది చేసేందుకు ప్రయత్నించేవాడిని’’అన్నారు. అంతేకాదు.. అలాస్కా గవర్నర్, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన సారా పాలిన్ ప్రభుత్వ పాలనకు సంబంధించి ఏం మాట్లాడేదో తనకు అస్సలు అర్థమయ్యేది కాదని ఒబామా వ్యాఖ్యానించారు. వైవాహిక జీవితంపై.. అధ్యక్షుడిగా తనపై అందరి దృష్టి ఉండటం..పదవి తాలూకూ ఒత్తిడి, విపరీతమైన భద్రత భార్య మిషెల్ ఒబామాకు నిస్పృహ కలిగించేదని బరాక్ ఒబామా తన పుస్తకంలో రాసుకున్నారు. తాము వైట్‌హౌస్ నాలుగు గోడల మధ్య బందీ అయిపోయామన్న భావన మిషెల్లో కనిపించేదని తెలిపారు. ‘‘జీవితంలో మిషెల్ ఎన్ని విజయాలు సాధించినా, ప్రాచుర్యం పొందినప్పటికీ ఆమెలో ఏదో తెలియని ఒక టెన్షన్ కనిపించేది. కంటికి కనిపించని యంత్రపు రొదలా ఉండేది ఆ టెన్షన్. రోజంతా పనిలో నిమగ్నమైన నా గురించో... కుటుంబం మొత్తమ్మీద వస్తున్న రాజకీయ విమర్శలో, కుటుంబ సభ్యులు కూడా తనకు రెండో ప్రాధాన్యత ఇస్తున్నారన్న భావనో ఉండేది’’ అని వివరించారు. ఎ ప్రామిస్డ్ ల్యాండ్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (2009 – 2017) రాసుకున్న జ్ఞాపకాల దొంతర ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో తన బాల్యంతోపాటు రాజకీయంగా ఎదిగిన వైనం వంటి పలు అంశాలు ఉన్నాయి. 2008లో అధ్యక్ష పదవి కోసం నడిపిన చారిత్రక ఎన్నికల ప్రచారం వివరాలు, అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ 768 పేజీల పుస్తకంలో పొందుపరిచారు. అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా ప్రస్థానాన్ని రెండు భాగాలుగా ప్రచురించనుంది. తొలి భాగమైన ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ నవంబర్ 17న విడుదల కానుంది. రెండో భాగం ప్రచురణ సమయం నిర్ణయించాల్సి ఉంది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాల పుస్తకాల కోసం దాదాపు రూ.485 కోట్లు చెల్లించినట్లు సమాచారం. వైట్‌హౌస్‌లో తన అనుభవాలన్నింటినీ మిషెల్ ఇప్పటికే ‘బికమింగ్’పేరుతో ప్రచురితమైన పుస్తకంలో వెల్లడించారు. మైక్రోఫోన్, జాక్స్ లేని ఫోన్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడిగా తనకు ఒకసారి బ్లాక్‌బెర్రీ ఫోన్ ఇచ్చారని, కానీ అందులో మైక్రోఫోన్, హెడ్‌ఫోన్ జాక్స్ రెండింటిని తొలగించిన తరువాతే తనకు ఇచ్చారని ఒబామా ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో తెలిపారు. ఆ ఫోన్ ద్వారా తాను భద్రతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించిన 20 మందితో మాట్లాడే సౌకర్యం ఉండేదని వివరించారు. మైక్రోఫోన్, హెడ్‌ఫోన్ జాక్స్ రెండూ లేకపోవడంతో పసిపిల్లలకు ఇచ్చే డమ్మీఫోన్ మాదిరిగా ఉండేదని సరదాగా వ్యాఖ్యానించారు. – సాక్షి, హైదరాబాద్ -
'గాయాలు బాధిస్తున్నాయి.. కానీ బతకాలనుంది'
-
'గాయాలు బాధిస్తున్నాయి.. కానీ బతకాలనుంది'
న్యూయార్క్ : 'ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది.. నా వీపుకు తగిలిన గాయాలు నన్ను బాధిస్తున్నాయి.. రోజులో ఉండే 24 గంటలు కేవలం నొప్పిని మాత్రమే గుర్తు చేస్తున్నాయి.. అయినా సరే నాకు బతకాలనిపిస్తుంది.. ఎందుకంటే నేను జీవితంలో సాధించాల్సి చాలా ఉంది.. అంటూ జాకబ్ బ్లాక్ అనే నల్ల జాతీయుడు షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అమెరికాలో జాతి వివక్ష గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని దశాబ్దాలుగా నల్లజాతీయులు అక్కడి తెల్ల జాతీయుల చేతిలో జాత్యంహకారానికి బలవుతూనే ఉన్నారు. జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం అమెరికాను అట్టుడికేలా చేసింది. ఇప్పటికి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా నల్ల జాతీయులపై దాడులు ఆగడం లేదు. (చదవండి : మరో నల్లజాతీయుడిని కాల్చి చంపిన పోలీసులు) ఇదే కోవలో ఆగస్టు 23న విస్కాన్సిన్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న కెనోషా అనే ప్రాంతంలో 29 ఏళ్ల జాకబ్ బ్లేక్స్ అనే వ్యక్తి ఇంటికి వెళదామని తన కారు దగ్గరకు వచ్చాడు. ఇంతలో తెల్లజాతీయులైన ఇద్దరు పోలీసులు వచ్చి జాకబ్ బ్లేక్‌ను అడ్డుకొని ఏదో అడిగారు. ఆ తర్వాత అతన్ని కిందపడేసి విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం తుపాకీతో ఏడు నుంచి ఎనిమిది బులెట్లను జాకబ్ వీపులోకి కాల్చారు. బులెట్ల దాటికి అతని శరీరం చిద్రమైంది. ఆ సమయంలో జాకబ్ ముగ్గురు పిల్లలు కారులోనే ఉన్నారు. క్షణాల్లో చోటుచేసుకున్న ఈ ఉదంతంతో అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. వెంటనే బ్లేక్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జాకబ్ బ్లేక్ కదల్లేని స్థితిలో పడి ఉన్నాడు. బులెట్ల దాటికి వీపు భాగం మొత్తం దెబ్బతింది. బ్లేక్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆసుపత్రి బెడ్‌పై నుంచే ప్రపంచానికి తన బాధను చెప్పుకోవాలని బ్లేక్ అనుకున్నాడు. డాక్టర్ల సహాయంతో తన మాటలను ఒక వీడియో రూపంలో విడుదల చేశాడు. 'నాకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది... 24 గంటలు నొప్పిని మాత్రమే చూస్తున్నా.. తిండి తినాపించడం లేదు.. నిద్ర రావడం లేదు.. జీవితం చాలా విలువైనది.. అందుకే నేను బతకాలి.. నా కుటుంబసభ్యులను కలుసుకోవాలి.. అందుకే ఒకటి చెప్పదలచుకున్నా.. మీ జీవితాలను మార్చుకోండి... ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేం.. బతికినంత కాలం డబ్బు సంపాధించడంతో పాటు మనుషులను ప్రేమించడం అలవాటు చేసుకోండి.. ఇవన్నీ ఇప్పుడు నేను అనుభవించే స్థితిలో లేను' అంటూఉద్వేగంతో చెప్పుకొచ్చాడు.(చదవండి : నావల్నీ విషప్రయోగం కేసుపై రష్యా స్పందన) జాకబ్ బ్లేక్ పలికిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బ్లేక్‌కు మద్దతుగా విస్కాన్సిన్ నగరంలో పౌరులు ఆందోళనలు చేస్తున్నారు. బ్లేక్‌కు న్యాయం జరగాలంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే జాకబ్‌ను కాల్చిన పోలీసులను విస్కాన్సిన్ సిటీ పోలీస్ విధుల నుంచి తొలగించింది. సస్పెండ్ చేస్తే చాలదని.. వారికి తగిన శిక్ష వేయాలంటూ అక్కడి ప్రజలు కోరుతున్నారు. -
'ఎన్గిడి... నిజంగా నువ్వు మూర్ఖుడివి'
జోహన్నెస్‌బర్గ్ : అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్షపై నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ హత్యోదంతం తర్వతా బ్లాక్ లైవ్స్ మేటర్ అంశంపై ప్రచారం విస్తృతంగా పెరిగింది. దీనిపై పలువురు వెస్టిండీస్ క్రికెటర్లు కూడా తమ గళం విప్పారు. క్రికెట్లోనూ వర్ణ వివక్ష ఎదుర్కొన్నామంటూ డారెన్ సామి, క్రిస్ గేల్, మైఖేల్ హోల్డింగ్ లాంటి ఆటగాళ్లు పేర్కొన్నారు. తాజాగా 'బ్లాక్ లైవ్స్ మేటర్' ఉద్యమానికి తాను మద్దతు ఇస్తానని దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ లుంగి ఎన్గిడి శుక్రవారం పేర్కొన్నాడు. ఎన్గిడి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్లో పెను దుమారాన్నే రేపుతున్నాయి.(అండర్సన్.. మొన్ననేగా పొగిడాం ఇంతలోనే) 'బ్లాక్ లైవ్స్ మేటర్‌కు నేను మద్దతు ఇస్తున్నా.. ఈ అంశంలో ఇతర ఆటగాళ్ల మద్దతు నాకు ఉంటుందనే ఆశిస్తున్నా. గడిచిన కొన్ని సంవత్సరాల్లో దక్షిణాఫ్రికాలోనూ జాత్యాహంకారం జరగుతుంది.. క్రికెట్లోనూ ఇది కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ లైవ్స్ మేటర్‌కు మా జట్టులోని ఆటగాళ్లు కూడా కలిసి వస్తారని ఆశిస్తున్నా’అని తెలిపాడు.' అయితే ఎన్గిడి వ్యాఖ్యలపై పలువురు మాజీ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. 'ఎన్గిడి నువ్వు నిజంగా మూర్ఖుడివి.. బ్లాక్ లైవ్స్ మేటర్‌కు మద్దతు ఇవ్వాలా వద్దా అనేది నీ ఇష్టం. నువ్వు మద్దతు ఇవ్వాలనుకుంటే ఇవ్వు. కానీ మొత్తం దక్షిణాఫ్రికా ప్రజలను ఇందులోకి లాగొద్దు.' అంటూ దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ పాట్ సిమ్‌కాక్స్ పేర్కొన్నాడు. ' బ్లాక్ లైవ్స్ మేటర్ ప్రచారం వెనుక రాజకీయ ఉద్యమం తప్ప మరొకటి లేదని నేను భావిస్తున్నా. ఎన్గిడి.. మద్దతు ఇచ్చే ముందు థామస్ సోవల్, లారీ ఎల్డర్, వాల్టర్ విలిమమ్స్ లాంటి తెల్లజాతి రైతులపై జరిగిన దారుణాలను గుర్తు తెచ్చుకోవాలి. ఈ విషయంలో నువ్వు సానుభూతి ప్రకటిస్తే బ్లాక్ లైవ్స్ మేటర్ ప్రచారంలో నేను నీతో పాటు వస్తా 'అంటూ మాజీ బ్యాట్స్‌మన్ బొటా డిప్పెనార్ తెలిపాడు. అయితే ఎన్గిడి వ్యాఖ్యలకు తాను మద్దతిస్తున్నట్లు విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి తెలిపాడు.' బ్లాక్ లైవ్స్ మేటర్ ప్రచారానికి ఎన్గిడి మద్దతివ్వడం చాలా సంతోషంగా ఉంది. నీ వెనుక ఎవరు లేకున్నా మేమంతా నీతోనే ఉన్నాం . ఈ విషయలంలో కలిసి పోరాడుదాం' అంటూ ట్విటర్లో పేర్కొన్నాడు. ఒకప్పుడు వర్ణ వివక్ష అన్న కారణంతోనే దక్షిణాఫ్రికా దశాబ్దాలకు పైగా క్రికెట్ ఆడలేదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.('ధోనికున్న మద్దతు కోహ్లికి లేదు..') -
జరిగిందేదో జరిగిపోయింది!
కింగ్స్టన్: నల్ల జాతీయుల పట్ల ఇప్పటి వరకు జరిగింది చాలని, ఇక నుంచైనా వారిని అందరితో సమానంగా గౌరవించాలని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో అన్నాడు. ఎన్నో ఏళ్లుగా వివక్షకు గురవుతోన్న నల్ల జాతీయులు ప్రతీకారం కోసం చూడట్లేదని, సమానత్వాన్ని కోరుకుంటున్నారని బ్రేవో పేర్కొన్నాడు. ‘వర్ణ వివక్ష విచారకరం. ఎన్నో ఏళ్లుగా జరుగుతోన్న అఘాయిత్యాల గురించి నల్ల జాతీయునిగా నాకు బాగా తెలుసు. కానీ వాటికి ప్రతీకారం కోరుకోవట్లేదు. మాకు కావల్సిందల్లా సమానత్వం, గౌరవం అంతే’ అని జింబాబ్వే మాజీ క్రికెటర్ పోమీ ఎంబాగ్వాతో ఇన్స్టాగ్రామ్ లైవ్ సందర్భంగా బ్రేవో వ్యాఖ్యానించాడు. విండీస్ తరఫున 40 టెస్టులు, 164 వన్డేలు, 71 టి20లు ఆడిన 36 ఏళ్ల బ్రేవో... నల్ల జాతీయులు కూడా మిగతా వారిలాగే శక్తివంతమైన, అందమైన వారని ప్రపంచం గుర్తించాలని కోరాడు. ‘సోదర సోదరీమణులను నేను కోరేదొక్కటే. నెల్సన్ మండేలా, మొహమ్మద్ అలీ, మైకేల్ జోర్డాన్ లాంటి గొప్ప వ్యక్తులు మాలోని వారే. మేం కూడా శక్తివంతులమనే విషయాన్ని ప్రపంచం గుర్తించాలి’ అని పేర్కొన్నాడు. -
‘ఫేస్బుక్’లో జాతి వివక్ష
శాన్ఫ్రాన్సిస్కో: సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ సంస్థలో వ్యక్తుల రంగు ఆధారంగా వివక్ష చూపుతున్నారని మాజీ ఉద్యోగి ఒకరు బహిరంగ లేఖ రాశారు. నల్ల జాతీయుల్ని ఉద్యోగంలో నియమించుకునేందుకు, తమ నెట్‌వర్క్‌లో చేర్చుకునేందుకు ఫేస్బుక్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని మార్క్ లూకీ అనే నల్లజాతీయుడు వెల్లడించారు. స్ట్రాటెజిక్ పార్ట్నర్ మేనేజర్‌గా ఆయన ఈ నెలలో రాజీనామా చేయడానికి ముందు ఈ లేఖను ఫేస్బుక్ ఉద్యోగులందరితో పంచుకున్నారు. సోషల్ నెట్‌వర్క్‌లో నల్ల జాతీయులే ఎంతో క్రియాశీలకంగా ఉంటున్నారని, సమాచార గోప్యతకు వారు చేస్తున్న ప్రయత్నాల్ని ఫేస్బుక్ పట్టించుకోవడం లేదని తెలిపారు. నల్ల జాతీయేతరుల మాటే చెల్లుబాటవుతోందని, వారు చెబితే విద్వేషపూరిత సమాచారం కాకున్నా ఆ ఖాతాలను నిలిపేస్తున్నారని ఆరోపించారు. అసలు నల్ల జాతీయులు తమ సంస్థలో పనిచేస్తున్న సంగతినే చాలా మంది ఉద్యోగులు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లూకీకి ఎదురైన అనుభవాలు అందరికీ వర్తించవని స్మిత్ అనే ఉద్యోగి పేర్కొన్నారు. లూకీ వ్యాఖ్యలపై స్పందించేందుకు ఫేస్బుక్ నిరాకరించింది. -
ఆ సంస్థ విమానాలు ఎక్కడం మానేయండి!
జాతి వివక్ష ఎక్కడ ఉన్న తప్పుబట్టాల్సిందే. జాత్యహంకారం ఈ మధ్య కాలంలో మితి మీరిపోతోంది. తాజాగా జాత్యాహంకారాన్ని ప్రదర్శించిన బ్రిటీష్ ఎయిర్వేస్ సంస్థపై బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ మండిపడ్డారు. తనకు గతంలో జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘లండన్ విమాన ఘటన గురించి తెలుసుకుని నేను చాలా బాధపడ్డాను. విమానంలోని భారతీయుల్ని దించేయడం సరికాదు. ఇది జాతి వివక్షే. గతంలో నేను ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినప్పటికీ.. రెండు సార్లు బ్రిటిష్ ఎయిర్ వేస్ క్యాబిన్ క్రూ సిబ్బంది నాతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆ సంస్థ విమానాలను ఎక్కడం మానేశాను. మనకు గౌరవం ఇవ్వని ఇలాంటి విమానాలను ఇకపై ఎక్కడం మానేయండి. జెట్ ఎయిర్ లేదా ఎమిరేట్స్ విమానాల్లో ప్రయాణించండి. అక్కడ గౌరవం దక్కుతుంది’ అని ట్వీట్ చేశారు. జూలైలో ఓ ఇండియన్ ఫ్యామిలీ లండన్ నుంచి బెర్లిన్‌కు వెళ్లడానికి బ్రిటీష్ ఎయిర్వేస్ సర్వీస్ విమానంలో టికెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే ఆ ఫ్యామిలీలో ఉన్న చిన్న బాలుడు ఏడ్వడంతో అక్కడి సిబ్బంధి వారిని దూషించి అక్కడే దించేశారు. ఈ ఘటనపై కేంద్ర విమానయాన శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై రిషీ కపూర్ పైవిధంగా స్పందించారు. Racist. Dont fly British Airways.We cannot be kicked around. Sad to hear about the Berlin child incident. I stopped flying BA after the cabin crew were rude and had attitude not once but twice even after being a first class passenger. Fly Jetair or Emirates. There is dignity. — Rishi Kapoor (@chintskap) August 9, 2018 -
నీ దేశం పో.. నీ పిల్లల్ని చంపేస్తా!
టొరంటో: కెనడాలో భారత సంతతి జంట జాతి వివక్ష వేధింపులకు గురైంది. ఆదివారం ఒంటారియోలోని ఓ షాపింగ్‌మాల్ వద్ద పార్కింగ్ విషయంలో భారత జంటతో 47 ఏళ్ల డేల్ రాబర్డ్‌సన్ గొడవకు దిగాడు. పార్కింగ్ స్థలానికి వస్తుండగా వారికెదురుగా ట్రక్కులో రాబర్ట్సన్ దూసుకొచ్చాడు. అతనితో మాట్లాడేందుకు భారతీయుడు ప్రయత్నించగా, రాబర్ట్సన్ అతని భార్య మీదికి వాహనంతో దూసుకెళ్లాడు. ట్రక్కు కదులుతుండగానే భారతీయుడు దాన్ని అనుసరిస్తూ..‘నేను స్వదేశం పోవాలని అనుకుంటున్నావా? నేనూ కెనడా పౌరుడినే’ అని అన్నాడు. దీనికి రాబర్ట్సన్ స్పందిస్తూ.. ‘ఏదీ నిరూపించు. నీ మాటలు నమ్మను’ అని అతని ఆంగ్ల భాష ఉచ్ఛారణను వ్యంగ్యంగా అనుకరిస్తూ ‘మీరు కెనడా వ్యక్తి మాదిరిగా మాట్లాడలేరు. నేను ఇతర జాతి వారిని ద్వేషిస్తాను. నాకు నీవు నచ్చలే, ఆమె నచ్చలే. నీ దేశంపో.. లేకపోతే మీ పిల్లలను చంపేస్తా’ అని దుర్భాషలాడాడు. ఈ ఘటనను భారతీయుడి భార్య వీడియో తీసి యూట్యూ బ్, ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. బాధిత జంట వివరాలు వెల్లడికాలేదు. పోలీసులు విద్వేష నేరంగా పరిగణించి విచారణ ప్రారంభించారు. -
భారతీయ అమెరికన్లపై వివక్ష
న్యూయార్క్: యూఎస్ఏలో ఉండే భారతీయ అమెరికన్లు నిత్యం జాతి వివక్షకు గురవుతున్నట్లు తేలింది. ఆసియా–అమెరికన్ల జీవనంపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ‘అమెరికాలో వివక్ష’ అంశంపై నేషనల్ పబ్లిక్ రేడియో, రాబర్ట్ వుడ్ జాన్సన్ ఫౌండేషన్, హార్వర్డ్ టీహెచ్ చాన్ పబ్లిక్ హెల్త్ స్కూల్ కలిసి చేపట్టిన సర్వే ఫలితాలను ఇటీవల విడుదల చేశారు. ఈ సర్వేలో పాల్గొన్న ఆసియన్ అమెరికన్లు... తమను గానీ తమ కుటుంబసభ్యులను గానీ పోలీసులు అనవసరంగా ఆపి ప్రశ్నలతో వేధించటం, వివక్ష చూపటం వంటివి నిత్యకృత్యంగా మారాయని తెలిపారు. ఈ విషయంలో చైనీస్ అమెరికన్ల కంటే కూడా భారతీయ సంతతి వారే ఎక్కువగా వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడయింది. రెండు శాతం మంది చైనీస్ అమెరికన్లు మాత్రమే పోలీసులు తమపై వివక్ష చూపుతున్నట్లు తెలపగా, పోలీసులు మార్గమధ్యలో అనవసరంగా ఆపటం, ప్రశ్నలతో వేధించటం వంటివి చేస్తున్నట్లు 17% మంది భారతీయ సంతతి వారు చెప్పారు. -
అమెరికా అంతటా వివక్షే!
ఇండియాలో మాదిరిగానే అమెరికాలో కూడా దైనందిన జీవితంలోని అనేర రంగాల్లో తాము వివక్ష ఎదర్కుంటున్నామని అన్ని జాతుల్లోనూ అత్యధిక ప్రజానీకం వాపోతోంది. అగ్రరాజ్యానికి చెందిన ప్రఖ్యాత నేషనల్ పబ్లిక్ రేడియో (ఎన్పీఆర్), రాబర్ట్‌వుడ్ జాన్సన్ ఫౌండేషన్, హార్వర్డ్ యూనివర్సిటీ టీహెచ్ చాన్ స్కూలాఫ్ పబ్లిక్ హెల్త్ సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దేశంలో 70 శాతం జనాభాతోపాటు దాదాపు అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న తెల్లజాతివారు (వైట్స్) సైతం తమపై వివక్ష ఉందని చెప్పారు. శ్వేతజాతీయుల్లో 55 శాతం ‘అమెరికాలో తెల్లజాతివారికి కూడా వివక్ష ఎదురౌతోంది’ అని తెలిపారు. ఉద్యోగం చేసే ప్రదేశం నుంచి ఆస్పత్రి వరకూ తాము ఫలానా జాతివారమనే కారణంగా ఎదర్కుంటున్న అన్యాయం, వివక్షపై జనం అనుభవాలపై ఈ సర్వేలో అనేక ప్రశ్నలడిగారు. శ్వేతజాతీయులు, నల్లజాతివారు, లాటినోలు(స్పానిష్ భాష మాట్లాడే హిస్పానిక్‌లు), ఆసియన్ అమెరికన్లు, స్థానిక అమెరికన్లు(రెడ్ ఇండియన్లు), ఎల్జీబీటీక్యూలుగా గుర్తింపు పొందిన వారిని ఈ సర్వేలో ప్రశ్నించారు. కిందటి జనవరి 26 నుంచి ఏప్రిల్ 9 వరకూ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 3,453 మంది తమ అనుభవాలు వెల్లడించారు. మొదట ఆఫ్రికన్ అమెరికన్ల(నల్లజాతివారు) అనుభవాలపై మంగళవారం ఈ సర్వే ఫలితాలు ప్రకటించారు. అమెరికా వచ్చినప్పటి నుంచీ నల్లవారికి వివక్షే! తమ జాతివారు ఆఫ్రికాఖండం నుంచి అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుంచీ తరతరాలుగా అత్యధికస్థాయిలో సమాజంలో జాతి వివక్ష ఎదుర్కొన్నామని 802 మంది చెప్పారు. పోలీసులతో వ్యవహారాలు, ఉద్యోగం కోసం దరఖాస్తు, ప్రమోషన్‌కు అభ్యర్థన, అపార్ట్మెంట్లలో అద్దెకు దిగడం, ఇళ్ల కొనుగోలు, వైద్యశాలలో డాక్టర్‌ను చూడడం వంటి నిజ జీవితంలోని ప్రధాన సందర్భాల్లో తాము తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని వారు వాపోయారు. పోలీసులు తమపై వివక్ష చూపారని 57 శాతం నల్లజాతి పురుషులు తెలిపారు. అద్దె ఇళ్లు సంపాదించడం, గృహాల కొనుగోలులో తమకు సమానావకాశాలు లేవని 54 శాతం నల్లజాతి పురుషులు చెప్పారు. ఓటేసే విషయంలో, రాజకీయాల్లో పాల్గొనే సందర్భాల్లో కూడా వివక్ష ఉందని 19 శాతం ఆఫ్రికన్ అమెరికన్లే అభిప్రాయపడ్డారు. డాక్టర్‌ను కలవడానికి లేదా ఆస్పత్రికి వెళ్లినప్పుడు తాము వ్యక్తిగతంగా జాత వివక్ష చవిచూశామని ఈ సర్వేలో పాల్గొన్న నల్లజాతీయుల్లో మూడో వంతు(32శాతం) చెప్పగా, తమను సరిగ్గా చూడరనీ, సవ్యమైన చికిత్స అందదనే భయంతో దవాఖానేకే తాము పోవడంలేదని 22 శాతం మంది తెలిపారు. తాము నల్లజాతివారమనే కారణంగా తమను, తమ కుటుంబసభ్యులను పోలీసులు అన్యాయంగా ఆపి, దౌర్జన్యం చేయడం సర్వసాధారణమని 60 శాతం మంది ఈ సర్వేలో తెలిపారు. ఒకే రకమైన సందర్భంలో తెల్లజాతివారిపై చేయిచేసుకోని పోలీసులు ఆఫ్రికన్ అమెరికన్లపై మాత్రం బలప్రయోగం చేసే అవకాశాలెక్కువని 61 శాతం అభిప్రాయపడ్డారు. నల్లజాతివారు ఎక్కువమంది ఉండే ప్రాంతాల్లోనే వివక్ష ఎక్కువ! శ్వేతజాతీయుల మధ్య స్పల్ప సంఖ్యలో బతికే నల్లజాతివారు తక్కువ వివక్షకు గురవుతుండగా, ‘బ్లాక్’ మెజారిటీ ప్రాంతాల్లో వారు ఎక్కువ అన్యాయాన్ని, అణచివేతను రుచిచూస్తున్నారు. దేశంలో 64 శాతం నల్లవారు ఇతర జాతులు అత్యధిక సంఖ్యలో ఉండే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అంటే వారికి వివక్ష తక్కువే. నల్లజాతివారు మెజారిటీగా ఉన్న వాడల్లో వారికి అవసరమైన సందర్భాల్లో సైతం వివక్ష తప్పదనే భయంతో పోలీసులను పిలవడం లేదని 31 శాతం మంది చెప్పారు. నల్లజాతివారు అత్యధిక సంఖ్యలో నివసించే ప్రాంతాల్లో విద్యా బోధనలో నాణ్యత తక్కువని ఈ సర్వే చేసినవారికి 45 శాతం చెప్పారు. సమాజంలో జాతి వివక్ష వల్ల రోజూ అమెరికాలో 200 మందికి పైగా నల్లజాతివారు వృద్ధాప్యానికి ముందే మరణిస్తున్నారని వైద్యసేవల్లో జాతుల మధ్య అసమానతలపై అధ్యయనం చేసిన హార్వర్డ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డేవిడ్ విలియమ్స్ చెప్పారు. ఈ సర్వే ఫలితంగా తాము సమస్యల పరిష్కారానికి ఎక్కడెక్కడ చర్యలు తీసుకోవాలో తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా..?
-
డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
-
మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా?
-
మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా?
మనది అమెరికానేనా.. మనం అమెరికాకు చెందిన వాళ్లమా? ఇక్కడ మనకు భద్రత ఉందా?.. ఇవి కన్సాస్‌లో శ్వేతజాతి ఉన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కూచిభోట్ల భార్య సునయన దుమల అడిగిన ప్రశ్నలు. అమెరికాలో చోటుచేసుకున్న విద్వేష కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కూచిభోట్ల ఉద్యోగం చేసే గార్మిన్ కంపెనీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన భార్య సునయన మాట్లాడారు. అమెరికాలో జరుగుతున్న కాల్పుల ఘటనలు తనను ఆందోళనకు గురిచేశాని, ఒకదశలో ఈ దేశంలో మనం ఉండగలమా? అని తన భర్తని అడిగితే.. ఏం కాదు అమెరికాలో మంచి రోజులు వస్తాయని ఆయన చెప్పేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. అమెరికాలో మైనారిటీలు, విదేశీయులపట్ల వివక్ష చూపుతున్న ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయని, మేం ఇక్కడి వాళ్లమేనా? అన్న సందేహాలు కలిగిస్తున్నాయని ఆమె అన్నారు. ఇప్పటికైనా ఈ విద్వేష నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అని ఆమె ప్రశ్నించారు. విద్వేష దారుణాలపై అమెరికా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన భర్తకు ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాకు వెళ్లిపోదామని తాను గతంలో ఎన్నోసార్లు చెప్పినా తన భర్త ఒప్పుకోలేదని ఆమె అన్నారు. ఇంత జరిగాక, ఇంకా అమెరికాలో ఉండటం అవసరమా? అని ఆమె వ్యాఖ్యానించారు. తమకు పిల్లలు కూడా లేరని, తన భర్త జ్ఞాపకాలే ఇప్పుడు తమకు మిగిలాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి ఆదుకునేందుకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది. హుస్టన్‌లోని భారత కౌన్సెల్ జనరల్ అనుపమ రాయ్ ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. శ్రీనివాస్ కుటుంబానికి అన్ని విధాల సాయం చేసేందుకు కృషి చేస్తున్నారు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఓ శ్వేతజాతి ఉన్మాది జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది\ -
డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
వాషింగ్టన్: అమెరికాలో విద్వేషపూరితంగా విదేశీయులపై తూటాలు పేలుతున్నా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు ఏ మాత్రం మారలేదు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆవేశంతో యూఎస్ నేవీ మాజీ ఉద్యోగి జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్ మరణించిన మరుసటిరోజు ట్రంప్ మరింత దురుసుగా ప్రవర్తించారు. కన్సర్వేటీవ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ)లో పాల్గొన్న ట్రంప్ ప్రసంగిస్తూ.. తానేమీ ప్రపంచానికి ప్రతినిధిని కాదని, కేవలం అమెరికాకు మాత్రమే అధ్యక్షుడిని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గన్ ఓనర్షిప్ రైట్స్ కోసం చర్యలు తీసుకుంటానని, అమెరికా పౌరుల రక్షణ కోసం పాటు పడతానని, అమెరికన్లకే ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సందర్భంగా ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. అయితే ట్రంప్ గానీ, వైట్ హౌస్ గానీ కన్సాస్ కాల్పుల ఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 'ప్రపంచమంతటా అన్ని దేశాలకూ కలిసి ఒకే గీతం ఉందా.. అదే విధంగా ఒకే రకమైన కరెన్సీ ఉందా.. ఒకే జెండా లాంటివి ఉన్నాయా' అని ట్రంప్ ప్రశ్నించారు. చికాగోలోని పలు ప్రాంతాల్లో తుపాకీ కాల్పుల్లో ఏడుగురు మృతిచెందడంపై ట్రంప్ ట్విట్టర్లో స్పందించారు. వారి మృతిపట్ల సంతాపం ప్రకటించారు. 'అసలు చికాగోలో ఏం జరుగుతుంది. పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. చికాగోకు ఇప్పుడు సహాయం అవసరం' అని ట్రంప్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ట్రంప్.. ఇతర దేశస్తులను అమెరికా నుంచి వెల్లగొట్టేందకు సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకుంటూ విదేశీయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ట్రావెల్ బ్యాన్, వీసా రూల్స్, జాబ్ రూల్స్ అంటూ ఏదో రకంగా విదేశీయులను వారి స్వస్తలాలకు పంపించేసి.. దేశ పౌరులతోనే అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశీయులపై ఎలాంటి దాడులు జరిగినా పట్టించుకునే ప్రసక్తే లేదని, కేవలం అమెరికా ప్రజల కోరకు మాత్రమే తాను పని చేయనున్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్థానికంగానూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. (జాతి వివక్షకు 'అధికారం' తోడైతే..) (‘కూచిబొట్ల’కు కొండంత అండ) శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట -
అమెరికాలో మళ్లీ విద్వేషపు తూటా పేలింది
-
విద్వేషపు తూటా!
- అమెరికాలో కాల్పుల ఉదంతం.. జాతి వివక్ష కోణంలో ఎఫ్‌బీఐ దర్యాప్తు - మృతుడు శ్రీనివాస్, గాయపడ్డ అలోక్‌రెడ్డి ఇద్దరూ హైదరాబాదీలే - తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ అమెరికన్ ఘాతుకం - వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలు - కాల్పులు జరిపిన పూరింటన్ అరెస్ట్.. నేవీ మాజీ ఉద్యోగిగా గుర్తింపు - విషాదంలో మునిగిపోయిన శ్రీనివాస్ కుటుంబం - ఘటనపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ దిగ్భ్రాంతి.. ‘మా ఉద్యోగాలు మాకే..’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో ఇచ్చిన నినాదం వెర్రితలలు వేస్తోందా? గద్దెనెక్కాక ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు అమెరికాలో జాత్యహంకార భావజాలానికి మరింత ఊతమిస్తున్నాయా? కన్సాస్‌లో ఇద్దరు తెలుగు ఇంజనీర్లపై జరిగిన కాల్పుల ఘటన చూస్తుంటే ఇది నిజమేనని అన్పిస్తోంది! బార్లోకి వచ్చిన అమెరికన్.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ ఇంజనీర్లపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో అమెరికాలో ఉంటున్న భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హ్యూస్టన్/వాషింగ్టన్/హన్మకొండ/ సాక్షి, హైదరాబాద్: అమెరికాలో మళ్లీ విద్వేషపు తూటా పేలింది. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఆడమ్ పూరింటన్ అనే ఓ శ్వేతజాతి ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల అనే ఇంజనీర్‌ను పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. కాల్పులు జరిపిన పూరింటన్ అమెరికా నేవీ మాజీ ఉద్యోగి అని గుర్తించారు. ఘటన జరిగిన 5 గంటల్లోనే మిస్సోరి ప్రాంతంలోని ఓ బార్లో అతడిని అరెస్టు చేశారు. మీరు నాకంటే ఎక్కువా..? హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్, మేడసాని అలోక్‌రెడ్డి అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలో ఉన్న ఓవర్‌ల్యాండ్ పార్క్‌లో నివసిస్తున్నారు. జీపీఎస్ వ్యవస్థలను తయారు చేసే గార్నిమ్ అనే సంస్థలో ఉద్యోగం నిర్వస్తున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఇద్దరూ కలసి బుధవారం రాత్రి అక్కడి ఒథాలే ప్రాంతంలోని ఆస్టిన్స్ బార్‌కు వెళ్లారు. కొంతసేపటి తర్వాత çపూరింటన్ అనే అమెరికన్ వారి వద్దకు వచ్చి వాదనకు దిగాడు. తాము (అమెరికన్లు) మేధావులమేనని, తమకు ప్రతిభ ఉన్నా విదేశాల వారి కారణంగా తమకు ఉద్యోగాలు రావట్లేదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘మీరు మా ఉద్యోగాలను కాజేస్తున్నారు. తక్షణం అమెరికా విడిచివెళ్లిపోండి. ఉగ్రవాదులు.. మీరు నాకంటే ఎలా ఎక్కువ? అమెరికాలో ఎందుకుంటున్నారు, ఏం చేస్తున్నారు..’అంటూ గొడవకు దిగాడు. దీంతో శ్రీనివాస్, అలోక్‌రెడ్డిలు బార్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడికి వచ్చిన బార్ మేనేజర్, సిబ్బంది పూరింటన్‌ను బయటికి పంపేశారు. కొద్దిసేపటికే తిరిగొచ్చి.. బార్ నుంచి బయటికి వెళ్లగొట్టినా.. పూరింటన్ కొద్దిసేపటికి తుపాకీతో తిరిగి వచ్చాడు. ‘మా దేశం విడిచి వెళ్లిపోండి.. ఉగ్రవాదులారా..’ అని అరుస్తూ శ్రీనివాస్, అలోక్‌రెడ్డిలపై కాల్పులు జరిపాడు. శ్రీనివాస్ ఛాతీలో బుల్లెట్ దిగడంతో అక్కడే కుప్ప కూలిపోయారు. అలోక్‌కి తొడ భాగంలో తూటా దూసుకుపోయింది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఇయాన్ గ్రిలట్ అనే మరో అమెరికన్.. పూరింటన్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో అతడి చేతిపై బుల్లెట్ గాయమైంది. వారందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించగా.. శ్రీనివాస్ అప్పటికే మరణించారు. అలోక్‌రెడ్డి, ఇయాన్ గ్రిలట్‌లు చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక జాతి, మత విద్వేష నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ కాల్పుల ఘటన భారతీయ అమెరికన్లలో భయాందోళన నింపుతోంది. కాగా.. తమ ఏవియేషన్ ఇంజనీరింగ్ టీమ్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్ కాల్పుల్లో మృతిచెందడం, అలోక్ గాయపడ్డం తమను కలచివేసిందని గార్మిన్ కంపెనీ తెలిపింది. 1.చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న అలోక్‌రెడ్డి 2.కుమారుడి మరణవార్త తెలిసి విలపిస్తున్న శ్రీనివాస్ తల్లిదండ్రులు 3.శ్రీనివాస్, అలోక్రెడ్డిపై కాల్పులు జరిగింది ఈ బార్లోనే.. శ్రీనివాస్ కుటుంబానికి వెల్లువలా సాయం.. శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సహాయం చేసేందుకు చాలా మంది ముందుకొచ్చారు. ఆయన స్నేహితురాలు కవిప్రియ మథురమాలింగం సోషల్ మీడియాలో ఏర్పాటు చేసిన ‘గోఫండ్‌మి’పేజీ ద్వారా పలువురు అమెరికన్లు సహా దాదాపు 7,200 మంది 2,61,996 డాలర్ల (సుమారు రూ.కోటి 80 లక్షలు) సాయం అందించారు. శ్రీనివాస్ స్నేహశీలి అని, ఎవరినీ పల్లెత్తుమాట అనేవాడు కాదని అమెరికాలో ఆయన ఇంటి పొరుగువారు చెప్పారు. 1. ప్రణీత్ నేచర్స్ బౌంటీలోని శ్రీనివాస్ నివాసం 2. ఆర్కేపురంలోని అలోక్‌రెడ్డి నివాసం పదేళ్ల కింద అమెరికా వెళ్లి.. అమెరికాలో మరణించిన శ్రీనివాస్ తండ్రి కూచిభొట్ల మధుసూదనరావు ఐడీపీఎల్ విశ్రాంత ఉద్యోగి. వారు ఐదేళ్లుగా హైదరాబాద్ శివార్లలోని బాచుపల్లి మల్లంపేట గ్రామ పరిధిలో ఉన్న ప్రణీత్ నేచర్స్ బౌంటీ ఫేజ్–1లో నివసిస్తున్నారు. వారికి శ్రీనివాస్ తోపాటు పరశురామశాస్త్రి, సాయి కిశోర్ సంతానం. పరశు రామశాస్త్రి హైదరాబాద్‌లోనే స్థిరపడగా.. శ్రీనివాస్, సాయి కిశోర్ అమెరికాలో ఉంటున్నారు. శ్రీనివాస్ హైదరాబాద్ శివార్లలోని విద్యా జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీ రింగ్ చదివారు. పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేశారు. తొలుత అమెరికాలోని రాక్వెల్ కొలిన్స్ సంస్థలో సిస్టమ్స్ ఇంజనీర్‌గా పనిచేసి.. అనంతరం గార్నిమ్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరారు. శ్రీనివాస్‌కు నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కే చెందిన సునయనతో వివాహం జరిగింది. వారికి ఇంకా సంతానం లేదు. శ్రీనివాస్ మరణవార్త విని వారి కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. స్నేహితుడితో కలసి.. అమెరికన్ కాల్పుల్లో గాయపడిన అలోక్ కుటుంబం హైదరాబాద్‌లోని చైతన్యపురి పరిధిలో ఉన్న ఆర్కే పురంలో నివసిస్తోంది. ఆయన తండ్రి మేడసాని జగన్మోహన్రెడ్డి, తల్లి రేణుక. వీరి స్వస్థలం వరంగల్ జిల్లా హన్మకొండలోని అడ్వొకేట్స్ కాలనీ. పదేళ్లుగా వారి కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటోం ది. మిషన్ భగీరథ ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జగన్మోహన్రెడ్డికి ఇద్దరు కుమారులు అలోక్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి. అలోక్‌రెడ్డి హైదరాబాద్ లోని వాసవి కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూని కేషన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2006లో అమెరికా వెళ్లి మాస్టర్స్ డిగ్రీ చేశారు. శ్రీనివాస్‌తో కలసి రాక్వెల్ కొలిన్స్ సంస్థలో పనిచేసిన ఆయన.. తర్వాత శ్రీనివాస్ మాదిరిగానే గార్నిమ్ సంస్థలో చేరారు. ప్రస్తుతం కో–ఆర్డినేటర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలోక్రెడ్డికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య దీప్తి అమెరికాలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ప్రస్తుతం గర్భవతి. ఐదు గంటల్లోనే దుండగుడు అరెస్ట్.. ఎఫ్‌బీఐ దర్యాప్తు శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్‌రెడ్డిలపై కాల్పులు జరిపిన జాత్యహంకారి పూరింటన్ (51)ను అమెరికా పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. పూరింటన్‌పై హత్య (ఫస్ట్ డిగ్రీ మర్డర్), హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. కాల్పుల ఘటన జరిగిన తర్వాత ఐదు గంటల్లోనే దుండగుడిని పట్టుకోవడం గమనార్హం. కాల్పుల ఘటన తర్వాత మిస్సోరీలోని క్లింటన్లో ఉన్న ఓ బార్లో దాక్కున్న పూరింటన్ తాను తూర్పుఆసియా వాసులిద్దరిని చంపానని అక్కడి ఉద్యోగితో చెప్పాడని అమెరికన్ స్థానిక మీడియా పేర్కొంది. కాల్పుల ఘటనపై అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) కూడా దర్యాప్తు చేపట్టింది. ఈ ఘటన వెనుక జాతి వివక్ష కోణం ఉందా, లేదా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నామని కన్సాస్ నగరంలోని ఎఫ్‌బీఐ ప్రతినిధి ఎరిక్ జాక్స్ వెల్లడించారు. ఈ దుర్ఘటన జరిగిన బార్‌ను నిరవధికంగా మూసివేశారు. దుండగుడు అమెరికన్ నేవీ మాజీ ఉద్యోగి! కాల్పులు జరిపిన పూరింటన్ అమెరికా నావికాదళం మాజీ ఉద్యోగి అని స్థానిక మీడియా వెల్లడించింది. అతడి వద్ద పైలట్ లైసెన్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయని తెలిపింది. అతను ఒథాలేలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా పనిచేశాడని, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ పనిచేసి 2010లో బయటికొచ్చాడని పేర్కొంది. మానవత్వమున్న మనిషిని.. దుండగుడిని అడ్డుకున్న అమెరికన్‌పై ప్రశంసలు కాల్పులు జరిపిన పూరింటన్‌ను ప్రాణాలకు తెగించి అడ్డుకున్న 24 ఏళ్ల అమెరికన్ యువకుడు ఇయాన్ గ్రిలట్‌కు ప్రశంసలు లభిస్తున్నా యి. ఒక అమెరికన్ జాతి విద్వేషంతో కాల్పులు జరపగా.. మరో అమెరికన్ మానవత్వంతో అడ్డుకోవడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. పూరింటన్ కాల్పులు మొదలుపెట్టడంతో టేబుల్ వెనక దాక్కున్న గ్రిలట్.. ఒక్కసారిగా విసురుగా వెళ్లి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడు అతడిపైనా కాల్పులు జరపడంతో.. గ్రిలట్ చేతి గుండా ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆస్పత్రిలో గ్రిలట్‌ను యూనివర్సిటీ ఆఫ్ కన్సాస్ హెల్త్ సిస్టమ్ ఇంటర్వూ్య చేసింది. అందు లో.. ‘సాటి మనిషి కోసం నేనేం చేయాలో అదే చేశాను. అతడు (బాధితుడు) ఎక్కడి వాడు, ఏ జాతి వాడదన్నది ముఖ్యం కాదు. మనమంతా మనుషులం. దుండగుడు మరొకరి వైపు వెళ్లకుండా ఏం చేయాలో అది చేశాను’ అని గ్రిలట్ పేర్కొన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటాం: కాల్పుల ఘటనపై సుష్మ దిగ్భ్రాంతి సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో తెలుగువారిపై జాతి విద్వేష కాల్పుల పట్ల విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ సర్నాతో మాట్లాడానని, అక్కడి అధికారులు కన్సాస్‌కు చేరుకున్నారని ట్విటర్లో పేర్కొన్నారు. శ్రీనివాస్ భౌతిక కాయాన్ని హైదరాబాద్‌కు చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. కన్సాస్‌లో కాల్పులను ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఖండించింది. ఈ ఘటనపై అమెరికా దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని రాయబార కార్యాలయ అధికారి మ్యారికే కార్లసన్∙ పేర్కొన్నారు. కాగా, అమెరికాలో జాత్యహంకార దాడుల పట్ల సీపీఐ ఆందోళన వ్యక్తం చేసింది. జాత్యహంకారం, ట్రంప్ విధానాలపై పోరాడాలని అమెరికాలోని ప్రజాస్వామ్య శక్తులకు విన్నవించింది. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని కన్సాస్‌లో దుండగుడు ఇద్దరు తెలుగు విద్యార్థులపై కాల్పులు జరపడం, ఈ ఘటనలో ఒకరు మరణించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కాల్పుల ఘటనలో శ్రీనివాస్ కూచిభొట్ల అనే విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అలోక్ మేడసాని అనే విద్యార్థి గాయపడ్డారు. కన్సాస్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అలోక్‌కు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలి: కృష్ణమోహన్, శ్రీనివాస్ బంధువు ‘‘ఇప్పటికే అమెరికాలో నలుగురు జాత్యహంకార దాడుల్లో చనిపోయారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలి. శ్రీనివాస్ మృతదేహాన్ని మూడు, నాలుగు రోజుల్లో రప్పించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారు..’’ తెలుగు ప్రజలు కలసికట్టుగా ఉండాలి: జగన్మోహన్రెడ్డి, అలోక్‌రెడ్డి తండ్రి ‘‘అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలంతా కలసికట్టుగా ఉండాలి. అమెరికా వాళ్లు పిచ్చివాళ్లలా మారిపోతున్నారు. ఏ విషయమైనా వారితో వాదించవద్దు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. భారత యువత పునరాలోచన చేసుకుని స్వదేశానికి తిరిగి రావాలి..’’ సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. (జాతి వివక్షకు 'అధికారం' తోడైతే..) (‘కూచిబొట్ల’కు కొండంత అండ) శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట -
యువరాజ్ సింగ్, హజల్ కీచ్ ఆగ్రహం
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్, అతడికి కాబోయే భార్య హజల్ కీచ్ కు కోపం వచ్చింది. జాతి వివక్ష చూపారని ఆరోపిస్తూ వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ కంపెనీ ఉద్యోగిపై విరుచుకుపడ్డారు. పియూష్ శర్మ అనే ఉద్యోగి తన పట్ల జాతివివక్ష చూపించాడని హజల్ కీచ్ ట్విట్టర్ లో వెల్లడించింది. తన పేరు హిందూ మతానికి సంబంధించింది కాదన్న సాకుతో తనకు డబ్బు ఇచ్చేందుకు అతడు నిరాకరించాడని తెలిపింది. ‘నేను కలిసిన వారిలో జైపూర్ లోని వెస్ట్రన్ యూనియన్ మనీ సంస్థలో పనిచేస్తున్న పియూష్ శర్మ అత్యంత జాతివివక్ష కలిగిన వ్యక్తి. నా పేరు హిందూ మతానికి చెందినది కాదన్న కారణంతో నాకు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన నాకు బాధ కలిగించింది. హిందువైన నా తల్లి, నా ముస్లిం ఫ్రెండ్ ఎదురుగా నన్ను అమానించాడు. నా పేరు హజల్ కీచ్. నేను హిందువుగా పుట్టి పెరిగాను. కానీ సమస్య అదికాదు. పేరు చూసి వెస్ట్రన్ యూనియన్ మనీ సంస్థ వివక్ష చూపిస్తుందా’ అని ప్రశ్నించారు. యువరాజ్ సింగ్ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించాడు. ’పియూష్ శర్మ ప్రవర్తన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మనుషులుగా మనమంతా జాతివివక్షను సహించకూడదు. శర్మపై వెస్ట్రన్ యూనియన్ మనీ కఠిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాన’ని యువరాజ్ ట్వీట్ చేశాడు. గతేడాది నవంబర్ లో యువీ-కీచ్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. Mr Peeyush Sharma @WesternUnion in Jaipur is the most racist person ive met and refused to give money because my name is not "Hindu" enough — Hazel Keech (@hazelkeech) 30 August 2016 Im sickened by the attitude of these people,in front of my HINDU mother + my muslim friend @1NS1A #outrage #racism https://t.co/Rq7eIyEcWG — Hazel Keech (@hazelkeech) 30 August 2016 My name is Hazel Keech. i am Hindu born/raise. But why does dat matter at @WesternUnion whether2 give me money or no https://t.co/jF7XIzm6Yu — Hazel Keech (@hazelkeech) 30 August 2016 shocking behaviour this is @WesternUnion We all are human beings is that not enough racial discrimination will not be tolerated @hazelkeech — yuvraj singh (@YUVSTRONG12) 30 August 2016 Mr Piyush Sharma @WesternUnion in Jaipur this behaviour will not be tolerated,we would expect some serious action to be taken against him ! — yuvraj singh (@YUVSTRONG12) 30 August 2016 -
తెల్లరేగడిలో మొలకెత్తిన నల్ల పిడుగు
‘ఏదో ఒక రోజు నా నలుగురు పిల్లలూ.. వారి వర్ణాన్ని బట్టి కాకుండా, వారి వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తించే దేశంలో నివసిస్తారని నాకో కల ఉంది’ రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) చరిత్రాత్మక మహోపన్యాసం‘ నాకో కల ఉంది(ఐ హేవ్ ఎ డ్రీమ్)’ (ఆగస్టు 28, 1963)లోని వాక్యమిది. ఈ ప్రసంగం అమెరికా నల్లజాతి చరిత్రను మలుపుతిప్పింది. అమెరికా ఈ రోజు అగ్రరాజ్యం అయి ఉండవచ్చు. కానీ దాని చరిత్ర అంత ఘనమైనది కాదు. 20 శతాబ్దం మధ్యవరకూ కూడా అక్కడ తీవ్ర వ ర్ణ వివక్ష ఉండేది. బస్సులో సీట్లు, స్కూల్లో బెంచ్‌లు ఆఖరికి హోటల్లో కాఫీ గ్లాసులు కూడా నల్లవారికి వేరుగా ఉండేవి. ఇలాంటి వివక్షతలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. మార్టిన్ 1929 జనవరి 15న అట్లాంటాలోని క్రైస్తవ చర్చి బోధకుడి కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు కూడా అదే కావడంతో మార్టిన్ జూనియర్ అయ్యారు. మార్టిన్ బాల్యంలోనే వర్ణవివక్షకు గురయ్యారు. తెల్లవారితో ఆడుకోకూడదని, తగిన మార్కులున్నా కోరుకున్న విద్యాలయంలో చేరేందుకు అర్హత లేకుండా చట్టం చేశారని అర్థం చేసుకున్నారు. ఇక బస్సులో కూడా నల్లవారికి వేరే సీట్లు. తెల్లవారి సీట్లు ఖాళీగా ఉంటే కూర్చోవచ్చు. కానీ వారు రాగానే లేచి ఆ సీటు ఇవ్వాలి. అలా ఇవ్వనందుకు బస్సులో నుంచి మార్టిన్‌ను గెంటివేశారు. సరిగ్గా దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీకి జరిగిన అవమానం లాంటిదే. అప్పటి నుంచి మహాత్మాగాంధీ గురించి చదివారు. మహాత్ముని అహింసా మార్గమే సరైన దారని నిర్ణయించుకున్నారు. చర్చిలో బోధకుడిగా పనిచేస్తూనే తన వాగ్ధాటితో నీగ్రోలకు నాయకుడయ్యారు. తను పిలుపునిస్తే నల్లజాతి మొత్తం కదలి వచ్చే స్థాయికి ఎదిగారు. బస్సులో వర్ణవివక్షతకు వ్యతిరేకంగా బస్సులను బహిష్కరింపజేసి చివరకు ఆ వివక్షత తప్పు అని సుప్రీంకోర్టు చేతే తీర్పు ఇప్పించగలిగారు. మార్టిన్ అసలు పేరు మైఖేల్. తండ్రి బాప్టిస్ట్ మినిస్టర్. మినిస్టర్ అంటే మంత్రి కాదు. మత బోధకుడు. తల్లి ఉపాధ్యాయిని. వివాహం మార్టిన్ 1955లో డాక్టరేట్ సంపాదించడానికి ముందు, బోస్టన్‌లో పీహెచ్డీ చేస్తున్నప్పుడు పరిచయమైన కొరెట్టా స్కాట్‌ను 1953లో వివాహం చేసుకున్నారు. 1954లో మాంట్‌గోమరీ(అలబామా)లోని డెక్స్టర్ అవెన్యూ బాప్టిస్టు చర్చికి పాస్టర్‌గా నియమితులయ్యారు. ఈ సమయంలోనే బస్సులలో వివక్షతకు నిరసనగా ఆఫ్రికన్ అమెరికన్లు బస్సులను బహిష్కరించే ఉద్యమానికి నాయకత్వం వహించడంతో మార్టిన్ పేరు తొలిసారి అమెరికాలో మారుమోగింది. ఐ హేవ్ ఎ డ్రీమ్ 1963లో జాతి వివక్షతకు వ్యతిరేకంగా మార్టిన్ నాయకత్వంలో బర్మింగ్ హామ్, అలబామాలలో చెలరేగిన ఉద్యమాన్ని తెల్లవారు అతి పాశవికంగా బాంబులతో అణచివేశారు. నిరసనలకు వ్యతిరేకంగా జారి అయిన ఆదేశాలను ఖాతరు చేయకపోవడంతో ఆయనను బర్మింగ్‌హామ్ జైల్లో వేశారు. జైలు నుంచి విడుదలయ్యాక ‘చిల్డ్రన్ క్రూసేడ్’ మొదలైంది. మార్టిన్ ప్రోద్బలంతో వేలాది మంది విద్యార్థులు బర్మింగ్‌హామ్ అంతటా కవాతు చేస్తూ నిరసన గళం విప్పారు. దీంతో పోలీసులు విద్యార్థులపై లాఠీలను ఝళిపించారు. ఈ దృశ్యాలను టీవీలలో చూసి ఆగ్రహం చెందిన అమెరికన్లు మార్టిన్‌కు మద్దతు తెలిపారు. ఈ విజయం ఇచ్చిన తీర్పుతోనే మార్టిన్ ‘ఐ హేవ్ ఎ డ్రీమ్’ ప్రసంగాన్ని ఇవ్వగలిగారు. తలొగ్గిన ప్రభుత్వం మార్టిన్ లూథర్ కింగ్ ఉద్యమానికి తలవంచి 1964లో ఫెడరల్ ప్రభుత్వం ‘సివిల్ రైట్స్’ చట్టాన్ని తీసుకువచ్చింది. అలాగే 1965లో అమెరికా ప్రభుత్వం ‘ఓటింగ్ రైట్స్’ చట్టాన్ని కూడా తెచ్చింది. సమాన హక్కుల కోసం చేసిన కృషికి గుర్తింపుగా 1964లో 34వ ఏట మార్టిన్ లూథర్ కింగ్ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. 1967 డిసెంబర్లో మార్టిన్ ‘ పూర్ పీపుల్ క్యాంపెయిన్’ ప్రారంభించారు. పారిశుధ్య కార్మికులకు మద్దతుగా మార్చింగ్‌కు ఏర్పాట్లు చేయడం కోసం 1968 ఏప్రిల్ నెలలో టెన్నెస్సీ రాష్ట్రంలోని మెంఫీస్ చేరుకున్నారు. మరునాడు తను బస చేసిన హోటల్ బాల్కనీలో ఉండగా ఆయనపై దాడి జరిగింది. తుపాకీ గుళ్లకు మార్టిన్ నేలకు ఒరిగారు. -
ఇప్పటికీ తప్పని జాతి వివక్ష
న్యూయార్క్: గాంధీజీని నల్లజాతీయుడైన కారణం చేత రైల్లోంచి దించేశారని చదివినప్పుడు ఆశ్చర్యపోయాం. ఆ రోజులు ఇప్పుడు లేవులే అని సరిపెట్టుకున్నాం. అయితే ఇప్పటికీ అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగ నియామకాల్లో జాతివివక్ష కొనసాగుతూనే ఉందని న్యూయార్క్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇతర దేశాల నుంచి ఉద్యోగావకాశాల కోసం అమెరికాకు వెళ్లిన వారిలో తెల్లజాతీయులకు దక్కుతున్నన్ని అవకాశాలు, నల్లజాతీయులకు ఉండటం లేదని ఈ పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా ఆసియా నుంచి వెళ్లిన వారు నల్లజాతీయులనే కారణం చేత ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్తున్న వారిలో ఎక్కువగా లాటిన్ అమెరికా, ఆసియా ప్రాంతాలకు చెందిన వారే ఉంటున్నారని, ప్రస్తుతం అమెరికా జనాభాలో వీరి సంఖ్య వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. పురుషులతో పోల్చుకుంటే నల్లజాతి మహిళలను మరింత చులకనగా చూస్తున్నట్టు వెల్లడైంది. ఉదాహరణకు లాటిన్ అమెరికా, ఆసియా ప్రాంతాల నుంచి వెళ్లిన మహిళల్లో అగ్రభాగం ఉద్యోగాలు లాటిన్ అమెరికా మహిళలకే వస్తున్నట్టు చెప్పారు. -
జాత్యహంకారం సోకుతోందా?
విదేశీ పర్యాటకులను రా, రమ్మని పిలిచే భారత దేశవు ‘స్వర్గ సీమ’ గోవా ఒక దౌత్య సంక్షోభానికి కేంద్రమైంది. వారం క్రితం జరిగిన ఒక నైజీరియన్ హత్యపై పోలీసులు ‘ఒక నల్లవాడి చావు’తో వ్యవహరించాల్సిన విధంగానే వ్యవహరించారు. బాధ్యతారాహిత్యంతోపాటూ, వీసా గడువుకు మించి ఉన్న దాదాపు 150 మంది నైజీరియన్లను వెనక్కు పంపేయాలని నిర్ణయించారు. మాదకద్రవ్య ముఠాలకు వ్యతిరేకంగా చేపట్టిన పోరులో భాగమే ఇది అనడం నమ్మశక్యం కాదు. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న మాదకద్రవ్యాల విని యోగం, అక్రమ వ్యాపారం అక్కడా పెరుగుతున్నాయి. పైగా వీసాల గడుపు దాటిన నైజీరియన్లను మాత్రమే పంపేయాలని నిర్ణయించడమంటే వారు మాత్రమే మాదకద్రవ్య ముఠాలకు చెందినవారని చెప్పడమే. నైజీరియన్లు ‘క్రూర జంతువులు’ ‘క్యాన్సర్ కురుపులు’ అని ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ మంత్రి వర్గ సహచరుడు ఒకరు అననే అన్నారు. పుండు మీద కారం జల్లినట్టున్న ప్రభుత్వం, పోలీసుల వైఖరికి నిరసనగా గోవాలోని నైజీరియన్లు ఆందోళనకు దిగారు, హద్దు మీరి ఉంటే ఉండొచ్చు. పోలీ సులు అంటున్నట్టు ఆ హత్య మాదకద్రవ్య ముఠాల మధ్య తగాదాలతో ముడిపడినదే అయినా కావొచ్చు. గోవా ఘటనపై నైజీరియన్ రాయబార కార్యాలయం తీవ్రంగానే స్పందించింది. నైజీరియన్లపై వివక్ష చూపి బహిష్కరించడం తమ దేశంలోని లక్ష మందికి పైగా భారతీయులపై దాడులకు దారి తీయవచ్చని హెచ్చరించింది. మన దేశంలోని నైజీరియన్ల సంఖ్య 40 వేల వరకు ఉంటుంది. నైజీరియాకు మనమిచ్చేంత ప్రాధాన్యం అది మనకు ఇవ్వనవసరం లేదు. గోవా పోలీసులు, ప్రభుత్వం నేరస్తుల దేశంగా ముద్రవేస్తున్న నైజీరియా చమురు సంపన్న దేశం. చమురు ఉత్పత్తిలో దానిది పన్నెండో స్థానం, ఎగుమతులలో ఎనిమిదో స్థానం. చమురు ఎగుమతులలో 40 శాతం అమెరికాకే. పైగా దేశం పొడవునా ప్రవహించే నైజిర్ నది ఉంది. అది నైజిర్ డెల్టాను సస్యశ్యామలంగా మార్చింది. బొగ్గు, రాగి, బాక్సైటు తదితర ఖనిజాల నిక్షేపాలు కూడా ఆ డెల్టా ప్రాంతంలోనే ఉన్నాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టయింది నైజీరి యన్ల పరిస్థితి. స్థూల జాతీయోత్పత్తి లెక్కల ప్రకారం ప్రపంచంలోని 36వ స్థానంలో ఉన్న ఆ దేశం మానవాభివృద్ధి సూచికలో 154వ స్థానంలో ఉంది! గోవా దౌత్య దూమారం రేగుతుండగా హక్కుల సంస్థ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’... బహుళ జాతి సంస్థ ‘షెల్’ నైజీరియాలో చము రు పైపుల లీకేజీని అనుమతిస్తోందని ఆరోపించింది. లేకపోతే ఒక్క ఏడాదిలో 340 సార్లు చమురు లీకు కాదని స్పష్టం చేసింది. దశాబ్దాల క్రితం నాటి చిల్లులు పడ్డ పైపులతోనే పెట్రో కంపెనీలు చమురును రవాణా చేస్తున్నాయి. దీంతో డెల్టా ప్రాంతమంతా రుద్ర భూమిగా మారిపోతోంది. మంచినీటి వనరులు సైతం విషతుల్యంగా మారుతున్నాయి. ఖనిజ సంపదను అతి తక్కువ కాలంలో అతి తక్కువ ఖర్చుతో తరలించుకు పోవడమే వారికి ముఖ్యం. పంటపొలాలు, హరితారణ్యాలు గడ్డిపరక మొలవని మృత్యు భూమిగా మారిపోతే ఎవరికి కావాలి? పైగా అవి ‘చమురు దొంగల’ సాయుధ ముఠాలను సైతం ప్రోత్సహించి అస్థిరతను సృష్టిస్తున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. దశాబ్దాల తరబడి సాగుతున్న ఈ చమురు లీకేజీలతో ఊళ్లకు ఊళ్లే వల్ల కాళ్లుగా మారిపోతున్నాయి. దీనికి తోడు ఇటీవలి కాలంలో నైజీరియాకు మరో అరుదైన ఘనత కూడా దక్కింది. ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఆఫ్రికా ఖండంలోనే భూ దురాక్రమణలు సాగుతున్నాయి. భూ బకాసురులు అతిగా పేట్రేగిపోతున్న దేశాల్లో ద్వితీయ స్థానం నైజీరియాదే. ఆఫ్రికన్లందరినీ చిన్నచూపు చూసి, జాత్యహంకార వైఖరిని ప్రదర్శించే భారత సంస్థలు ఆఫ్రికాలో సాగుతున్న భూఆక్రమణల్లో ముఖ్య పాత్రధారులుగా ఉన్నాయి. లాగోస్ రాష్ట్రంలో ని భారతీయులు అలాంటి ‘రైతులు’, వారి ఉద్యోగులు, వివిధ ప్రాజెక్టులలో పని చేస్తున్న వారు. ఆఫ్రికా దేశాల సంపదలను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర పాశ్చాత్య దేశాలతో పాటూ మన దేశంలో కూడా నల్లజాతి వ్యతిరేకత ప్రబలడం ప్రమాదకరం. మొగ్గలోనే తుంచడం శ్రేయస్కరం. -పి. గౌతమ్