టొరంటో: కెనడాలో భారత సంతతి జంట జాతి వివక్ష వేధింపులకు గురైంది. ఆదివారం ఒంటారియోలోని ఓ షాపింగ్‌మాల్ వద్ద పార్కింగ్ విషయంలో భారత జంటతో 47 ఏళ్ల డేల్ రాబర్డ్‌సన్ గొడవకు దిగాడు. పార్కింగ్ స్థలానికి వస్తుండగా వారికెదురుగా ట్రక్కులో రాబర్ట్‌సన్ దూసుకొచ్చాడు. అతనితో మాట్లాడేందుకు భారతీయుడు ప్రయత్నించగా, రాబర్ట్‌సన్ అతని భార్య మీదికి వాహనంతో దూసుకెళ్లాడు. ట్రక్కు కదులుతుండగానే భారతీయుడు దాన్ని అనుసరిస్తూ..‘నేను స్వదేశం పోవాలని అనుకుంటున్నావా? నేనూ కెనడా పౌరుడినే’ అని అన్నాడు.
దీనికి రాబర్ట్‌సన్ స్పందిస్తూ.. ‘ఏదీ నిరూపించు. నీ మాటలు నమ్మను’ అని అతని ఆంగ్ల భాష ఉచ్ఛారణను వ్యంగ్యంగా అనుకరిస్తూ ‘మీరు కెనడా వ్యక్తి మాదిరిగా మాట్లాడలేరు. నేను ఇతర జాతి వారిని ద్వేషిస్తాను. నాకు నీవు నచ్చలే, ఆమె నచ్చలే. నీ దేశంపో.. లేకపోతే మీ పిల్లలను చంపేస్తా’ అని దుర్భాషలాడాడు. ఈ ఘటనను భారతీయుడి భార్య వీడియో తీసి యూట్యూ బ్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. బాధిత జంట వివరాలు వెల్లడికాలేదు. పోలీసులు విద్వేష నేరంగా పరిగణించి విచారణ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment